ఎంసెట్‌కు ఏర్పాట్లు పూర్తి
అనంతగిరి, న్యూస్‌లైన్: వికారాబాద్‌లోని ఎస్ఏపీ కళాశాల, ధన్నారం సమీపంలోని అన్వర్‌ఉలూమ్ కళాశాల సెంటర్లలో గురువారం ఎంసెట్ నిర్వహించనున్నట్లు ఎంసెట్ ప్రాంతీయ సమన్వయకర్త, ఎస్ఏపీ కళాశాల ప్రిన్సిపాల్ పి.శివప్రకాశ్ తెలిపారు. ఇందులో భాగంగా ఇంజినీరింగ్ పరీక్ష ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, మెడికల్ మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5-30 గంటల దాకా జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ రెండు కేంద్రాల్లో కలిపి ఇంజినీరింగ్‌కు 1,012 మంది, మెడిసిన్‌కు 694మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కానున్నారన్నారు. ఇంజనీరింగ్, మెడిసిన్ పరీక్షలు రెం డు సెంటర్లలోనూ ఉన్నాయన్నారు. పరీక్షలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆయన తెలిపారు. ఈ సందర్భం గా ఎంసెట్ రాసే విద్యార్థులకు ఆయన పలు సూచనలు చేశారు.
విద్యార్థులు బ్లూ లేదా బ్లాక్ పెన్నులను వాడాలి
హాల్‌టికెట్ తప్పనిసరిగా తీసుకురావాలి
ఫొటో అతికించి అటెస్టెడ్ చేసిన అప్లికేషన్ ఫారం తప్పనిసరి
ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు అటెస్టెడ్ చేసిన కుల ధ్రువీకరణపత్రం తీసుకురావాలి
పరీక్ష హాల్ల్లోకి ఎలక్ట్రానిక్ వస్తువులు అనుమతించరు
పరీక్ష సమయానికి గంట ముందు కేంద్రానికి చేరుకోవాలి. గంట ముందు పరీక్ష హాల్లోకి అనుమతిస్తారు
సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించరు.
హాల్టికెట్లలోని నిబంధనలను చదివి విద్యార్థులు విధిగా పాటించాలి.