normal
-
చలికాలంలో భగభగలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భగభగమంటున్నాయి. సాధారణంగా చలికాలంలో క్రమంగా తగ్గాల్సిన ఉష్ణోగ్రతలు వేసవి కాలం మాదిరి నమోదవుతున్నాయి. ప్రస్తుతం నైరుతి సీజన్ ముగిసి, ఈశాన్య రుతుపవనాల ప్రవేశానికి పరిస్థితులు అనుకూలిస్తుంటాయి. ఇంకా ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించనప్పటికీ సాధారణంగా ఈపాటికి వాతావరణం చల్లబడుతుంది. కానీ రాష్ట్రంలో మాత్రం అందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయి. సాధారణ ఉష్ణోగ్రతలను మించిపోతున్నాయి. సగటున 3–5 డిగ్రీ సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతుండటంతో రాష్ట్రంలో వాతావరణం వేసవి సీజన్‌ను తలపిస్తోంది. వాతావరణంలో తేమ తగ్గడంతో ఉక్కపోత పెరుగుతుండగా.. ఆకాశం మేఘాలు లేకుండా నిర్మలంగా ఉంటుండటంతో ఉష్ణోగ్రతలు సైతం అధికంగా నమోదవుతున్నాయి. మరో వారం ఇంతే... రాష్ట్రంలో నైరుతి రుతుపవనాల సీజన్ ముగిసినప్పటికీ... తిరోగమన ప్రక్రియ చివరి దశలో ఉంది. మరో మూడు రోజుల్లో రాష్ట్రం నుంచి నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో నిష్క్రమించే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత వారం రోజులకు ఈశాన్య రుతుపవనాలు ప్రవేశించే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈక్రమంలో వాతావరణంలో మార్పులు ఉంటాయని, దీంతో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. గురువారం రాష్ట్రంలో నమోదైన ఉషోగ్రతలను పరిశీలిస్తే గరిష్ట ఉష్ణోగ్రత ఖమ్మంలో 36.2 డిగ్రీ సెల్సియస్ నమోదు కాగా, కనిష్ట ఉష్ణోగ్రత అత్యల్పంగా మెదక్‌లో 18.3 డిగ్రీలుగా నమోదైంది. పగటి ఉష్ణోగ్రతలు చాలాచోట్ల సాధారణం కంటే 3 డిగ్రీలు అధికంగా నమోదవుతోంది. ఖమ్మం జిల్లాలో సాధారణం కంటే 4.6 డిగ్రీలు అధికంగా నమోదు కాగా, భద్రాచలంలో 3.5 డిగ్రీలు, మెదక్, నల్లగొండ, నిజామాబాద్, హనుమకొండలో 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఎక్కడా వర్షపాతం నమోదు కాలేదు. రానున్న మూడు రోజులు రాష్ట్రంలో పొడివాతావరణమే ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. -
ఆ దేశంతో మామూలు సంబంధాలు కావాలి..కానీ ఆ విషయంలో మాత్రం..
పాకిస్తాన్‌తో భారత్ సాధారణ పొరుగు సంబంధాలను కోరుకుంటుందని భారత్ ప్రధాని మోదీ అన్నారు. అయితే ఉగ్రవాదం లేని అనుకూలమైన వాతావరణం సృష్టించడం, అందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో పాక్‌నే భాద్యత వహిస్తుందని మోదీ చెప్పారు. జపాన్‌లో జరిగే జీ7 సదస్సుకు గెస్ట్ కంట్రీగా భారత్ హాజరవనున్న నేపథ్యంలో ప్రధాని మోదీ అతిపెద్ద స్వతంత్ర వ్యాపార మీడియా గ్రూపులలో ఒక్కటైన నిక్కి ఆసియాకు ఇచ్చిన ఇంటర్య్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. సరిహద్దు ఉగ్రవాదం విషయంలో పాక్ మద్దతుపై భారత్ పదేపదే ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదం, చర్చలు కలిసి వెళ్లలేవని నొక్కి చెప్పారు. ఈ సందర్భంగా చైనాతో సంబంధాల గురించి ప్రశ్నించిగా..దక్షిణాసియా దేశాల గొంతును, వారి ఆందోళనను తెలియజేయడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలు గురించి మాట్లాడారు. భారత్ తన సౌర్వభౌమాధికారం, గౌరవం కాపాడుకునేందుకు సిద్దంగానే గాక అందుకు కట్టుబడి ఉందన్నారు. 2020లో చైనా సైన్యంతో చర్యలు తర్వాత తూర్ప లడఖ్‌లో ప్రతిష్టంభన ఏర్పడిందన్నారు. ఈ చర్చలు కొన్ని ప్రాంతాలను విడదీసేలా ఘర్షణ కలిగించాయి. చైనాతో ద్వైపాక్షిక సంబంధాలు నెరపాలంటే సరిహద్దు ప్రాంతాలలో శాంతి, ప్రశాంతత చాలా అవసరమని చెప్పారు. భారత్-చైనా సంబంధాల భవిష్యత్తు, అభివృద్ధి, పరస్పర గౌరవం, సున్నితత్వం, ప్రయోజనాలపై మాత్రమే ఆధారపడి ఉందన్నారు. అంతేగాదు ఇరు దేశాల విస్తృత సంబంధాలు ప్రపంచానికి ప్రయోజనం చేకూరుస్తాయని చెప్పారు. ఇక రష్యా ఉక్రెయిన్ వివాదంలో భారత్ మధ్యవర్తి పాత్ర పోషించగలదా అని సంధించిన ప్రశ్నకు..ఉక్రెయిన్ వివాదంపై తమ దేశం వైఖరి స్పష్టంగా తిరుగులేనిదని మోదీ చెప్పారు. భారత్ ఎప్పుడూ శాంతివైపు నిలుస్తుంది. ప్రాథమిక అవసరాలను తీర్చడంలో సవాళ్లను ఎదుర్కొనే వారికి మద్దతు ఇవ్వడానికి తాము కట్టుబడి ఉన్నామని చెప్పారు. ముఖ్యంగా ఆహారం, ఇంధనం, ఎరువుల ధరలు పెరుగుతున్న నేపథ్యంలో రష్యా, ఉక్రెయిన్లతో తాము కమ్యూనికేషన్ కొనసాగిస్తామన్నారు. సహాయ సహకారాలతో సమయాన్ని నిర్వచించాలి గానీ సంఘర్షణతో కాదు అని చెప్పారు. ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, చట్టబద్ధమైన పాలన వంటి విలువలే జపాన్, భారత్‌ని మరింత దగ్గర చేశాయని ప్రధాని మోదీ అన్నారు. తాము ఇప్పుడూ ఆర్థిక ప్రయోజనాల్లో పెరుగుతున్న రాజకీయ, వ్యూహాత్మక భద్రత కలయికను చూస్తున్నాం అని చెప్పారు. ఇదిలా ఉండగా జీ7 సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోదీ శుక్రవారం జపాన్‌లోని హిరోషిమా చేరుకున్నారు. ఈ సమ్మిట్‌కు భారత్‌ను అతిధిగా ఆహ్వానించారు. 2003 నుంచే జీ7 సదస్సులో భారత్ పాల్గొంటోంది. (చదవండి: నాడు అద్దె గదిలో జూనియర్ లాయర్‌గా ప్రారంభమై..నేడు సుప్రీంకోర్టు జడ్జి స్థాయికి..) -
దక్షిణాదిలో మార్చి ఎండలు తక్కువే!
సాక్షి, హైదరాబాద్: హమ్మయ్య! ఈ నెలలో దక్షిణాది రాష్ట్రాలు కొంచెం నిశ్చింతగా ఉండవచ్చు. ఎందుకంటారా? దేశం మొత్తమ్మీద మార్చి నెలలో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉండబోతున్నాయి. కానీ, దేశ ద్వీపకల్ప ప్రాంతంలో మాత్రం వేడి సాధారణం నుంచి అంతకంటే తక్కువ ఉండనుంది. భారతీయ వాతావరణ విభాగం (ఐఎండీ) ఈ విషయం తెలిపింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరి మాత్రం ఎన్నడూ లేనంతగా, స్పష్టంగా చెప్పాలంటే 1877 సంవత్సరం నుంచి ఇప్పటివరకూ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన నెలగా రికార్డు సృష్టించింది. వేసవి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఐఎండీ మంగళవారం వర్చువల్ పద్ధతిలో విలేకరుల సమావేశం నిర్వహించింది. మార్చి నుంచి మే నెల వరకూ వేసవి తీరుతెన్నులపై తన అంచనాలను వెలువరించింది. దీని ప్రకారం.. మార్చిలో గరిష్ట ఉష్ణోగ్రతలు దేశ ఈశాన్య, తూర్పు, మధ్య ప్రాంతాలతోపాటు వాయువ్య ప్రాంతాల్లో కొన్ని చోట్ల సాధారణం కంటే ఎక్కువగా ఉండనున్నాయి. మిగిలిన ప్రాంతాలు అంటే.. దక్షిణాది రాష్ట్రాల్లో మాత్రం తక్కువగా ఉంటాయి. కనిష్ట ఉష్ణోగ్రతల్లోనూ ఈ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. దక్షిణాది రాష్ట్రాలు మినహా మిగిలిన అన్నిచోట్ల రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని ఐఎండీ తెలిపింది. మార్చి నుంచి మే నెల మధ్యభాగంలో దేశ మధ్య ప్రాంతం దానికి అనుకుని ఉండే వాయవ్య ప్రాంతాల్లో వడగాడ్పులు సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉండనుంది. మార్చిలో దేశంలోని మధ్య ప్రదేశంలో వడగాడ్పుల ప్రభావం అంతగా ఉండకపోవచ్చు. సాధారణ స్థాయిలోనే వర్షాలు.. మార్చి నెలలో వర్షపాతం కూడా దేశం మొత్తమ్మీద సాధారణంగానే ఉండనున్నట్లు ఐఎండీ తెలిపింది. దీర్ఘకాలిక అంచనాలతో పోల్చినప్పుడు ఈ నెల వర్షాలు 83 –117 శాతం మధ్యలో ఉంటాయని తెలిపింది. దేశ వాయవ్య ప్రాంతాల విషయానికి వస్తే అక్కడ సాధారణం కంటే తక్కువ స్థాయి వర్షాలు నమోదు కావచ్చునని, సెంట్రల్ ఇండియా పశ్చిమ దిక్కున, ఈశాన్య, తూర్పు భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి ఉంటుందని వివరించింది. దేశ ద్వీపకల్ప ప్రాంతంలో మార్చి నెల వానలు సాధారణం లేదా అంతకంటే ఎక్కువ స్థాయిలో ఉంటాయని తెలిపింది. ఎల్‌నినో, లానినాలపై ఇప్పుడే చెప్పలేం ఈ ఏడాది రుతుపవనాల పరిస్థితులపై స్పష్టంగా చెప్పడం ప్రస్తుతానికి వీలుకాదని ఐఎండీ తెలిపింది. ‘‘పసఫిక్ మహాసముద్ర ప్రాంతంలోని ఉపరితల జలాల ఉష్ణోగ్రతల దృష్ట్యా లానినా పరిస్థితులున్నాయి. రానున్న రోజుల్లో ఇది బలహీనపడి ఎల్‌నినో పరిస్థితులు ఏర్పడే అవకాశం కనిపిస్తోంది’’ అని వివరించింది. రుతుపవనాల సీజన్‌కు ముందు ఈ పరిస్థితులు ఏర్పడవచ్చంది. అంతేకాకుండా... రుతుపవనాలపై ప్రభా వం చూపగల హిందూ మహాసముద్ర ఉపరి తల జలాల ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థితిలోనే ఉండే అవకాశమున్నట్లు చెప్పారు. -
సాధారణ స్థాయికి ఎల్పీజీ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: దేశీయంగా, రాష్ట్రంలో ఎల్పీజీ గ్యాస్ నిల్వలకు ఎలాంటి కొరత లేదంటూ ఇండియన్ ఆయిల్ కంపెనీల ప్రకటనల నేపథ్యంలో డిమాండ్ సాధారణ స్థాయికి చేరింది. గత కొన్ని రోజులుగా వంట గ్యాస్ సిలిండర్ల బుకింగ్‌లు విపరీతంగా పెరగ్గా, ప్రస్తుతం అవి తగ్గుముఖం పట్టాయి. ఎక్కడా కొరత లేకపోవడం, ఆయిల్ కంపెనీలు సైతం బుకింగ్ చేసిన రెండు, మూడు రోజుల్లోనే సరఫరా చేస్తుండటంతో అటు వినియోగదారులు, ఇటు కంపెనీలు ఊపిరి పీల్చుకుంటున్నాయి. రాష్ట్రంలో గత ఫిబ్రవరి నెలతో పోలిస్తే మార్చి 21 నుంచి గ్యాస్ బుకింగ్‌లు విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజూ బుకింగ్‌లు 1.75లక్షల నుంచి 1.85లక్షల వరకు ఉంటుండగా, మార్చి నెలాఖరులో అవి ఏకంగా రోజుకు 3లక్షల వరకు పెరిగాయి. వినియోగదారులు అవసరం లేకున్నా అదనపు బుకింగ్‌లు చేస్తుండటంతో అప్రమత్తమైన ఆయిల్ కంపెనీలు ఒక్కో సిలిండర్ బుకింగ్‌కు మధ్య గడువును 14 రోజులకు పెంచాయి. ఇదే సమయంలో దేశ వ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌తో పాటే ఎల్పీజీ నిల్వలు సరిపడేంతగా ఉన్నాయని ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. ఎల్పీజీ సిలిండర్ పూర్తిగా అందుబాటులో ఉండటంతో సోమవారం బుకింగ్‌లు కేవలం 1.08లక్షలు మాత్రమే ఉన్నాయని ఆయిల్ కంపెనీలు తెలిపాయి. -
‘కశ్మీర్ పునరుద్ధరణకు రోడ్‌మ్యాప్’
వాషింగ్టన్ : జమ్ము కశ్మీర్లో రాజకీయ, ఆర్థిక సాధారణ పరిస్థితి పునరుద్ధరించేందుకు రోడ్‌మ్యాప్ ప్రకటించాలని, రాజకీయ నిర్బంధంలో ఉన్న నేతలందరినీ విడుదల చేయాలని భారత్‌ను అమెరికా కోరింది. ఇక తమ భూభాగంలో ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాదులపై కఠిన చర్యలు చేపట్టాలని పాకిస్తాన్‌కు సూచించింది. జమ్ము కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం అనంతరం పెద్దసంఖ్యలో వేర్పాటువాద నేతలను ముందస్తు కస్టడీలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. కశ్మీర్లో రాజకీయార్థిక సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు రోడ్‌మ్యాప్ అవసరమని అమెరికా దక్షిణాసియా వ్యవహారాల సహాయ కార్యదర్శి అలైస్ వెల్స్ అన్నారు. ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో అమలవుతున్న నియంత్రణలతో కశ్మీర్లో 80 లక్షల మంది స్ధానికులు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్న తీరు తమకు ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. భద్రతా పరమైన కారణాలతో కశ్మీర్లో వార్తలను కవర్ చేసే జర్నలిస్టులు పలు సవాళ్లు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. -
ఆ మూడూ ముఖ్యం
ఎలాంటి అమ్మాయి కావాలి? అని సాధారణంగా అబ్బాయిల్ని అడిగితే ఫలానా హీరోయిన్లా ఉండాలి అని సమాధానం చెబుతారు. మరి ఏకంగా హీరోయిన్‌కే ఎలాంటి వాడు కావాలి? అంటే ‘గ్రీకువీరుడు...’ పాట పాడతారు. కానీ అదంతా సినిమాల్లో, నార్మల్ లైఫ్‌లో మూడు లక్షణాలు ఉండాలనుకుంటున్నాను అంటున్నారు రకుల్ ప్రీత్ సింగ్. ఈ మూడు లక్షణాలు ఏంటంటే... నేను హీల్స్ వేసుకున్నా తనని తలెత్తుకు చూసేలా ఉండాలి. అంటే మంచి ఎత్తుండాలి. తనకు జీవితంలో ఓ ప్యాషన్ ఉండాలి. అది ఏ రంగంలో అయినా సరే. అందులో పెద్ద సక్సెస్ఫుల్ కానక్కర్లేదు. తన జీవితంలో ఒక విజన్‌తో ఉండాలి. ఇంక మూడోది.. నిజాయతీపరుడై ఉండాలి. సెన్సాఫ్ హ్యూమర్ కూడా బాగా ఉండాలి’’ అని పేర్కొన్నారు రకుల్. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండలవాడి దర్శనానికి భక్తులు 5 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీనివాసుడి సర్వదర్శనానికి 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడనక వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. స్వామివారిని మంగళవారం 68,763 మంది భక్తులు దర్శించుకున్నారు. 24,229 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ 3.21 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుపతి: తిరుమలలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనం కోసం మొత్తం 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామి వారి సర్వదర్శనానికి 4 గంటలు, శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. శుక్రవారం శ్రీవారిని 55,963 మంది భక్తులు దర్శించుకున్నారు. 22,339 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.09 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుపతి: తిరుమలలో గురువారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 4 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సర్వ దర్శనానికి 6 గంటల సమయం పడుతుంది. ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. బుధవారం 63,870 మంది భక్తులకు స్వామివారిని దర్శించుకున్నారు. 20,359 మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీలో భక్తులు సమర్పించిన నగదు రూ. 2.69 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుమల: తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి బుధవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీనివాసుడి దర్శనానికి భక్తులు 4 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. స్వామివారిని మంగళవారం 61,679 మంది భక్తులు దర్శించుకున్నారు. 18,990 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 2,23 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
సాక్షి, తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు 2 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. స్వామివారి సర్వదర్శనానికి 5 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినకడనక వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతుంది. ఏడుకొండలవాడిని సోమవారం 77,292 మంది దర్శించుకున్నారు. 24,475 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం నిన్న రూ. 3.26 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమలః తిరుమలలో సోమవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనం కోసం 2 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 4 గంటల సమయం పడుతుంది. కాలినడకన వచ్చే భక్తులకు,. ప్రత్యేక దర్శనానికి రెండు గంటల సమయం పడుతుంది. ఆదివారం శ్రీనివాసుని 87,891 మంది భక్తులు దర్శించుకున్నారు. 33,001 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.3.20 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
