ఈ పెళ్లి ఫోటోలను చూస్తే.. మీరు ఇలాగే ప్రయత్నిస్తారు!
సాధారణంగా వివాహానికి ముందు, వివాహ సమయంలో జంటలు ఫోటోలు దిగుతుంటారు. వాటిని తీసే ఫోటోగ్రాఫర్లు కొన్ని స్టాండ్లు, లైట్లను ఉపయోగించి తీస్తుండటం చూసుంటారు. కానీ, ఫోటోలను తీయడం కోసం చిత్ర విచిత్రమైన పొజిషన్లను మారుస్తూ కొంతమంది ఫోటోగ్రాఫర్లు ఓ జంటకు చేసిన ప్రీ వెడ్డింగ్ షూట్ ఫోటోలు ప్రస్తుతం ఆన్ లైన్ లో వైరల్ అయ్యాయి.
రోజూ కనిపించే సాధారణ ప్రాంతాల్లోనే ఎక్కువశాతం ఫోటోలు తీసిన వీరి ఆలోచనల్లోని సృజనాత్మకత ఫోటోలు వచ్చిన తర్వాత బయటపడింది. దాదాపు ప్రకృతిలోని అన్ని వనరులను వాడుకుంటూ చేసిన ఈ ప్రీ వెడ్డింగ్ షూట్ ఫోటోలను ఒకసారి తిలకించారంటే మీకు కూడా ఇలానే షూట్ చేయాలనిపించక మానదు.