Pooja equipment
-
అమ్మవారికి శఠగోపం
బాసర : ‘లక్ష్మీ కొందరిది.. సరస్వతీ దేవి అందరిదీ’ అన్న నానుడిని బాసరలోని వ్యాపారులు రుజువు చేస్తున్నారు. సరస్వతీ దేవి అమ్మవారి ఆశీస్సులతో బుద్ధి జ్ఞానం వస్తుందనుకుంటే.. ఈ వ్యాపారులకు మాత్రం ధనలక్ష్మీ కటాక్షం ‘లాభి’స్తోంది. అమ్మవారి పేరిట ఏటా అరకోటి శఠగోపం పెడుతున్నా.. ఆలయాధికారులు పట్టించుకున్న దాఖ లాలు లేవు. బడావ్యాపార వేత్తలు బినామీ పేర్లతో ఆలయ టెండర్లలో పాల్గొని ఎనిమిదేళ్లుగా షాపులు నిర్వహిస్తున్న వైనంపై సాక్షి కథనం.. బాసర : తెలంగాణ రాష్ర్టంలోనే పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసరలో కొలువుదీరిన శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారి క్షేత్రం దినదినం అభివృద్ధి చెందుతోంది. అమ్మవారికి మొక్కులు సమర్పించడానికి ఏటా ఇక్కడికి మన రాష్ట్రంతోపాటే ఇతర రాష్ట్రాల నుంచే కాకుండా దేశవిదేశాల నుంచి వస్తుంటారు. అమ్మవారి చెంత చిన్నారులకు అక్షర శ్రీకార పూజలు జరిపిస్తే విద్యావంతులు అవుతారని వారి నమ్మకం. ఇందులోభాగంగానే.. భక్తులకు పూజా సామగ్రి తదితర వస్తువులను అందుబాటులో ఉండాలని దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణంలో దుకాణ సముదాయం ఏర్పాటు చేసింది. ఏటా ఆలయాధికారులు ఈ దుకాణాలకు బహిరంగ వేలం పాట నిర్వహిస్తుంటారు. ఆలయ పరిధిలోని దుకాణాలు, పువ్వుల విక్రయాలు, అమ్మవారి చీరెలు, కుంకుమార్చన, పూజా సామగ్రి, కూల్‌డ్రింక్స్, జ్యూస్ సెంటర్లు, హోటళ్లు, కొబ్బరి చిప్పలు పోగు చేసుకోవడం, వెహికిల్ పార్కింగ్ సదుపాయం, పాదరక్షలు భద్రపరచడం, భక్తుల సామగ్రి భద్రపరిచేందుకు లాకర్లు, గోదావరి నది తీరాన పువ్వుల దుకాణాలకు సంబంధించి ఏటా బహిరంగ వేలం పాట నిర్వహిస్తారు. టెండర్లలో ఎవరైనా పాల్గొనే అవకాశం ఉంది. అయితే.. ఎనిమిదేళ్లుగా బడా, చోట వ్యాపారులు అధికారులతో కుమ్మక్కై సుమారు అరకోటికి పైగా ఆదాయానికి గండికొట్టారు. ఏం జరిగిందంటే..! దుకాణాల సముదాయం కోసం వచ్చే వ్యాపారులకు బహిరంగ వేలం పాటలో పాల్గొనే ముందు ఆలయ అధికారులు దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిబంధనలను ముందుగా వినిపిస్తారు. ఓ దుకానాన్ని టెండర్ నిర్వహించిన తర్వాత వచ్చే ఏడాది 30 శాతం కంటే ఎక్కువ ధరకు వేలం పాట పాడిన వారికే దుకాణాలను అనుమతిస్తారు. వేలం పాటలో కొంత మొత్తాన్ని చెల్లించి మిగతా మొత్తాన్ని ఏదైనా జాతీయ గుర్తింపు పొందిన బ్యాంకు నుంచి గ్యారెంటీ ఇవ్వాలి. కానీ.. ఇక్కడ అలా జరగడం లేదు. 2005లో పువ్వుల దుకాణానికి ఆలయ అధికారులు వేలం పాట నిర్వహించగా.. రూ.10 లక్షలకు ఓ వ్యాపారి దక్కించుకున్నాడు. అనంతరం 2009లో అదే పువ్వుల దుకాణాన్ని అదే వ్యాపారికి రూ.4 లక్షల 75 వేలకు అంటగట్టారు ఆలయాధికారులు. దీంతో రూ.5 లక్షల 25 వేల వరకు నష్టం వాటిల్లింది. సదరు వ్యాపారి ఆ డబ్బులను కూడా పూర్తిస్థాయిలో చెల్లించకపోగా.. 2010లో బినామీ పేర్లతో తన అనుచరులతో రూ.11 లక్షల 81 వేలకు దక్కించుకున్నాడు. ఈ పువ్వుల దుకాణానికి సంబంధించే ఇలా ఉంటే.. మిగతా 50 దుకాణాల వేలం పాట ఎలా నడుస్తోందో అర్థం చేసుకోవచ్చు. అధికారుల చర్యలేవీ.. బహిరంగం వేలం పాటలో పాల్గొన్న వ్యాపారులకు ఆలయ అధికారుల అండదండలు ఉండడంతో ఇప్పటి వరకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదు. డబ్బులు పూర్తిస్థాయిలో చెల్లించకపోయినా పదేపదే ఆ వ్యాపారులకే కేటాయించి విమర్శలకు తావిస్తోంది. 2006-07 సంవత్సరానికి సంబంధించి అన్ని దుకాణాలకు వేలం పాట నిర్వహించగా.. రూ.8 లక్షల 58 వేల 532 ఇంకా చెల్లించాల్సి ఉంది. 2007-08లో రూ.7 లక్షల 25 వేల 220, 2008-09లో రూ.18 లక్షల 52 వేల 25, 2009-10లో ఆగస్టు వరకు రూ. 30 లక్షల 32 వేల 525 బకాయిలున్నాయి. మొత్తంగా రూ.64 లక్షల 68 వేల 302 వరకు వ్యాపారులు చెల్లించాల్సి ఉంది. అలాగే 2010-11 వరకు రూ.11 లక్షల 94 వేల 135, 2011-12 రూ.9 లక్షల 48 వేల 501, 2012 సంవత్సరానికి సంబంధించి రూ.11లక్షల 60 వేలు రావాల్సి ఉంది. ఇప్పటి వరకు ఆలయాధికారులు టెండర్‌దారులకు దుకాణాల ఆదాయాలపై ఇప్పటివరకు రికవరీ కూడా చేయలేదు. దేవాదాయ శాఖ నిబంధనలు కఠినంగా ఉన్నా.. అధికారుల వైఖరితో ఆలయ ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఇప్పటికైనా దేవాదాయ శాఖ కమిషనర్ దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చర్యలు తీసుకుంటున్నాం.. - ముత్యాలరావు, ఆలయ ఈవో వేలం పాట నిర్వహించిన దుకాణాల సముదాయానికి సంబంధించి బకాయిలు ఎనిమిదేళ్లుగా సుమారు అరకోటికి పైగా రావాల్సి ఉన్న మాట వాస్తవమే. వ్యాపారులకు ఇప్పటికే రెండు మూడు సార్లు నోటీసులు జారీ చేశాం. దేవాదాయ, ధర్మాదాయ శాఖ నిబంధనల ప్రకారం రెండు రోజుల్లో కోర్టు నుంచి ఆదేశాలు తీసుకుని వ్యాపారులకు నోటీసులు జారీ చేస్తాం. -
స్వామీ ఇదేం ధర !
కాణిపాకంలో కాంట్రాక్టర్ల శఠగోపం భక్తుల జేబులకు భారీగా చిల్లులు పూజాసామగ్రి అమ్మకాల్లో మోసాలు కాణిపాకం వినాయక స్వామి భక్తులకు కాంట్రాక్టర్లు టెండర్ పెట్టేశారు. పూజాసామగ్రి కోసం దుకాణాల వద్దకెళితే చాలు.. భక్తుల జేబులు ఖాళీ కావాల్సిందే. నిమ్మకాయ ఎనిమిది, టెంకాయ 30 రూపాయలకు పైగా విక్రయిస్తున్నారు. టెండర్లిచ్చిన ఆలయాధికారులు ఆయా షాపుల వద్ద ధరల పట్టికలను ఏర్పాటు చేయలేదు. ఇదే అదునుగా కాంట్రాక్టర్లు రెచ్చిపోతున్నారు. అందినకాడికి దోచుకుని భక్తులకు కుచ్చుటోపీ పెట్టేస్తున్నారు. పూజా సామగ్రిపైనే ఒక రోజుకు భక్తుల నుంచి 88 వేల రూపాయలకు పైగా అదనంగా వసూలు చేస్తున్నారంటే ఇక్కడ దోపిడీ ఏ స్థాయిలో సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. ఇంత జరుగుతున్నా ఏ ఒక్క అధికారీ ఆ దుకాణాల వైపు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం. ఐరాల: కాణిపాకం వరసిద్ధి వినాయకుడిని కనులారా చూసి తరించాలని భక్తులు ఆశపడుతుం టారు. అందుకే నిత్యం రాష్ట్రం నుంచేగాక ఇతర రాష్ట్రాల నుంచీ పెద్దఎత్తున తరలివస్తుంటారు. వీరు స్వామిని దర్శించుకునే ముందు ఆలయం వద్ద ఏర్పాటు చేసిన దుకాణాల్లో పూజా సామ గ్రి కొనుగోలు చేస్తుంటారు. ఇక్కడ అధిక ధరలకు విక్రయిస్తూ భక్తుల జేబులు ఖాళీ చేయడం దుకాణదారులకు రివాజుగా మారింది. ఎలా దోచేస్తున్నారంటే.. ఆలయానికి వివిధ ప్రాంతాల నుంచి రోజుకు పదివేల నుంచి 12వేల మంది భక్తులు వస్తుం టారు. పూజాసామగ్రి విక్రయించేందుకు ఆలయం వద్ద రెండు షాపులున్నాయి. వీటిని కాంట్రాక్లర్లు రూ.25 లక్షలకు వేలంపాటలో దక్కించుకున్నారు. ఆలయం తరపున పూజా సామగ్రి ఇవ్వకపోవడంతో భక్తులందరూ ఇక్క డే కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇదే అదనుగా స్థానిక కాంట్రాక్టర్లు ధరలను విపరీతంగా పెంచేశారు. కొబ్బరికాయ బయట మార్కెట్లో రూ.7 నుంచి రూ.15 వరకు ఉంటోంది. రోజుకు ఐదు వేల మంది భక్తులు కొబ్బరికాయలు కొనుగోలు చేస్తుంటారు. బయట మార్కెట్లో సైజును బట్టి ఒక్కో కొబ్బరికాయ ధర రూ.7 నుంచి రూ.15 ఉండగా ఇక్కడ మాత్రం ఏకంగా రూ.25 నుంచి రూ.30 వసూలు చేస్తున్నారు. ఈ లెక్కన ఒక్కో కొబ్బరికాయ రూ.30 లెక్కన వేసుకున్నా భక్తులు రూ.1,50,000 వెచ్చించాల్సి వస్తోంది. ఇందులో రోజుకు అదనంగా రూ.75,000 దుకాణదారులకు సమర్పించుకోవాల్సి వస్తోంది. ఇక కొత్త వాహనాలు కొనుగోలు చేసేవారు ఇక్కడే పూజలు చేస్తుం టారు. వినాయకుని వద్ద పూజ చేస్తే శుభం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి సైతం ఇక్కడికి పెద్ద ఎత్తున వస్తుంటారు. ఇలా రోజుకు కనీసం 600 నుంచి వెయ్యి మంది వస్తుంటారు. వీరంతా తమ వాహనాల కోసం నిమ్మకాయలు, గుమ్మడికాయలు కొనుగోలు చేస్తుంటారు. ఇదే అదనుగా ఇక్కడ ఒక్కో నిమ్మకాయ రూ.8, గుమ్మడికాయ కిలో రూ.10 లెక్కన విక్రరుుస్తున్నారు. బయట మార్కెట్లో ఒక్కో నిమ్మకాయ రూ.2, గుమ్మడికాయ కిలో రూ.5 లెక్కన లభిస్తుంది. కానీ ఇక్కడి ధరల వల్ల భక్తులు నిమ్మకాయల కోసం రూ.4,800 నుంచి రూ.8000 వరకు వెచ్చిస్తున్నారు. ఈ లెక్కన బయట మార్కెట్‌కన్నా అదనంగా రూ.3,600 నుంచి రూ.6000 వరకు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. ఇక గుమ్మడికాయలకు అదనంగా రూ.5000 వెచ్చిస్తున్నారు. ఇలా రోజుకు భక్తులు అదనంగా రోజుకు రూ.8,8000 వరకు ధారబోసుకోవాల్సి వస్తోంది. ఈ విధానాన్ని ఎందుకు ఎత్తేశారో.. గత ఏడాది అక్టోబర్ నుంచి పూజా సామగ్రిని ఆలయం తరపునే విక్రయించేవారు. ఇందులో ఒక టెంకాయ, పూలదండ, 8 నిమ్మకాయలు కలిపి రూ.200కు విక్రయించేవారు. ఈ ఏడాది నవంబర్ నుంచి దానికి స్వస్తి చెప్పి కాంట్రాక్టర్లకు అప్పగించారు. వీరు ఇదే సెట్‌ను రూ.500 నుంచి రూ.600 వరకు ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. ధరల బోర్డులు ఏర్పాటు చేయిస్తాం కాణిపాకం ఆలయం వద్ద టెండర్లు దక్కించుకున్న వారు తప్పనిసరిగా నియమనిబంధనలు పాటించాలి. అలా పాటించని వారిపై భక్తులు ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటాం. ప్రతిచోటా ధరలు సూచించే బోర్డులు ఏర్పాటు చేయిస్తాం. -పూర్ణచంద్రరావు, ఈవో, కాణిపాకం -
పాలుపోవట్లే..
