శ్రీజ, నైనాలకు పతకాలు
ముంబై: ఇండియా ఓపెన్ టేబుల్ టెన్నిస్ (టీటీ) చాంపియన్‌షిప్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు ఆకుల శ్రీజ, నైనా జైస్వాల్ మెరిశారు. బాలికల క్యాడెట్ (టీమ్) విభాగంలో శ్రీజ నాయకత్వంలోని భారత ‘బి’ జట్టు రజత పతకం సాధించింది. భారత్ ‘ఎ’తో జరిగిన ఫైనల్లో ‘బి’ టీమ్ మూడు సింగిల్స్‌లోనూ ఓడగా శ్రీజ-మౌమిత దత్తా జంట మాత్రం డబుల్స్ మ్యాచ్‌లో విజయం సాధించింది.
ఇదే విభాగంలో భారత ‘సి’ టీమ్ మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకుంది. హైదరాబాద్‌కే చెందిన నైనా జైస్వాల్ ఈ జట్టులో సభ్యురాలిగా ఉంది. క్వార్టర్ ఫైనల్లో నైనా-శ్రుతి జోడి 3-0 తేడాతో ఆష్లేష-మాన్సిపై విజయం సాధించింది. ఈ టోర్నీలో భారత్ మూడు విభాగాల్లో భారత్ స్వర్ణ పతకాలు గెలుచుకోగా, జూనియర్ బాలికల విభాగంలో చైనాకు స్వర్ణం దక్కింది.