palaniswamy
-
తమిళనాట ట్విస్ట్.. ఎన్డీఏకు అన్నాడీఎంకే గుడ్‌బై..
సాక్షి, చెన్నై: దేశ, తమిళనాడు రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎన్డీఏ కూటమి నుంచి తాము వైదొలగుతున్నట్టు అన్నాడీఎంకే ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ సందర్బంగా అన్నాడీఎంకే నేతలు తమిళనాడు బీజేపీ నేతలపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ సందర్బంగా అన్నాడీఎంకే డిప్యూటీ కోఆర్డినేటర్ కేపీ మునుస్వామి సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఈరోజు నుంచి బీజేపీ, ఎన్డీయే కూటమితో అన్నాడీఎంకే తెగతెంపులు చేసుకుంటోంది. నేడు జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు అన్నాడీఎంకే ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. బీజేపీ రాష్ట్ర నాయకత్వం మా పార్టీ నేతలపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. గత ఏడాది కాలంగా మా పార్టీ జనరల్ సెక్రటరీ పళనిస్వామి, పార్టీ కేడర్‌పై అనవసర రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. VIDEO | AIADMK announces to break alliance with BJP in #TamilNadu. "We are breaking our alliance with BJP and NDA. AIADMK will form a new alliance and face upcoming Parliamentary elections," says party. pic.twitter.com/TWpbMrQKPT — Press Trust of India (@PTI_News) September 25, 2023 ఇదే సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు మునుస్వామి. వచ్చే సార్వత్రిక ఎన్నికల కోసం తాము సిద్ధంగా ఉన్నామన్నారు. అన్నాడీఎంకే కొత్త కూటమిని ఏర్పాటు చేసి ఎన్నికలకు వెళ్తుందని స్పష్టం చేశారు. ఇక, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో డీఎంకే భారీ మెజార్టీతో విజయం సాధించింది. Chennai, Tamil Nadu | K P Munusamy, AIADMK Deputy Coordinator says, "AIADMK unanimously passed a resolution in the meeting. AIADMK is breaking all ties with BJP and NDA alliance from today. The state leadership of the BJP has been continuously making unnecessary remarks about our… pic.twitter.com/HSx3NJKKOJ — ANI (@ANI) September 25, 2023 అయితే, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై దివంగత ముఖ్యమంత్రి జయలలితను విమర్శించడంతో మొదలుపెట్టి ఆ పార్టీ హయాంలో జరిగిన అవినీతి జాబితాను విడుదల చేస్తానని అనడం, అలాగే, దివంగత సీఎం అన్నాదురై పైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం అన్నాడీఎంకే నేతలకు అస్సలు మింగుడుపడలేదు. దీంతో ఆ పార్టీలో సీనియర్లంతా అన్నామలై తీరుపై నిప్పులు చెరిగారు. ఇదే తరుణంలో మాజీ మంత్రి జయకుమార్ సైతం అన్నామలై తీరుపై ఇటీవల కాస్త ఘాటుగానే స్పందించడం, ఢిల్లీలో బీజేపీ నేతలను అన్నాడీఎంకే నేతలు కలవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాగా, అన్నామలై తీరుపై బీజేపీ పెద్దలకు చెప్పినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, వారి ప్రోద్బలం లేకుండా ఆయన అలా మాట్లాడి ఉండరని పళనిస్వామి భావించినట్టు కూడా ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో అన్నాడీఎంకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మరోవైపు.. ఎన్డీయే కూటమి నుంచి అన్నాడీఎంకే బయటకు రావడంతో ఆ పార్టీ నేతలు తమిళనాడులో సంబురాలు చేసుకున్నారు. పలు ప్రాంతాల్లో బాణాసంచా కాల్పి సంబురాలు జరుపుకుంటున్నారు. #WATCH | Tamil Nadu | AIADMK workers burst crackers in Chennai after the party announces breaking of all ties with BJP and NDA from today. pic.twitter.com/k4UXpuoJhj — ANI (@ANI) September 25, 2023 అన్నాడీఎంకే ప్రకటనపై తమిళనాడు బీజేపీ చీఫ్ కే. అన్నామలై స్పందించారు. ప్రస్తుతం తాను దుర్గ పూజలో ఉన్నానని చెప్పుకొచ్చారు. ఇప్పుడు రాజకీయాలు మాట్లాడదలచుకోలేదని స్పష్టం చేశారు. దీనిపై తర్వాత మాట్లాడుతానని తెలిపారు. #WATCH | Coimbatore | On AIADMK breaking alliance with BJP and NDA, Tamil Nadu BJP president K Annamalai says, "I will speak to you later, I don't speak during Yatra. I will speak later." pic.twitter.com/yObr5hSeT3 — ANI (@ANI) September 25, 2023 ఇది కూడా చదవండి: మీరు డమ్మీ సీఎం, అబద్దాల కోరు.. అందుకే పక్కన పెట్టేశారు -
అన్నాడీఎంకే కేసులో పళనిస్వామికి భారీ విజయం
-
తమిళ పాలిటిక్స్‌లో ట్విస్ట్.. పళణిస్వామికి బిగ్ షాక్!
సాక్షి,చెన్నై: అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి పళణిస్వామికి బుధవారం మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. రహదారుల టెండర్లలో చోటు చేసుకున్న అక్రమాలకు సంబంధించి ఏసీబీ చేపట్టిన విచారణపై స్టే విధించేందుకు న్యాయ మూర్తులు నిరాకరించారు. గత అన్నాడీఎంకే ప్రభుత్వంలో సీఎంగా పనిచేసిన పళనిస్వామి పర్యవేక్షణలో రహదారుల శాఖ వ్యవహారాలు సాగిన విషయం తెలిసిందే. గత ప్రభుత్వంలో రహదారుల శాఖలో పెద్దఎత్తున అక్రమాలు జరిగినట్టు అరప్పోర్ ఇయక్కం ఆరోపించింది. రూ. 4,800 కోట్లు రహదారుల టెండర్లలో అక్రమాలు జరిగినట్లు ఆధారాలతో సహా ఏసీబీకి ఫిర్యాదు చేశాయి. అదే సమయంలో ఈ టెండర్ల వ్యవహారం పళనిస్వామి మెడకు చుట్టుకునే విధంగా కోర్టుల్లో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ఈ ఆరోపణలు, ఫిర్యాదులపై ఏసీబీ స్పందించింది. అలాగే, మరోవైపు ఐటీ వర్గాలు సైతం దూకుడు పెంచాయి. పళణి స్వామి సన్నిహితులైన కాంట్రాక్టర్లను టార్గెట్ చేసి సోదాలు నిర్వహించాయి. అదే సమయంలో ఈ అక్రమాలపై దృష్టి పెట్టిన డీఎంకే ప్రభుత్వం తిరుచ్చి డివిజన్ రహదారుల శాఖ పర్యవేక్షణాధికారి, చీఫ్ ఇంజినీర్‌గా ఉన్న పళణిని సస్పెండ్ చేసింది. కోర్టులో విచారణ ఈ అక్రమాల వ్యవహారం విచారణ సుప్రీంకోర్టు వరకు వెళ్లొచ్చింది. మద్రాసు హైకోర్టు ఈ వ్యవహారంపై త్వరితగతిన విచారణ ముగించే విధంగా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ పరిస్థితుల్లో ఏసీబీ చర్యలకు సిద్ధం అవుతుండటంతో, ఈ విచారణకు స్టే విధించాలని కోరుతూ పళణి స్వామి హైకోర్టును ఆశ్రయించారు. బుధవారం ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. ఈ అక్రమాలపై ఏసీబీ ప్రాథమిక విచారణ ముగించినట్లు కోర్టుకు ఆ విభాగం తరపు న్యాయవాదులు వివరించారు. విజిలెన్స్ కమిషన్‌కు నివేదిక పంపించినట్లు, అనుమతి రాగానే, తదుపరి చర్యలు చేపట్టనున్నట్లు కోర్టు దృష్టికి తెచ్చారు. వాదనల అనంతరం ఏసీబీ తదుపరి చర్యలకు స్టే విధించలేమని హైకోర్టు స్పష్టం చేసింది. తదుపరి విచారనను ఈనెల 26వ తేదీకి న్యాయమూర్తులు వాయిదా వేశారు. -
శ్రీవారి దర్శనానికి 24 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో క్యూలైన్ రాంభగీచ వరకు చేరుకుంది. శుక్రవారం అర్ధరాత్రి వరకు 64,292 మంది శ్రీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకోగా.. 30,641 మంది తలనీలాలు ఇచ్చారు. భక్తులు శ్రీవారి హుండీలో రూ.3.72 కోట్లు సమర్పించారు. శ్రీవారిని దర్శించుకున్న పళనిస్వామి తిరుమల శ్రీవారిని శనివారం తమిళనాడు మాజీ సీఎం పళనిస్వామి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వేణుగోపాల్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, తెలంగాణ ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ప్రత్యేక దర్శనం కల్పించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనాలివ్వగా.. టీటీడీ అధికారులు శ్రీవారి ప్రసాదాలు అందజేశారు. -
మద్రాస్ హైకోర్టులో ఈపీఎస్‌కు ఊరట
చెన్నై: తమిళనాడు మాజీ సీఎం ఈకే పళనిస్వామికి మద్రాస్ హైకోర్టులో ఊరట లభించింది. అన్నాడీఎంకే నాయకత్వ వివాదంపై న్యాయస్థానం కీలక తీర్పునిచ్చింది. పార్టీకి పళనిస్వామే సుప్రీం నాయకుడని స్పష్టం చేసింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎన్నిక చెల్లుతుందని డివిజన్ బెంచ్ పేర్కొంది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పక్కనపెట్టింది. జులై 11న జరిగిన పార్టీ జనరల్ కౌన్సిల్ సమావేశంలో అన్నాడీఎంకే తాత్కాలిక కార్యదర్శిగా పళనిస్వామి ఎన్నికయ్యారు. అయితే దీన్ని సవాల్ చేస్తూ ఓ పన్నీర్‌సెల్వం కోర్టును ఆశ్రయించారు. అప్పటి సింగిల్ బెంచ్ ధర్మాసనం పళనిస్వామి ఎన్నిక చెల్లదని తీర్పునిచ్చింది. అయితే ఈ వ్యవహారంపై పళనిస్వామి మరోసారి మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన డివిజన్ బెంచ్.. ఆయనకు అనుకూలంగా తీర్పు వెలువరించింది. దీంతో ఈపీఎస్ మద్దతుదారులు సంబరాలు చేసుకున్నారు. మరోవైపు కోర్టు తీర్పు అనంతరం అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రత ఎర్పాటు చేశారు. గతంలో ఈపీఎస్, ఓపీఎస్ వర్గాలు ఆపీస్లో విధ్వంసం సృష్టించిన విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఈమేరకు చర్యలు తీసుకున్నారు. చదవండి: కేసీఆర్‌కు ఘోర అవమానం.. ఇందుకేనా బిహార్ వెళ్లింది?: బీజేపీ -
తమిళనాట ట్విస్ట్.. పన్నీర్‌సెల్వానికి బిగ్ షాక్
సాక్షి ప్రతినిధి, చెన్నై : అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలోకి చొరబడి నష్టం కలిగించిన వ్యవహారంపై పన్నీర్‌సెల్వం, ఆయన అనుచరులకు సమన్లు జారీచేయాలని సీబీసీఐడీ పోలీసులు నిర్ణయించారు. వైద్యలింగం, మనోజ్ పాండియన్ తదితరులకు సైతం సమన్లు పంపనున్నారు. సీబీసీఐడీ డీఎస్పీ నేతృత్వంలోని ఒక బృందం శుక్రవారం పార్టీ కార్యాలయానికి వెళ్లి పరిశీలించింది. చెన్నై వానగరంలో గతనెల 11వ తేదీన జరిగిన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశంలో ఎడపాడి పళనిస్వామిని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఇందుకు నిరసనగా పన్నీర్‌సెల్వం సహా ఆయన అనుచర వర్గం తీవ్ర ఆగ్రహంతో చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయానికి వెళ్లారు. కార్యాలయ ప్రధాన ద్వారాన్ని పగులగొట్టిలోనికి జొరబడి ఫరి్నచర్, ఇతర సామగ్రిని ధ్వంసం చేశారని, ముఖ్యమైన డాక్యుమెంట్లను ఎత్తుకెళ్లారని ఎడపాడి వర్గానికి చెందిన రాజ్యసభ సభ్యుడు సీవీ షణ్ముగం చెన్నై రాయపేట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇందుకు ప్రతిగా పన్నీర్ వర్గం కూడా పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో రెండు వర్గాలకు చెందిన చెరో 200 లెక్కన మొత్తం 400 మంది కార్యకర్తలపై పోలీసులు ఏడు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసుల విచారణను గ్రేటర్ చెన్నై పోలీసుల నుంచి సీబీసీఐడీ పోలీసులకు అప్పగిస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం మద్రాసు హైకోర్టుకు తెలిపింది. కార్యాలయంపై దాడి వ్యవహారంపై ఓపీఎస్, ఆయన మద్దతుదారు ముఖ్యనేతలకు వేర్వేరుగా సమన్లు జారీచేసి విచారణ చేపట్టాలని సీబీసీఐడీ నిర్ణయించింది. పన్నీరుసెల్వంకు దర్శకుడు భాగ్యరాజ మద్దతు ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకేను అంద రూ కలిసి కాపాడుకోవాలని ప్రముఖ సినీ దర్శకులు భాగ్యరాజా అన్నారు. పారీ్టలో, న్యాయస్థానాల్లో చో టుచేసుకుంటున్న పరిణామాలపై చర్చించేందుకు పన్నీర్‌సెల్వం తన అనుచరులతో శుక్రవారం చెన్నై లో సమావేశమయ్యారు. ఇందులో భాగ్యరాజ పా ల్గొని పన్నీర్‌కు మద్దతు ప్రకటించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, ఒక చిన్న కార్యకర్తలా పార్టీ క్షేమాన్ని కోరుతున్నానని, పారీ్టలోని అన్ని వర్గాలు ఏకం అవుతాయని, ఇందుకు సమయం పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఏందయ్యా మీ గొడవ.. కోర్టుకు మరో పనిలేదా..?
అన్నాడీఎంకేలో అగ్రనేతల వర్గపోరు న్యాయస్థానానికి కూడా తలనొప్పిగా మారింది. కోర్టులో దాఖలవుతున్న పిటీషన్ల పరంపరపై సాక్షాత్తూ న్యాయమూర్తే అసహనం వ్యక్తం చేశారు. ‘ప్రధాన న్యాయమూర్తికి మరో పనిలేదని భావిస్తున్నారా’ అంటూ న్యాయమూర్తి కృష్ణన్ రామస్వామి అన్నాడీఎంకే నేతలు, వారి న్యాయవాదులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి ప్రతినిధి, చెన్నై : అన్నాడీఎంకే అగ్రనేతలు ఎడపాడి పళనిస్వామి, పన్నీర్‌సెల్వం మధ్య అంతర్గత పోరు చిలికిచిలికి గాలివానగా మారిన విషయం తెలిసిందే. సమన్వయ కమిటీ కనీ్వనర్‌గా పన్నీర్‌సెల్వం, ఉప కనీ్వనర్ ఎడపాడి పళనిస్వామి ఉన్న ద్వంద విధానానికి స్వస్తి చెప్పి ఏక నాయకత్వంతో ముందుకు సాగాలనే అంశం పార్టీలో అగ్గిరాజేసింది. ఓపీఎస్ ఆదేశాలను అనుసరించి జూన్ 23వ తేదీన జరిగిన సర్వసభ్య సమావేశాన్ని ఈపీఎస్ వర్గం ధిక్కరించింది. పైగా జూలై 11వ తేదీన మరో సర్వసభ్య సమావేశం నిర్వహించింది. పనిలోపనిగా ఎడపాడిని తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకుని, ఓపీఎస్, ఆయన ఇద్దరు కుమారులు, అనుచరులపై బహిష్కరించింది. అయితే, ఓపీఎస్ వేసిన పిటిషన్‌తో ఎడపాడి నిర్వహించిన సర్వసభ్య సమావేశం చెల్లకుండా పోగా, పన్నీర్ పదవులు మళ్లీ పదిలమయ్యాయి. అన్నాడీఎంకే నిర్వహించిన సర్వసభ్య సమావేశం చెల్లదని ప్రత్యేక న్యాయమూర్తి జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఎడపాడి పళనిస్వామి మరో పిటిషన్ వేశారు. పార్టీలోని ఇరువర్గాలు ఏకమై మరో సర్వసభ్య సమావేశం జరుపుకోవాలని కోర్టు చేసిన సూచనకు ఎడపాడి తరపు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. పన్నీర్‌సెల్వంతో ఎడపాడి కలిసి పనిచేసేందుకు అవకాశమే లేదని మద్రాసు హైకోర్టులో గురువారం జరిగిన వాదోపవాదాల్లో తేల్చిచెప్పారు. ఇలా ఇరువురూ నేతలూ పోటాపోటీగా మద్రాసు హైకోర్టు, సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్లలో కొన్ని ఇంకా విచారణ దశలో ఉన్నాయి. తాజాగా మరో రెండు.. తిరుచెందూరుకు చెందిన న్యాయవాది, అన్నాడీఎంకే సభ్యుడైన పి. ప్రేమ్‌కుమార్ ఆదిత్యన్, అదే పార్టీ సభ్యుడు సురేన్ పళనిస్వామి మద్రాసు హైకోర్టులో బుధవారం వేర్వేరుగా రెండు సివిల్ పిటిషన్లు వేశారు. 2017 సెపె్టంబర్ 12వ తేదీన సర్వసభ్య సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. 2021 డిసెంబర్ 1వ తేదీన పార్టీ విధానాల్లో చేసిన మార్పులు, డిసెంబర్ 6వ తేదీన జరిగిన సమన్వయ కమిటీ ఎన్నికలు, సంస్థాగత ఎన్నికలు, 2022 జూన్ 23వ తేదీన సర్వసభ్యç సమావేశలో చేసిన తీర్మానాలు చెల్లవని ప్రకటించాల్సిందిగా కోరుతూ ఈ పిటిషన్ వేశారు. వీరిద్దరూ దాఖలు చేసిన కేసు మద్రాసు హైకోర్టులో విచారణలో ఉంది. తాము దాఖలు చేసిన సివిల్ పిటిషన్లు, జూన్, జూలై నిర్వహించిన సర్వసభ్య సమావేశ సమావేశాన్ని వ్యతిరేకిస్తూ సమన్వయ కమిటీ కన్వీనర్, ఉప కన్వీనర్ దాఖలు చేసిన పిటిషన్లు, స్థానిక సంస్థల ఎన్నికలకు వ్యతిరేకంగా కొందరు దాఖలు చేసిన పిటిషన్లు విచారణకు ప్రత్యేక బెంచ్ ఏర్పాటు చేయాలని అందులో కోరారు. ఇప్పటికే అన్నాడీఎంకే కేసుల విచారణకు ఈనెల 17వ తేదీన ప్రత్యేక న్యాయమూర్తిని ఏర్పాటు చేసి ఉన్నట్లు ఆ పిటిషన్లో పేర్కొన్నారు. రామ్‌కుమార్ ఆదిత్యన్ తదితరులు వేసిన పిటిషన్లు న్యాయమూర్తి కృష్ణన్ రామస్వామి ముందుకు విచారణకు వచ్చింది. ఇద్దరి నాయకుల తరపున హాజరైన న్యాయవాదులు ప్రత్యేక బెంచ్కోసం రిజి్రస్టార్‌కు వినతిపత్రం సమర్పించిన విషయం వెలుగులోకి రావడంతో న్యాయమూర్తి తీవ్రంగా ఆక్షేపించారు. కేసు విచారణ దశలో ఉండగా ప్రధాన న్యాయమూర్తికి వినతిపత్రాలు సమరి్పంచడమే మీపనిగా ఉంది, సీజేకి మరో పనిలేదని భావిస్తున్నారా..? అంటూ న్యాయమూర్తి ప్రశ్నించి కేసు విచారణను సెపె్టంబర్ 9వ తేదీకి వాయిదా వేశారు. గతనెల 11వ తేదీ జరిగిన సర్వసభ్య సమావేశం చెల్లదని ప్రకటించాలని కోరుతూ దాఖలైన పిటిషన్, సుప్రీంకోర్టు జారీచేసిన ఉత్తర్వులపై మద్రాసు హైకోర్టులో దాఖలైన పిటిషన్ ఇదే న్యాయమూర్తి ముందుకు విచారణకు వచ్చింది. అయితే పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్‌సెల్వం న్యాయవాది అభ్యర్థన మేరకు కేసు విచారణను మరో న్యాయమూర్తికి బదిలీ చేశారు. ఈమేరకు న్యాయమూర్తి జయచంద్రన్‌ను నియమిస్తూ ఈనెల 17న ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ దశలో అన్నాడీఎంకే కేసులన్నీ విచారించేందుకు ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేయాలని మరో రెండు పిటిషన్లు దాఖలు కావడంపై న్యాయమూర్తి కృష్ణన్ రామస్వామి తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. -
అన్నాడీఎంకే పాలిటిక్స్‌లో హై టెన్షన్.. రంగంలోకి దిగిన పోలీసులు!
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలోకి కార్యకర్తలెవ్వరూ ప్రవేశించరాదని ఎడపాడి పళనిస్వామి మద్దతుదారులు ఆదివారం ఆకస్మిక ఉత్తర్వులు జారీ చేశారు. కార్యాలయ ప్రవేశంపై కోర్టు విధించిన గడువు శనివారం ముగియడంతో ఈ మేరకు తమ పట్టు నిలుపుకునేందుకు అప్రమత్తం అయ్యారు. గతనెల 11వ తేదీన అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం జరగడం, తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎడపాడి ఎంపిక కావడంతో రెచ్చిపోయిన పన్నీర్‌సెల్వం వర్గీయులు పార్టీ ప్రధాన కార్యాలయం ప్రధాన ద్వారం తలుపు బద్దలు కొట్టి మరీ ప్రవేశించారని ఎడపాడి వర్గం ఆరోపిస్తోంది. పైగా లోపలున్న ఫర్నీచర్, ఫైళ్లు, డాక్యుమెంట్లు, కంప్యూటర్లు ధ్వంసం చేశారని చెబుతోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని కార్యాలయానికి సీలు వేయగా, సీలు తొలగించి పార్టీ కార్యాలయం తాళాలను ఎడపాడికి అప్పగించాలని కోర్టు ఇటీవల తీర్పు చెప్పింది. అయితే, పార్టీ శ్రేణులెవ్వరూ ఆగస్టు 20వ తేదీ వరకు కార్యాలయంలోకి ప్రవేశించరాదని కోర్టు అదేరోజు ఆదేశించింది. ఇదిలా ఉండగా, ఎడపాడి నిర్వహించిన సర్వసభ్య సమావేశం చెల్లదని, అంతకు ముందున్న పరిస్థితులు కొనసాగాలని ఇటీవల కోర్టు తీర్పు చెప్పడంతో పార్టీలో పన్నీర్సెల్వానిదే పైచేయిగా మారింది. పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ హోదా మళ్లీ తన చేతికి వచ్చినా, కార్యాలయ తాళాలు మాత్రం ఇంకా ఎడపాడి చేతుల్లోనే ఉన్నాయి. కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల ప్రకారం కార్యకర్తల కార్యాలయ ప్రవేశ నిషేధం ఈనెల 20వ తేదీతో ముగిసింది. అయితే, కోర్టు తాజా తీర్పుతో పన్నీర్‌సెల్వం వర్గం మళ్లీ పార్టీ కార్యాలయంలోకి బలవంతంగా ప్రవేశిస్తే గతనెల 11వ తేదీన జరిగిన దుస్సంఘటనకు సంబంధించిన ఆనవాళ్లు రూపుమాపే అవకాశం ఉంటుందని ఎడపాడి వర్గం అనుమానిస్తోంది. దీంతో కార్యాలయంలోకి పార్టీ శ్రేణులు ఎవ్వరూ వెళ్లరాదని ఎడపాడి వర్గం ఉత్తర్వులు జారీచేసింది. అయితే ఈ ఆదేశాలను పన్నీర్ వర్గం ఖాతరు చేస్తుందా..? అనే కొత్త అనుమానాలు తలెత్తాయి. కోర్టు విధించిన నిషేధం గడువు ముగిసిపోయిన దశలో అదనపు పోలీసు బందోబస్తు మధ్య కార్యాలయం బోసిపోయి దర్శనమిస్తుండడం గమనార్హం. ఇది కూడా చదవండి: కాంగ్రెస్‌లో ఊహించని షాక్.. నడిరోడ్డుమీదే తన్నుకున్న నేతలు -
పన్నీరు సెల్వానికి షాకిచ్చిన పళనిస్వామి.. తమిళ పాలిటిక్స్‌లో ట్విస్ట్
అంతర్గత కుమ్ములాటలతో కప్పల తక్కెడగా మారిన అన్నాడీఎంకేలో పరిణామాలు రోజురోజుకూ ఆసక్తికరంగా మారుతున్నాయి. బుధవారం కోర్టు తీర్పుతో మళ్లీ పార్టీ కనీ్వనర్, కోశాధికారిగా గుర్తింపు దక్కడంతో పన్నీరు శిబిరం ఆనంద తావడం చేస్తోంది. ఈ నేపథ్యంలో గురువారం పన్నీరు.. తన ప్రత్యర్థి పళని స్వామికి కీలక సూచన చేశారు. ఏక, జంట నాయకత్వానికి స్వస్తి పలికి ఉమ్మడిగా ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. అందరూ ఏకం కావాల్సిన సమయం అసన్నమైందంటూ వ్యాఖ్యానించారు. అయితే ఊసరవెళ్లి తరహాలో రంగులు మార్చే పన్నీరు సెల్వంతో కలిసి ప్రయాణించే అవకాశమే లేదని పళని స్వామి తేలి్చచెప్పారు. సాక్షి, చెన్నై : ‘గొడవలు వద్దు..ఐక్యతే ముద్దు, జంట , ఏక నాయకత్వాలు వద్దు ఉమ్మడిగా పార్టీని బలోపేతం చేద్దాం..’’ అని పళని స్వామికి పన్నీరు సెల్వం పిలుపు నిచ్చారు. అలాగే, చిన్నమ్మ శశికళ, ఆమె ప్రతినిధి టీటీవీ దినకరన్‌కూ ఆహ్వానం పలికారు. అయితే, పన్నీరు పిలుపును పళని తిరస్కరించారు. కలిసి పనిచేసే అవకాశం లేదని స్పష్టం చేశారు. కీలక మలుపు.. అన్నాడీఎంకే అగ్ర నేతలు పళనిస్వామి, పన్నీరు సెల్వం మధ్య సాగుతున్న వివాదాల ఎపిసోడ్ బుధవారం కీలక మలుపు తిరిగింది. జూలై 11వ తేదీన పళని నిర్వహించిన సర్వ సభ్య సమావేశానికి వ్యతిరేకంగా పన్నీరు సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సర్వ సభ్య సమావేశం చెల్లదని తేల్చింది. జూన్ 23వ తేదీ నాటి పరిస్థితులనే యథాతథంగా కొనసాగించాలని ఆదేశించింది. దీంతో తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా పళని ఎంపిక చెల్లకుండా పోయింది. అలాగే, అన్నాడీఎంకేలో రెండు గ్రూపులుగా ఏర్పడ్డ పళని, పన్నీరు తమ వాళ్లకు పదవులు కట్ట బెడుతూ జారీ చేసిన ఉత్తర్వులు అన్నీ చెల్లని కాగితాలయ్యాయి. అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్, కోశాధికారి పదవులు కోర్టు తీర్పుతో మళ్లీ పన్నీరు చేతికి చిక్కాయి. పళని కేవలంలో పార్టీ సమన్వయ కమిటీ కో– కన్వీనర్‌గా మిగలాల్సిన పరిస్థితి. కోర్టు తీర్పు పన్నీరు శిబిరంలో ఆనందాన్ని నింపితే, పళని శిబిరాన్ని నిరాశకు గురి చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ఇరు శిబిరాలు వేర్వేరుగా గురువారం సమావేశాల్లో మునిగాయి. తదుపరి కార్యాచరణపై దృష్టి పెట్టాయి. ఇందులో భాగంగా మీడియాతో మాట్లాడుతూ, పన్నీరు సెల్వం ఇచ్చిన పిలుపు అన్నాడీఎంకే రాజకీయాలను ఆసక్తికరం చేశాయి. పళణితో సామరస్యానికి పన్నీరు ముందుకు రావడమే కాకుండా, చిన్నమ్మ శశికళ, ఆమె ప్రతినిధి దినకర్‌ను కూడా పారీ్టలోకి ఆహ్వానించడం చర్చనీయాంశంగా మారింది. చేతులు కలుపుదాం.. పన్నీరు సెల్వం తన ప్రసంగంలో ప్రియ మిత్రమా చేతులు కలుపుదాం.. కలిసి పనిచేద్దాం అని పిలుపు నిచ్చారు. ఇన్నాళ్లూ మనస్సులో ఉన్న చేదు అనుభవాలు, బాధలు, భేదాలు, వివాదాలను పక్కన పెట్టేద్దామని సూచించారు. అమ్మ జయలలిత మరణం తదుపరి పరిణామాలతో సీఎం పగ్గాలు చేపట్టిన పళని స్వామికి నాలుగున్నరేళ్ల సంపూర్ణ సహకారం అందించామని గుర్తు చేశారు. అయితే, ఇప్పుడు ఏక నాయకత్వం అంటే, అంగీకరించే ప్రసక్తే లేదని, అయితే, ఉమ్మడి నాయకత్వంతో అందరం కలిసి కట్టుగా ఐక్యతను చాటుదామని పిలుపు నిచ్చారు. అన్నాడీఎంకేలో ఒకే ఎజెండా మాత్రమే ఉందని, అది ఒక్క ఐక్యత మాత్రమేనని పేర్కొన్నారు. సమష్టిగా పార్టీ బలోపేతమే లక్ష్యంగా ప్రజాస్వామ్యబద్ధంగా అందరం కలిసి పనిచేద్దామని పిలుపు నిచ్చారు. అందరూ అంటే, చిన్నమ్మ శశికళ, దినకరన్‌ను కూడా ఆహా్వనిస్తున్నారా..? అని ప్రశ్నించగా, అవును అని సమాధానం ఇచ్చారు. అందరూ మళ్లీ పారీ్టలోకి రావాలని, కలిసి కట్టుగా ముందుకు సాగాలని స్పష్టం చేశారు. అమ్మ జీవించి ఉన్న కాలంలో పార్టీ కోసం రేయింబవళ్లు శ్రమించి, ఇప్పుడు దూరంగా ఉన్న వారు సైతం రావాలని, అందరూ ఉమ్మడి ప్రయాణం ప్రారంభించాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. అప్పీల్‌కు పళని.. అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం వ్యవహారంలో ప్రత్యేక బెంచ్ బుధవారం ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ పళని స్వామి తరపున మద్రాసు హైకోర్టులో అప్పీల్ పిటిషన్ దాఖలు చేశారు. సీనియర్ న్యాయవాది విజయనారాయణన్ ఈ పిటిషన్ వేశారు. దీనిని న్యాయమూర్తులు ఎం. దురైస్వామి, సుందర్‌మోహన్ బెంచ్ విచారణకు స్వీకరించింది. అయితే, సోమవారం నుంచి విచారణ చేపడుతామని ప్రకటించింది. ఇదిలా ఉండగా, అన్నాడీఎంకే తాళాన్ని పళనిస్వామికి అప్పగించిన వ్యవహారంలో పన్నీరు సెల్వం దాఖలు చేసిన అప్పీల్ పిటిషన్ సుప్రీంకోర్టులో గురువారం విచారణకు వచ్చింది. తాళం కోసం పన్నీరు తరపు న్యాయవాదులు తీవ్రంగానే వాదనలు వినిపించారు. పళని స్వామికి తాళం అప్పగిస్తూ హైకోర్టు ఇప్పటికే ఇచ్చి న ఉత్తర్వులకు స్టే విధించాలని కోరారు. అయితే, సుప్రీంకోర్టు స్టేకు నిరాకరించింది. వివరణ ఇవ్వా లని పళని స్వామికి నోటీసులు జారీ చేసింది. అంగీకరించే ప్రసక్తే లేదు.. పళని స్వామి మీడియాతో మాట్లాడుతూ, పన్నీరు ఆహ్వానాన్ని తిరస్కరించారు. ఆయనతో కలిసి పనిచేసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ధర్మయుద్ధం అంటూ గతంలో గళం వినిపించిన పన్నీరు, ఇప్పుడు ఆ యుద్ధాన్ని పక్కన పెట్టేశారా? అని ప్రశ్నించారు. వాళ్లను కూడా పారీ్టలోకి ఆహా్వనిస్తుండడం చూస్తే, ఆయన ధర్మయుద్ధం ఎవరి కోసం చేసినట్లో అర్థం అవుతోందని మండిపడ్డారు. ఆయనకు పదవీ కాంక్ష ఎక్కువని, శ్రమించకుండా ఉన్నత పదవుల్లో కూర్చోవడం ఆయనకు అలవాటేనని విమర్శించారు. పార్టీ కన్నా, కుటుంబమే ఆయనకు ముఖ్యమని, అందుకే ఆయన తనయుడికి కేంద్ర మంత్రి పదవి కోసం గతంలో పట్టుబట్టారని గుర్తు చేశారు. గూండాలతో, రౌడీలతో, పోలీసు భద్రతతో వెళ్లి పార్టీ కార్యాలయం పరువును బజారుకీడ్చారని, కేడర్‌ను కొట్టించిన పన్నీరుతో ఎట్టి పరిస్థితుల్లోనూ కలిసే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఏక నాయకత్వం తన వ్యక్తిగతం కాదని, కార్యకర్తలందరి అభీష్టం అని స్పష్టం చేశారు. ఏదైనా సమస్యలు ఉంటే, పార్టీ సర్వ సభ్య సమావేశంలో చర్చించుకోవాలే గానీ, అనాగరికంగా వ్యవహరించడం సమంజసమా..? అని ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: బిహార్ పరిణామాలు.. కేంద్రంలో అధికార మార్పునకు సంకేతం -
బిగ్ రిలీఫ్: మద్రాస్ హైకోర్టులో పన్నీర్ సెల్వంకు ఊరట
చెన్నై: అన్నాడీఎంకే నాయకత్వం వ్యవహారంలో పన్నీర్ సెల్వంకు భారీ ఊరట లభించింది. అన్నాడీఎంకే కేసులో స్టేటస్ కో విధించింది మద్రాస్ హైకోర్టు. జూన్ 23న జనరల్ బాడీలో తీసుకున్న నిర్ణయాలపై స్టే విధించింది. పార్టీ జనరల్ సెక్రెటరీగా ఈ పళనిస్వామి నియామకం చెల్లదని స్పష్టం చేసింది. దీంతో పళనిస్వామికి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. కొత్తగా జనరల్ బాడీ సమావేశం నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది హైకోర్టు. తాజా ఆదేశాలతో అన్నాడీఎంకేలో సంయుక్త నాయకత్వాన్ని పునరుద్ధరించినట్లయింది. పన్నీరు సెల్వం కోఆర్డినేటర్‌గా, పళనిస్వామి డిప్యూటీ కోఆర్డినేటర్‌గా కొనసాగాల్సి ఉంటుంది. అన్నాడీఎంకే కేసులో ఇరు వర్గాల వాదనలు విన్న మద్రాస్ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా జూన్ 23న నిర్వహించిన జనరల్ బాడీ సమావేశం అక్రమమని వాదించారు పన్నీరు సెల్వం తరఫు న్యాయవాది. పార్టీ నిబంధనలను అతిక్రమించి పళనిస్వామి సమావేశం ఏర్పాటు చేశారని ఆరోపించారు. అలాంటి సమావేశం సంయుక్తంగా ఇరువురి నేతల సమక్షంగా చేపట్టాలని వెల్లడించారు. ‘పార్టీ మధ్యంతర జనరల్ సెక్రెటరీగా ఈపీఎస్ నియామకం సరైంది కాదు. ఇరువురు నేతలు కలిసి పనిచేయాలి.’ అని పేర్కొన్నారు ఓపీఎస్ తరఫు న్యాయవాది తమిల్‌మారన్. గతంలో ఓపీఎస్‌ను పార్టీ టాప్ పోస్ట్‌కు రెండుసార్లు ఎంపిక చేశారు అన్నాడీఎంకే చీఫ్, మాజీ ముఖ్యమంత్రి జయలలిత. ఆమె మరణించేకన్నా ముందు మూడు సార్లు ముఖ్యమంత్రిగానూ చేశారు. కానీ, జయలలిత నెచ్చెలి శశికల పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత ఈపీఎస్‌ను ముఖ్యమంత్రిగా నియమించారు. మరోవైపు.. శశికల ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే ప్రయత్నాలు చేయగా ఓపీఎస్ తిరుగుబాటు చేశారు. ఆ తర్వాత ఆమె జైలుకు వెళ్లారు. ఇరువురు నేతలు కలిసి పార్టీని నడిపించారు. ఓపీఎస్‌తో చేతులు కలిపిన ఈపీఎస్ పార్టీ నేత శశికలను బహిష్కరించారు. ఓపీఎస్‌ను ఉపముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టారు ఈపీఎస్. ఓపీఎస్ కోఆర్డినేటర్‌గా, ఈపీఎస్ డిప్యూటీ జాయింట్ కోఆర్డినేటర్‌గా కొనసాగుతూ వచ్చారు. అయితే, ఇటీవల జరిగిన మూడు ఎన్నికల్లో అన్నాడీఎంకే ఓటమిపాలవటంతో నేతల మధ్య విబేధాలు బయటపడ్డాయి. పార్టీని హస్తగతం చేసుకునేందుకు ద్వంద నాయకత్వంతో నిర్ణయాలు తీసుకోలేకపోతున్నామని పేర్కొన్నారు ఈపీఎస్. పార్టీకి ఒక్కరే నాయకత్వం వహించాలని సూచించారు. ఆ తర్వాత జనరల్ బాడీ మీటింగ్ ఏర్పాటు చేసి జనరల్ సెక్రెటరీగా ఎన్నికయ్యారు. అయితే, తాజాగా మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో ఓపీఎస్‌కు ఊరట లభించినట్లయింది. ఇదీ చదవండి: Tamil Nadu: సుప్రీంకోర్టుకు పళనిస్వామి.. తీర్పుపై ఫుల్ ఉత్కంఠ -
అన్నాడీఎంకే: రెండాకుల్లో.. మూడుముక్కలాట!
