రెండు బైక్‌లు ఢీ.. ఒకరు మృతి
Published Sun, Nov 8 2015 9:13 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM
కసింకోట (విశాఖ): శుభకార్యానికి హాజరై ఇంటికి తిరిగి వెళుతూ ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. విశాఖ జిల్లా కసింకోట వద్ద ఆదివారం రాత్రి రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందాడు. మృతుడు విజయనగరం జిల్లా కొత్తవలస మండలం బెందేడు గ్రామానికి చెందిన వ్యక్తి గా గుర్తించారు. కాగా, మరో బైక్‌పై వెళుతున్న రామకృష్ణకు గాయాలు అవడంతో అతడిని అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Advertisement