MW thermal power plant
-
సింగరేణిలో మరో విద్యుత్ ప్లాంటు
సాక్షి, హైదరాబాద్/జైపూర్(చెన్నూర్): సింగరేణి బొగ్గు గనుల సంస్థ వ్యాపార విస్తరణ చర్యల్లో భాగంగా ఇప్పటికే మంచిర్యాల జిల్లా జైపూర్ వద్ద నెలకొల్పిన 1,200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంటుకు అదనంగా అదే ప్రాంగణంలో మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ ప్లాంట్ నిర్మించనున్నారు. దీనికి సం బంధించిన సవివర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను శుక్రవారం సింగరేణి సీఎండీ ఎన్.శ్రీధర్ అధ్యక్షతన జరిగిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశం ఆమోదించింది. రూ.6,790 కోట్ల అంచనా వ్య యంతో విద్యుత్ ప్లాంట్ నిర్మించనున్నారు. ప్రస్తుత 1200 మెగావాట్ల ప్లాంట్‌తో ఏటా రూ.500 కోట్ల లాభాలు సమకూరుతున్నాయని, ఈ కొత్త యూనిట్ కూడా సంస్థ ఆర్థిక సుస్థిరతకు దోహదపడుతుందని శ్రీధర్ ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో ఆర్థిక, ఇంధనశాఖ ల ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు రామకృష్ణారావు, సునీల్ శర్మ, కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్టర్లుగా వెస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ సీఎండీ మనోజ్ కుమార్, కేంద్ర బొగ్గు శాఖ డైరెక్టర్లు పీ ఎస్ఎల్ స్వామి, వి.కె.సోలంకి పాల్గొన్నారు. మరిన్ని బోర్డు నిర్ణయాలు ►స్థానికతపై రాష్ట్రపతి కొత్త ఉత్తర్వులకు అనుగుణంగా సింగరేణి సంస్థలో కూడా ఉద్యోగ నియామకాల్లో స్థానిక రిజర్వేషన్ల శాతాన్ని పెంచడానికి అంగీకారం ►సింగరేణి విస్తరించిన నాలుగు ఉమ్మడి జిల్లా ల వారికి అధికారేతర ఉద్యోగాల్లో 80 శాతం, అధికారుల ఉద్యోగాల్లో 60 శాతం స్థానిక రిజర్వేషన్ వర్తింపజేస్తుండగా, ఇకపై రెండు కేటగిరీల్లోనూ 95 శాతానికి పెంచారు. ఎగ్జిక్యూటివ్, ఎన్సీడబ్ల్యూఏ ఉద్యోగాల్లో 95 శాతం పోస్టులు స్థానికులకే లభిస్తాయి. ఐదు శాతాన్ని ఓపెన్ కేటగిరీలో భర్తీ చేస్తారు. ►సింగరేణి ఉద్యోగులకు యూనిఫాం పంపిణీకి స్టేట్ హ్యాండ్లూమ్ వీవర్స్ కో–ఆపరేటివ్ సొసైటీ ద్వారా రూ.2 కోట్లతో వస్త్రాల కొనుగోళ్లకు ఆమోదం. ►ఈ ఏడాది 700 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో ఇందుకు అవసరమైన పేలుడు పదార్థాల సరఫరా కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్‌తో కలిసి మందమర్రి వద్ద 50 వేల టన్ను ల ఉత్పత్తి సామర్థ్యం గల ప్లాంట్ ఏర్పాటుకు ఆమోదం. మణుగూరు, రామగుండం ఏరియాల్లో గల 50 వేల టన్నుల సామర్థ్యం గల ప్లాంట్ల సామర్థ్యం లక్ష టన్నులకు పెంపు -
తొలిదశలో 1,600 మెగావాట్ల ప్లాంటు
ఎన్టీపీపీ 4వేల మెగావాట్ల {పాజెక్టులో భాగంగా వెంటనే నిర్మాణం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి పీయూష్‌గోయల్ వెల్లడి ఢిల్లీ నుంచి రాష్ట్రాల విలేకరులతో మంత్రి వీడియో కాన్ఫరెన్స్ హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వెంటనే 1,600 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు కేంద్ర విద్యుత్, బొగ్గు శాఖల మంత్రి పీయూష్‌గోయల్ తెలిపారు. రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీపీసీ 4 వేల మెగావాట్ల విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా మొదటి దశలో ఈ కేంద్రాన్ని నిర్మించనున్నట్లు వివరించారు. ఆదివారం ఢిల్లీ నుంచి వివిధ రాష్ట్రాల్లోని విలేకరులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నుంచి విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. మహబూబ్‌నగర్ జిల్లాలో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్‌ప్లాంట్‌ను కూడా ఎన్టీపీసీ నిర్మిస్తుందని, అందుకోసం ఐదువేల ఎకరాలు ఇవ్వడానికి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు అంగీకరించారని మంత్రి ఈ సందర్భంగా వెల్లడించారు. శనివారం తెలంగాణ సీఎం కేసీఆర్ తనను కలిసారని, అలాగే ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడానని పీయూష్‌గోయల్ పేర్కొన్నారు. ఎవరికీ కేటాయించని విద్యుత్ నుంచి తెలంగాణకు 500 మెగావాట్ల విద్యుత్ సరఫరా చేయడానికి తాను ఎలాంటి హామీ ఇవ్వలేదని, ప్రస్తుతం ఇస్తున్న వంద మెగావాట్ల విద్యుత్‌ను వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు వినియోగించుకునేలా కేటాయించినట్లు చెప్పారు. విద్యుత్ మిగులు ఉన్న ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు విద్యుత్ ఇవ్వాలన్నా.. ట్రాన్స్మిషన్ లైన్లు లేని కారణంగా సరఫరా జరగడంలేదన్నారు. విద్యుత్ ప్రసార లైన్లు సిద్ధమైతే అదనపు విద్యుత్ ఇవ్వడానికి సిద్ధమని మంత్రి స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకుంటున్న థర్మల్ విద్యుత్ ప్రాజెక్టులకు అవసరమైన బొగ్గు కేటాయింపులు, పర్యావరణ అనుమతులు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే బొగ్గు కేటాయింపులకు సంబంధించి మంగళవారం సుప్రీంకోర్టు ఇచ్చే తుది తీర్పును అనుసరించి ఆ కేటాయింపులు ఉంటాయని పేర్కొన్నారు. తెలంగాణలో 24 గంటలు విద్యుత్ సరఫరా చేసే అంశంపై నిర్ణయం తీసుకుంటామని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముందుగా వచ్చినందున ఢిల్లీ, రాజస్థాన్‌తోపాటు ఆ రాష్ట్రాన్ని ఎంపిక చేసినట్లు గోయల్ వెల్లడించారు.