oye ninne
-
అందరూ కనెక్ట్ అవుతారు
‘‘నాగార్జున, మహేశ్‌బాబు, ప్రభాస్గార్ల యాక్టింగ్ అంటే ఇష్టం. ముఖ్యంగా నాగార్జున మేనరిజానికి అభిమానిని నేను’’ అని నూతన హీరో భరత్ మార్గాని అన్నారు. సత్య చల్లకోటి దర్శకత్వంలో భరత్ మార్గాని, సృష్టి జంటగా వంశీకష్ణ శ్రీనివాస్ నిర్మించిన సినిమా ‘ఓయ్.. నిన్నే’. ఈ చిత్రం రేపు విడుదల కానుంది. భరత్ మాట్లాడుతూ – ‘‘వైజాగ్ సత్యానంద్ మాస్టర్ దగ్గర యాక్టింగ్ కోర్స్ చేశాను. కాలేజ్ డేస్‌లో మోడలింగ్ చేసేవాణ్ణి. అలా హీరోగా ఛాన్స్ వచ్చింది. బిజినెస్ ఉండటం వల్ల నేను ఇండస్ట్రీలోకి రావడానికి ముందు మా అమ్మా నాన్న ఒప్పుకోకపోయినా ఇప్పుడు హీరో అయినందుకు హ్యాపీగా ఉన్నారు. ‘ఓయ్.. నిన్నే’ బావామరదళ్ల కథ. సినిమాలో తండ్రికీ కొడుక్కీ మధ్య అభిప్రాయభేదాలుంటాయి. కానీ తండ్రంటే గౌరవం. ఆ గౌరవం వల్ల ప్రేమను వదులుకోవాల్సిన పరిస్థితులు వస్తాయి. బావ తన మరదలి ప్రేమను ఎలా గెలుచుకున్నాడు? అన్నది తెరపైనే చూడాలి. అవుట్‌పుట్ బాగా వచ్చింది. అందరూ కనెక్ట్ అవుతారు’’ అన్నారు. -
బొమ్మరిల్లు, సోలో చిత్రాలను మించిన విజయం!
‘‘మా సంస్థ నుంచి వచ్చిన సోలో, నువ్వా నేనా, రారా.. కృష్ణయ్య’ తరహాలో చక్కని కుటుంబ కథాచిత్రమిది. సెన్సార్ బోర్డ్ క్లీన్ ‘యు’ సర్టిఫికెట్ ఇచ్చింది’’ అని వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. భరత్ మార్గాని, సృష్టి జంటగా సత్య చల్లకోటి దర్శకత్వంలో ఎస్వీకె సినిమా పతాకంపై ఆయన నిర్మించిన చిత్రం ‘ఓయ్.. నిన్నే’. వచ్చే నెల 6న ఈ చిత్రం విడుదల కానుంది. వంశీకృష్ణ మాట్లాడుతూ – ‘‘ఇందులో హీరోది ముక్కుసూటి మనస్తత్వం. అది కొన్నిసార్లు ప్లస్, ఇంకొన్నిసార్లు మైనస్ అవుతుంటుంది. అటువంటి మనస్తత్వం వల్ల తండ్రితో ఎలాంటి అభిప్రాయభేదాలు వచ్చాయి? మరదలికి, అతనికి మధ్య ఎవరు అడ్డు వచ్చారు? అనేది చిత్రకథ. కొందరు సినీ ప్రముఖులకు సినిమాని చూపిస్తే ‘బొమ్మరిల్లు’, ‘సోలో’ సినిమాలకు మించిన విజయం సాధిస్తుందన్నారు’’ అని చెప్పారు. -
బొమ్మరిల్లులా...
భరత్ మార్గాని, సృష్టి జంటగా సత్య చల్లకోటి దర్శకత్వంలో ఎస్.వి.కె. సినిమా పతాకంపై వంశీకృష్ణ శ్రీనివాస్ నిర్మించిన చిత్రం ‘ఓయ్.. నిన్నే’. ఈ నెల 15న విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘మా సంస్థ గతంలో నిర్మించిన ‘సోలో, నువ్వా నేనా, రారా కృష్ణయ్య’ తరహాలో చక్కటి కుటుంబ కథా చిత్రమిది. తండ్రీకొడుకుల అనుబంధం, బావామరదళ్ల మధ్య ప్రేమకథతో దర్శకుడు చిత్రాన్ని బాగా తీర్చిదిద్దారు’’ అన్నారు నిర్మాత. ‘‘ముక్కుసూటి మనస్తత్వం వల్ల ఓ కుర్రాడికి అతని తండ్రితో ఎలాంటి అభిప్రాయ బేధాలొచ్చాయి? మరదలికి, అతనికి మధ్య విలన్లా అడ్డొచ్చింది ఎవరు? అనేది చిత్రకథ. ‘బొమ్మరిల్లు’లా క్లీన్ ఫ్యామిలీ ఫిల్మ్’’ అన్నారు దర్శకుడు. తనికెళ్ల భరణి, నాగినీడు, రఘుబాబు, సత్య, ‘తాగుబోతు’ రమేశ్, తులసి, ప్రగతి, ధనరాజ్ నటించిన ఈ చిత్రానికి సంగీతం: శేఖర్ చంద్ర, సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి.