Nizamabad Town
-
తల్లి సేవలో తరించిన నగరం
నిజామాబాద్‌కల్చరల్ : ఆషాఢమాసం చివరి ఆదివారం నిజామాబాద్ నగరంలో ఊరపండుగను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. అంటువ్యాధులు సోకకుండా కాపాడాలనీ, జిల్లాలో సమృద్ధిగా వర్షాలు కురవాలని అమ్మవారిని వేడుకున్నారు. ఖిల్లా నుంచి ఉదయం 8.55 గంటలకు గ్రామదేవతలతో ఊరేగింపు ప్రారంభమైంది. గ్రామదేవతల ఊరేగింపునకు ముందుభాగాన ఉండే తొట్లెల కింద నుంచి దూరేందుకు భక్తులు పోటీపడ్డారు. దారిపొడుగునా కొబ్బరి కాయలు కొట్టి, కోళ్లు సమర్పించుకుని మొక్కులు తీర్చుకున్నారు. పోతరాజుల విన్యాసాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సర్వసమాజ్ కమిటీ ఆధ్వర్యంలో వేడుక సాగింది. -
నేడే ‘ఊర’ పండుగ
నిజామాబాద్‌కల్చరల్ : ఊరంతా మెచ్చే పండుగ వచ్చేసింది. అమ్మను కొలవడానికి ఇందూరు సర్వసమాజం సన్నద్ధమైంది. శనివారం రాత్రి నుంచే వేడుక ప్రారంభం కానుంది. ఆదివారం ఉదయం ఊర పండుగ జరగనుంది. వేడుకకు సంబంధించి బల్దియా అధికారులు, సర్వసమాజ్ ప్రతినిధులు ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో ఏటా ఆషాఢ మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చే ఆదివారం ఊర పండుగను జరుపుకుంటున్నారు. ఊర పండుగ చరిత్ర గురించి స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఎనిమిది దశాబ్దాల క్రితం నిజామాబాద్‌లో గత్తర, కలర, ప్లేగువంటి ప్రాణాంతక అంటువ్యాధులు ప్రబలాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులపాలయ్యారు. ఎడ్లు మృత్యువాతపడడంతో వ్యవసాయం దెబ్బతింది. వ్యాధుల కారణంగా ప్రజలు నగరం విడిచిపోయి శివారు ప్రాంతాల్లో ఆవాసాలు ఏర్పాటు చేసుకుని జీవించసాగారు. గ్రామ దేవతల ఆగ్రహం వల్లే వ్యాధులు ప్రబలుతున్నాయని భావించిన గ్రామ పెద్దలు.. ప్రజలను కాపాడేందుకు అమ్మవారి విగ్రహాలను ప్రతిష్ఠించాలని నిర్ణయించారు. నిజామాబాద్‌లోని 9 మున్నూరుకాపు సంఘాలతోపాటు గోనెకాపు, పాకనాటి సంఘాలను కలుపుకుని ఆషాఢ మాసంలో ఊర పండుగ చేశారు. అమ్మ దయతో వ్యాధులు తగ్గిపోయాయి. గ్రామం విడిచి వెళ్లినవారు ఊరిలోకి తిరిగి వచ్చారు. వ్యాధులు దరి చేరకుండా ఉండేందుకు ఊరంతా బండారు చల్లి కట్టడి చేశారు. ఆ ఆనవాయితీనే ఏటా కొనసాగిస్తున్నారు. ‘సరి’ విశిష్టత ఊరపండుగలో వినియోగించే ‘సరి’కి ఎంతో విశిష్టత ఉంది. దీని కోసం ప్రజలు తోపులాడుకుంటారు. నవధాన్యాలు, పిండితో సరిని తయారు చేస్తారు. ఇందులో గ్రామదేవతలకు బలిచ్చే జీవాల రక్తం, పేగులను కలుపుతారు. ఈ సరిని ఇళ్లపై, ఎడ్లపై చల్లితే అనారోగ్యం దరి చేరదని నగరవాసుల అపార నమ్మకం. శనివారం అర్ధరాత్రినుంచే.. నగరంలోని ఆయా ప్రాంతాల్లో ప్రతిష్ఠించే గ్రామదేవతలను వడ్రంగులు తీర్చిదిద్దారు. నగరంలోని 12 ప్రధాన చౌరస్తాల్లో అమ్మవారిని కొలుస్తూ పసుపు, కుంకుమతో ముగ్గువేసి బండారు వేసి పూజలు చేశారు. శనివారం అర్ధరాత్రి దాటాక అశోక్వీధిలోని వడ్లదాతి వద్ద తయారు చేసిన గ్రామదేవతలను ఖిల్లా తేలిమైసమ్మ గద్దెకు తీసుకువెళతారు. ఆదివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో అక్కడినుంచి విగ్రహాలతో శోభాయాత్ర ప్రారంభమవుతుంది. గాజుల్‌పేట, గురుద్వార్, బడాబజార్, కస్బాగల్లి, గోల్హనుమాన్ చౌరస్తా, పూలాంగ్ చౌరస్తా మీదుగా వినాయక్‌నగర్‌లోని మహాలక్ష్మీనగర్ వరకు శోభాయాత్ర సాగుతుంది. మూడు గ్రామ దేవతలను బడాబజార్ సమీపం నుంచి దుబ్బ వైపు తీసుకువెళ్తారు. -
ఘనంగా ప్రారంభమైన ఊర పండుగ
నిజామాబాద్ టౌన్ : నిజామాబాద్ జిల్లా రఘునాథ్ ఖిల్లాలో ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే ఊర పండుగ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఊర పండుగను నిజామాబాద్‌లో 1935వ సంవత్సరం నుంచి సంప్రదాయంగా నిర్వహిస్తున్నారు.ఈ పండుగకు ప్రత్యేకంగా మామిడి చెక్కతో అమ్మవార్ల విగ్రహాలను తయారు చేస్తారు. అలా తయారుచేసిన అమ్మవార్ల విగ్రహాలను శ్రీరఘునాథ ఆలయం నుంచి పెద్దబజార్, పుల్లాంగ్ చౌరస్తా మీదుగా వినాయక్‌నగర్ వరకు ఊరేగిస్తారు. అదే సమయంలో ఒక్కో అమ్మవారి విగ్రహాన్ని నగరంలోని ఒక్కో దేవాలయంలో ప్రతిష్టించుకుంటూ వెళ్తారు. ఈ ఊరేగింపులో దాదాపు నగరంలోని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని విజయవంతం చేస్తారు. -
ఊర పండుగకు సర్వం సిద్ధం
నిజామాబాద్ టౌన్ : ప్రతి ఏడాది నిజామాబాద్ నగరంలో ఘనంగా నిర్వహించే ఊర పండుగకు శనివారం సర్వం సిద్ధం చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఊర పండుగను నిజామాబాద్‌లో 1935వ సంవత్సరం నుంచి సంప్రదాయంగా నిర్వహిస్తున్నారు. ఈ పండుగకు ప్రత్యేకంగా మామిడి చెక్కతో అమ్మవార్ల విగ్రహాలను తయారు చేస్తారు. ఈ అమ్మవార్ల విగ్రహాలను పండుగ నాడు నగరంలో ఊరేగిస్తారు. అదే సమయంలో ఒక్కో అమ్మవారి విగ్రహాన్ని నగరంలోని ఒక్కో దేవాలయంలో ప్రతిష్టించుకుంటూ వెళ్తారు. ఈ కార్యక్రమంలో దాదాపు నగరంలోని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని విజయవంతం చేస్తారు.