mohammadabad crossing
-
భర్త చేసిన తప్పుకు భార్యను చంపేశారు
ఫరూఖాబాద్(యూపీ): బర్త్‌డే అని పిలిచి 23 మంది పిల్లలను బందీలు చేసిన వ్యక్తిని పోలీసులు హతమార్చిన విషయం తెలిసిందే. అయితే అతను చేసిన తప్పుకు ఆయన భార్యను గ్రామస్తులు కొట్టి చంపడం విషాదంగా మారింది. ఉత్తర ప్రదేశ్‌లోని మహ్మదాబాద్ ప్రాంతం కతారియాకు చెందిన సుభాష్ బథం అనే వ్యక్తి తన కూతురి పుట్టిన రోజు వేడుకలకు రావాల్సిందిగా స్థానిక పిల్లలను ఆహ్వానించాడు. దీంతో గురువారం మధ్యాహ్నం 23 మంది పిల్లలు అతని ఇంటికి చేరుకోగా వాళ్లందరినీ ఇంట్లో పెట్టి నిర్భందించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పిల్లలను బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేశారు. అయితే నిందితుడు పోలీసులపైకి నాటుబాంబు విసరడంతోపాటు పలుమార్లు కాల్పులకు దిగాడు. దీంతో ముగ్గురు పోలీసులు, ఓ గ్రామస్థునికి గాయాలయ్యాయి. పిల్లలను సురక్షితంగా బయటకు తీసుకురావడానికి నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో నిందితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. సుమారు ఎనిమిది గంటపాటు ఆపరేషన్ నిర్వహించిన ఎన్ఎస్జీ(నేషనల్ సెక్యూరిటీ గార్డ్) బృందాలు రాత్రి 1.20 సమయంలో పిల్లలను సురక్షితంగా విడిపించారు. ఇక నిందితుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు అతని భార్యను రాళ్లతో కొట్టి చంపారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి వచ్చేసరికి ఆమె తీవ్రగాయాలతో పడి ఉంది. ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆమె మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్‌కు తరలించామని పోలీసులు తెలిపారు. చదవండి: కూతురు పుట్టిన రోజని పిలిచి -
బాత్రూము బండ విరిగిపడి బాలుడి మృతి
ఓడీ చెరువు : ఇంటిముందు బాత్రూము కోసం ఏర్పాటు చేసుకున్న నల్లబండ విరిగి మీద పడటంతో బాలాజీ అనే ఐదేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఓడీచెరువు మండలంలోని మహమ్మదాబాద్ క్రాసింగ్‌లో శనివారం చోటుచేసుకున్న ఈ దుర్ఘటనతో ఆ ప్రాంతంలో విషాదఛాయలు నెలకొన్నాయి. స్థానికుల కథనం మేరకు.. క్రాసింగ్‌లో నివాసముంటున్న నాగరాజు, అనూష దంపతులకు బాలాజీ, కార్తీక్ అనే ఇద్దరు కుమారులున్నారు. నలుగురూ కలిసి శనివారం ఉదయం టిఫిన్ చేశారు. నాగరాజు కూలి పని నిమిత్తం బయటకు వెళ్లిపోయాడు. ఇంటిముందు చుట్టూ బండలు పాతి ఏర్పాటు చేసుకున్న బాత్రూము వద్ద పెద్ద కుమారుడు బాలాజీ ఆడుకుంటున్నాడు. ఆ బండల వద్ద కూర్చోవడానికి వీలుగా పెట్టిన ఓ రాయి ఎక్కి బండను పట్టుకుని ఆ పక్కనే ఉన్న చిన్న కానుగచెట్టు ఎక్కబోయాడు. ఆ బండ విరిగి మీదపడింది. ఆ శబ్ధం విన్న అనూష అరుస్తూ పరుగున బయటకు వచ్చింది. ఆమె అరుపుతో చుట్టుపక్కలవారు కూడా అక్కడికి వచ్చి బాలుడిపై పడిన బండను తొలగించారు. తలకు గాయమై తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న బాలాజీని రక్షించేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఆ బాలుడు అక్కడికక్కడే చనిపోయాడు.