దేశంలో సాధారణ వర్షపాతం-వాతావరణ శాఖ
న్యూఢిల్లీ: దేశంలో సాధారణ వర్షపాతం నమోదుకానుందని భారత వాతావరణశాఖ మంగళవారం ప్రకటించింది. జూన్- సెప్టెంబర్ మాసంలో సాధారణ వర్షాలు కురియనున్నాయని ప్రభుత్వ వాతావరణ కార్యాలయం చెప్పింది. జూన్ టు సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాలు సీజన్ లో భారతదేశం అంతటా సాధారణ వర్షాలు కురుస్తాయని భారత మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ కె.జే.రమేష్ చెప్పారు. వర్షపాతం దీర్ఘ కాలంలో సగటు 96శాతంగా ఉంటుందన్నారు. సాధారణ వర్షపాతం దేశ ఆర్థికవ్యవస్థకు, వ్యవసాయ రంగానికి మేలు చేస్తుందన్నారు. ఇది రైతులకు మరింత మేలు చేస్తుందన్నారు. రైతులు ఈ ఏడాది ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 38 శాతం అధిక వర్ష పాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, మే చివరిలో నైరుతి రుతుపవననాలు కేరళను తాకే అవకాశం ఉందని చెప్పారు. వాణిజ్య పంటల కన్నా సంప్రదాయ పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. గత ఏడాదిలో లాగే ఈ ఏడాది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలపై నైరుతి, ఈశాన్య రుతు పనవాల ప్రభావం అధికంగా ఉంటుందని, ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం తగ్గుముఖం పడుతుందని ఆయన వివరించారు. Monsoon, normal, 2017,IMD, సాధారణ వర్షపాతం, వాతావరణ శాఖ, దేశంలో సాధారణ వర్షపాతం న్యూఢిల్లీ: దేశంలో సాధారణ వర్షపాతం నమోదుకానుందని భారత వాతావరణ శాఖ మంగళవారం ప్రకటించింది. జూన్- సెప్టెంబర్మాసంలో సాధారణ వర్షాలు కురియనున్నాయని ప్రభుత్వ వాతావరణ కార్యాలయం చెప్పింది. జూన్ టు సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాలు సీజన్ లో భారతదేశం అంతటా సాధారణ వర్షాలు కురుస్తాయని భారత మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ డైరెక్టర్ జనరల్ కె.జే.రమేష్ చెప్పారు. సాధారణ వర్షపాతం దేశ ఆర్థికవ్యవస్థకు, వ్యవసాయ రంగానికి మేలు చేస్తుందన్నారు. ఇది రైతులకు మరింత మేలు చేస్తుందన్నారు. రైతులు ఈ ఏడాది ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, 38 శాతం అధిక వర్ష పాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని, మే చివరిలో నైరుతి రుతుపవననాలు కేరళను తాకే అవకాశం ఉందని చెప్పారు. వాణిజ్య పంటల కన్నా సంప్రదాయ పంటల వైపు మొగ్గు చూపాలని సూచించారు. గత ఏడాదిలో లాగే ఈ ఏడాది కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అన్నారు. రెండు తెలుగు రాష్ట్రాలపై నైరుతి, ఈశాన్య రుతు పనవాల ప్రభావం అధికంగా ఉంటుందని, ఈ ఏడాది ఎల్ నినో ప్రభావం తగ్గుముఖం పడుతుందని ఆయన వివరించారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తల రద్దీ సాధారణంగా ఉంది. సర్వ దర్శనానికి భక్తులు మూడు కంపార్టుమెంట్లలో వేచి ఉన్నారు. వీరికి 5 గంటల సమయం పడుతోంది. కాలినడక భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి సుమారు 2 గంటల సమయం పడుతోంది. ఈరోజు అర్ధరాత్రి నుంచి కాలి నడక భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు జారీ చేస్తారు. వైకుంఠ ఏకాదశి, మర్నాడు ద్వాదశి సందర్భంగా దేవస్థానం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్సులోని 54 కంపార్టుమెంట్లుతోపాటు నారాయణగిరి ఉద్యానవనంలో ప్రత్యేక కంపార్టుమెంట్లు ఏర్పాటు చేయనున్నారు. ఆ రెండు రోజులు (8, 9తేదీలు) ఆర్జిత సేవలను, ప్రత్యేక ప్రవేశ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. కాగా, గురువారం శ్రీవారిని 61,517మంది భక్తులు దర్శించుకున్నారు. -
వేస్టేజ్ ఈజ్ మస్ట్!
