పూర్ణియా: బిహార్ పూర్ణియా జిల్లాలోని భవానిపూర్ పోలీసు పరిధిలో దుర్గాపూర్ చౌక్ వద్ద గురువారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సును ట్రక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మరణించగా... మరో 24 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.... క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన మహిళ రేఖా దేవిగా గుర్తించారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని పోలీసు ఉన్నతాధికారులు సందర్శించారు. ప్రమాద ఘటనపై పోలీసులు ఆరా తీశారు. ఈ ఘటనకు కారణమైన ట్రక్ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.