ఘనంగా ప్రారంభమైన ఊర పండుగ
నిజామాబాద్ టౌన్ : నిజామాబాద్ జిల్లా రఘునాథ్ ఖిల్లాలో ప్రతి ఏడాది ఘనంగా నిర్వహించే ఊర పండుగ ఆదివారం ఘనంగా ప్రారంభమైంది. ఆదివారం తెల్లవారుజాము నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఊర పండుగను నిజామాబాద్‌లో 1935వ సంవత్సరం నుంచి సంప్రదాయంగా నిర్వహిస్తున్నారు.ఈ పండుగకు ప్రత్యేకంగా మామిడి చెక్కతో అమ్మవార్ల విగ్రహాలను తయారు చేస్తారు.
అలా తయారుచేసిన అమ్మవార్ల విగ్రహాలను శ్రీరఘునాథ ఆలయం నుంచి పెద్దబజార్, పుల్లాంగ్ చౌరస్తా మీదుగా వినాయక్‌నగర్ వరకు ఊరేగిస్తారు. అదే సమయంలో ఒక్కో అమ్మవారి విగ్రహాన్ని నగరంలోని ఒక్కో దేవాలయంలో ప్రతిష్టించుకుంటూ వెళ్తారు. ఈ ఊరేగింపులో దాదాపు నగరంలోని ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొని విజయవంతం చేస్తారు.