కనిపించనినాగులచవితి సందడి కనుమరుగైన పుట్టలు దొరకని పూజా సామగ్రి ‘హుదూద్’ దెబ్బకు కళ తప్పిన మార్కెట్లు సాక్షి, విశాఖపట్నం: హుదూద్ ప్రభావం నాగుల చవితిపై కూడా పడింది. తుపాను దెబ్బ నుంచి జిల్లా వాసులు ఇంకా తేరుకోలేదు. కార్తీక మొదటి సోమవారంనాడు ఈ పండగ కావడంతో ముఖ్యంగా మహిళలు ఆదివారం సాయంత్రమే సామాన్లు సిద్ధం చేసుకుంటారు. పూజాసామగ్రి కొనుగోలుదారులతో మార్కెట్లు కళకళలాడుతాయి. కానీ ఈ సారి ఆ సందడి ఎక్కడా కనబడలేదు. అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం, చోడవరం వంటి పట్టణాల్లోనూ మార్కెట్లు వెలవెలబోయాయి. ఈ పండగ పట్ల జనం పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. రోజుకో చోట వెలుస్తున్న రియ ల్ ఎస్టేట్ వెంచర్ల పుణ్యమా అని పల్లెల్లో పుట్టలు కనుమరుగవుతున్నాయి. ఇప్పటికే పట్టణ ప్రాంతంలో కృత్రిమ పుట్టలకు పూజలు చేసే దుస్థితి ఏర్పడింది. ఇటీవల వచ్చిన హుదూద్ తుపాను కారణంగా వేలాది చెట్లు కూలిపోయాయి. వాటి కింద పడి పుట్టలు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో సంప్రదాయాన్ని కొనసాగించే పరిస్థితులు కానరావడం లేదు. అందుబాటులో లేని పూజా సామగ్రి నాగుల చవితికి కావాల్సిన పూజ సామగ్రి సైతం మా ర్కెట్లో అందుబాటులో లేదు. సాధారణంగా పుట్ట లో పాలు పోయడానికి వెళ్లేటప్పుడు చలివిడి, చిమ్నీ లు, అరటి పళ్లు, పాలు, చెరుకుగడ, కొబ్బరికాయ లు, బుర్రగుంజు, కోడిగుడ్లు, కమల, బత్తాయి తొన లు, గళ్ల తువ్వాలు తీసుకువెళుతుంటారు. సాధారణ రోజుల్లో అయితే ఇవన్నీ దొరికేవి. కొన్ని ఇంటి వద్దే తయారు చేసుకునేవారు. అలా కుదరకపోయినా ప్ర ముఖ స్వీట్ దుకాణాల్లో చిమ్మీ, చలివిడి విక్రయించేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు. చలివిడి పిండి, చిమ్నీ ఆడేందుకు పిండిమరలు విద్యుత్ సరఫరా లేక మూలనపడ్డాయి. బుర్రగుంజు(ఎండిన తాటిపండులో ఉండే గుజ్జు)తేగల పాతర నుంచి వచ్చేది. ప్రస్తుతం అలాంటి పాతరలే ఎక్కడాలేవు. చెరుకుతోటలు పడిపోవడంతో చెరకు ముక్కలు కూడా లేవు. దీంతో అక్కడక్కడా రైతు బజార్లలో మినహా మార్కెట్లలో ఎక్కడా నాగులచవితికి సంబంధించిన పూజ సామగ్రి, ఇతర వస్తువులు దొరకడం లేదు. టపాసులు కాల్చకుండా కేవలం దీపాలతో దీపావళి జరుపుకున్న నగరవాసులు ఇప్పుడు పాల తో నాగులచవితి జరుపుకోవడం కూడా కష్టంగా మారింది.