23న దివ్య దర్శనం
కర్నూలు(న్యూసిటీ):
దేవాదాయ ధర్మదాయ శాఖ ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీన దివ్య దర్శనం కార్యక్రమం నిర్వహిస్తామని సహాయ కమిషనర్ సి.వెంకటేశ్వర్లు తెలిపారు. దివ్య దర్శనం కోసం 960 మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కలెక్టర్ లాటరీ తీసి ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. కార్యక్రమాన్ని ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఉప కమిషనర్ బి.గాయత్రి దేవి తదితరులు హాజరవుతారని పేర్కొన్నారు. విడతల వారీగా దివ్య దర్శనం చేయిస్తామని తెలిపారు.