Mali terrorist attack
-
ఉగ్రదాడిలో 35మంది జవాన్ల మృతి
బమాకో (మాలి) : వైశాల్యపరంగా ఆఫ్రికాలో ఎనిమిదో అతిపెద్ద దేశంగా పిలవబడుతున్న మాలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆఫ్రికా దేశం మాలిలో ఉగ్రవాదులు మరోసారి దాడులకు తెగబడ్డారు. మాలిలోని మేనక ఔట్‌పోస్టు ప్రాంతంలో ఉన్న సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో సుమారుగా 35 మంది సైనికులు మృతి చెందారు. ప్రస్తుతం అక్కడ పరిస్థితులు అదుపులో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. గతంలో జరిగిన ఉగ్రదాడుల్లో కూడా అనేక మంది సైనికులు మరణించారు. ఇటీవలే ఓ నెల రోజుల క్రితం బుర్కినో ఫాసోలో ఇద్దరు జిహాదీలు చేసిన దాడిలో సుమారు 40 మంది సైనికులు మృతిచెందారు. అయితే శుక్రవారం జరిగిన దాడికి సంబంధించి ఇప్పటి వరకు ఏ సంస్థ బాధ్యత ప్రకటించలేదు. ఉత్తర మాలి ప్రాంతంలో ఆల్ ఖైదా ఉగ్రవాదులు ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అయితే ఫ్రెంచ్ దళాలు చేపట్టిన ఆపరేషన్‌తో ఉగ్రవాదులు ప్రతిదాడులకు దిగుతున్నారు. 2016లో ఉగ్రవాదులు జరిపిన దాడిలో 17మంది సైనికులు ప్రాణాలు కోల్పోగా, 2018లో 40మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. 2015లో మాలి రాజధాని బమాకో నగరం మధ్య ఉన్న రాడిసన్ బ్లూ హోటల్‌ను లక్ష్యంగా చేసుకున్న ఉగ్రవాదులు 18మందిని బలి తీసుకున్న విషయం తెలిసిందే. -
'ఆమె నాకు తెలుసు'
వాషింగ్టన్: మాలి ఉగ్రవాద దాడిలో ఇండియన్ అమెరికన్ స్వచ్ఛంద కార్యకర్త అనిత దాతర్ మృతి పట్ల అమెరికా మాజీ విదేశాంగ మంత్రి హిల్లరీ క్లింటన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆమె తనకు వ్యక్తిగతంగా తెలుసునని, ఆమె మృతి బాధాకరమని పేర్కొన్నారు. సమాజ సేవే జీవిత సర్వస్వంగా మార్చుకున్న అనితా దాతర్ (41) స్వచ్ఛంద కార్యకర్తగా మాలిలో పనిచేస్తూ.. ఉగ్రవాద దాడిలో బలయ్యారు. ఉగ్రవాదులు గత శుక్రవారం మాలిలోని ఓ హోటల్లోకి చొరబడి.. 27 మందిని పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. మాలి దాడిలో మరణించిన ఏకైక అమెరికన్, భారత సంతతి మహిళ ఆమెనే. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్ అభ్యర్థి రేసులో ముందున్న కిల్లరీ క్లింటన్ అనితా దాతర్ మృతి పట్ల స్పందించారు. 'ఆమె నాకు తెలుసు. ఏడేళ్ల కొడుకు తల్లిగా, నా విధాన సలహాదారుల్లో ఒకరైన డేవిడ్ గార్టన్ మాజీ భార్యగా ఆమెతో నాకు పరిచయముంది. ఈ విషాద సమయంలో దాతర్, గార్డెన్ కుటుంబాలకు మద్దతుగా నేను ప్రార్థిస్తున్నాను. ముఖ్యంగా అనిత, డేవిడ్ ఏడేళ్ల కొడుకు గురించి నేను ఆలోచిస్తున్నాను. రానున్న రోజులను అతను ఎలా ఎదుర్కొంటాడో? ఎన్ని కష్టాలు పడతాడో? అని ఆలోచిస్తేనే ఎంతో బాధ కలుగుతున్నది' అని ఆమె పేర్కొన్నారు. ఉగ్రవాద దాడులకు తెగబడుతున్న ఐఎస్ఎఐస్, ఆల్‌ఖైదాపై వెంటనే అమెరికా యుద్ధాని ప్రారంభించి.. విజయం సాధించాల్సిన అవసరముందని ఆమె పేర్కొన్నారు.