Oral contraceptive pills
-
గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలూ... జాగ్రత్త!
కొత్త పరిశోధన దీర్ఘకాలం పాటు గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తున్నారు డేనిష్ పరిశోధనవేత్తలు. హార్మోన్లతో కూడిన గర్భనిరోధక మాత్రలు వాడే మహిళలు వాటిని చాలాకాలం పాటు వాడుతుంటే వారిలో చాలామందికి ‘గ్లియోమా’ అనే అరుదైన మెదడు క్యాన్సర్ వచ్చే రిస్క్ ఎక్కువని డేనిష్ పరిశోధనవేత్తలు పేర్కొంటున్నారు. ‘గ్లియోమా’ అనే మెదడు క్యాన్సర్తో బాధపడుతున్న 50 ఏళ్ల లోపు మహిళల్లో చాలా మందిని పరిశీలిస్తే, వారిలో 90% మంది గతంలో హార్మోనల్ కాంట్రసెప్టివ్ పిల్స్ (హార్మోన్లతో కూడిన గర్భనిరోధక మాత్రలు) వాడినవారేనని తేలింది. మాత్రలు వాడిన వ్యవధి పెరుగుతున్న కొద్దీ ‘గ్లియోమా’ రిస్క్ కూడా పెరుగుతుందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ఈ అధ్యయన ఫలితాలన్నీ ‘బ్రిటిష్ జర్నల్ ఆఫ్ క్లినికల్ ఫార్మకాలజీ’ అనే మెడికల్ జర్నల్లో ప్రచురితమైనట్లు పరిశోధనవేత్తలు వెల్లడించారు. -
నడుము చుట్టూ నలుపు
దిసీజ్ నాట్ ఏ బ్లాక్ బెల్ట్ పురుషుల్లో అయితే బెల్ట్ పెట్టుకునే చోట, మహిళల్లో నడుము చుట్టూ నాడా కట్టుకునే చోట నల్లగా కనిపించడం సహజం. ఆ నలుపును నివారించే మార్గాలివే... నడుముకు బెల్టు పెట్టుకునే చోట /నాడా కట్టుకునే చోట గట్టిగా లాగి, బిగించి కట్టకండి. సౌకర్యంగా ఉండే కంప్రెషన్ ఎలాస్టిక్ నాడాలు వాడండి మరీ ఎక్కువసేపు అదేపనిగా నిలబడి/కూర్చొని ఉండటం తగదు. ప్రతి గంటకు ఒకసారి కనీసం 5 - 10 నిమిషాలపాటైనా నడవాలి క్యాలరీలు తక్కువగా ఉండి, పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. మహిళలు ఈస్ట్రోజెన్ ఎక్కువగా ఉండే గర్భనిరోధక మాత్రలను నివారిస్తే మేలు. ఎందుకంటే ఈ మాత్రలలలోని ఈస్ట్రోజెన్ వల్ల కాళ్లలోని రక్తనాళాలు వెడల్పు అయ్యి, రక్తప్రసరణ ఎక్కువగా అవుతుంది. ఈ క్రమంలో నడుము చుట్టూ బిగుతుగా కట్టడం రక్తప్రసరణకు అడ్డంకిగా మారి నలుపు రావచ్చు. ఇక మహిళలైనా, పురుషులైనా పడుకునే సమయంలో కాళ్ల కింద తలగడ పెట్టుకుని, అవి పడక నుంచి 10 అంగుణాల పైన ఉండేలా జాగ్రత్త తీసుకుంటే నడుము చుట్టూ ఉన్న నల్ల మరకలే కాకుండా, గుండెకూ తగినంత రక్తప్రసరణ తేలిగ్గా అవుతుంది.