సాక్షి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే ప్రబలశక్తి. రెండాకుల గుర్తుపై గణనీయమైన ఓటు బ్యాంకు ఈ పార్టీకి సొంతం. ఎంజీఆర్, జయలలిత కాలం నాటి క్రమశిక్షణ కనుమరుగైపోగా, రెండాకుల పార్టీ కోసం ఈపీఎస్, ఓపీఎస్, వీకేఎస్ మధ్య మూడుముక్కలాట తరహా రాజకీయాలు నడుస్తున్నాయి. వ్యవస్థాపక అధ్యక్షునిగా ఎంజీ రామచంద్రన్, ఆ తరువాత పగ్గాలు చేపట్టిన జయలలిత ప్రధాన కార్యదర్శిగా పార్టీని పరుగులు పెట్టించారు. జయ మరణం తరువాత పార్టీపై పెత్తనం కోసం వీకే శశికళ (వీకేఎస్), ఓ పన్నీర్‌సెల్వం (ఓపీఎస్), ఎడపాడి పళనిస్వామి (ఈపీఎస్) పోటీపడ్డారు. ఆస్తుల కేసులో శశికళ జైలుపాలు కావడంతో ఓపీఎస్,ఈపీఎస్‌ల జంట నాయకత్వం అనివార్యమైంది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో శశికళ జైలు నుంచి విడుదల కావడం, పార్టీ ఓటమి తరువాత అంతః కలహాలు మొదలయ్యాయి. ఏక నాయకత్వం నినాదంతో గద్దెనెక్కాలని ఎడపాడి చేస్తున్న ముమ్మురమైన ప్రయత్నాలపై ఓపీఎస్ న్యాయపోరాటానికి దిగారు. పోటీగా ఈపీఎస్ సైతం కోర్టు మెట్లెక్కారు. ముచ్చటగా మూడో నేత.. ప్రధాన కార్యదర్శి పదవిని పునరుద్ధరించడం ద్వారా పార్టీని కైవసం చేసుకుకోవాలని ఎడపాడి పళనిస్వామి భావిస్తుండగా ఆ ప్రయత్నాలకు పన్నీర్‌సెల్వం గండికొడుతున్నారు. ఈపీఎస్, ఓపీఎస్ కుమ్ములాటతో స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండాకుల గుర్తుపై ఈసీ (ఎన్నికల కమిషన్) నిషేధం విధించింది. ఇక అన్నాడీఎంకేలో నెలకొన్న రాజకీయ కలవరాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేలా శశికళ రాష్ట్రవ్యాప్త పర్యటన మొదలుపెట్టారు. ఎంజీఆర్, జయలలిత ఆశయాలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తులనే నిజమైన నేతలుగా పరిగణించాలి, కార్యకర్తలను కలుపుకుపోగల ఏక నాయకత్వమే పార్టీకి శ్రేయస్కరమని ఈనెల 4వ తేదీన పూందమల్లి జరిపిన పర్యటనలో శశికళ అన్నారు. క్యాడర్‌ను ఏకతాటిపై నడిపించేందుకు పార్టీ శ్రేణులు తన నాయకత్వాన్ని కోరుతున్నారని ఆమె చెప్పారు. చదవండి: Viral: బ్యాండ్ వాయించి సీఎం ఏక్‌నాథ్‌కు వెల్కమ్ చెప్పిన భార్య స్టే కోసం ఓపీఎస్ పిటిషన్ ఎడపాడి పళనిస్వామి మద్దతుదారులు ఈనెల 11వ తేదీన తలపెట్టిన సర్వసభ్య సమావేశం నిర్వహణపై స్టే విధించాలని కోరుతూ పన్నీర్‌సెల్వం మంగళవారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను అత్యవసర కేసుగా పరిగణించి విచారణ చేపట్టాలని ఓపీఎస్ చేసిన అభ్యర్థనను కోర్టు అంగీకరించింది. ఈమేరకు స్టే కోరుతూ దాఖలైన ఈ పిటిషన్ బుధవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది. స్టే కోసం ఒకవైపు ఓపీఎస్ సర్వశక్తులు ఒడ్డుతుండగా, మరోవైపు ఈపీఎస్ సర్వసభ్య సమావేశానికి సన్నాహాలు చేస్తున్నారు. 11వ తేదీన సర్వసభ్య సమావేశంలో ప్రధాన కార్యదర్శిగా తనను కార్యకర్తలే ఎన్నుకునేలా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని వ్యూహం పన్నుతున్నారు. ఈ సమావేశానికి పోలీసు బందోబస్తు కల్పించాలని మాజీ మంత్రి జయకుమార్ డీజీపీకి మంగళవారం దరఖాస్తు చేశారు. అసాంఘిక శక్తుల వల్ల శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే అవకాశం ఉందని అందులో పేర్కొన్నారు. జనరల్‌బాడీ సమావేశానికి హాజరయ్యే సభ్యులకు బార్‌కోడ్‌తో కూడిన గుర్తింపుకార్డు విధానాన్ని ప్రవేశపెట్టాలని పార్టీ భావిస్తోంది. అంతేగాక, పన్నీర్‌సెల్వం వర్గాన్ని తమవైపునకు తిప్పుకునేలా ఎడపాడి నుంచి ఆహ్వానాలు అందుతున్నాయి. పనిలో పనిగా పన్నీర్‌సెల్వంకు సైతం ఎడపాడి ఆహ్వానం పంపడం విశేషం. -
అన్నాడీఎంకేలో తారాస్థాయికి ముసలం.. జయ సమాధి వద్ద ఉద్రిక్తత
చెన్నై: అన్నాడీఎంకేలో ఆధిపత్య ముసలం ఆగలేదు.. మళ్లీ తారాస్థాయిలో రాజుకుంది. పళనిస్వామి, పన్నీరు సెల్వంలో ఎవరో ఒకరు పార్టీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాలంటూ ఇరు వర్గాల మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. జూన్ 14వ తేదీన జరిగిన జిల్లా కార్యదర్శుల సమావేశం నుంచి ఈ ముసలం మరింతగా ముదిరింది. ఈ తరుణంలో.. జయలలిత సమాధి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జయలలిత సమాధి వద్ద కిరోసిన్ పోసుకుని ఓ కార్యకర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. పళనిస్వామి అన్నాడీఎంకే అధ్యక్షుడిగా ఉండడానికి వీల్లేదంటూ వీరంగం సృష్టించాడు. అన్నాడీఎంకే అధినేతగా జయలలిత పేరే ఉండాలంటూ డిమాండ్ చేశాడు. కార్యకర్తను అడ్డుకుని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అన్నాడీఎంకే జనరల్ కౌన్సిల్ భేటీకి ముందు పార్టీలో వర్గపోరు మరోసారి బయటపడింది. మాజీ ముఖ్యమంత్రి, పార్టీ కో-కోఆర్డినేటర్ పళనిస్వామి(EPS), మాజీ డిప్యూటీ సీఎం.. పార్టీ కోఆర్డినేటర్ పన్నీరుసెల్వం వర్గీయులు వాళ్ల వాళ్ల డిమాండ్లతో రచ్చకెక్కుతున్నారు. జూన్ 23న(గురువారం) జరగబోయే మీటింగ్‌లో పార్టీ అంతా ఒక్కరి నాయకత్వంలోనే నడవాలని పళనిస్వామి తీర్మానం చేయనున్నాడు. అదే సమయంలో.. తన సంతకం లేకుండా జనరల్ బాడీ ఆ తీర్మానం ఆమోదించడానికి వీల్లేదంటూ పన్నీర్ సెల్వం వాదిస్తున్నాడు. ఈ మేరకు బుధవారం ఎన్నికల కమిషన్‌ను కలిసి తన పాయింట్‌ను వినిపించనున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు జనరల్ కౌన్సిల్ భేటీ జరగకుండా అడ్డుకునేందుకు పోలీసులను ఆశ్రయించాడు ఆయన. అయితే.. ఈ భేటీ జరగకుండా ఆదేశాలు ఇవ్వాలంటూ మద్రాస్ హైకోర్టులో మాజీ మంత్రి బెంజిమన్ ఓ పిటిషన్ దాఖలు చేయగా.. మంగళవారం ఆ పిటిషన్‌ను తోసిపుచ్చింది హైకోర్టు. నిర్వహణ ఉండాలా? వద్దా? అనేది పార్టీ జనరల్ కౌన్సిల్‌కు సంబంధించిన నిర్ణయమని, దానిని ఆపాలని ఆదేశించలేమని బెంచ్ స్పష్టం చేసింది. అంతేకాదు.. భేటీకి హాజరయ్యే సభ్యులను క్షుణ్ణంగా తనిఖీలు చేయాలని పోలీసులను ఆదేశించింది మద్రాస్ హైకోర్టు. ఈ తరుణంలో అన్నాడీఎంకే వర్గపోరు వేడి.. అక్కడి రాజకీయాలను హీటెక్కిస్తోంది. -
తమిళనాడు సీఎంకు శస్త్రచికిత్స
సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి అనారోగ్యానికి గురై ఆసుపత్రిలో చేరారు. తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ సోమవారం చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్‌కాగా ఆయనకు హెర్నియా శస్త్రచికిత్స చేశారు. ఈనెల 6న పోలింగ్ ముగిసిన నాటి నుంచి సేలం జిల్లాల్లోని తన స్వగ్రామంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆదివారం సేలం నుంచి చెన్నైకి చేరుకున్న సీఎం ఎడపాడి తన క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వాధికారులతో లతో సమావేశమై కరోనా పరిస్థితులను సమీక్షించారు. ఆక్సిజన్ కొరత.. ఏడుగురి మృతి సాక్షి ప్రతినిధి, చెన్నై: రోగులకు ఆక్సిజన్ అందక ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన సంఘటన తమిళనాడులో సోమవారం చోటు చేసుకుంది. వేలూరు జిల్లా అడుక్కంపారై ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేక వార్డులో పాజిటివ్ రోగులు చికిత్స పొందుతున్నారు. అయితే ఆక్సిజన్ అందక రాజేశ్వరి (68), ప్రేమ్ (40), సెల్వరాజ్ (66) సహా ఏడుగురు మృతి చెందారు. ఆక్సిజన్ కొరత అని కొందరంటుండగా, ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరత లేదని, వేర్వేరు కారణాలతో రోగులు మృతిచెందారని వేలూరు కలెక్టర్ షణ్ముగ సుందరం, ఆస్పత్రి డీన్ సెల్వి తెలిపారు. కరోనా సెకెండ్ వేవ్‌తో తమిళనాడు అతలాకుతలమవుతోంది. రోజుకు 10 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. సోమ వారం 10,941 కేసులు నిర్ధారణ అయ్యాయి. 44 మంది మృతి చెందారు. చదవండి: నేతల ఆట విడుపు.. కొడైకెనాల్లో తిష్ట -
నేతల ఆట విడుపు.. కొడైకెనాల్లో తిష్ట
సాక్షి, చెన్నై: తెల్ల పంచె, తెల్లచొక్క అంటూ రాజకీయ వ్యవహారాల్లో బిజీబిజీగా గడిపిన నేతలకు కాస్త విరామం లభించింది. కొడైకెనాల్లో పలువురు నేతలు ఆటవిడుపుగా తిష్ట వేశారు. కొందరు అయితే, కుటుంబాలతో కలిసి పర్యాటక కేంద్రాల్లో చక్కర్లు కొడుతున్నారు. వీరు తమ నాయకులేనా అని గుర్తు పట్టలేని రీతిలో వేషాల్ని మార్చేశారు. అసెంబ్లీ ఎన్నికల ముందుగా సిట్టింగ్ సీట్లు మళ్లీ దక్కేనా అన్న ఆందోళన అనేక మంది మంత్రులు, ఎమ్మెల్యేలు పడ్డ విషయం తెలిసిందే. చివరకు సీట్లు దక్కించుకున్న వాళ్లు, ఎన్నికల ప్రచారంలో రేయింబవళ్లు ఓటర్లను ఆకర్షించేందుకు కుస్తీలు పట్టారు. పార్టీల ముఖ్య నేతలు, మంత్రులు అంటూ నెలన్నర రోజులు తీవ్రంగానే శ్రమించారు. ఈనెల ఆరవ తేదీతో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. దీంతో ఫలితాల వెల్లడికి మే 2వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం విరామ సమయం నేతలకు దొరికింది. తమ కుటుంబాలతో గడిపేందుకు మరింతగా సమయం దొరికింది. సీఎం పళనిస్వామి అయితే, స్వగ్రామం ఎడపాడికి వెళ్లి కుటుంబం, బంధువులతో గడిపేందుకు ఎక్కువ సమయం కేటాయించడం జరుగుతోంది. డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం సొంతూరు బోడినాయకనూర్‌కు పరిమితమయ్యారు. డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ అయితే, కుటుంబంతో కలిసి కొడైకెనాల్ వెళ్లారు. వేషాల్ని మార్చేసి.. తమిళ నేతలు సాధారణంగా తెల్లపంచె, తెల్ల చొక్కాలతో దర్శనం ఇవ్వడం నిత్యం చూస్తూ వచ్చాం. అయితే, ఇప్పుడు విరామ సమయంలో తమ వేషాల్నే మార్చేశారు. భార్య దుర్గ, కుమారుడు ఉదయ నిధి, కోడలు, మనుమళ్లు, మనుమరాళ్లతో స్టాలిన్ కొడైకెనాల్లో రెండు రోజులుగా బస చేశారు. గోల్ఫ్ ఆడుతూ ఎక్కువ సమయం గడుపుతున్నారు. సాయంత్రం సతీమణితో కలిసి అలా పర్యాటక అందాల్ని తిలకించేందుకు కారులో చక్కర్లు కొట్టే పనిలో పడ్డారు. ట్రాక్, టీషర్టుతో కనిపించిన స్టాలిన్‌తో సెల్ఫీలకు పలువురు ఎగబడడం విశేషం. ఈ పరిస్థితుల్లో కొడైకెనాల్లో స్టాలినే కాదు, అన్నాడీఎంకే ముఖ్య నేతలు, మంత్రులు పలువురు సైతం కుటుంబాలతో కలిసి తిష్ట వేసి ఉండడం వెలుగు చూసింది. అయితే, వీళ్లేనా తమ నేతలు, తమ మంత్రులు అని గుర్తు పట్టలేని పరిస్థితుల్లో వేషాల్ని మార్చేశారు. థర్మాకోల్ మంత్రిగా ముద్ర పడ్డ సహకార మంత్రి సెల్లూరురాజు ఆదివారం ఉదయం కుటుంబంతో వాకింగ్ చేస్తూ కెమెరాకు చిక్కారు. ఆయన్ను తొలుత ఎవ్వరూ గుర్తు పట్టనప్పటికీ, చివరకు దగ్గరకు వెళ్లి పలకరించగా, ఆయనే సెల్లూరు రాజు అని తేలింది. దీంతో ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పలువురు యువకులు ఆసక్తి చూపించారు. తానే కాదు, మరెందరో నేతలు కొడైకెనాల్లో విశ్రాంతిలో ఉన్నట్టుగా సెల్లూరు సంకేతం ఇవ్వడం గమనార్హం. పంచెకట్టు, తెల్ల చొక్కాల్ని పక్కన పెట్టి, టీషర్టులు, జీన్స్‌లు, ట్రాక్‌లతో వేషాల్ని మార్చిన మనోల్ని గుర్తు పట్టడం కాస్త కష్టమే అన్నట్టుగా పరిస్థితి నెలకొని ఉండడం గమనార్హం. గతంలో ముఖ్య నేతలు ఎన్నికల అనంతరం విదేశాలకు చెక్కేసేవారు. తాజాగా కరోనా పరిస్థితుల నేపథ్యంలో దిండుగల్ జిల్లా కొడైకెనాల్‌కు పరిమితమైనట్టుంది. చదవండి: రాత్రి కర్ఫ్యూ.. ఆదివారం ఫుల్ లాక్డౌన్ -
నా మాటల్ని వక్రీకరించారు: రాజా
సాక్షి, చెన్నై: తన వ్యాఖ్యలను వక్రీకరించి బయటకు విడుదల చేశారని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల కమిషన్లకు డీఎంకే ఎంపీ రాజా వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారంపై సమగ్ర, న్యాయబద్ధంగా విచారణ జరగాలని కోరారు. పెరంబలూరు ఎన్నికల ప్రచారంలో డీఎంకే ఎంపీ రాజా చేసిన వ్యాఖ్యలు దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. సీఎం పళనిస్వామి, ఆయన తల్లిని కించపరిచే రీతిలో రాజా వ్యాఖ్యలు చేశారంటూ అన్నాడీఎంకే వర్గాలు ఈసీకి ఫిర్యాదు చేశాయి. ఆయనపై చర్యకు పట్టుబడుతూ అన్నాడీఎంకే నేతృత్వంలో నిరసనలు సైతం సాగాయి. సీఎం పళనిస్వామి సైతం ఆయన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ ఎన్నికల ప్రచారంలో ఉద్వేగానికి లోనయ్యారు. సీఎం ఉద్వేగానికి గురికావడంతో మనసు నొప్పించి ఉంటే మన్నించండి అంటూ రాజా క్షమాపణలు కూడా చెప్పుకున్నారు. ఈ పరిస్థితుల్లో ఈ వ్యవహారాన్ని తీవ్రంగానే పరిగణించిన ఎన్నికల కమిషన్ వివరణ కోరుతూ రాజాకు నోటీసులు జారీ చేసింది. న్యాయవాదితో వివరణ రాజా స్వయంగా వచ్చి ఈసీ సాహుకు వివరణ ఇస్తారన్న సంకేతాలు వెలువడ్డాయి. అయితే తన న్యాయవాది పచ్చయప్పన్ ద్వారా రాజా వివరణ లేఖను కేంద్ర, రాష్ట్ర కమిషన్లకు పంపించారు. అందులో తాను ఎన్నికల ఆదాయం కోసం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఎన్నికల నిబంధనల్ని ఉల్లంఘించ లేదని వివరించారు. తానేదో వ్యాఖ్యలు చేసినట్టుగా అన్నాడీఎంకే, బీజేపీలు తీవ్రంగా దుమారం రేపుతున్నాయని, వాస్తవానికి తన వ్యాఖ్యల్ని కత్తిరించి, వక్రీకరించి బయటకు వీడియోల రూపంలో విడుదల చేశారని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై సమగ్ర, న్యాయబద్ధంగా విచారణ జరిగితే, తాను ఏ తప్పు చేయలేదన్నది, వ్యాఖ్యలు చేయలేదనేది స్పష్టం అవుతోందన్నారు. సీఎం ఉద్వేగానికి గురయ్యారన్న సమాచారంతో ఒక వేళ తానేమైనా తప్పు చేశానా.. అని భావించి మనసు నొప్పించి ఉంటే మన్నించాలని క్షమాపణ కూడా కోరినట్టు గుర్తు చేశారు. అన్నాడీఎంకే వర్గాలు తనపై మోపిన ఆరోపణలకు సంబంధించిన ఫిర్యాదు నకలు అందించాలని, ఆ మేరకు పూర్తి వివరణ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. -
బీజేపీతో మైత్రి కొనసాగుతుంది: అన్నాడీఎంకే
సాక్షి, చెన్నై : బీజేపీతో తమ మైత్రి కొనసాగుతుందని, త్వరలో జరగనున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కూడా కలిసే పోటీ చేస్తామని అన్నాడీఎంకే చీఫ్ కోఆర్డినేటర్, ఉప ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం స్పష్టం చేశారు. శనివారం కేంద్ర మంత్రి అమిత్‌షా తమిళనాడు పర్యటన సందర్బంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ‘‘ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మా పొత్తు కొనసాగుతుంది. మేము పదేళ్ల పాటు మంచి పాలనను అందించాము. 2021 ఎన్నికల్లో కచ్చితంగా గెలుస్తాము. తమిళనాడు ప్రజలు ఎల్లప్పుడూ ప్రధాని మోదీకి మద్దతుగా ఉంటారు’’ అని పేర్కొన్నారు. అమిత్‌షా కూడూ తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు. ( డీఎంకేకి షాక్.. అమిత్ షా- అళగిరిల భేటీ?!) చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘తమిళనాడులో కరోనాను నియంత్రించడానికి ముఖ్యమంత్రి పళనిస్వామి, ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వంల కృషి అభినందనీయం. తమిళనాడులో కరోనా రికవరీ రేటు ఎక్కువగా ఉంది. తమిళనాడును ఓ గర్భిణిలా ప్రభుత్వం చూసుకుంది. ఇలా ఏ ఇతర ప్రభుత్వం చేయలేదు. కుటుంబ రాజకీయాలు చేసే వారికి ప్రజలు బుద్ధి చెబుతారు. 2జి స్కాంలో దొరికిపోయిన వారు రాజకీయాల గురించి మాట్లాడే హక్కులేదు’’ అని అన్నారు. -
అన్నాడీఎంకేలో కుర్చీ వార్
సాక్షి, చెన్నై: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం అభ్యర్థి ఎవరనే అంశంపై అన్నాడీఎంకేలో నిప్పు రాజుకుంది. సీఎం ఎడపాడి పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం ఎవరికివారు ‘నేనంటే నేనే’ అంటూ వాదులాడుకునే స్థాయికి చేరింది. వివాదానికి తెరదించేలా అక్టోబరు 7న అధికారిక ప్రకటిన చేయనున్నట్లు పార్టీ సోమవారం స్పష్టం చేసింది. చదవండి: (కుష్బూను సందిగ్ధంలో పడేసిన గ్రూపు రాజకీయాలు) ఎడపాడి, పన్నీర్ మాటల యుద్ధం చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో సోమవారం పార్టీ కార్యవర్గ సమావేశం రసవత్తరంగా సాగింది. ఎడపాడి, పన్నీర్ వర్గాలు రెండుగా విడిపోయి బలప్రదర్శన చేస్తూ తమ నేతలకు స్వాగతం పలికాయి. తమనేతే సీఎం అభ్యర్థి అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నందున హోం మంత్రిత్వశాఖ ఆదేశాల మేరకు సీఎం ఎడపాడికి బందోబస్తు పెంచారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై ఈ సమావేశంలో ఎడపాడి, పన్నీర్ మధ్య వాగ్యుద్ధం చోటుచేసుకుంది. ఈ అంశంపై 11 మందితో మార్గదర్శక కమిటీని వేయాలని పన్నీర్ ప్రతిపాదించగా, పార్టీ పరంగానే నిర్ణయం తీసుకోవచ్చు, కమిటీ అవసరం లేదని ఎడపాడి నిరాకరించారు. జయలలిత ఆదేశాల మేరకు సీఎం అయినందున తానే ముఖ్యమంత్రి అభ్యర్థి అని పన్నీర్‌సెల్వం చెప్పగా, మిమ్మల్నే కాదు జయను సైతం సీఎంను చేసింది శశికళేనని ఎడపాడి బదులిచ్చారు. సుమారు ఐదు గంటపాటు సమావేశం జరిగినా ఓ అవగాహనకు రాలేకపోయారు. వచ్చే నెల 7వ తేదీన జరుగనున్న జనరల్ బాడీ సమావేశంలో ఎడపాడి, పన్నీర్ సంయుక్తంగా ప్రకటన చేస్తారని ఆ పార్టీ అగ్రనేత కేపీ మునుస్వామి మీడియాకు తెలిపారు. 15 తీర్మానాలు ఆమోదం పార్టీ ప్రయోజనాలు, సిద్ధాంతాలకు కట్టుబడి సమష్టిగా పాటుపడదాం, తమిళనాడు ప్రభుత్వానికి కేంద్రం జీఎస్టీ సహా పలు అభివృద్ధి కార్యక్రమాల బకాయిలను చెల్లించాలని, కరోనా కష్టకాలంలో ప్రజల కోసం శ్రమించిన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, ఆరోగ్య, పోలీస్ శాఖలతోపాటు అన్నాడీఎంకే శ్రేణులకు ధన్యవాదాలు, ద్విభాషా విధానం, తమిళనాడులో నీట్ పరీక్ష రద్దు తదితర 15 తీర్మానాలను సమావేశంలో ఆమోదించారు. -
దిండుగల్‌లో పోస్టర్ల హల్చల్
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సీఎం వివాదం రోజుకో రూపంలో తెరపైకి వస్తోంది. దిండుగల్‌లో సీఎం పన్నీరు.. డిప్యూటీ పళని అంటూ పోస్టర్లు వెలిశాయి. ఇది దిండుగల్ అన్నాడీఎంకే గ్రూపువార్‌ను తెరపైకి తెచ్చింది. 2021 ఎన్నికల్లో అన్నాడీఎంకే సీఎం అభ్యర్థి అంటూ మంత్రులు సెల్లూరు రాజు, కేటీ రాజేంద్ర బాలాజీల భిన్న వ్యాఖ్యలు వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఇది కాస్త సీఎం, డిప్యూటీ సీఎం శిబిరాల మధ్య చిచ్చుకు దారి తీసింది. బుధవారం దిండుగల్ జిల్లాలో సీఎంపన్నీరు..డిప్యూటీ పళని అంటూ పోస్టర్లు వెలిశాయి. దిండుగల్ జిల్లా అన్నాడీఎంకేలో మాజీ మంత్రి నత్తం విశ్వనాథన్, మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ కీలకం. ఇది వరకు పన్నీరు విశ్వాసపాత్రుడి ఉన్న విశ్వనాథన్, ప్రస్తుతం సీఎం పళనికి నమ్మకస్తుడయ్యారు. ఇది దిండుగల్ శ్రీనివాసన్ మద్దతుదారుల్ని కలవరంలో పడేసింది. నత్తం రూపంలో శ్రీనివాసన్‌కు చిక్కులు తప్పవన్న ఆందోళన బయలుదేరింది. ఈ పరిస్థితుల్లో రెండు శిబిరాల వివాదం కాస్త సీఎం ఎవరో చర్చను మరోమారు తెరపైకి తెచ్చింది. 2021 ఎన్నికల్లో గెలుపుతో సీఎంగా పన్నీరు, డిప్యూటీ సీఎంగా పళని వ్యవహరించడం ఖాయం అంటూ వెలిసిన ఈ పోస్టర్లు దిండుగల్ రాజకీయ గ్రూప్ వార్‌ను తెర పైకి తెచ్చింది. -
'ఆయన పుణ్యానా ఎమ్మెల్యేను కోల్పోయాం'
సాక్షి, చెన్నై: డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్‌పై సీఎం పళనిస్వామి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆయన పుణ్యమా అని ఓ ఎమ్మెల్యేను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తంచేశారు. వద్దంటున్నా, ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, ఇప్పుడు ఒకరి ద్వారా మరొకరికి వైరస్ వ్యాప్తి పెరిగి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా కట్టడిలో కోయంబత్తూరు అధికారుల పనితీరు అభినందనీయమని కొనియాడారు. మెజిస్ట్రేట్ విచారణ నివేదిక మేరకు సాత్తాన్ కులంలో తండ్రి, కుమారుడి మరణంపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సీఎం పళనిస్వామి గురువారం కోయంబత్తూరులో పర్యటించారు. రూ.238 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధిపనుల్ని ప్రారంభించారు. స్మార్ట్ సిటీ పనులు, వంతెనల నిర్మాణాలు, భారీ ఫ్లైఓవర్ల పనులు, అత్తికడవు అవినాశి ఉమ్మడి నీటి పథకం పనుల పరిశీలన అంటూ పలు పనులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. అలాగే, రూ. 779 కోట్లతో చేపట్టనున్న పిల్లూరు తాగునీటి పథకం, సొరంగం తవ్వకాల పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ రాజామణి, మంత్రి ఎస్పీ వేలుమణి, డిప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి వి జయరామన్‌లతో కలిసి కరోనా నివారణ చర్యల మీద సమీక్షించారు. అలాగే, చిన్న ,మధ్యతరహా, భారీ పరిశ్రమల యాజమాన్యాలు, ప్రతినిధులతో భేటీ అయ్యారు. స్వయం సహాయక బృందాలు, మహిళా సంఘాలతో సమావేశం అయ్యారు. సాయంత్రం మూడు గంటలకు మీడియా ముందుకు సీఎం వచ్చారు. కోయంబత్తూరు భేష్.. కోయంబత్తూరులో చేపట్టనున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల గురించి ముందుగా సీఎం పళనిస్వామి వివరించారు. కరోనా నివారణ చర్యలను గుర్తు చేస్తూ, వైరస్ కట్టడిలో అధికారుల పనితీరు అభినందనీయమని కొనియాడారు. ఇక్కడ వైరస్ అన్నది కట్టడిలో ఉందని, ప్రస్తుతం 112 మంది మాత్రమే చికిత్సలో ఉన్నట్టు వివరించారు. ఇక్కడున్న పరిశ్రమల్ని బలోపేతం చేయడం కోసం కేంద్రం ద్వారా రూ. 761 కోట్ల మేరకు రుణాల్ని ఇప్పించామని తెలిపారు. గత 90 రోజులుగా రాష్ట్రంలోని ప్రతి అధికారి నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు, వైద్యుల నుంచి నర్సులు, వార్డుబాయ్‌ల వరకు రేయింబవళ్లు కరోనా నివారణ, కట్టడి, బా«ధితుల సేవలో ఉన్నారని వివరించారు. వీరందరికి తాను ఈసందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నారు. అయితే, రోగాన్ని అడ్డం పెట్టుకుని డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ చేస్తున్న రాజకీయం జూస్తుంటే, తీవ్ర ఆవేదన , ఆగ్రహం కల్గుతోందన్నారు. ఓ ఎమ్మెల్యేను కోల్పోయాం.. కరోనా కట్టడి లక్ష్యంగా అందరూ రేయింబవళ్లు శ్రమిస్తుంటే, ప్రభుత్వం చేతులెత్తేసిందని, సీఎంకు మానవత్వం లేదని, అధికారులు అసమర్థులు అన్నట్టుగా స్టాలిన్ వ్యాఖ్యలు చేస్తుండడం విచారకరంగా పేర్కొన్నారు. వాస్తవానికి స్టాలిన్ ఇచ్చిన ఆలోచనల్ని తాను అనుసరించి ఉంటే, ఈ పాటికి రాష్ట్రంలో కరోనా విలయతాండవం, మరణమృదంగం మార్మోగి ఉండేదేమో అని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎంకే నేతృత్వంలో కరోనా నివారణ చర్యలు, కట్టడి, బాధితులకు సాయం అన్న ప్రకటన చేయగానే, తొలుత ఆక్షేపణను తానే తెలియజేసినట్టు తెలిపారు. ఇందుకు కారణం, వైద్య నిపుణులు, పరిశోధకులు ఇచ్చిన నివేదికేనని వివరించారు. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా సేవల్లో నిమగ్నమైన పక్షంలో కరోనా వ్యాప్తికి అవకాశం ఉందని ఆ నివేదికలో హెచ్చరించారన్నారు. అందుకే తాను అడ్డుకోవడం జరిగిందని, అయితే, కోర్టు ద్వారా వారు సేవల్ని కొనసాగించారన్నారు. ఇందుకు మూల్యంగా ఓ ఎమ్మెల్యేను కోల్పోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిబంధనల్ని విస్మరించి ఇష్టానుసారంగా వ్యవహరించడంతో భౌతిక దూరాలు, సామాజిక బాధ్యతల్ని మరిచి ప్రజలు సహాయకాల కోసం తరలివచ్చారని, ఇప్పుడు అదే జనం వైరస్ బారిన పడి ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైరస్ ఒకరి ద్వారా మరొకరికి సంక్రమించినట్టు తాజా నివేదిక స్పష్టం చేసిందని, అయితే, సమాజంలోకి ఇది వ్యాపించ లేదన్నారు. ఇష్టానుసారంగా సేవలు అంటూ దూకుడుగా ముందుకు సాగి వైరస్ వ్యాప్తికి పరోక్షంగా కారణం కావడమే కాకుండా, ఓ ఎమ్మెల్యేను కోల్పోవాల్సిన పరిస్థితిని తీసుకొచ్చింది ఎవరో అన్నది ప్రజలు గుర్తెరగాలని పిలుపునిచ్చారు. తానో జాతీయ నేతను అని స్టాలిన్ గొప్పలు చెప్పుకుంటున్నారని, అలాంటప్పుడు ముంబై, ఢిల్లీ, పశ్చిమ బెంగాల్లో పెరుగుతున్న కేసుల విషయంగా ఎందుకు పెదవి విప్పడం లేదని ప్రశ్నించారు. కరోనా కాలంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్న విషయాన్ని పసిగట్టి, ఏదో ఒక రూపంలో బురద చల్లడం లక్ష్యంగా వ్యక్తిగత ప్రచారం కోసం రోజుకో ప్రకటనలు ఇచ్చుకోవడం ఆయనకు అలవాటుగా మారి ందని మండిపడ్డారు. కాగా, సాత్తాన్ కులం తండ్రి, కుమారుల మరణం గురించి ప్రశ్నించగా, మెజి్రస్టేట్ విచారణ కోర్టు పర్యవేక్షణలో సాగుతున్నదని, మదురై ధర్మాసనం ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామని, ఎవరైనా తప్పు చేసి ఉంటే, వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. -
చెన్నైలో భయం.. భయం
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. మంగళవారం నాటికి కరోనా పాజిటివ్ కేసులసంఖ్య రెండువేలు దాటింది. రాష్ర్టంలో మొత్తం 37 జిల్లాల్లో కృష్ణగిరి మినహా అన్ని జిల్లాల్లో నెలరోజులుగా పాజిటివ్ కేసులు రోజూ నమోదవుతున్నాయి. ముఖ్యంగా చెన్నైలోనే అత్యధిక కేసులు వెలుగు చూడటం ఆందోళన కలిగిస్తుంది. రాష్ర్టవ్యాప్తంగా మంగళవారం నిర్ధారణ అయిన 121 కరోనా పాజిటివ్ కేసల్లో 103 కేసులు ఒక్క చెన్నైలోనే నమోదుకావడం గమనార్హం. అయితే చాలా కేసుల్లో వైరస్ ఎలా సోకిందనే లింక్ దొరక్క పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఇలీవలె చెన్నైలో 43 కేసులు బయటపడగా వీరిలో 13 మందికి వైరస్ ఎలా సోకిందనే లింక్ దొరకలేదు. ఇప్పటివరకు రాష్ర్టంలో 2,058 కరోనా కేసులు నమోదుకాగా 25 మంది చనిపోయారు. (కరోనా భయం: తమిళనాడులో అమానుషం) ‘స్వచ్ఛంద’వ్యాప్తి.. ప్రజల్లో భీతి లాక్‌డౌన్‌తో తినడానికి సరిగ్గా తిండి దొర్కక అవస్తులు పడుతున్న వారి ఆకలి తీర్చేందుకు ఓ స్వచ్ఛంద సేవకుడు ప్రతీరోజు కొంతమంది నిరాశ్రయులకు ఆహారం అందించాడు. అయితే గత కొన్ని రోజులుగా జలుబు, దగ్గు వంటి లక్షణాలతో ఉండటంతో పరీక్షించగా కరోనా పాజిటివ్ అని తేలింది. సదరు యువకుడు కొన్ని రోజులుగా నిరాశ్రయులు, కార్మికులు, కొంతమంది పోలీసులకి సహా దాదాపు 80 మందిదాకా ఆహార పొట్లాలు అందించి తనకు చేతనైన సహాయం చేశాడు. దీంతో వీరందరిని గుర్తించి, వారు ఎవరెవరిని కలిశారో అన్నదానిపై విచారిస్తున్నారు. సరి(హద్దు)లేని జాగ్రత్తలు.. వైరస్‌ను అడ్డుకట్టవేసేందుకు అధికారులు తీసుకున్న నిర్ణయం వారికి కొత్త సమస్యలు తెచ్చిపెట్టింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దు బయటివారిని రానివ్వకుండా గోడను కట్టారు. దీంతో పాలు, కూరగాయలు వంటి అత్యవసర సరుకుల పంపిణీకి తీవ్ర ఆటంకం కలిగింది. సరిహద్దు జిల్లాల కలెక్టర్ల మధ్య సమన్వయ లోపంతో వాహనాలు వేరే ప్రాంతాల మీదుగా అక్కడికి చేరుకోవాల్సి వచ్చింది. గుడియాత్తం–పలమనేరు రోడ్డు మధ్యలో ఈనెల 26వ తేదీ సాయంత్రం గోడను కట్టడంతో ఏపీ నుంచి తమిళనాడుకు అత్యవసర వస్తువులతో బయలుదేరిన లారీలన్నీ పలమనేరులో నిలిచిపోయాయి. మరికొన్ని వాహనాలు పలమనేరు నుంచి చిత్తూరుకు వెళ్లి అక్కడి నుంచి కాట్పాడి మీదుగా సుమారు 60 కిలోమీటర్లు ప్రయాణించి తమిళనాడులోకి ప్రవేశించాయి. ఆంధ్రప్రదేశ్ నుంచి అత్యవసర చికిత్స కోసం వేలూరు ఆసుపత్రికి వెళ్లలేక పలువురు రోగులు అల్లాడిపోయారు. సమాచారం అందుకున్న వేలూరు జిల్లా కలెక్టర్ షణ్ముగం ఆదేశంతో గోడను తొలగించారు. (సెల్ ఫోన్ పేలి చూపు కోల్పోయిన యువతి) -
చెన్నైకు తాగునీరివ్వండి
సాక్షి, అమరావతి : చెన్నై నగరవాసుల తాగునీటి అవసరాల కోసం తెలుగుగంగ నుంచి నీటిని విడుదల చేయాల్సిందిగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. తమిళనాడు ముఖ్యమంత్రి కె.పళనిస్వామి ఆదేశాల మేరకు తమిళనాడు మున్సిపల్ శాఖ మంత్రి ఎస్పీ వేలుమణి, మత్స్య శాఖ, పాలనా సంస్కరణల మంత్రి జయకుమార్, ముఖ్య కార్యదర్శి మనివాసన్ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు. తాగునీటి ఎద్దడితో అల్లాడుతున్న చెన్నై ప్రజలను ఆదుకోవాలని, అందుకు నీటిని విడుదల చేయాల్సిందిగా వారు విజ్ఞప్తి చేశారు. తాగునీరు లేక 90 లక్షల మంది చెన్నై ప్రజలు అల్లాడుతున్నారని మంత్రులు చెప్పగా.. వైఎస్ జగన్ వెంటనే స్పందించి చెన్నైకి తాగునీటిని విడుదల చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఇరుగుపొరుగు రాష్ట్రాలు పరస్పరం సోదరభావంతో మెలగాలని తమిళనాడు మంత్రుల బృందంతో అన్నారు. కష్టాల్లో పాలు పంచుకోవాలని, ప్రజలు ఇబ్బంది పడుతున్నప్పుడు మానవత్వంతో స్పందించాల్సిన అవసరముందని సీఎం జగన్ వివరించారు. -
చెమ్మ దొరకని చెన్నపట్నం
ఎండిపోయిన బోర్లు. నిండుకున్న రిజర్వాయర్లు. నీటికోసం తల్లడిల్లే పల్లెలు అనగానే మనకు వెంటనే గుర్తువచ్చేది మహారాష్ట్రలోని వెనుకబడిన మరఠ్వాడా, విదర్భ. నీటికోసం అల్లాడిపోతున్న మరాఠాలను ఆదుకునేందుకు ప్రత్యేకంగా రైలు భోగీలను ఏర్పాటు చేసి.. నీటిని తరలించిన పరిస్థితిని గతంలో లాతూర్‌లో చూశాం. కానీ ఇప్పుడు మహారాష్ట్ర సరసన తమిళనాడు చేరింది. తమిళనాట నీటి కటకట. నీరు కోసం తమిళ తంబీల తండ్లాట. నీటి చెమ్మ దొరకని చెన్నపట్నం. గుక్కెడు జలం కోసం జనం విలవిళ్లాడుతున్న పరిస్థితి. మొన్న మహారాష్ట్ర, నేడు తమిళనాడులో నీటి కోసం చిన్నపాటి యుద్ధలే జరుగుతున్నాయి. సాక్షి, చెన్నై: గుక్కెడు మంచినీళ్ల కోసం తమిళనాడులోని చెన్నై నగరం విలపిస్తోంది. మునుపెన్నడూ లేనంతగా తీవ్ర నీటి సంక్షోభంతో చెన్నై విలవిలలాడుతోంది. రిజర్వాయర్లలో నీళ్లు పూర్తిగా అడుగంటిపోయాయి. బోర్లు ఎండిపోయాయి. వాటర్ ట్యాంకర్ బుక్ చేసినా.. వస్తుందో రాదో తెలియని పరిస్థితి. బిందెడు నీళ్లు కావాలంటే.. లక్కీ డ్రాలో గెలవాల్సిందే. మంచినీళ్ల కోసం టోకెన్లు తీసుకోవాల్సిన పరిస్థితి. ఆఖరికి కాలకృత్యాలు తీర్చుకుందామన్నా ఎక్కడా నీళ్లు దొరకడం లేదు. వంటలకు నీళ్లు లేక హోటళ్లు మూతపడుతున్నాయి. నీటికోసం ఏకంగా యుద్ధాలే జరుగుతున్నాయి. ఒక ట్యాంకరు వస్తే చాలు నీళ్ల కోసం పెద్ద క్యూలలో ప్రజలు నిలబడుతున్నారు. గంటలకొద్దీ నీటికోసం క్యూలో నిలబడి సహనం కోల్పోయి గొడవలు పడుతున్నారు. తంజావూరులో నీటిని అక్రమంగా నిల్వ చేసుకుంటున్నారని ప్రశ్నించిన సామాజిక కార్యకర్త ఆనంద్ బాబును కొట్టి చంపారు. చెన్నైలో నీళ్ల పంపకాల విషయంలో జరిగిన గొడవలో మహిళపై పదునైన పరికరంతో దాడి చేశారన్న ఆరోపణలతో.. అసెంబ్లీ స్పీకర్ ధనపాల్ కారు డ్రైవర్ ఆదిమూలంను పోలీసులు అరెస్ట్ చేశారు. సూపర్ స్టార్ రజనీకాంత్ చేయూత... ఎక్కడ నీళ్లు ఎక్కువ వాడాల్సి వస్తుందోనని.. తమకిష్టమైన సాంబారు కూడా చేసుకోవడం లేదు తమిళ తంబీలు. ఇదీ ప్రస్తుతం తమిళనాడును వెంటాడుతున్న దుర్భర నీటి కష్టం. చెన్నైలో ఓవైపు నీటి ట్యాంకర్ల వద్ద నీటియుద్ధాలు జరుగుతుంటే.. మరోవైపు అధికార, విపక్ష పార్టీలు కత్తులు దూసుకుంటున్నాయి. నీటిఎద్దడిపై డీఎంకే ఆందోళన చేస్తుంటే.. ఏమంత ఎద్దడి లేదంటూ కొట్టిపారేస్తోంది అధికార అన్నాడీఎంకే. జలాశాయాలు అడుగంటిపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని.. పక్క రాష్ట్రాల నుంచి చైన్నై రావాల్సిన నీరు రావడం లేదని చెబుతోంది పళని సర్కార్. ప్రభుత్వ వైఫల్యంపై సాక్షాత్తు మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నీటి ఎద్దడి తీవ్రరూపం దాల్చే వరకు ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని తీవ్రంగా మందలించింది. అప్పటికి గాని సీఎం పళనిస్వామి పరిస్థితిపై మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేయలేదు. ప్రజల కష్టాలను చూసి చలించిన సూపర్ స్టార్ రజనీకాంత్ తన సొంత ఖర్చుతో నీటి ట్యాంకర్లను ఏర్పాటు చేసి.. ప్రజల దాహర్తిని తీర్చే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే తమిళనాడులో పరిస్థితి ఏవిధంగా ఉండో అర్థమవుతోంది. వాటర్ ట్యాంకర్ బుకింగ్.. సాధారణంగా చెన్నై నగరం నీటి పేరుచెబితే భయంతో వణుకుతుంది. ఎందుకంటే.. దేశంలో వరదల తాకిడికి ఎక్కువగా గురయ్యే నగరం అదే. కానీ, ఇప్పుడదే చెన్నై నీటి చుక్క కోసం తపిస్తోంది. తీవ్ర నీటి ఎద్దడితో తమిళ ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. కళ్లెదుట మహా సముద్రం కనిపిస్తున్నా.. కనీసం గొంతు తడుపుకోవడానికి గుక్కెడు నీళ్లు దొరక్క ప్రజలు విలవిలలాడుతున్నారు. స్నానాలు చేసి రెండు, మూడులు రోజులవుతున్నా భరిస్తున్న చెన్నై వాసులు.. మంచినీటి కోసం మాత్రం దాహం.. దాహం అంటూ తపిస్తున్నారు. పుజల్, పాండీతో సహా.. చెన్నై నగరానికి దాహార్తిని తీర్చే రిజర్వాయర్లన్నీ అడుగంటిపోయాయి. బోరుబావులు ఎండిపోయాయి. భూగర్భ జలాలు అడుగంటడంతో జనం ఆగచాట్లు పడుతున్నారు. నీటి ట్యాంకర్లు బుక్ చేసినా వస్తుందో లేదో తెలియని పరిస్థితి. నీళ్లు లేక హాస్టళ్లు, హోటళ్లు మూతపడుతున్నాయి. కొన్ని హాస్టళ్లలో కేవలం ఒక గంట పాటు మాత్రమే నీటిని సప్లై చేస్తున్నారు. ఆ గంటలోనే స్నానాలు, బట్టలు ఉతుక్కోవడం అన్నీ పూర్తికావాలి. లేదంటే అంతే. మరోవైపు నీళ్లు ఎక్కువగా వాడాల్సి రావడంతో.. తమకిష్టమైన సాంబారును కూడా వదులుకుంటున్నారు చెన్నై ప్రజలు. కొన్ని హోటళ్లలో సాంబారు వండటం లేదు. నీళ్లు లేక కొన్ని హోటళ్లను పూర్తిగా మూసేశారు. చెన్నై నగరవాసుల నీటి అవసరాలు తీర్చేందుకు ప్రతి రోజు 80 కోట్ల లీటర్ల నీరు అవసరం. అయితే ప్రభుత్వం ప్రతి రోజు 50 కోట్ల లీటర్ల నీటిని మాత్రమే సరఫరా చేస్తోంది. దీంతో నీటి కోసం చెన్నైవాసులు అష్టకష్టాలు పడుతున్నారు. ఐటీపై ఆంక్షలు.. ప్రైవేటు ట్యాంకర్ల వద్ద మహిళలు రోజంతా బారులు తీరుతున్నారు. ఉదయం 4 గంటలకు బయటకు వస్తే మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా తమ వంతు రావడం లేదని, కుటుంబానికి పది బిందెలకు మించి నీరు సరఫరా కావడం లేదని గృహిణులు ఆవేదిన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే, నీటి ఎద్దడిని ఎదుర్కోవడం కోసం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి రైలు ట్యాంకర్ల ద్వారా చెన్నైకి నీటిని తరలించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఒక్క చెన్నైలోనే కాదు.. తమిళనాడు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఇదే పరిస్థితి. బిందెడు నీళ్ల కోసం బావుల వద్ద మహిళలు కిలోమీటర్ల కొద్దీ క్యూ కడుతున్నారు. జనం నీటి అవసరాలను అవకాశంగా తీసుకుంటున్న కొందరు ట్యాంకర్ యజమానులు, బిందె నీటిని 50 రూపాయలకు అమ్ముతున్నారట. చాలీచాలని జీతాలతో జీవితాలను నెట్టుకొచ్చే కుటుంబాలు.. సాధారణ అవసరాలకు కూడా ప్రతీరోజూ నీళ్లను కొనుగోలు చేయాలంటే తమవల్ల కాదంటున్నారు. నీటి కొరతను దృష్టిలో పెట్టుకుని చెన్నైలోని ఐటీ కంపెనీలు తమ ఉద్యోగులకు ఆంక్షలు విధించాయి. కొన్ని సంస్థలు ఇంటి వద్దే పనిచేయమంటే, మరికొన్ని సంస్థలు భోజనం ఇంటి నుండే తెచ్చుకోమని సూచిస్తున్నాయి. రైళ్ల ద్వారా మంచినీటిని సరఫరా వేసవి వచ్చిందంటే నీటి కొరత గురించి గుర్తుకొస్తుంది. అంతకుముందు నీటి అవసరం పెద్దగా లేకపోవడం వల్ల నీళ్ల గురించి ఎవరికీ పట్టింపు వుండదు. వేసవిలో భూగర్భల జాలాలు అడుగంటినప్పుడు మళ్లీ నీటి గురించి వెతుక్కునే పరిస్థితులు, నీటి కటకటలు మొదలవుతాయి. ఇక ఎక్కడ చూసినా దాహార్తులే. గుక్కెడు మంచినీటికోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు. అందుబాటులో వున్న జలాలను సద్వినియోగం చేసుకోలేకపోవడం వల్ల తలెత్తే పరిణామాలివి. ప్రస్తుతం తమిళనాడు లాగే.. గతంలో మహారాష్ట్ర కూడా తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంది. 2016లో తీవ్ర కరువు తాండవించినప్పుడు మరఠ్వాడాలోని లాతూరు వంటి ప్రాంతాల్లో తాగడానికి కూడా మంచినీరు లభించలేదు. దీంతో రైళ్ల ద్వారా మంచినీటిని సరఫరా చేయాల్సివచ్చింది. మహారాష్ట్రలోని మొత్తం 358 తాలూకాల్లో సగానికిపైగా కరువు కోరల్లో మగ్గుతున్నాయి. ఈ తాలూకాల్లోని దాదాపు 30 వేల గ్రామాలు నీటి ఎద్దడితో అలమటిస్తున్నాయి. వందకు పైగా పల్లెలు నరకం చూస్తున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. మహారాష్ట్ర మాత్రమే కాదు.. రాజస్థాన్ వంటి రాష్ట్రాల్లో సైతం నీటి ఎద్దడి ఎక్కువగా వుంటోంది. ముఖ్యంగా మహానగరాల్లో ప్రతీ ఏటా నీటి ఎద్దడి పెరుగుతూనేవుంది. నగరాలన్నీ కాంక్రీట్ జంగిల్స్ గా మారిపోవడంతో.. వర్షపు నీరు నేల ఒడికి చేరడం లేదు. -
తమిళనాట చేతులు కలిపిన బీజేపీ, ఏఐఏడీఎంకే
-
తమిళనాట చేతులు కలిపిన బీజేపీ, ఏఐఏడీఎంకే
చెన్నై : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కలిసి పోటీచేస్తామని పాలక ఏఐఏడీఎంకే, బీజేపీ మంగళవారం అధికారికంగా ప్రకటించాయి. తమిళనాడు సీఎం పళనిస్వామి, డిప్యూటీ సీఎం పన్నీర్ సెల్వం, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌లు సంయుక్తంగా ఈ విషయం వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఐదు స్ధానాల్లో పోటీ చేస్తుందని తాము తమిళనాడు, పుదుచ్చేరిలో ఉమ్మడిగా బరిలో దిగుతామని పన్నీర్‌సెల్వం పేర్కొన్నారు. పొత్తుపై కేంద్ర మంత్రి, బీజేపీ సీనియర్ నేత పీయూష్ గోయల్ మాట్లాడుతూ తమిళనాడులోని 21 అసెంబ్లీ స్ధానాల ఉప ఎన్నికల్లో తాము ఏఐఏడీఎంకేకు మద్దతిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో పన్నీర్‌సెల్వం, పళనిస్వామి నాయకత్వంలో, కేంద్ర స్ధాయిలో నరేంద్ర మోదీ నాయకత్వంలో పనిచేసేందుకు తాము అంగీకరించామన్నారు. అంతకుముందు పీఎంకేతో పొత్తుపై ఏఐఏడీఎంకే ప్రకటించింది. ఆ పార్టీ ఏడు లోక్‌సభ స్ధానాల్లో పోటీ చేస్తుందని వెల్లడించింది. పీఎంకేకు ఓ రాజ్యసభ సీటు ఇచ్చేలా అంగీకారం కుదిరింది. అవగాహనలో భాగంగా తమిళనాడులో రానున్న 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జరిగే ఉప ఎన్నికల్లో ఏఐఏడీఎంకేకు పీఎంకే మద్దతు ప్రకటిస్తుంది. -
వంద కోట్ల జరిమానా
సాక్షి, చెన్నై: రాజధాని నగరంలోని బకింగ్‌హాం కాలువ, కూవం, అడయార్ నదులు కలుషితం కావడాన్ని జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ తీవ్రంగా పరిగణించింది. ఈ నదుల్లో పూడికతీత కరువు, దుర్గంధం వంటి అంశాలతో పాటు నిధులు కేటాయించినా పునరుద్ధరణ చర్యలు చేపట్టకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. తమిళనాడు ప్రభుత్వానికి రూ. వంద కోట్లు జరిమానా విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ట్రిబ్యునల్ ఉత్తర్వులపై అప్పీలుకు అధికార వర్గాలు సిద్ధం అవుతున్నాయి. చెన్నైలో బకింగ్ హాం కాలువ, కూవం, అడయార్ నదులు ఉన్నాయి. ఒకప్పుడు ఈ నదుల్లో స్వచ్ఛమైన నీళ్లు ప్రవహించేవి. పడవ సవారీ కూడా సాగేదని చెప్పవచ్చు. కాలక్రమేనా నగరాభివృద్ధితోపాటు స్వచ్ఛత కరువై మురికి నీటి మార్గంగా ఈ నదులు మారాయి. కూవం, అడయార్ నదీ పరివాహక ప్రదేశాలన్నీ ఆక్రమణలకు గురయ్యాయి. ఆ నదుల తీరంలోని పరిశ్రమలు, నివాస గృహాల నుంచి వెలువడే వ్యర్థాలతో, చెత్తా చెదారాలతో మురికి కూపంగా, అటువైపు వెళ్తే చాలు ముక్కు మూసుకోవాల్సినంత పరిస్థితి తప్పడం లేదు. కూవం ప్రక్షాళన, అడయార్‌కు మహర్దశ అంటూ పాలకులు ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. నిధుల్ని సైతం కేటాయిస్తున్నా, అందుకు తగ్గపనులు అడుగైనా ముందుకు సాగడం లేదు. అందుకే 2015లో చెన్నై భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పలేదు. కుండపోత వర్షం, పోటెత్తిన వరదలతో కూవం, అడయార్‌లు ఉప్పొంగి జనావాసాల మీదుగా దూసుకొచ్చాయి. అష్టకష్టాల్ని చెన్నై వాసులు ఎదుర్కోవాల్సి వచ్చింది. అయినా, పాలకులు గుణపాఠం నేర్వలేదు. వర్షాలు వస్తున్నాయంటే, హడావుడి సృష్టిం చడం, ఆతదుపరి యథారాజా తథా ప్రజా అన్నట్టుగా వ్యవహరించడం పరిపాటిగా మారింది. ట్రిబ్యునల్‌లో పిటిషన్.. కూవం, అడయార్, బకింగ్‌హాంల కలుషితంపై పర్యావరణ ట్రిబ్యునల్‌లో అనేక పిటిషన్లు విచారణలో ఉన్నాయి. వీటికి తోడు గత ఏడాది తిరువాన్మియూరుకు చెందిన జవహర్లాల్ షణ్ముగం దాఖలు చేసిన పిటిషన్‌ను ట్రిబ్యులన్ తీవ్రంగా పరిగణించింది. బకింగ్ హాం కాల్వలో అత్యధికంగా నిర్మాణ శకలాలు ఉన్నాయని, మట్టి, చెత్తాచెదారాలు పేరుకు పోయాయని, వర్షా కాలంలో నివాసాల వైపు వరదలు దూసుకొచ్చేంతగా పరిస్థితి ఉందని ఆ పిటిషన్లో జవహర్లాల్ వివరించారు. దీంతో ఇది వరకు దాఖలైన అన్ని పిటిషన్లను కలిపి జాతీయ పర్యావరణ ట్రిబ్యునల్ విచారించడం మొదలెట్టింది. ప్రభుత్వాన్ని వివరణ కూడా కోరింది. గతంలో బకింగ్ హాం కాలువ, కూవం, అడయార్‌ల ప్రక్షాళన పేరిట 1,646 కోట్లతో ప్రత్యేక పథకం, తొలి విడతగా రూ.604 కోట్ల కేటాయింపు వంటి అంశాల ప్రస్తావన ట్రిబ్యునల్ ముందుకు చేరింది. 2016లో చేపట్టిన చర్యలు, అలాగే, 13 పరిశ్రమలు, ఆ తీరం వెంబడి ఉన్న విద్యా సంస్థల నుంచి వెలుపలకు వస్తున్న మురికి అంతా కలిపి ఆ నదుల్ని పూర్తి స్థాయిలో కలుషితంకు కారణంగా తేల్చే రీతిలో నివేదికలు చేరాయి. వీటన్నింటిని పర్యావరణ ట్రిబ్యునల్ సమగ్రంగానే పరిశీలించినట్టుంది. శనివారం ఢిల్లీలో సాగిన విచారణ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వివరణతో కూడిన నివేదికను ట్రిబ్యునల్ పరిశీలించింది. అధికారుల నిర్లక్ష్యం అన్నది కొట్టచ్చినట్టు కనిపిస్తున్నదని, పాలకులు చర్యలు అసంతృప్తికరంగా ఉందని ట్రిబ్యునల్ వ్యాఖ్యానించింది. పర్యావరణ పరిరక్షణలో పూర్తిగా విఫలం అయ్యారని, కలుషితం కాబడ్డ నదుల్లో పూడిక తీత, వ్యర్థాల తొలగింపు అన్నది సక్రమంగా సాగలేదని, ప్రక్షాళన అన్నది ప్రకటకే పరిమితం కావడంతో తమిళనాడు ప్రభుత్వానికి రూ.వంద కోట్లు జరిమానా విధిస్తున్నట్టు ప్రకటించి మధ్యంతర ఉత్తర్వుల్ని ట్రిబ్యునల్ జారీ చేయడం గమనార్హం. కేంద్ర పర్యావరణ శాఖకు ఈ వంద కోట్ల జరిమానా చెల్లించాలని, ఈ మొత్తాన్ని పర్యావరణ పరిరక్షణ, అభివృద్ధి ఉపయోగించాలని ట్రిబ్యునల్ పేర్కొనడంతో పళని సర్కారుకు షాక్ తగిలినట్టు అయింది. దీంతో సోమవారం పర్యావరణశాఖ, ప్రజా పను లశాఖ వర్గాలతో సీఎం పళనిస్వామి సమాలోచనకు నిర్ణయించినట్టు సమాచారం. ఇందులో తీసుకునే నిర్ణయం మేరకు అప్పీలు ప్రయత్నాలు చేపట్టబోతున్నారు.