National Geographic Traveler Photo Contest -2014
-
మోముపై అవార్డు మెరుపు..
ప్రతిష్టాత్మక నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ ఫొటో కాంటెస్ట్-2014లో మనకూ చోటు దక్కింది. చెన్నైకు చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ మహేశ్ సుబ్రమణియన్ ‘డివైన్ మేకోవర్’ పేరిట తీసిన ఈ చిత్రం టాప్-10 ఉత్తమ చిత్రాల జాబితాలో చోటుచేసుకోవడంతోపాటు మెరిట్ ప్రైజునూ సొంతం చేసుకుంది. తమిళనాడులోని కావేరీపట్టణంలో శివరాత్రి మరుసటి రోజు భారీ ఉత్సవం నిర్వహిస్తారు. ఆ సందర్భంగా తీసినదే ఈ ఫొటో. -
మేఘం ముంచుకొచ్చేస్తోంది..
మీరెప్పుడైనా ఇలాంటి సీన్‌ను చూశారా? చూడలేదు కదూ.. అందుకే ఇది ప్రతిష్టాత్మక నేషనల్ జియోగ్రాఫిక్ ట్రావెలర్ ఫొటో కాంటెస్ట్-2014 విజేతగా నిలిచింది. ఇటీవల విజేతల వివరాలను ప్రకటించారు. అమెరికాలో టోర్నడోలు వచ్చినప్పుడు ఇలాంటి మేఘాలు ఏర్పడతాయి. దీన్ని గతేడాది మే 28న అమెరికాలోని జ్యులెస్బర్గ్ వద్ద మార్కో కొరోసెక్ అనే ఫొటోగ్రాఫర్ తీశారు. ఈ అవార్డు కోసం మొత్తం 18 వేల ఫొటోలు ఎంట్రీలుగా రాగా.. ఈ ఫొటో అవార్డును ఎగరేసుకుపోయింది.