Michelle Christian
-
‘రఫేల్ డీల్‌కు మిషెల్ అడ్డుపడ్డారు’
ముంబై : రఫేల్ ఒప్పందంలో కొత్త అంశాలు వెలుగు చూస్తున్నాయి. రఫేల్‌ను వ్యతిరేకిస్తూ అగస్టా స్కాంలో దళారి క్రిస్టియన్ మిషెల్ లాబీయింగ్ చేశారనే వార్తల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీని నిలదీశారు. మహారాష్ట్రలోని షోలాపూర్‌లో బుధవారం జరిగిన ర్యాలీలో ప్రధాని మాట్లాడుతూ అగస్టా సూత్రధారి మిషెల్‌ను తాము భారత్‌కు రప్పించిన తర్వాత పలు అంశాలు బయటికొస్తున్నాయని, రఫేల్‌కు వ్యతిరేకంగా మిషెల్ మరో డీల్ ప్రతిపాదించారనే వార్తలపై కాంగ్రెస్ వివరణ ఇవ్వాలన్నారు. రఫేల్‌కు బదులుగా యూరోఫైటర్కు ఈ ఆర్డర్‌ను కట్టబెట్టేందుకు అగస్టా ఒప్పందంలో ముడుపులు స్వీకరించారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న మిషెల్ ప్రయత్నించారని ఇండియా టుడే కొన్ని పత్రాలను బయటపెట్టిన సంగతి తెలిసిందే. -
అగస్టా రహస్యాలు బట్టబయలు..
జైపూర్ : యూపీఏ హయాంలో జరిగిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంలో దళారీ క్రిస్టియన్ మైఖేల్ నోటివెంట ఇప్పుడు రహస్యాలు బయటికొస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన బుధవారం ఓ ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మాట్లాడారు. అగస్టాలో రాజకీయ నేతలకు ముడుపులు ముట్టచెప్పిన మధ్యవర్తి మైఖేల్‌ను దుబాయ్ నుంచి భారత్ రప్పించామని, ఈ కుంభకోణంలో ఇప్పుడు రహస్యాలు బట్టబయలు కానున్నాయని అన్నారు. మైఖేల్ వెల్లడించే అంశాలతో కేసు ఏ మలుపు తీసుకుంటుందో చూడాలన్నారు. కాగా, అగస్టా కేసుకు సంబంధించి మైఖేల్‌ను దుబాయ్ ప్రభుత్వం భారత్‌కు అప్పగించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో సీబీఐ ఆయనను అరెస్ట్ చేసిన క్రమంలో మంగళవారం రాత్రి మైఖేల్ ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి తీసుకువచ్చారు. మైఖేల్‌ను బుధవారం సీబీఐ ప్రత్యేక న్యాయస్ధానం న్యాయమూర్తి అరవింద్ కుమార్ ఎదుట హాజరుపరిచారు. కాగా, రూ.3600 కోట్లతో 12 వీవీఐపీ హెలికాప్టర్లు కొనేందుకు 2010, ఫిబ్రవరిలో నాటి యూపీఏ ప్రభుత్వం అగస్టా వెస్ట్‌ల్యాండ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘనకు గురవడంతో పాటు రూ.423 కోట్ల ముడుపులు చేతులు మారాయని, కేంద్ర ఖజానాకు సుమారు రూ.2666 కోట్ల నష్టం వాటిల్లినట్లు ఆరోపణలు రావడంతో 2014 జనవరి 1న ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకుంది. హెలి కాప్టర్లు ఎగిరే ఎత్తు పరిమితిని 6 వేల మీటర్ల నుంచి 4500 మీటర్లకు తగ్గించి కొందరు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీబీఐ ఆరోపించింది. ఎత్తు తగ్గించడం ద్వారానే అగస్టా వెస్ట్‌ల్యాండ్ ఒప్పందం చేసుకోవడానికి అర్హత సాధించిందని తెలిపింది. -
‘నాకోసమైనా వారిని కాపాడాలి’
అగస్టాలో సోనియా, రాహుల్‌లపై మధ్యవర్తి మిచెల్ దుబాయ్: అగస్టా కుంభకోణంలో మధ్యవర్తిగా ఉన్న మిచెల్ క్రిస్టియన్ తనెప్పుడూ కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌లను కలవలేదని స్పష్టం చేశారు. ఎన్డీటీవీకి దుబాయ్ నుంచి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో.. గాంధీ కుటుంబానికి ఈ ముడుపులతో సంబంధం లేదని వెల్లడించారు.‘హెలికాప్టర్ల కుంభకోణానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకునేది సోనియా గాంధీయేనని తెలుసు. అందుకే ఓ లేఖలో ‘ద డ్రైవింగ్ ఫోర్స్’గా సోనియాను పేర్కొన్నాను. అంతకుమించి సోనియా, రాహుల్‌లను నేనుప్పుడూ వ్యక్తిగతంగా కలవలేదు. వారితో లాబీయింగ్ చేయించాలని ప్రయత్నించినా కుదరలేదు’ అని మిచెల్ ఈ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ‘ఈ కుంభకోణంతో వారికి సంబంధం లేదని నిరూపించటం ద్వారా నేను అమాయకుడనని నిరూపించుకోవాలి’ అని అన్నారు. భారత ప్రధాని మోదీ, ఇటలీ ప్రధాని మధ్య న్యూయార్క్‌లో జరిగిన సమావేశంలో అగస్టా కేసుకు సంబంధించిన సమాచారం ఇస్తే.. ఇటాలియన్ నావికుల విడుదల చేస్తామని మాట్లాడుకున్నారంటూ గతంలో తను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని మిచెల్ వెల్లడించారు. మిచెల్‌తోపాటు జైల్లో ఉన్న ఇద్దరు అగస్టా ప్రతినిధులు రాసిన లేఖలు, దీనిపై ఇటలీ కోర్టులో విచారణ ఆధారంగా హెలికాప్టర్ల స్కాంకు సంబంధిం చి భారత్‌లో ముడుపులు అందినట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. దీన్ని కాంగ్రెస్‌పై అస్త్రంగా మార్చుకున్న బీజేపీ.. కుంభకోణంలో కాంగ్రె స్ అధిష్టానంపై విమర్శలు చేస్తోంది.