Private medical hospitals
-
కొత్తగా 3,350 పడకలు
సాక్షి, హైదరాబాద్ : ప్రైవేట్ మెడికల్ బోధన ఆసుపత్రులన్నింటినీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. 22 ప్రైవేటు మెడికల్ కాలేజీలు, వాటికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రులు (ఒకట్రెండు మినహా) సోమవారం నుంచి కరోనా బాధితుల సేవల్లో భాగస్వామ్యం కానున్నాయి. ఇప్పటికే ఆయా మెడికల్ కాలేజీ యాజమాన్యాలతో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ప్రైవేటు బోధనాసుపత్రుల్లో ఉన్న 3,350 పడకలు, 236 ఐసీయూ పడకలు, 80 వెంటిలేటర్లు పూర్తిగా కరోనా బాధితుల కోసమే వినియోగిస్తారు. ప్రస్తుతం ఆయా బోధనాసుపత్రుల్లో ఉన్న రోగులను ప్రత్యామ్నాయ ఆసుపత్రులకు తరలించారు. కొన్ని ప్రైవేటు మెడికల్ కాలేజీలకు రెండు మూడు అనుబంధ ఆసుపత్రులున్నాయి. వాటిలో ఒక దానిలోకి రోగులను తరలించారు. కొన్ని కాలేజీలకు ఒకటి చొప్పున మాత్రమే అనుబంధ ఆసుపత్రులున్నాయి. అలాంటిచోట్ల ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న సమీప జిల్లా ఆసుపత్రులకు రోగులను తరలిస్తున్నారు. కరోనా బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. కరోనా మూడో దశకు చేరుకుంటే కేసులు మరింత పెరిగే అవకాశాలున్నాయి. దీంతో ముందు జాగ్రత్తగా సర్కారు వీటిని స్వాధీనం చేసుకుంది. ఉచితంగానే ప్రైవేట్ డాక్టర్లు, సిబ్బంది సేవలు ప్రైవేటు బోధనాసుపత్రుల్లోని వసతులను, డాక్టర్లను, సిబ్బందిని ప్రభుత్వం ఉచితంగానే ఉపయోగించుకోనుంది. సిబ్బంది జీతాలను ప్రైవేటు వారే ఇచ్చుకోవాలి. యాజమాన్యాలకు సర్కారు నయాపైసా చెల్లించదు. అయితే కరోనా బాధితులకు సేవచేసే వైద్యులకు, నర్సులకు, ఇతరత్రా సిబ్బందికి అవసరమైన పర్సనల్ ప్రొటెక్ట్ ఎక్విప్మెంట్స్, సర్జికల్ ఐటమ్స్, మాస్క్‌లు, శానిటైజర్లు, ఇతర పరికరాలను ప్రభుత్వమే రూ.30 కోట్ల మేర వెచ్చించి ప్రైవేట్ మెడికల్ బోధనాసుపత్రులకు అందచేస్తుంది. అంతేతప్ప ఈ నిధులను ప్రైవేటు ఆసుపత్రులకు నేరుగా ఇవ్వదు. దీనివల్ల నిధులు దుర్వినియోగం కావని సర్కారు భావిస్తోంది. ప్రైవేటు మెడికల్ కాలేజీలున్న వారిలో కొందరు మంత్రులుగా, ప్రజాప్రతినిధులుగా, ఇంకొందరు సానుభూతిపరులుగా ఉన్నారు. ఈ పరిచయాల ఆధారంగా ప్రైవేటు బోధనాసుపత్రులను స్వాధీనంలోకి తీసుకోవడంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్, వీసీ డాక్టర్ కరుణాకర్‌రెడ్డి కీలకంగా వ్యవహరించారని అధికారులు చెబుతున్నారు. ఎంబీబీఎస్ విద్యార్థులకు సెలవులు మొత్తం ప్రైవేటు మెడికల్ కాలేజీలు, బోధనాసుపత్రులను ఖాళీచేసి సర్కారుకు అప్పగించడంతో వాటిల్లోని ఎంబీబీఎస్ విద్యార్థులకు సెలవులు ఇచ్చారు. ముఖ్యంగా మొదటి, రెండు, మూడో సంవత్సరం విద్యార్థులకు సెలవులు ఇచ్చారని, మిగిలిన తరగతుల, పీజీ విద్యార్థులు మాత్రం కరోనా సేవల్లో ఉంటారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపాయి. కాగా, కరోనా బాధితుల్లో విదేశాల నుంచి వచ్చినవారు, ధనికులు ఎక్కువ ఉన్నారు. ప్రస్తుతం సర్కారు ఆసుపత్రుల్లో ఐసోలేషన్‌లో ఉండలేమని వారంతా అంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రైవేటు బోధనాసుపత్రుల్లోని వసతులు అటువంటి వారికి గొప్పగా ఉపయోగపడతాయని వైద్య వర్గాలు భావిస్తున్నాయి. కాగా, గాంధీ ఆసుపత్రిని పూర్తిగా కరోనా చికిత్సలకే పరిమితం చేయగా, మరో ఏడెనిమిది సర్కారు బోధనాసుపత్రులు కూడా కరోనా సేవలకే పరిమితమైన విషయం తెలిసిందే. -
ప్రజల్లో డెంగీ భయం!
- సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ వైద్యగణం - జిల్లాలో 143 డెంగీ కేసులు - బాధితుల్లో 115 మంది పిల్లలే - జ్వరం వచ్చినా డెంగీ అంటూ భయపెడ్తున్న వైనం - కొరవడిన వైద్య ఆరోగ్యశాఖ అధికారుల పర్యవేక్షణ అనంతపురం మెడికల్ : జిల్లాలో డెంగీ భయం ప్రజలను వణికిస్తోంది. రెండు రోజులు జ్వరం కాస్తే ముందు జాగ్రత్త చర్యగా వైద్యుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ఇదే అదనుగా కొందరు ప్రైవేటు డాక్టర్లు వారిని మరింత భయపెడతూ వేలకువేల రూపాయలు గుంజుతున్నారు. డెంగీ బారిన పడుతున్న వారిలో చిన్నారులే అధికంగా ఉంటుండడంతో వారిని ఎలాగైనా కాపాడుకోవాలన్న తపనతో డాక్టర్లు ఎంత అడిగితే అంత చెల్లిస్తూ పేద ప్రజలు జేబులు గుల్ల చేసుకుంటున్నారు. దీనిని నియంత్రించాల్సి న వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మా త్రం నిమ్మకునీరెత్తినట్లున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలో ఈ ఏడాది ఇప్పటి వరకు 143 డెంగీ కేసులు నమోదయా ్యయి. జనవరి నుంచి జూన్ వరకు 35 డెంగీ పాజిటివ్ కేసులు నమోదవగా.. ఒక్క జులై మాసంలోనే ఏకంగా 88 కేసులు నమోదయ్యాయి. ఆగస్టులో 20 వరకు అయ్యాయి. డెంగీ బారిన పడిన వారిలో ప్రధానంగా 14 ఏళ్లలోపు ఉన్న పిల్లలు 115 మంది వరకు ఉన్నారు. రక్త పరీక్షలతో బెంబేలు : చిన్నపాటి జ్వరం, ఒళ్లు నొప్పులు, సీజనల్ వ్యాధులతో ఆస్పత్రులకు వెళ్లినా రకరకాల పరీక్షలతో బెంబేలెత్తిస్తున్నారు. వాస్తవానికి డెంగీని నిర్ధారించే పరీక్షలు చేసే పరికరాలు లేకున్నా అందినకాడికి పిండుకుంటున్నారు. జిల్లా కేంద్రంతో పాటు కదిరి, హిందూపురం, ధర్మవరం, గుంతకల్లు, తాడిపత్రి ప్రాంతాల్లో ఈ దోపిడీ రోగం పట్టుకుంది. డెంగీ సోకిన చిన్నారుల్లో సుమారు 50 మంది వరకు అనంతపురంలోని ఓ ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రిలోనే చికిత్స పొందారు. అవసరమైన చికిత్సలు చేయకపోయినా నాలుగైదు రోజులు ఉంచుకుని వేలాది రూపాయలు బిల్లు వేస్తున్నారు. డెంగీ నిర్ధారించాలంటే..: ఐదు రోజుల వరకు రోజూ జ్వరం ఉంటే నాన్ స్ట్రక్చురల్ ప్రొటీన్ యాంటిజెన్ పరీక్ష చేస్తారు. పది రోజుల వరకు జ్వరం వస్తే ఇమ్యునోగ్లోబులిన్ యాంటిజెన్ పరీక్ష చేస్తారు. ఎలీసా విధానంలో చేస్తేనే ఈ రెండు రకాల పరీక్షలు పక్కాగా వస్తాయి. జిల్లాలో కేవలం అనంతపురం మెడికల్ కళాశాల, హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రిలో మాత్రమే ఈ పరీక్షకు సంబంధించిన పరికరాలున్నాయి. డెంగీ పరీక్షల ఖచ్చితమైనఫలితం రావాలంటే ఆరు గంటల సమయం పడుతుంది. నిర్ధారణ కాదని తెలిసినా ప్రైవేట్ వైద్యులు ర్యాపిడ్ విధానాన్ని అనుసరిస్తూ రూ.లక్షలు ఆర్జిస్తున్నారు. మందులు ఇచ్చినా జ్వరం అదుపులోకి రాకపోతే డెంగీగా భావించి ప్లేట్లెట్ల సంఖ్య పరీక్షలు చేస్తున్నారు. దీనికి నామమాత్రపు ఫీజు వసూలుచేయాల్సి ఉన్నప్పటికీ రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. అసలు కథ ఇక్కడి నుంచే.. జిల్లాలోని కొందరు ప్రైవేట్ వైద్యులు రోగులను కొద్ది రోజులు తమ ఆ స్పత్రుల్లో ఉంచుకొని తర్వాత ఇతర ప్రాంతాలకు రెఫర్ చేస్తారు. అసలు కథ మొదలవుతోంది. కార్పొరేట్ ఆస్పత్రులకు వెళ్లిన ప్రతి రోగికీ రూ.70 వేల వ రకు బిల్లు వేసి డెంగీ నయం చేసినట్లు పంపుతున్నారు. రోగిని పంపిన స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి చెందిన డాక్టర్లకు పది శాతం వరకు కమీషన్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్ఎంపీ మొదలు ఎంబీబీఎస్ వరకు ఇలా కాసులకు కక్కుర్తి పడి రోగులను కార్పొరేట్ ఆస్పత్రులకు తరలించి దండుకుంటున్నారు. కొరవడిన పర్యవేక్షణ జిల్లాలోని ల్యాబ్‌లు, క్లినిక్‌లు, నర్సింగ్ హోంల నిర్వాహకుల వివరాలను వైద్య ఆరోగ్యశాఖ వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. కానీ జిల్లాలో వివరాలు పూర్తిగా నమోదు కావడం లేదు. నమోదైనా కొన్నింటికి సంబంధించి వాటి రిజిస్ట్రేషన్ల పునరుద్ధరణ ఊసే ఉండడం లేదని తెలుస్తోంది. పరిస్థితి ఇలా ఉన్నా అధికారులు మాత్రం తనిఖీలు నిర్వహించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు.