Presidents Police Medal
-
తెలంగాణకు 2 విశిష్ట సేవా పతకాలు
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉత్తమ సేవలందించిన పోలీసు అధికారులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రకటించింది. తెలంగాణకు రెండు రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలు, 12 పోలీసు ప్రతిభా పతకాలు లభించాయి. హైదరాబాద్ అదనపు సీపీ శిఖా గోయల్, నిజామాబాద్ ఐజీ శివశంకర్‌రెడ్డి రాష్ట్రపతి పోలీసు విశిష్ట సేవా పతకాలను దక్కించుకున్నారు. ఇక ప్రతిభా పతకాలకు రాజేశ్ కుమార్ (ఐజీ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్, హైదరాబాద్), షరీపుద్దీన్ సిద్దిఖీ (కమాండెంట్, టీఎస్ఎస్ఎస్పీ బెటాలియన్ హైదరాబాద్), కందుకూరి నర్సింగరావు (డీఎస్పీ, నిర్మల్), సూర్యనారాయణ సోమగాని (డీఎస్పీ, ఏసీబీ రంగారెడ్డి), గోవర్ధన్ తన్నీరు (ఏసీపీ, హైదరాబాద్), గుంజ రమేశ్(డిప్యూటీ అసల్ట్ కమాండర్, గ్రేహౌండ్స్), ఎం.ఉద్ధవ్ (కానిస్టేబుల్, టీఎస్ఎస్ఎస్పీ 13వ బెటాలియన్, మంచిర్యాల), బృంగి గోవర్దన్ (సబ్ఇన్స్పెక్టర్, ఇంటెలిజెన్స్ హైదరాబాద్), కొత్తపల్లి కరుణాకర్ రెడ్డి (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, సీసీఎస్, షీ టీం), భట్టురాజు మోహన్‌రాజు (అసిస్టెంట్ రిజర్వ్ సబ్ ఇన్స్పెక్టర్, టీఎస్ఎస్ఎస్పీ 13వ బెటాలియన్, మంచిర్యాల), దేవులపల్లి మోహన్‌రెడ్డి (కానిస్టేబుల్, ఇంటెలిజెన్స్, మహమ్మద్ నయీముద్దీన్(కానిస్టేబుల్, ఇంటెలిజెన్స్) కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. అత్యుత్తమ సేవా పురస్కారానికి..: ఇటు తెలంగాణలోని జైళ్ల శాఖలో పనిచేస్తున్న చీఫ్ హెడ్ వార్డర్లు అయిన వి.చంద్రయ్య, గడ్డం సోమశేఖరరెడ్డి, జి.దైనమ్మలు ఖైదీల్లో సత్ప్రవర్తనకు దోహదపడినందుకు గానూ అత్యుత్తమ సేవా పురస్కారానికి ఎంపికయ్యారు. ఇద్దరికి ఫైర్ సర్వీస్ ప్రతిభా పురస్కారాలు..: దేశవ్యాప్తంగా 73 మందికి ఫైర్ సర్వీస్ మెడల్స్‌ను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఇందులో రాష్ట్రపతి ఫైర్ సర్వీస్ శౌర్య పతకాన్ని 8 మందికి, ఫైర్ సర్వీస్ శౌర్య పతకాన్ని ఇద్దరికి ప్రకటించింది. అలాగే రాష్ట్రపతి ఫైర్ సర్వీస్ విశిష్ట సేవా పురస్కారాన్ని 13 మందికి, ఫైర్ సర్వీస్ ప్రతిభా పురస్కరాన్ని 50 మందికి ప్రకటించింది. కాగా ఫైర్ సర్వీస్ ప్రతిభా పురస్కారాలకు రాష్ట్రంలోని యజ్ఞనారాయణ అన్నపురెడ్డి (డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్), కట్ట జగదీశ్వర్ (లీడింగ్ ఫైర్‌మ్యాన్ ) లు ఎంపికయ్యారు. రాష్ట్ర పరిధిలో ఇతర బలగాల్లో పనిచేస్తున్న అధికారులకు..: బి.వెంకట్‌రెడ్డి (డిప్యూటీ కమాండెంట్, సీఆర్పీఎఫ్ ఎస్ఎస్ హెడ్‌క్వార్టర్స్, హైదరాబాద్), మొలుగు రాజా (సీఆర్పీఎఫ్, జీసీ రంగారెడ్డిలో ఇన్స్పెక్టర్), పుల్లల చెరువు నారాయణ (అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్, ఎన్ఎఫ్సీ యూనిట్, సీఐఎస్ఎఫ్ హైదరాబాద్), జైపాల్‌రెడ్డి (జేఐఓ–1, ఎంహెచ్ఓ, హైదరాబాద్ యూనిట్), టీవీ రాజేశ్ (డీఎస్పీ, ఎన్ఐఎ హైదరాబాద్), సత్వీర్ సింగ్ (డిప్యూటీ కమాండెంట్, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ), సెందమంగళం రామస్వామి గాంధీ (సీనియర్ డివిజనల్ సెక్యూరిటీ కమిషనర్, రైల్వే శాఖ), కరుణానిధి మధుసూధన్ (ఇన్స్పెక్టర్, ఆర్పీఎఫ్, ఖమ్మం), ఎస్.