National identity cards
-
దేశమంతటా పౌర రిజిస్టర్
న్యూఢిల్లీ: 2020 కల్లా జాతీయ ప్రజా రిజిస్టర్(ఎన్పీఆర్)ను రూపొందించేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. దీని ఆధారంగానే దేశవ్యాప్త పౌరసత్వ రిజిస్టర్‌ను తయారు చేయనుంది. ఎన్పీఆర్ పూర్తయి, అధికారికంగా ముద్రించాక ప్రభుత్వం దీనినే భారత జాతీయ పౌరసత్వ(ఎన్ఆర్ఐసీ) రిజిస్టర్‌కు ఆధారంగా చేసుకుంటుంది. అంటే, ఇది అస్సాంలో చేపట్టిన జాతీయ పౌరసత్వ రిజిస్టర్(ఎన్నార్సీ)కి అఖిల భారత రూపమని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 2020 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సెప్టెంబర్ 30వ తేదీల మధ్య ఈ కార్యక్రమం అస్సాం మినహా దేశవ్యాప్తంగా జరుగుతుందని పేర్కొన్నారు. ఇందులో భాగంగా అధికారులు ఇంటింటికీ వెళ్లి ఆ ప్రాంతంలో ఆరు నెలలుగా నివాసం ఉంటున్న లేదా మరో ఆరు నెలలు, అంతకంటే ఎక్కువ కాలం అక్కడే ఉండాలనుకున్న వ్యక్తుల పేర్లను నమోదు చేసుకుంటారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నమోదు చేయించుకోవాలి. -
ప్రజలందరికీ జాతీయ గుర్తింపు కార్డులు
హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ వెల్లడి న్యూఢిల్లీ: అసలైన భారత పౌరులందరి వివరాలతో ప్రభుత్వం జాతీయ జనాభా రిజిస్టర్(ఎన్పీఆర్)ను రూపొందిస్తోందని, అందరికీ నిర్దిష్ట గడువులోగా జాతీయ గుర్తింపు కార్డులు(ఎన్ఐసి) అందజేస్తామని హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. దేశంలోకి చొరబాట్లు సాగుతున్నాయన్న వార్తలపై మంగళవారం లోక్‌సభలో సభ్యుల ప్రశ్నలకు మంత్రి జవాబిచ్చారు. ‘అసలైన భారతీయులను గుర్తించడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. సమగ్ర ఎన్పీఆర్ డేటాబేస్ తయారీకి ఎన్పీఆర్, ‘ఆధార్’ కార్డులిచ్చే ప్రత్యేక గుర్తింపు సాధికార సంస్థ(ఉడాయ్) పర స్పర సహకారంతో ఎలా పనిచేయాలో చర్చించడానికి ప్రధాని మోడీ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్పీఆర్ ను త్వరలోనే తయారు చేస్తామ’న్నారు. చొరబాట్లను ఆపడానికి అంతర్జాతీయ సరిహద్దులో కంచె నిర్మాణం వంటి చర్యలు తీసుకుంటున్నామన్నారు. కాగా, 2003లో సవరించిన పౌరసత్వ చట్టం ప్రకారం.. పౌరులందరి వివరాలను నమోదు చేసి, ఎన్‌ఐసిలను ఇవ్వాల్సి ఉందని హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు రాతపూర్వక జవాబిచ్చారు. ఆధార్‌కు, ఎన్ఐసీకి తేడా ఏంటి? ఆధార్ కార్డు ప్రత్యేక గుర్తింపు సంఖ్య మాత్రమే. గుర్తింపు కార్డు కాదు. దీనికి చట్టబద్ధత లేదు. ఈ కార్డుదారులందరి బయోమెట్రిక్(వేలిముద్రలు,కనుపాపలచిత్రాలు) వివరాలు, వంటి సమాచారం ‘ఉడాయ్’ వద్ద ఉంటుంది. జాతీ య గుర్తింపు కార్డు(ఎన్ఐసీ) దేశ పౌరులకు ఇచ్చే గుర్తింపు కార్డు. ఇందులో కార్డుదారు పేరు, ప్రత్యేక జాతీయగుర్తింపు సంఖ్య, బయోమెట్రిక్ సమాచారంతోపాటు పేరు, ఊరు తదితర 16 వివరాలు ఉంటాయి. సంక్షేమ పథాకాల అమలు, సబ్సిడీల మంజూరుకు ఇకపై ఎన్‌ఐసీనే ప్రాతిపదికగా తీసుకునే అవకాశముంది. ఎన్‌ఐసీల రాకతో ఆధార్‌కు కాలం చెల్లినట్లే. జాతీయ భద్రతకు ఎన్ఐసీ ప్రాజెక్టు కీలకమని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు రూ. 50 వేల కోట్ల వ్యయంతో చేపట్టిన ఆధార్ ప్రాజెక్టు కింద గత ఏడాది చివరి నాటికి 50 కోట్ల మంది పేర్లు నమోదు చేయడం తెలిసిందే. -
పౌరులందరికీ జాతీయ గుర్తింపు కార్డులు
న్యూఢిల్లీ: భారత పౌరులందరికీ త్వరలో జాతీయ గుర్తింపు కార్డులు ఇవ్వనున్నట్లు హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. దేశంలోకి చొరబాట్లు సాగుతున్నాయన్న వార్తలపై మంగళవారం లోక్‌సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అసలైన భారత పౌరులందరి వివరాలతో ప్రభుత్వం జాతీయ జనాభా జాబితా(ఎన్పీఆర్)ను రూపొందిస్తోందని, వారందరికీ నిర్దిష్ట గడువులోగా జాతీయ గుర్తింపు కార్డులు అందజేస్తామని చెప్పారు. ‘అసలైన భారతీయులను గుర్తించడానికి చర్యలు తీసుకోవాల్సి ఉంది. సమగ్ర ఎన్పీఆర్ డేటా బేస్ తయారీకి ఎన్పీఆర్, ప్రత్యేక గుర్తింపు సాధికార సంస్థ(ఉడాయ్) పరస్పర సహకారంతో ఎలా పనిచేయాలో చర్చించడానికి ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఎన్పీఆర్ను నిర్దిష్ట వ్యవధిలో తయారు చేస్తాం’ అని ఆయన వివరించారు. సరిహద్దుల నుంచి చొరబాట్లను ఆపడానికి అంతర్జాతీయ సరిహద్దులో కంచె నిర్మాణం వంటి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. భారత్-బంగ్లాదేశ్ సరిహద్దులో 4,090 కిలోమీటర్ల కంచె నిర్మాణంలో భాగంగా ఇప్పటికే 3,300 కిలోమీటర్ల కంచెను నిర్మించినట్లు తెలిపారు. కాగా, 2003లో సవరించిన పౌరసత్వ చట్టం ప్రకారం దేశ పౌరులందరి వివరాలను నమోదు చేయవలసి ఉందని హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. పౌరులకు జాతీయ గుర్తింపు కార్డులు కూడా ఇవ్వవలసి ఉందని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభకు ఇచ్చిన రాతపూర్వక సమాధానంలో ఆయన ఈ వివరాలు తెలిపారు.