'పది’ పరీక్షలు పాత విధానంలోనే
బోధన మాత్రం కొత్త విధానంలో
విజయవాడ: విద్యా వ్యవస్థను సంస్కరణల బాట పట్టిస్తామని ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. పదో తరగతి పరీక్షలను ఈ ఏడాది పాత విధానం(11 పేపర్లు)లోనే నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు విద్యాబోధన మాత్రం నిరంతర సమగ్ర మూల్యాంకనం(సీసీఈ)కు అనుగుణంగా మారిన పాఠ్యప్రణాళికతో జరగాలని ఆదేశించింది. దీంతో ప్రభుత్వంపై ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్ల ఒత్తిడి ఫలించినట్లయింది. నూతన విద్యావిధానంపై తొలుత కొన్ని ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేసినా చివరికి అంగీకరించాయి. విద్యాసంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా పరీక్షలు ఏ విధానంలో నిర్వహించాలన్న అం శంపై విద్యాశాఖ నుంచి ఆదేశాలు అందక ఉపాధ్యాయులు, విద్యార్థుల్లో చాలా రోజులుగా అయోమ యం నెలకొంది. సీసీఈకి అనుగుణంగా రూపొం దించిన పాఠ్యపుస్తకాలు అందుబాటులోకి రావడంతో నెలన్నర రోజులుగా నూతన విధానంలోనే విద్యాబోధన జరుగుతోంది. తీరా పాత విధానంలోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ఉత్తర్వు లు జారీ కావడంతో ఉసూరుమంటున్నారు. బోధన ఒక విధానంలో చేస్తూ, పరీక్షలు మరో విధానంలో జరపడమేమిటని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు.