Oscars Award
-
అమెరికన్ పాపులర్ టీవీ షోలో మెగాపవర్‌స్టార్ రాంచరణ్ (ఫొటోలు)
-
Oscars 2022: ఆస్కార్ గెలిచిన ‘కోడా’ మూవీ కథేంటంటే..
కోడా కథ... స్టార్ ఇమేజ్, భారీ బడ్జెట్, కళ్లు చెదిరే విజువల్ ఎఫెక్ట్స్.. వీటికన్నా ఈసారి ఆస్కార్ కమిటీ కుటుంబ భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చిందనడానికి నిదర్శనం ‘కోడా’ని ఉత్తమ చిత్రంగా ఎంపిక చేయడం. ఫ్రెంచ్ చిత్రం ‘లా ఫామిల్లె బెలియర్’ ఆధారంగా దర్శకురాలు సియాన్ హెడెర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంగీతంలో రాణించాలన్న రూబీ అనే యువతి, ఆమె కుటుంబం చుట్టూ ఈ సినిమా ఉంటుంది. రూబీకి తప్ప మిగతా కుటుంబ సభ్యులకు వినికిడి లోపం ఉంటుంది. కుటుంబ పోషణకు తల్లిదండ్రులకు చేపల వేటలో సాయం చేస్తూనే గాయకురాలిగా తన కలను నిజం చేసుకోవడానికి రూబీ పడే మానసిక వేదనే ఈ సినిమా. బలమైన భావోద్వేగాలతో పాటు సునిశితమైన కామెడీ కూడా ఈ సినిమాకు బలంగా నిలిచింది. ఈ మూవీలో రూబీ పాత్రధారి మినహా ఇందులో నటించిన నటీనటుల్లో ఎక్కువ శాతం మంది నిజంగానే వినికిడి లోపం ఉన్నవారే. ‘ఉత్తమ చిత్రం’గానే కాదు ఉత్తమ అడాపె్టడ్ స్క్రీన్‌ప్లే విభాగంలో సియాన్ హెడెర్, ఉత్తమ సహాయ నటుడి విభాగంలో ఈ చిత్రానికిగాను ట్రాయ్ కోట్సర్ ఆస్కార్ అందుకున్నారు. సైన్ లాంగ్వేజ్‌తో ప్రసంగం నటి మార్లీ మాట్లిన్ తర్వాత డిఫరెంట్లీ ఎబుల్డ్ పీపుల్‌లో ఆస్కార్ అందుకున్న రెండో వ్యక్తి ట్రాయ్ కోట్సర్. అంతకుముందు ‘చిల్డ్రన్ ఆఫ్ ఎ లెస్సర్ గాడ్’ (1987)కి గాను మార్లీ మాట్లిన్ ఉత్తమ నటి అవార్డు అందుకున్నారు. తాజా చిత్రం ‘కోడా’లో ఆమె ట్రాయ్ భార్యగా నటించారు. కాగా, అవార్డు అందుకున్న తర్వాత సైన్ లాంగ్వేజ్‌తో తమ భావాలను వ్యక్తపరిచారు. ట్రాన్స్‌లేటర్ ఆ లాంగ్వేజ్‌ని ట్రాన్స్‌లేట్ చేసి, వినిపించారు. -
ఆస్కార్ రేసులో అదరగొట్టిన ‘షేప్ ఆఫ్ వాటర్’!
యావత్ సినీప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్కార్ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఆస్కార్గా పేరొందిన 90వ అకాడమీ అవార్డుల ప్రదానోత్సవం హాలీవుడ్‌లోని డాల్బీ థియేటర్లో సినీతారల సందోహం, సందడి మధ్య కన్నులపండువగా జరిగింది. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ ఉత్తమ చిత్రం అవార్డు ‘షేఫ్ ఆఫ్ వాటర్’ సినిమాను వరించగా.. ఉత్తమ నటుడు అవార్డును గ్యారీ ఓల్డ్మన్ (డార్కెస్ట్ హవర్), ఉత్తమ నటి అవార్డును ఫ్రాన్సెస్ మెక్‌డార్మమండ్ (త్రి బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబింగ్, మిసోరి) సొంతం చేసుకున్నారు. ఆస్కార్ ఉత్తమ దర్శకుడి అవార్డును ‘ద షేప్ ఆఫ్ వాటర్’ సినిమాకుగాను గిలెర్మో డెల్ టోరో సొంతం చేసుకున్నారు. మొత్తానికి 13 నామినేషన్లతో ఆస్కార్ అవార్డుల రేసులో అగ్రభాగంలో నిలిచిన గ్విలెర్మో డెల్ టోరో రొమాంటిక్ ఫాంటసీ ‘ద షేప్ ఆఫ్ వాటర్’కు అవార్డుల పంట పండిందని చెప్పవచ్చు. ఉత్తమ చిత్రం, ఉత్తమ దర్శకుడితోపాటు బెస్ట్ ప్రోడక్షన్ డిజైన్ అవార్డును ఈ చిత్రం ఎగరేసుకుపోయింది. ఇక బెస్ట్ ఒరిజినల్ స్క్రీన్‌ప్లే అవార్డును ‘గెట్ ఔట్’ సినిమాకుగాను జోర్డన్ పీలె అందుకోగా, బెస్ట్ రైటింగ్ ఫర్ అడాప్టెడ్ స్క్రీన్‌ప్లే అవార్డు ‘కాల్ మీ బై యువర్ నేమ్’ సినిమాను వరించింది. 8 నామినేషన్లతో రెండోస్థానంలో నిలిచిన క్రిస్టోఫర్ నోలాన్ వార్ ఎపిక్ ‘డంకిర్క్’ మూడు అవార్డులు సొంతం చేసుకోగా.. ఏడు నామినేషన్లతో సాధించిన మార్టిన్ మెక్‌డొనాగ్స్ బ్లాక్ కామెడీ ‘ద త్రి బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబింగ్, మిసోరి’ చిత్రానికి ఉత్తమ నటి, ఉత్తమ సహాయ నటుడు సహా పలు అవార్డులు వరించాయి. బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: సామ్ రాక్‌వేల్ ( త్రి బిల్‌బోర్డ్స్ ఔట్‌సైడ్ ఎబింగ్, మిసోరి) బెస్ట్ మేకప్ అండ్ హెయిర్ ఆర్టిస్ట్ : కజుహిరో సుజి, డేవిడ్ మాలినోవిస్కి, లూసీ సిబ్బిక్ (డార్కెస్ట్ హవర్) బెస్ట్ కాస్ట్యూమ్ డిజైన్: మార్క్ బ్రిడ్జెస్ (ఫాంతమ్ థ్రెడ్) బెస్ట్ డాక్యుమెంటరీ ఫీచర్: బ్రియాన్ ఫోజెల్, డాన్ కోగన్ (ఇకారస్) బెస్ట్ ఫిలీం ఎడిటింగ్: లీ స్మిత్ (డంకిర్క్) బెస్ట్ సౌండ్ ఎడిటింగ్: అలెక్స్ గిబ్సన్, రిచర్డ్ కింగ్ (డంకిర్క్) బెస్ట్ సౌండ్ మిక్సింగ్: మార్క్ వీంగార్టెన్, గ్రెగ్ లాండకెర్, గ్యారీ ఏ రిజ్జో బెస్ట్ ప్రోడక్షన్ డిజైన్: జెఫ్రీ ఏ మెల్విన్, షేన్ వీవు (ద షేప్ ఆఫ్ వాటర్) బెస్ట్ ఫారెన్ లాగ్వెంజ్ ఫిలిం ( ఉత్తమ విదేశీ చిత్రం): ఏ ఫెంటాస్టిక్ వుమన్ (చిలీ) ఉత్తమ సహాయనటి: అలిసన్ జేనీ (ఐ, టోన్యా) యానిమేటెడ్ షార్ట్ ఫిలిం: డియర్ బాస్కెట్ బాల్ చిత్రానికి గాను గ్లెన్ కెనీ, కోబ్ బ్రయాంట్ అందుకున్నారు యానిమేటెడ్ ఫీచర్ ఫిలిం: కోకో చిత్రానికిగాను లీ ఉంక్రిచ్, డార్లా కే అండర్సన్ అందుకున్నారు బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్: బ్లేడ్ రన్నర్ చిత్రానికిగాను జాన్ నెల్సన్, పాల్ లాంబర్ట్, రిచర్డ్ ఆర్ హువర్, గెర్డ్ నెఫ్జర్ అందుకున్నారు (మరిన్ని చిత్రాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
ప్రతి ఏటా ఆస్కా అవార్డు
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఆంధ్రా సోషల్, కల్చరల్ అసోసియేషన్ (ఆస్కా) తరపున ఇకపై ప్రతిఏటా అవార్డులను ప్రదానం చేయనున్నట్లు అధ్యక్షులు డాక్టర్ కే సుబ్బారెడ్డి తెలిపారు. వివిధ రంగాలకు చెందిన నిష్ణాతులకు ఉగాది సంబరాల సమయంలో ఈ ఆస్కా అవార్డులు ప్రదానం చే స్తామని ఆయన చెప్పారు. ఆస్కా కార్యాలయంలో గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతో చారిత్రాత్మక నేపథ్యం కలిగిన ఆస్కా ఆవిర్భివించిన తరువాత అవార్డులను ప్రవేశపెట్టడం ఇదే ప్రథమమని అన్నారు. తెలుగు, తమిళ ఉగాది వేడుకలను ఆస్కా హాలులో సంయుక్తంగా నిర్వహిస్తామని తెలిపారు. అనేక సాంస్కృతిక కార్యక్రమాలతోపాటు అవార్డుల ప్రదానోత్సవాలను రెండురోజులపాటు జరుపుతామని తెలిపారు. ఆస్కా అవార్డుల కార్యక్రమాలకు తమిళనాడులోని ముఖ్యంగా చెన్నై నగరంలోని అన్ని తెలుగు సంఘాలను ఆహ్వానిస్తామని చెప్పారు. ఆస్కా వేరే సంస్థ కావచ్చు తెలుగువారంతా ఒక్కటేననే భావనతో అందరికీ ఆహ్వానాలు పలుకుతున్నామని తెలిపారు. ఆస్కా అవార్డును ఒక ప్రతిష్టాత్మక అవార్డుగా తీర్చిదిద్దడంతోపాటు కమిటీలో ఎవరున్నా అవార్డుల ప్రదానం కొనసాగాలని తాము ఆశిస్తున్నట్లు తెలిపారు. రూము చార్జీలు భారీగా తగ్గింపు: ఆస్కా కొత్త పాలకవర్గం ఏర్పడి రెండున్నర మాసాలు పూర్తికాగా నెలరోజులు వర్షాలు, వరదలతోనే గడిచిపోయిందని తెలిపారు. అయితే ఆ లోటును భర్తీ చేసేలా కమిటీ సమావేశమై అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఆస్కాలోని రూము చార్జీల రేట్లను భారీగా తగ్గించాలని, రూములో దిగిన అతిథులకు మెరుగైన వసతులు కల్పించాలని కమిటీ నిర్ణయం తీసుకుందని సుబ్బారెడ్డి తెలిపారు. ఆస్కా సభ్యుల కోసం డీలక్స్ రూము రూ.3వేల నుంచి రూ.2వేలు, ప్రెసిడెంట్ సూటు రూ.6వేల నుంచి రూ.4వేలకు తగ్గించామని తెలిపారు. అలాగే స్టాండర్డ్ రూము రూ.1200గా నిర్ణయించామని తెలిపారు. ఈనెల 26వ తేదీ నుంచి తగ్గించిన చార్జీలు అమల్లోకి వస్తాయని అన్నారు. వినోద, విహార, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు రూపకల్పన చేశామని తెలిపారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 7వ తేదీన షిరిడీ పుణ్యక్షేత్రానికి ఆధ్యాత్మిక యాత్రకు నిర్ణయించామని తెలిపారు. ఆస్కా పనితీరును మరింత మెరుగుపరిచేలా అనేక విభాగాల్లో టెస్ట్న్ ్రసాగుతోందని తెలిపారు. ‘వచ్చేసింది మకర సంక్రాంతి-పోయింది వరదల భయభ్రాంతి-తెచ్చింది ఆనందాల క్రాంతి-జీవితాల్లో విరిసెనిక ప్రశాంతి’అంటూ ఆస్కా సంయుక్త కార్యదర్శి జేకే రెడ్డి ఆసుకవిత్వాన్ని వినిపించారు. తెలుగు ప్రజలకు, ఆస్కా సభ్యులకు అధ్యక్షులు సుబ్బారెడ్డి, ఉపాధ్యక్షులు రవీంద్రన్, సాంస్కృతిక కార్యదర్శి సాలూరు వాసూరావు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు.