Nasreen Begum
-
అనుమానాస్పదస్థితిలో బీటెక్ విద్యార్థి విషాదం!
మహబూబ్‌నగర్: అనుమానాస్పద స్థితిలో బీటెక్ విద్యార్థి ఉరేసుకుని మృతిచెందిన ఘటన హైదరాబాద్‌లోని మేడ్చల్ మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని అయ్యవారిపల్లికి చెందిన బాలెమియా, భార్య నస్రీన్ బేగానికి ఇద్దరు కుమారులు ఉన్నారు. తాను ఆటో నడుపుతూ, భార్య కూలిపని చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. వీరి పెద్దకుమారుడు రఫీ అపోలో ఫార్మసిలో పని చేస్తున్నాడు. చిన్న కుమారుడు ఎండీ మహ్మద్(21) హైదరాబాద్‌లోని మేడ్చల్, మైసమ్మగూడ మల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతూ.. అక్కడే హాస్టల్లో ఉంటున్నాడు. ఇతను బుధవారం రాత్రి అనుమానాస్పదంగా కాలేజీ హాస్టల్లో ఉరేసుకుని మృతిచెందాడు. ఆ వివరాలను రాత్రి 2 గంటలకు పోలీసులు అయ్యవారిపల్లిలో ఉన్న కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. గురువారం గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం మృతదేహాన్ని అయ్యవారిపల్లికి తీసుకొచ్చారు. ఇవి చదవండి: హనీట్రాప్ చేసి.. కత్తులతో పొడిచి -
శ్వాసే.. ఆ‘ఐ’శ !
వికారాబాద్: పిల్లలకు చిన్న గాయమైతేనే కన్నపేగు అల్లాడిపోతుంది.. అలాంటిది ఏడేళ్లుగా నయం కాని వ్యాధితో చిన్నారి కళ్ల ముందు నేలకే పరిమితమైతే ఆ తల్లిదండ్రుల బాధ, వ్యథ చెప్పడానికి కూడా వీలుకాదు.. అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది చౌడాపూర్ మండలంలోని అబ్దుల్ ఉస్మాన్ కుటుంబం. మందిపల్ గ్రామానికి చెందిన అబ్దుల్ ఉస్మాన్, నస్రీన్ దంపతులు. వీరికి ముగ్గురు సంతానం. ఐదేళ్ల వరకు పెద్ద కూతురు అబ్దుల్ ఐశ(15) ఎంతో ఆరోగ్యంగా ఉండేది. రెండో తరగతి చదువుకునే సమయంలో ప్రమాదం జరిగి కాలు విరిగిపోయింది. అప్పుడు సర్జరీ చేశారు. అప్పటి నుంచి బాలికలో ఎదుగుదల నిలిచిపోయింది. దీనికి తోడు క్యాల్షియం లోపం వెంటాడింది. ఐశను గట్టిగా పట్టుకున్నా ఎముకలు విరిగిపోయేవి. దీంతో తల్లిదండ్రులు బాలికను పలు ఆస్పత్రులకు తీసుకెళ్లారు. కానీ ఫలితం కనిపించలేదు. పేద కుటుంబ కావడంతో ఆర్థిక పరమైన ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా అప్పులు చేసి వైద్యం చేయిస్తున్నారు. ఇటీవల ఐశ ఆరోగ్యం మరింత దెబ్బతింది. దీంతో రెండు నెలల పాటు ఆస్పత్రిలో ఉంచారు. ఖర్చులు ఎక్కువ కావడంతో ఇటీవలే ఇంటికి తెచ్చారు. అయితే ప్రస్తుతం ఆమె ఆక్సిజన్‌పై నెట్టుకొస్తోంది. కదలలేని స్థితిలో ఉన్న కూతుర్ని చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆటో నడిస్తే తప్ప కుటుంబం గడవని పరిస్థితిలో కూతురి వైద్యం కోసం నెలకు రూ.10 వేలకు పైగా ఖర్చు చేయాల్సి వస్తోందని అబ్దుల్ ఉస్మాన్ తెలిపారు. ఇన్వర్టర్, కరెంటు బిల్లు రూ. 2వేలు, వాతావరణం వేడిగా ఉండడం కోసం ఓ యంత్రం, ఆక్సిజన్ మిషన్‌కు నెలకు రూ. 6 వేలు, ఇతర ఖర్చులు మరో రెండు వేలు వెచ్చించాల్సి వస్తోందని తల్లిదండ్రులు తెలిపారు. ఐశ స్వతహాగా ఏ పని చేసుకోలేదని, భోజనం కూడా తినిపించాలి ఉంటుందని, ధ్రవ పదార్థాలే ఎక్కువ ఇస్తున్నట్లు తెలిపారు. కదలలేని స్థితిలో ఉన్న కూతుర్ని కంటికి రెప్పలా కాపాడుకోవాలని, ఎవరో ఒకరు పక్కనే ఉండి చూసుకోవాలని తల్లి తెలిపింది. ఆక్సిజన్ మిషన్ పెట్టడం వల్ల కరెంటు పోకుండా చూసుకోవాల్సి ఉంటుందన్నారు. ఇటీవల మూడు గంటలపైగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఐశను సబ్ స్టేషన్‌కు తీసుకెళ్లి అక్కడే పడుకోవాల్సి వచ్చిందని బోరున విలపించారు. ప్రస్తుతం వికలాంగ పింఛను రూ.3,016 వస్తోందని చెప్పారు. కొంత కాలం పాటు మందులు వాడితే బాలిక ఆరోగ్యం కుదటపడే అవకాశం ఉందని వైద్యులు చెప్పినట్లు బాలిక తల్లిదండ్రులు అబ్దుల్ ఉస్మాన్, నస్రీన్ తెలిపారు. దాతలు ముందుకు వచ్చి సాయం చేయాలని వారు వేడుకుంటున్నారు. బాలిక తండ్రి ఫోన్ నంబర్ 7036042976. -
దేశమే నా కుటుంబం
సరిహద్దే సైనికుడి ఇల్లు... దేశమే అతని కుటుంబం. ఆ కుటుంబానికి కాపలా సైనికుని విధి.డ్యూటీ ఫస్ట్ అనుకున్నాడు ఫిరోజ్లోని సైనికుడు. బుల్లెట్లకు ఎదురొడ్డి ‘నా దేశం కోసం నా ప్రాణాలైనా ఇస్తాను’ అని నినదించాడు. నేడు సైనికుడు లేకపోవచ్చు...దేశం అనే ఈ కుటుంబం అతణ్ణి తలుచుకోకుండా ఉంటుందా? సరిహద్దే సైనికుడి ఇల్లు.ఇంటి కాపలా సైనికుని విధి.శతృవు టక్కరి నక్క అయినప్పుడు సైనికుడు పులిలా గాండ్రిస్తాడు.తుపాకీని ఎక్కుపెడతాడు.బుల్లెట్ తాకిన శతృవు హాహాకారాలు చేస్తాడు.బుల్లెట్లకు ఎదురొడ్డిన సైనికుడు ‘భారత్ మాతాకీ జై’ అని నినదిస్తాడు.నేడు సైనికుడు లేకపోవచ్చు.దేశం అనే ఈ ఇల్లు అతణ్ణి తలుచుకోకుండా ఉంటుందా?‘నస్రీన్.. బక్రీద్ పండక్కి రాలేకపోతున్నా..’ చెప్పాడు ఫిరోజ్.‘కోషీష్ చేయండి.. పిల్లలు చాలా జ్ఞాపకం చేస్తున్నారు... ’ నిరాశ పడుతూ అంది నస్రీన్. ‘నీకు తెలుసుగా నస్రీన్.. మిలట్రీలో ఇలాగే ఉంటుంది... పిల్లలని సముదాయించు’‘అలాగే... మీరు జాగ్రత్త’ దాదాపు అరగంట సాగింది ఆ సంభాషణ. ఆ అరగంటలో చాలాసార్లు సిగ్నల్ కట్ అయింది. మళ్లీ మళ్లీ ట్రై చేస్తూ భార్యతో మాట్లాడాడు. ఇంకా ఆమెకు భర్తను వినాలనే ఉంది. కాని జమ్ము, కశ్మీర్‌లోని పూంచ్ సెక్టార్ కమ్యూనికేషన్ సిగ్నల్ అంత బలంగా లేదు. ఫోన్ డిస్కనెక్ట్ అయ్యాక ఫిరోజ్, నస్రీన్ ఇద్దరిలోనూ బాధే! నేపథ్యం... ఫిరోజ్ది హైదరాబాద్‌లోని నవాబ్సాబ్ కుంట. నస్రీన్ది ఎమ్.ఎస్ మఖ్తా. ఇద్దరికీ దూరపు బంధుత్వం ఉంది. 