మిషన్ భగీరథ ప్రారంభోత్సవానికి ప్రధాని
మెదక్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ (వాటర్గ్రిడ్) ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరు కానున్నారు. వచ్చేనెల 7న ప్రధాని తెలంగాణకు రానున్నారు. గజ్వేల్ మండలం సంగాపూర్, కోమటిబండలో ప్రధాని మిషన్ భగీరధ పథకాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా ప్రధాని సభ ఏర్పాట్లను మిషన్ భగీరధ చైర్మన్ ప్రశాంత్ రెడ్డి, స్పెషల్ సెక్రటరీ ఎస్పీ సింగ్ బుధవారం పరిశీలించారు. కాగా తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల ప్రధానిని కలిసి మిషన్ భగీరథ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానించిన విషయం తెలిసిందే.