వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో..ఇద్దరు బాలురు దుర్మరణం
నేరేడుచర్ల
వేర్వేరు రోడ్డు ప్రమాదంలో ఇద్దరు బాలుర్ల్లు మృతి చెందారు. నేరేడుచర్ల మండ లం దిర్శించర్ల శివారులో ఒకరు మృతి చెందగా, గుర్రంపోడు మండలం కొ ప్పోలు శివారులో మరొకరు మృత్యువాత పడ్డారు. పోలీ సులు తెలిపిన వివరాల ప్రకారం దిర్శించర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని తోకలవారిగూడెం స్టేజీ వద్ద శివసాయి (5) రోడ్డు దాటుతుండగా జాన్‌పహాడ్ నుంచి నేరేడుచర్ల వస్తున్న బొలోరో వాహనం ఢీకొట్టింది. శివసాయిని 108లో చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తీసుకుపోతుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. శివసాయి తండ్రి సైదులు ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ జి.గోపి తెలిపారు.
కొప్పోలులో మరో బాలుడు..
గుర్రంపోడు : మండలంలోని కొప్పోలు గ్రామ శివారులో మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో నూనావత్ రాకేష్(14) అనే బాలుడు మృతి చెందాడు. ఎస్‌ఐ సాయి వెంకటకిశోర్ తెలిపిన వివరాల ప్రకారం నల్లగొండ నుంచి మల్లేపల్లికి వెళ్తున్న పాల ఆటో డ్రైవర్ సురేష్ ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనాన్ని తప్పించబోయి సడన్ బ్రేక్ వేశాడు. దాంతో డ్రైవర్‌కు సహాయకుడైన రాకేష్ కూర్చున్న పక్క డోర్ తెరుచుకోవడంతో రోడ్డు పక్కన పడిపోయాడు. తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృ తుడు రాకేష్ నల్లగొండ పట్టణానికి చెం దిన వాడు. కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.