ఖాట్మాండు: నేపాల్లో మరో విమానం కూలిపోయింది. పశ్చిమ నేపాల్లో శుక్రవారం ఓ చిన్నపాటి విమానం కుప్పకూలింది. కాగా విమానంలో 11మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకూ తమకు అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు నేపాల్ ఉన్నతాధికారి పదమ్లాల్ లమిచనే తెలిపారు. కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
సాంకేతిక లోపం తలెత్తడంతో విమానాన్ని పైలెట్ ఓ వ్యవసాయ భూమిలో ల్యాండ్ చేసేందుకు ప్రయత్నించిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. ప్రమాద స్థలికి చేరుకునేందుకు సమీప నగరం నుంచి నాలుగు గంటల సమయం పడుతోందన్నారు. సహాయక చర్యలు అందించేందుకు పోలీసులు, ఆర్మీ సిబ్బంది హెలికాపర్ట్లో బయల్దేరారు. కాగా విమానం కూలడం వారంలో ఇది రెండోసారి. బుధవారం తారా ఎయిర్ లైన్స్ విమానం కూలి 23మంది దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.
నేపాల్లో కూలిన మరో విమానం
Published Fri, Feb 26 2016 2:59 PM | Last Updated on Sun, Sep 3 2017 6:29 PM
Advertisement
Advertisement