ట్యాంక్ బండ్ పై ఓ ఎమ్మెల్యే కుమారుడి వీరంగం!
హైదరాబాద్: వరంగల్ జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే కుమారుడు బుధవారం సాయంత్రం ట్యాంక్ బండ్ పై వీరంగం సృష్టించాడు. అతని అనుచరులతో కలిసి మరో ఎమ్మెల్యే ఫ్లెక్సీని చించేసి నానా హంగామా చేశాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడానికి యత్నించారు. తాను ఎమ్మెల్యే కుమారుడినంటూ పోలీసులపై దాడికి పాల్పడ్డాడు. ఆ దాడిని అడ్డుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.