హ్యూమర్ ఈమధ్య రాంబాబుగాడు వృథా చేయవద్దనే అంశం మీద అనర్గళంగా మాట్లాడుతున్నాడు. వాడు మాట్లాడినంత కాలం ఏం పర్లేదు. వాడి వరకు ఆచరించినా ఓకే. కానీ దాన్ని విచిత్రంగా అందరిచేతా ఆచరణలో పెట్టిస్తున్నాడంటూ వాళ్ల అమ్మగారు కళ్లనీళ్లు పెట్టుకున్నారు. సాధారణంగా వాడు నార్మల్‌గా ఉండటమే జరగదు. తన వాదనలతో వాడు అందరినీ ఇబ్బంది పెట్టడం మామూలే. ఇందులో ప్రత్యేకంగా వాడు ఇతరులను ఇక్కట్లు పెట్టడం ఏముందని నా అభిప్రాయం. ఆ ఉద్దేశంతోనే...‘‘వృథా చేయకపోవడం మంచిదేగా. ఇందులో ఇబ్బందేముంది? ఏం చేస్తున్నాడు వాడు’’ అడిగాను నేను. ‘‘వృథా చేయకూడదని మాకు కూడా తెలుసు కదా నాయనా. పొద్దున్నే టిఫిన్ చేసే టైమ్‌లో ఉప్మాలో మిరపకాయలను వదిలేయకుండా తినాలంటూ వాళ్ల నాన్న చేతా, నా చేతా వాటిని తినిపిస్తున్నాడు. పిండిన నిమ్మకాయలనే మళ్లీ మళ్లీ పిండిస్తున్నాడు. అంతెందుకు... నిమ్మకాయల్లో ఉన్న గింజలను వృథా చేయకూడదంటూ... వాటిని ఏరి ప్రత్యేకంగా పెరట్లో నాటిస్తున్నాడు. అదేదో వాడు చేయవచ్చు కదా... కాదంట. ఆపిల్స్ అంటే తొక్కతో తినవచ్చు. కానీ అరటిపండ్లకు కూడా అదే న్యాయమంటే ఎలా?’’ అంటూ తన బాధ వెళ్లగక్కుకుంది ఆవిడ.‘‘నేను చూస్తా పదండి’’ అంటూ ఆమెను సమాధాన పరచి పంపించా. సరిగ్గా మధ్యానం భోజనాలప్పుడు వచ్చాడు రాంబాబు గాడు.‘‘రారా నువ్వు కూడా తిందువుగానీ’’ అంటూ పిలిచా. ఆ పిలుపే నా పాలిట శాపమవుతుందని ఆ టైమ్‌లో తెలియదు.సరిగ్గా ఆవకాయ ముక్క పెట్టించుకుని, దాన్ని తినే టైమ్‌లో హితోక్తులు మొదలు పెట్టాడు. ‘‘ఒరేయ్... టెంక ముక్కను ఉయ్యకూడదు. దాన్ని విపరీతంగా నములు. అలా నములుతూ ఉండగా కమ్మటి ఊట వస్తుంది. అలా ఊరే దాన్ని మింగు’’ అంటూ ఆదేశాలు ఇస్తున్నాడు.‘‘అలాగేలేరా... నాకు తెలియదా’’ అంటూ నములుతున్న నోటితోనే అన్నాను.‘‘కాదురా... ఇంకాసేపు నములు’’ అంటూ ఉమ్మనివ్వడం లేదు వాడు.‘‘ఒరేయ్... టెంక ముక్క అంతా టేస్ట్‌లెస్‌గా అయిపోయింది. ఇక పిప్పి తప్ప ఏమీ లేదురా. ఇంక ఉయ్యనివ్వు’’ అంటూ దీనంగా అర్థించినా వినలేదు వాడు.నోరు నొప్పి పెట్టి నొప్పి పెట్టి... ఇక తప్పక... డైనింగ్ టేబుల్ దగ్గర్నుంచి పారిపోయి బయటకు వెళ్లి ఉమ్మేయ్యాల్సి వచ్చింది. నా వరకు నాకే అంత ఇబ్బందిగా ఉంటేl... పొద్దస్తమానం ఇంట్లో వీడితోనే వేగాల్సి వచ్చే వాడి అమ్మానాన్నా ఎంత వేదన పడుతున్నారో అనిపించింది. ఇదే మాటే వాళ్ల నాన్న దగ్గర ఎత్తితే ఆయన ఇంకా ఎన్నో బాధలు చెప్పుకున్నాడు.