2006లో నిఖాతో విడదీయని బంధంగా మారారు. ఫిరోజ్ కుటుంబంలో అతనే మొదటి సంతానం. ఫిరోజ్ వాళ్ల నాన్న మిలటరీలో ఉండి రిటైరయ్యాడు. ఫిరోజ్ కూడా పద్దెనిమిదేళ్లకు మిలటరీలో జాయిన్ అయ్యాడు. యూనిఫామ్ అంటే అమితమైన భక్తి, గౌరవం. డ్యూటీ అంటే ప్రాణం. ఏ బార్డర్లో ఏ సెక్టార్లో బాధ్యతలు అప్పజెప్పినా అక్కడ ప్రత్యక్షమయ్యేవాడు. సౌత్ఆఫ్రికాకు వెళ్లమంటే ఇంట్లో వాళ్లు వద్దని వారించినా వినకుండా వెళ్లాడు. డ్యూటీ అంటే డ్యూటీనే అనేవాడు. వీరుడు లాన్స్ నాయక్ ఫిరోజ్.అమరవీరుడు ఫిరోజ్! 2013 అక్టోబర్... కశ్మీర్ సరిహద్దులో విపరీతంగా కాల్పులు జరుగుతున్నాయి. ఆ సంఘటనప్పడు ఆ రోజు డ్యూటీలో ఉన్నాడు ఫిరోజ్. అది బక్రీద్‌కు ముందు రోజు. ఆ సమయంలోనే దసరా కూడా ఉండడంతో హిందూ జవాన్లు సెలవుల మీద సొంతూళ్లకు వెళ్లారు. ఫిరోజ్ బక్రీద్‌కి లీవ్ తీసుకోకుండా డబుల్ డ్యూటీలో ఉన్నాడు. ఆ విషయాన్నే ఫోన్లో భార్యతో పంచుకున్నాడు. అన్నట్లుగానే సరిహద్దులో రెప్ప వేయకుండా నలు దిక్కులా దృషిసారిస్తున్నాడు. అప్పుడే అవతలవైపు నుంచి కాల్పులు మొదలయ్యాయి. సమాధానంగా ఫిరోజ్‌ఖాన్ తుపాకి గురిపెట్టాడు. ఫైర్ చేస్తూనే ఉన్నాడు. ధడ్ధడ్ధడ్... శతృవు తోక ముడుస్తూ ఉండగా... ధడ్ధడ్మంటూ ఎదురు నుంచి బుల్లెట్లు దూసుకొచ్చి జివ్వున ఫిరోజ్‌కు గుచ్చుకున్నాయి. అయినా ఫిరోజ్ తగ్గలేదు. పోరాడాడు. పోరాడుతూ పోరాడుతూనే కుప్పకూలాడు. వెంటనే అతణ్ణి శిబిరంలోకి చేర్చారు తోటి సైనికులు. అదే సమయానికి హైదరాబాద్‌లో... నస్రీన్ తన ముగ్గురు పిల్లల (ఇద్దరమ్మాయిలు, ఒక్కబ్బాయి)తో తల్లిగారింట్లో ఉంది. బక్రీద్ ఏర్పాట్లు జరుగుతున్నాయి. నస్రీన్ తండ్రి మొయినుద్దీన్ హడావిడిగా ఉన్నాడు. ఇంతలోకే అతనికి ఫోన్.. ‘బార్డర్లో చిన్నగా కాల్పులు. ఫిరోజ్‌కి షోల్డర్‌లో బుల్లెట్ దిగింది’ అని సమాచారం. ‘యాల్లాహ్...’ మొయినుద్దీన్ కంగారు పడ్డాడు. ‘కంగారు పడకండి.. ఏం కాలేదు. మీతో ఏదో మాట్లాడాలనుకుంటున్నాడు’అని ఫిరోజ్‌కి ఫోన్ ఇచ్చారు. ‘అబ్బాజాన్.. అ..బ్బా...జా...’ ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు ఫిరోజ్. కాని చెప్పలేకపోయాడు. అందరూ ఉన్న పని వదిలేసి దేవుడి ప్రార్థనల్లో మునిగి పోయారు. తెల్లవారో.. ఆ మర్నాడో.. ఫిరోజ్ భౌతిక కాయం రానే వచ్చింది. నస్రీన్ కుప్ప కూలిపోయింది. ‘పిల్లలు పెరుగుతున్నారు. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఫౌజీ వద్దు ఏం వద్దు.. అందరం ఒక్క చోటే ఉందాం.. ఉన్నది తిందాం.. వచ్చేయండి’ ఎన్నో సార్లు బతిమాలుకుంది. ‘నస్రీన్.. దీన్ని నేనొక ఉద్యోగంలా అనుకోవట్లేదు. ఈ నేలను కాపాడ్డం ఈ దేశ పౌరుడిగా నా బాధ్యత అనుకుంటున్నా. నువ్వే అర్థం చేసుకోకపోతే ఎట్లా చెప్పూ..!? నాకు మాత్రం ఉండదా? నీతో, పిల్లలతో ఉండాలని. ఇన్ని రోజులు ఓపిక పట్టావు. ఇంకొన్ని రోజుల్లో రిటైరైపోతా.. అప్పుడంతా మీతోనే కదా..’ అంటూ అంతకుముందే ఆగస్ట్‌లో ఈద్ పండక్కి వచ్చినప్పుడు ఆప్యాయంగా చేయి పట్టుకొని భరోసా ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని వమ్ము చేసి అట్లా ఎట్లా పోతాడు? అల్లాహ్.. ఈ పిల్లలకు ఏమని చెప్పాలి? ‘నస్రీన్.. తుపాకి భుజానేసుకొని జమీన్‌ను కాపాలకాసే జావాన్‌ను నేను. ఎప్పుడేమవుతుందో తెలియదు. అన్నిటికీ సిద్ధపడాలి. ఒంటరిగా బతకడం నేర్చుకోవాలి. ఇండిపెండెంట్‌గా బతికే ధైర్యాన్ని తెచ్చువాలి’ మొన్న ఈద్కొచ్చినప్పుడే అన్నాడు. గుర్తు తెచ్చుకుంటూ ఉంటే ఆమె కళ్లల్లో జలధారలు. ఎప్పుడూ దగ్గరగా లేకపోయినా అప్పుడప్పుడు కనీసం నెలకో రెండునెల్లకైనా అరగంట అయినా సిగ్నల్ సతాయిస్తూ అయినా ఫిరోజ్‌తో మాటలుండేది. ఊరడింపులు.. ధైర్యవచనాలు.. ప్రేమ.. అనురాగం.. భవిష్యత్ ప్రణాళికలు.. ఆశలు.. ఆశయాలు..ఎన్నో పంచుకునే వాళ్లు. డ్యూటీ గురించి ఎప్పడూ ఏమీ చెప్పవు అని గారంగా విసుక్కునేది. ‘చెబితే భయపడ్తావ్.. మళ్లీ నన్ను వెళ్లనివ్వవ్.. నీ భర్త బహద్దురీ నీ భర్త గుండెలోనే ఉండనివ్వు’ అనేవాడు నవ్వుతూ. ‘మరినాకెట్లా తెలిసేది.. మీ నాన్నను చూసి నువ్వు ఇన్స్పైర్ అయినట్లు వాళ్ల నాన్నను నా పిల్లలు ఇన్స్పైర్ కావొద్దా?’ అనేది. నవ్వి ఊరుకునేవాడు అంతే!ఆ నవ్వు లేదు.. ఆ ధైర్యం రాదు.. ఆ సాహసం కనిపించదు ఇప్పుడు! అన్నీ ఈ నేలకు సెల్యూట్ చేసి ఆయనతోపాటే వెళ్లిపోయాయి. ఫిరోజ్ అంటే.. వెలుగు.. విజయం! ఆ పేరే తనకు ప్రేరణ. ఆ వెలుగే తనకు దారి చూపిస్తోంది.. ఆ కామియాబీనే తనను నడిపిస్తోంది అంటుంది నస్రీన్. ఆమె కోరుకునేది ఒక్కటే. ‘బతికున్నంత కాలం.. ఫౌజీ ఫౌజీ అని తపించాడు. ఈ దేశం కోసం ప్రాణాలర్పించాడు. ఆయన చనిపోయినప్పుడు ఈ స్టేట్ గవర్నమెంట్ రెండువందల గజాల స్థలాన్నిస్తానని చెప్పింది. జవాన్ భార్యగా అది నా హక్కు. ఆయన చనిపోయి అయిదేళ్లయినా ఇంకా ఆ జాగ ఇవ్వలేదు. తెలంగాణ ఏర్పడ్డాక అదిచ్చే బాధ్యత తెలంగాణ గవర్నమెంట్‌కు వచ్చింది. రేపు మాపు అంటూ తిప్పుతూనే ఉన్నారు. కాని ఇప్పటికీ జాడలేదు. కాళ్లరిగేలా తిరుగుతున్నా.. అమర జవాన్‌కు ఇచ్చే గౌరవం ఇదేనా?’ అంటూ ఆవేదన చెందుతోంది నస్రీన్. ఫిరోజ్ పెద్ద కూతురికి పదేళ్లు. పెద్దయ్యాక ఏమవుతావ్ అని అడిగితే.. ‘పప్పాలాగా మిలిట్రీ పోలీస్ అవుతా’ అంటుంది ఉత్సాహంగా. బక్రీద్ పండగ త్యాగానికి చిహ్నం.ఆ పండుగ సమయంలో దేశం కోసం ప్రాణాన్ని త్యాగం చేసినవాడు ఫిరోజ్. సలాం.. ఫిరోజ్ సాబ్.. సలాం! – సరస్వతి రమ డ్యూటీ గురించి ఎప్పడూ ఏమీ చెప్పవు అని గారంగా విసుక్కునేది. ‘చెబితే భయపడ్తావ్.. మళ్లీ నన్ను వెళ్లనివ్వవ్.. నీ భర్త శౌర్యం నీ భర్త గుండెలోనే ఉండనివ్వు’ అనేవాడు నవ్వుతూ. -
