వైఎస్ హయాంలోనే పేదలకు సంక్షేమ పథకాలు
నేరేడుచర్ల, న్యూస్‌లైన్ : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలోనే పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాయని వైఎస్సార్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నేరేడుచర్ల, కందులవారిగూడెం, బొత్తలపాలెం, అలింగాపురం, జాన్‌పహాడ్‌లో పార్టీ జెడ్పీటీసీ, ఎంపీటీసీ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అర్హులైన వారిందరికీ ఇందిరమ్మ ఇళ్లు, ఫీజు రీయింబర్స్మెంట్, రైతుల రుణాల మాఫీ, పావలా వడ్డీరుణాలు, విద్యుత్ బకాయిల మాఫీ జరిగాయన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల, మరుగుదొడ్ల బిల్లులు చెల్లించకుండా లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నా స్థానిక మంత్రి జోక్యం చేసుకోకపోవడం దారుణమన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో అభివృద్ధి పేరిట బ్రోకర్లకు, కాంట్రాక్టర్లకు లబ్ధిచేకూర్చరన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే పేకాట క్లబ్‌లను మూసి వేయిస్తామన్నారు. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి వైఎస్సార్ విగ్రహాల, వైఎస్సార్ కాంగ్రెస్ జోలికి వస్తే రాజకీయంగా అంతం కావడం ఖాయమన్నారు. రానున్న ఎంపీటీసీ, జెడ్పీటీసీ, ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు.
కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు పోరెడ్డి నర్సిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఇనుపాల పిచ్చిరెడ్డి, కుందూరు మట్టారెడ్డి, గజ్జల కోటేశ్వరరావు, జెడ్పీటీసీ అభ్యర్థి బాణోతు మంగమ్మ, ఎంపీటీసీ అభ్యర్థులు బండావత్ సరిత, నకిరేకంటి సైదులు, బాణవత్ బుజ్జి, బెరైడ్డి రవీందర్‌రెడ్డి, నాయకులు బెల్లంకొండ గోవింద్‌గౌడ్, రాజేష్, యాకుబ్, కొదమగుండ్ల మట్టయ్య, సుం కరి యాదగిరి, థామస్, పఠాన్ జాని, పల్లా అంజయ్య, కీత శ్రీను, బాలసైదా, ఉపేంద్రచారి, రాపోలు వెంకన్న, దుర్గా ఉన్నారు.