నేను ఎక్స్పెక్ట్ చేసింది రైటే. కూరలోని కరివేపాకుల్నీ తినమంటూ ఒకటే పోరట. ‘అరే... వాటి నుంచి వచ్చే సారం ఆల్రెడీ కూరలోకి ఊరుతుంది. ఆ ఆకుల్ని తినలేమం’టూ బదులిస్తేl... ‘అలా కుదరదు. కరివేప ఆకుల్ని నమిలి తింటే క్యాన్సర్కూడా తగ్గుతుందం’టూ బలవంతంగా తినిపిస్తున్నాడట. అంతేకాదు... వాడి పిచ్చి ఎంతవరకూ వచ్చిందంటే లవంగం మొగ్గలనూ వదలకుండా బలవంతంగా నమిలేలా చేస్తున్నాట్ట. అలా చేయడం వల్ల కూరలోని రుచిపోయి నాలుక భగ్గుమంటోందన్నా వినడం లేదట. వీడి బాధ పడలేక... ఆ లవంగాలూ, దాల్చినచెక్క లాంటి వాటిని నమలకుండా బలవంతంగా మింగేయాల్సి వస్తోందట. ఇది చెప్పుకొని ఎంతో బాధపడ్డాడా పెద్దాయన.‘‘నేను వాడికి చెబుతాలెండి’’ అంటూ అప్పటికి వచ్చేశాను. సరిగ్గా మర్నాడు పొద్దున్నే వాడి దగ్గరకు బయల్దేరా.‘‘ఒరేయ్... కాసేపు ఆగు. స్నానం చేసి వస్తా’’ అంటూ టవల్ తీసుకొని బయల్దేరాడు. ‘‘ఒరేయ్ రాంబాబూ! నువ్వు నాకొక మాట ఇవ్వాల్రా’’ అన్నాను వాడితో.‘‘ఏమిట్రా’’ అడిగాడు.‘‘అయితే... ఒక్క బొట్టు కూడా కింద పడకుండా... అంతా ఒంటి మీదే పడేలా స్నానం చేయ్’’ అన్నా.‘‘అదెలా సాధ్యం?’’ అడిగాడు వాడు.‘‘అంతే... అలాగే చేయ్’’ అన్నాను మొండిగా నేను.‘‘కుదరదు’’కరాఖండిగా అన్నాడు వాడు.‘‘పారబోయడానికీ... పారేయడానికీ... పారించడం అన్న విషయాలు తెలుసుకుంటే వృథా విషయంలో వేస్ట్ ఆఫ్ టైమ్కూ రెస్ట్కూ తేడా అవగతమవుతుంది’’ అంటూ వచ్చేశా.వాడికి అర్థమైందనే అనుకుంటా. – యాసీన్ -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో ఆదివారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. మూడు కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి మూడు గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలు, కాలి నడక భక్తులకు మూడు గంటల సమయం పడుతోంది. కాగా, శనివారం 72,137మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. సుమారు 33 వేల మంది తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.2.36 కోట్లుగా ఉంది. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనార్థం మంగళవారం ఉదయం 7 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవేంకటేశ్వరస్వామి ప్రత్యేక దర్శనానికి రెండు గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటలు, సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీనివాసుని 71,029 మంది భక్తులు దర్శించుకున్నారు. 26,944 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 2.94 కోట్ల రూపాయలని టీటీడీ అధికారులు తెలిపారు. -
నోటు సమస్య నుంచి ఓ రాష్ట్రం బయటపడింది!
ఐజ్వాల్: పెద్ద నోట్ల రద్దు ప్రభావం నుంచి తాము బయటపడ్డామని, ఇప్పుడు అంతపెద్ద ఇబ్బందులు రావడం లేదని, ఇక రూ.500 నోట్లు కూడా బ్యాంకులకు చేరితే సమస్య పోయనట్లేనని మిజోరం రాష్ట్ర రాజధాని ఐజ్వాల్ లోని ఎస్బీఐ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ప్రదీప్ కుమార్ సేన్ అన్నారు. 16 రోజుల తర్వాత తమ బ్యాంకులు సాధారణ పరిస్థితులతో నడుస్తున్నాయని, హడావుడి తగ్గిపోయిందని, బ్యాంకుల ముందు క్యూలు తగ్గిపోయాయని, ఏటీఎంల వద్ద కూడా అంతా బాగానే ఉందని ఆయన గురువారం మీడియాకు చెప్పారు. రిజర్వ్ బ్యాంకు నుంచి తమకు రావాల్సిన మొత్తం ఆదివారం రాత్రి చేరుకుందని.. ఇంకొంత వస్తుందని అది కూడా త్వరలోనే కొత్త రూ.500 నోట్లతో ఉంటుందని తాము భావిస్తున్నామని, లావాదేవీలు కూడా సులువుగా ఉంటాయని అభిప్రాయపడ్డారు. -
తగ్గిన భక్తులు.. పెరిగిన హుండీ రాబడి
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. అయితే అనూహ్యంగా హుండీ రాబడి పెరిగింది. శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనార్థం మంగళవారం రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. సర్వ దర్శనానికి రెండు గంటలు, ప్రత్యేక దర్శనానికి ఒక గంట, కాలినడకన వచ్చే భక్తులకు రెండు గంటల సమయం పడుతోంది. సోమవారం శ్రీవారిని 67,241 మంది దర్శించుకున్నారు. 25,643 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. సోమవారం శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.18 కోట్లు వచ్చింది. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి ప్రస్తుతం 5 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడక వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. శుక్రవారం 67,862 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని శ్రీవారి హుండీకి రూ. 3 కోట్ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండలపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి ప్రస్తుతం 11 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. శ్రీవారి సర్వ దర్శనానికి 6 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 4 గంటలు సమయం పడుతోంది. గురువారం స్వామివారిని 56,244 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 2.28 కోట్లుగా నమోదైందని టీటీడీ అధికారులు తెలిపారు. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ గురువారం సాధారణంగా ఉంది. శ్రీవారి దర్శనార్థం రెండు కంపార్ట్మెంట్లలో భక్తులు వేచిఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 2 గంటల సమయం పడుతోంది. బుధవారం శ్రీవారిని 64,068 మంది భక్తులు దర్శించుకున్నారు. 27,389 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. బుధవారం శ్రీవేంకటేశ్వరస్వామి హుండీ ఆదాయం రూ.2.7కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. -
సాధారణం కంటే అధికంగా వర్షాలు
కర్నూలు(అగ్రికల్చర్): జిల్లాలో ఈ నెల సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిశాయి. సెప్టంబర్ నెల సాధారణ వర్షపాతం 125.7 మీ.మీ ఉండగా ఇప్పటి వరకు 145 మిమీ వర్షం కురిసింది. ఆదివారం రాత్రి జిల్లాలోని వివిధ మండలాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. అత్యధికంగా సి.బెళగల్లో 34.6 మీమీ వర్షపాతం నమోదు అయింది. పెద్దకడుబూరులో 32.4, దేవనకొండలో 26.4, ఎమ్మిగనూరులో 21.2, కోసిగిలో 16.4, పాములపాడులో 14.8, నందవరంలో 14.2, దొర్నిపాడులో 14, ఆత్మకూరులో 12.2, ఆదోనిలో 11.6, బండిఆత్మకూరులో 11.2, కోవెలకుంట్లలో 10.2, ఆస్పరిలో 10 మీమీ ప్రకారం వర్షాలు కురిశాయి. -
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల: తిరుమలలో సోమవారం ఉదయం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి దర్శనానికి భక్తులు 6 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 3 గంటల సమయం పడుతోండగా.. కాలినడక భక్తులకు 2 గంటల్లో దర్శనం లభిస్తోంది. -
తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఏడుకొండలవాడి దర్శనానికి ప్రస్తుతం 3 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 4 గంటలు, కాలినడకన వచ్చే భక్తులకు 3 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. నిన్న(శనివారం) స్వామివారిని 76,137 మంది భక్తులు దర్శించుకున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.