అర్ధరాత్రి ప్రసవ వేదన
♦ పురిటినొప్పులతో వస్తే హైదరాబాద్‌కు రిఫర్ చేశారు ♦ అంబులెన్స్‌లో వెళ్తుండగా మార్గ మధ్యంలో ప్రసవం ♦ వికారాబాద్ ఆస్పత్రి వైద్యుల నిర్వాకంపై ఆగ్రహం బంట్వారం: ఓ నిండు గర్భిణి పురిటినొప్పులతో ఆస్పత్రికి వెళ్తే.. ప్రసవం చేసేందుకు వైద్యులు నిరాకరించారు. బీపీ ఎక్కువగా ఉందనే నెపంతో హైదరాబాద్‌కు రిఫర్ చేశా రు. అంబులెన్స్‌లో నగరానికి తరలిస్తుండగా మార్గ మధ్యంలో ప్రసవం జరిగింది. వికారాబాద్ జిల్లా కోట్‌పల్లి మండలం కరీంపూర్ గ్రామానికి చెందిన నస్రీన్ బేగం (25) నిండు గర్భిణి. శనివారం రాత్రి 11 గంటలకు పురిటి నొప్పులు రావడంతో భర్త హసన్, ఆడపడుచు మహబూబ్‌బీ కలసి ఆటోలో వికారాబాద్‌కు తీసుకొచ్చారు. రాత్రి ఒంటి గంటకు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో చేర్పించేందుకు యత్నించగా నైట్ డ్యూటీలో ఉన్న డాక్టర్లు నిరాకరించారు. బీపీ ఎక్కువగా ఉందని, తల్లీబిడ్డకు ప్రమాదకరమని హైదరాబాద్‌లోని నయాపూల్ ఆస్పత్రికి తీసుకెళ్లాలని సలహా ఇచ్చారు. ఇక తప్పని పరిస్థితిలో బిక్కుబిక్కుమంటూ రూ.3 వేలకు అంబులెన్స్ మాట్లాడుకొని నగరానికి బయలుదేరారు. మార్గంమధ్యలో చేవెళ్ల సమీపంలోకి చేరుకోగానే ఆదివారం తెల్లవారుజామున నస్రీన్ బేగానికి ప్రసవం జరిగి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. చేవెళ్లలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లి బాలింతకు ఇంజెక్షన్ చేయించారు. అదే అంబులెన్స్‌లో ఆదివారం ఉదయం 6.30 గంటలకు తిరిగి వికారాబాద్ ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి వచ్చారు. అప్పుడు నస్రీన్‌బేగంను అడ్మిట్ చేసుకున్నారు. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. వికారాబాద్ ఆస్పత్రిలో పట్టించుకోలేదు: హసన్, నస్రీన్ భర్త వికారాబాద్ ఆస్పత్రిలో నైట్ డూటీలో ఉన్న డాక్టర్, సిబ్బంది ఎవ్వరూ పట్టించుకోలేదు. బీపీ ఎక్కువగా ఉంది హైదరాబాద్ వెళ్లాలని చెప్పారంతే. నా దగ్గర డబ్బులు లేకపోతే మా సర్పంచ్‌ను పంపించి అంబులెన్స్ ఏర్పాటు చేయించారు. అల్లా దయతో తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు. ఇంతపెద్ద దవాఖానాలో పట్టించుకోకపోతే ఎట్టా..? బీపీ చాలా ఎక్కువగా ఉన్నందునే: జావిద్, డ్యూటీ డాక్టర్ నస్రీన్‌కు బీపీ 180 కంటే ఎక్కువగా ఉంది. బ్లడ్ బ్యాంక్‌లో ఆమె గ్రూప్ రక్తం లేదు. అనస్థీషియన్ (మత్తు) డాక్టర్ లేరు. ఇలాంటి పరిస్థితుల్లో జరగరానిది జరిగితే తల్లీబిడ్డకు ప్రమాదకరమే. అందుకే ఆమెను హైదరాబాద్‌కు రిఫర్ చేయాల్సి వచ్చింది.