mission bhagiradha project
-
'జనాల పాదాలు కడిగి రుణం తీర్చుకుంటాం'
నిజామాబాద్: గోదావరి జలాలతో జనాల పాదాలు కడిగి రుణం తీర్చుకుంటామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి, మిషన్ భగరీథ వైస్ ఛైర్మన్ ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నిజాం సాగర్ ప్రాజెక్టులో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో మల్లన్న సాగర్ సాధన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎవరూ అడ్డుకున్న వచ్చే రెండేళ్లలో నిజాం సాగర్‌కు నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. మల్లన్నసాగర్ పూర్తైతే గ్రామాల్లోకి రానివ్వరని, ఓట్లు వేయరనే భయంతోనే టీడీపీ, కాంగ్రెస్‌లు నాటకాలాడుతున్నాయని వారు మండిపడ్డారు. -
మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి ప్రధాని
మెదక్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ (వాటర్‌గ్రిడ్) ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. వచ్చేనెల 7న ప్రధాని తెలంగాణకు రానున్నారు. గజ్వేల్ మండలం సంగాపూర్, కోమటిబండలో ప్రధాని మిషన్ భగీరధ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని సభ ఏర్పాట్లను మిషన్ భగీరధ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, స్పెషల్ సెక్రటరీ ఎస్పీ సింగ్ బుధవారం పరిశీలించారు. కాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల ప్రధానిని కలిసి మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే. -
'ఇంటింటికి రక్షిత మంచినీరు, ఇంటర్నెట్'
ఢిల్లీ: మిషన్ భగీరథలో భాగంగా.. 40 వేల కోట్లతో ఇంటింటికి రక్షిత మంచినీరు, ఇంటర్ నెట్ సౌకర్యం కల్పిస్తామని తెలంగాణ ఐటీ, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. బుధవారం దేశ రాజధాని న్యూఢిల్లీలో మంత్రి కేటీఆర్ మిషన్ భగీరథపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన మిషన్ భగీరథ ప్రజెంటేషన్‌ను కేంద్రమంత్రి వీరేంద్ర సింగ్, ఇతర రాష్ట్రాల మంత్రులు, అధికారులు అభినందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. వచ్చే ఏప్రిల్ నాటికి తొలి దశలో 10 నియోజకవర్గాల్లో రక్షిత మంచినీరు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. పనుల్నీ పూర్తి పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు. సకాలంలో పనులు చేయని కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెడుతున్నామని కేటీఆర్ పేర్కొన్నారు.