హోటల్లో అగ్నిప్రమాదం: ఒకరు మృతి
ముంబయి: ముంబయిలోని వాషి ప్రాంతంలో ఓ హోటల్లో శుక్రవారం తెల్లవారుజామున అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో ఒకరు మరణించగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఎన్ఎంఎంసీ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారని చెప్పారు. పోలీసుల కథనం ప్రకారం ... హోటల్లో ఈ రోజు తెల్లవారుజామున ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
దాంతో స్థానికులు వెంటనే స్పందించి పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్లతో అక్కడికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అనంతరం సహాయక చర్యలు చేపట్టారు. ఆ క్రమంలో మృతి చెందిన ఓ మృతదేహాన్నిస్వాధీనం చేసుకున్నారు. గాయపడ్డిన ఇద్దరు వ్యక్తులను ఆసుపత్రికి తరలించారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.