one die
-
'ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం' చూస్తూ మృతి
-
'ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం' చూస్తూ మృతి
సిద్దిపేట: సిద్ధిపేట జిల్లా కేంద్రంలోని శ్రీనివాస థియేటర్లో ఓ వ్యక్తి మృతిచెందాడు. ఇంట్లో దెయ్యం నాకేం భయ్యం సినిమా చూస్తూ సదరు వ్యక్తి ప్రాణాలు విడిచాడు. మృతుడు సిద్ధిపేట్‌లోని ఎన్టీఆర్ నగర్‌కు చెందిన ఎండీ షాదుల్(30)గా గుర్తించారు. ఇంటర్వెల్ సమయంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని థియేటర్ యాజమాన్యం పోలీసులకు తెలియజేసింది. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గుండెపోటుతో మరణించి ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు. -
నేపాల్‌లో కూలిన మరో విమానం
ఖాట్మాండు: నేపాల్‌లో మరో విమానం కూలిపోయింది. పశ్చిమ నేపాల్‌లో శుక్రవారం ఓ చిన్నపాటి విమానం కుప్పకూలింది. కాగా విమానంలో 11మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకూ తమకు అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు నేపాల్ ఉన్నతాధికారి పదమ్లాల్ లమిచనే తెలిపారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని పైలెట్ ఓ వ్యవసాయ భూమిలో ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ప్రమాద స్థలికి చేరుకునేందుకు సమీప నగరం నుంచి నాలుగు గంటల సమయం పడుతోందన్నారు. సహాయక చర్యలు అందించేందుకు పోలీసులు, ఆర్మీ సిబ్బంది హెలికాపర్ట్లో బయల్దేరారు. కాగా విమానం కూలడం వారంలో ఇది రెండోసారి. బుధవారం తారా ఎయిర్ లైన్స్ విమానం కూలి 23మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. -
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
పూర్ణియా: బిహార్ పూర్ణియా జిల్లాలోని భవానిపూర్ పోలీసు పరిధిలో దుర్గాపూర్ చౌక్ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా... మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన మహిళ రేఖా దేవిగా గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పోలీసు ఉన్నతాధికారులు సందర్శించారు. ప్రమాద ఘటనపై పోలీసులు ఆరా తీశారు. ఈ ఘటనకు కారణమైన ట్రక్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. -
రెండు బైక్‌లు ఢీ.. ఒకరు మృతి
కసింకోట (విశాఖ): శుభకార్యానికి హాజరై ఇంటికి తిరిగి వెళుతూ ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. విశాఖ జిల్లా కసింకోట వద్ద ఆదివారం రాత్రి రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం బెందేడు గ్రామానికి చెందిన వ్యక్తి గా గుర్తించారు. కాగా, మరో బైక్‌పై వెళుతున్న రామకృష్ణకు గాయాలు అవడంతో అతడిని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
నల్గొండ: భువనగిరి శివారులోని జగదేవ్‌పూర్ చౌరస్తా వద్ద మంగళవారం ఉదయం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు...భువనగిరికి వస్తున్న ఆర్టీసీ బస్సు ఎదురుగా వెళుతున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో ద్విచక్రవాహనం నడుపుతున్న మల్లయ్య(32) అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక కూర్చున్న శీను(30) తీవ్రంగా గాయపడ్డాడు. వీరు భువనగిరికి చెందినవారుగా గుర్తించారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
లారీని ఢీ కొన్న ఆర్టీసీ బస్సు: ఒకరి మృతి
నల్లగొండ: ఆగి ఉన్న లారీని ఆర్టీసీ బస్సు ఢీ కొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సోమవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమనేడు గ్రామ శివారులో జరిగింది. వివరాలు..జాతీయరహదారి65పై ఒక లారీ డీజిల్ అయిపోవడంతో ఆగి పోయింది. ఈ క్రమంలోనే విజమవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు లారీని వెనుక నుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, ఐదుగురికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం నార్కట్‌పల్లి కామినేని ఆస్పత్రికి తరలించారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.