పవన్ సింగ్ (ఇన్స్పెక్టర్, రైల్ నిలయం, సికింద్రాబాద్)లకు పోలీస్ ప్రతిభా పురస్కారాలు వరించాయి. జమ్మికుంట సీఐకి ‘ఉత్తమ్ జీవన్ రక్ష’ జీవన్ రక్ష పతకాల ప్రదానానికి రాష్ట్రపతి ఆమోదం.. సాక్షి, న్యూఢిల్లీ: సాటి మనుషుల ప్రాణాలను కాపాడేందుకు చేసిన కృషికి గుర్తింపుగా కేంద్రం ఇచ్చే జీవన్ రక్ష పతకాల ప్రదానానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆమోదముద్ర వేశారు. ఇందులో ఉత్తమ్ జీవన్ రక్ష పతకానికి ఎంపికైన వారిలో తెలంగాణకు చెందిన సీఐ కోరిపల్లి సృజన్‌రెడ్డి కూడా ఉన్నారు.. సర్వోత్తమ్ జీవన్ రక్ష పతకం, ఉత్తమ్ జీవన్ రక్ష పతకం, జీవన్ రక్ష పతకం విభాగాల్లో కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రదానం చేస్తోంది. 2020 సంవత్సరానికిగాను దేశవ్యాప్తంగా మొత్తం 40 మందిని ఈ పతకాలకు ఎంపిక చేశారు. సర్వోత్తమ్ జీవన్ రక్ష పతకాన్ని ఒకరు, ఉత్తమ్ జీవన్ రక్ష పతకాన్ని 8 మంది, జీవన్ రక్ష పతకాన్ని 31 మంది అందుకోనున్నారు. వీరిలో కేరళకు చెందిన ముహమ్మద్ హుష్రీన్ (మరణానంతర)కు సర్వోత్తమ్ జీవన్ రక్ష పతకాన్ని కేంద్రం ప్రకటించింది. సీఐ కోరిపల్లి సృజన్‌రెడ్డి ఇద్దరిని కాపాడినందుకు..: ఇక 2019 మే 28న కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం మడిపల్లిలో చేద బావి పూడిక కోసం బావిలోకి దిగి స్పృహ కోల్పోయిన ఇద్దరు గ్రామస్తులను జమ్మికుంట టౌన్ సీఐ సృజన్‌రెడ్డి కాపాడారు. ఘటనపై సత్వరమే స్పందించిన ఆయన బావిలోకి దిగి అగ్నిమాపక సిబ్బంది సాయంతో వారిని రక్షించారు. దీనిని గుర్తించిన కేంద్రం సృజన్‌రెడ్డిని 2020 సంవత్సరానికి గాను ఉత్తమ్ జీవన్ రక్ష పతకానికి ఎంపిక చేసింది. -
కేంద్ర పోలీసు అవార్డులకు రాష్ట్ర జాబితా
సాక్షి, హైదరాబాద్: ప్రతి ఏటా ఇచ్చే ఇండియన్ పోలీస్ మెడల్ (ఐపీఎం), రాష్ట్రపతి పోలీస్ మెడల్ (పీపీఎం) అవార్డులకు సంబంధించి 24 మంది పోలీసు అధికారులతో కూడిన జాబితాను రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపించింది. ఎంపికైన అధికారులకు గణతంత్ర దినోత్సవం సందర్భంగా అవార్డులను అందజేస్తారు. ఐపీఎం కేటగిరిలో పోలీసు అధికారులను, పీపీఎం కేటగిరిలో 8 మంది పోలీసు అధికారుల పేర్లను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదిస్తూ జాబితా పంపించింది. ఇందుకు సంబంధించి ఐపీఎం కేటగిరిలోని ముగ్గురు అధికారులు, పీపీఎం కేటగిరిలో ఐదుగురికి సంబంధించిన వార్షిక రహస్య నివేదిక (ఏసీఆర్) ను పంపింది. మిగతా వారికి సంబంధించిన ఏసీఆర్ను కూడా త్వరలో పంపనుంది. రెండు విభాగాల్లో కలిపి 8 మంది ఐపీఎస్ అధికారులు ఉన్నారు. ఇండియన్ పోలీస్ మెడల్స్ (ఐపీఎం) కోసం కేంద్రానికి పంపిన పేర్లు 1.ఎం.స్టీఫెన్ రవీంద్ర, ఐపీఎస్, డీఐజీ గ్రేహౌండ్స్, హైదరాబాద్ 2. సి.రవి వర్మ, ఐపీఎస్, డీఐజీ, సైబర్ క్రైం సీఐడీ 3. ఎంకె సింగ్, ఐపీఎస్, ఐజీ (లా అండ్ ఆర్డర్) 4. పి.రవీందర్‌రెడ్డి, అడిషనల్ ఎస్పీ, మెదక్ 5. మేకల భీంరావు, డీఎస్పీ, పీటీసీ, కరీంనగర్ 6. కొట్టం శ్యాం సుందర్, డీఎస్పీ, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ 7. కటకం మురళీధర్, డీఎస్పీ, సీఐ సెల్, ఇంటెలిజెన్స్ 8. కె.శ్రీనివాసరావు, ఇన్స్పెక్టర్, ఎస్ఐబీ, ఇంటెలిజెన్స్ 9. వి.శ్యాంబాబు, ఇన్స్పెక్టర్, సీసీఎస్, హైదరాబాద్ 10. పి.రవీందర్, ఎస్ఐ డీఎస్బీ, నిజామాబాద్ 11. యండమూరి వాలి బాబ, ఎస్ఐ, జీడీకె-2, కరీంనగర్ 12. ఎన్.మారుతి రావు, ఎస్ఐ, ఎస్ సెల్, ఇంటెలిజెన్స్ 13. మహ్మద్ జాఫర్, ఎస్ఐ, సీఐ సెల్, ఇంటెలిజెన్స్ 14. డి.కిషన్ జీ, ఏఆర్ ఎస్ఐ, కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ 15. ఎ.వెంకటేశ్వర్‌రెడ్డి, ఏఆర్ ఎస్ఐ, మహబూబ్‌నగర్ 16. షేక్ అబ్దుల్లా, హెడ్‌కానిస్టేబుల్, ఆమన్‌గల్, మహబూబ్‌నగర్ ప్రెసిడెంట్ పోలీసు మెడల్స్ (పీపీఎం) కోసం పంపిన పేర్లు 1. ఎం.గోపికృష్ణ, ఐపీఎస్, అడిషనల్ డీజీపీ, పోలీస్ సంస్కరణలు 2. అంజని కుమార్, ఐపీఎస్, ఏసీపీ హైదరాబాద్ 3. ఎన్.సూర్యనారాయణ, ఐపీఎస్, డెరైక్టర్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ 4. ఎం.శివప్రసాద్, ఐపీఎస్, జాయింట్ కమిషనర్, సీఏఆర్ హెడ్‌క్వార్టర్ 5. టి.వి.శశిధర్‌రెడ్డి, ఐపీఎస్, జాయింట్ కమిషనర్, సైబరాబాద్ 6. యు. రామ్మోహన్, అడిషనల్ ఎస్పీ, సైబర్ క్రైం, సీఐడీ 7. జె.దేవేందర్‌రెడ్డి, డీఎస్పీ, ఇంటెలిజెన్స్ 8. జె.అమరేందర్‌రెడ్డి, జాయింట్ సీపీ, కోఆర్డినేషన్, హైదరాబాద్ -
సీపీకి రాష్ట్రపతి పోలీసు మెడల్
విజయవాడ సిటీ : నగర పోలీసు కమిషనర్ ఎ.బి.వెంకటేశ్వరరావుకు రాష్ట్రపతి పోలీసు మెడల్ (పీఎం) ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన న్యూఢిల్లీలో జరిగే గణతంత్ర దిన వేడుకల్లో రాష్ట్రపతి నుంచి ఈ మెడల్ అందుకుంటారు. గతంలో ఆయన ఇండియన్ పోలీసు మెడల్ (ఐపీఎం), యాంత్రిక్ సురక్ష అవార్డుసహా అనేక రివార్డులు పొందారు. విధి నిర్వహణలో నిజాయితీగా, ముక్కుసూటిగా వ్యవహరించే వెంకటేశ్వరరావు దిగువ స్థాయి సిబ్బందితోస్నేహపూర్వకంగా ఉంటారు. తరచూ వారి సాధకబాధకాలు వింటూ విధి నిర్వహణలో అవసరమైన సలహాలు, సూచనలు అందజేస్తారు. ఇదీ నేపథ్యం.. నూజివీడు సమీపంలోని ముక్కొల్లుపాడు గ్రామానికి చెందిన ఉపాధ్యాయ కుటుంబంలో 1960లో జన్మించిన ఎ.బి.వెంకటేశ్వరరావు ప్రాథమిక, మాధ్యమిక విద్యను నూజివీడులో పూర్తిచేశారు. సివిల్ ఇంజినీరింగ్‌లో ఎంటెక్ చేసిన ఆయన ఆర్థికశాస్త్రంలోనూ పట్టభద్రులు. 1989లో ఐపీఎస్‌కు ఎంపికైన తర్వాత తూర్పుగోదావరి సహా పలు జిల్లాల్లో ఎస్పీగాను, 2003-04లో డీఐజీ హోదాలో విజయవాడ పోలీసు కమిషనర్‌గా పనిచేశారు. హైదరాబాదులో పలు కీలక విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించిన వెంకటేశ్వరరావు ఇటీవలి కాలం వరకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) అదనపు డీజీగా పనిచేశారు. ఈ నెల ఆరో తేదీన జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో అదనపు డీజీ హోదాలో రెండోసారి సీపీగా వచ్చారు. రాష్ట్రపతి పోలీసు మెడల్ ప్రకటించడంతో పలువురు అధికారులు సీపీని కలిసి అభినందనలు తెలిపారు.