Punjab Congress
-
మ్యాగజైన్ స్టోరీ 29 September 2021
-
Navjot Singh Sidhu: నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది
చండీగఢ్: తన ప్రయాణం ఇప్పుడే మొదలైందని పంజాబ్ కాంగ్రెస్ నూతన చీఫ్, మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధూ పేర్కొన్నారు. సిద్ధూ, సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మధ్య తీవ్ర విభేదాలు కొనసాగుతున్న నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీకి కొత్త అధ్యక్షుడిగా అధిష్టానం ఆయన్ను ఆదివారం నియమించిన విషయం తెలిసిందే. సోమవారం సిద్ధూ చండీగఢ్ చేరుకుని పలువురు పార్టీ నేతలు, ఎమ్మెల్యేలను కలుసుకున్నారు. తనపై నమ్మకం ఉంచి, కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ చీఫ్ సోనియాగాంధీకి, రాహుల్, ప్రియాంకలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘నా ప్రయాణం మొదలైంది. విధేయత కలిగిన కార్యకర్తగా ‘జీతేగా పంజాబ్’మిషన్ సాకారానికి పంజాబ్ కాంగ్రెస్ కుటుంబంలోని ప్రతి ఒక్కరితోనూ కలిసి పనిచేస్తా. పంజాబ్ మోడల్, అధిష్టానం సూచించిన 18 అంశాల ఎజెండాతో ప్రజల అధికారాన్ని తిరిగి ప్రజలకే అప్పగిస్తా’అని ట్విట్టర్లో పేర్కొన్నారు. పాటియాలాలో పలువురు ఎమ్మెల్యేలు, నేతలను కలుసుకుని మొహాలీలోని ఎమ్మెల్యే కుల్జీత్ సింగ్ నగ్రా నివాసానికి వెళ్లారు. అక్కడ కేక్ కట్ చేసి, స్వీట్లు పంచారు. అనంతరం పంజాబ్ కాంగ్రెస్ మాజీ చీఫ్ జాకఢ్, మంత్రులు రజియా సుల్తానా, తృప్త్ రజీందర్ సింగ్, మాజీ సీఎం రజీందర్ కౌర్ నివాసాలకు వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా అమృత్‌సర్‌లో కాంగ్రెస్ శ్రేణులు, సిద్దూ మద్దతుదారులు స్వీట్లు పంచుకున్నారు. ఇలా ఉండగా, సీఎం అమరీందర్ తీవ్ర వ్యతిరేకత నడుమ సిద్ధూను పీసీపీ చీఫ్‌గా పార్టీ అధిష్టానం నియమించిన విషయం తెలిసిందే. తనకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన సిద్ధూ క్షమాపణ చెప్పే వరకు అతనితో సమావేశమయ్యేది లేదని సీఎం ఇప్పటికే స్పష్టం చేశారు. సిద్దూ నియామకంపై ఆయన వర్గం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. సోమవారం సీఎం అమరీందర్ తన అధికార నివాసంలో పార్టీ నేతలు, కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. -
రాహుల్, ప్రియాంకతో భేటీ: సిద్ధూకు కొత్త బాధ్యతలు!
న్యూఢిల్లీ: పంజాబ్ కాంగ్రెస్‌లో అంతర్గత సంక్షోభం ఒక కొలిక్కి వచ్చే సచనలు కనిపిస్తున్నాయి. అసమ్మతి నాయకుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ బుధవారం కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేత రాహుల్ గాంధీని కలుసుకున్నారు. ‘ప్రియాంక గాంధీజీతో సుదీర్ఘ సమావేశం జరిగింది’అంటూ ట్విట్టర్లో సిద్ధూ వెల్లడించారు. వచ్చే ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీని ప్రక్షాళన చేయాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్‌పై తీవ్ర అసంతృప్తితో ఉన్న సిద్ధ బహిరంగంగానే తన అసమ్మతి తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో పార్టీలో తన పాత్ర గురించి సిద్ధూ ప్రియాంకతో చర్చించినట్టుగా తెలుస్తోంది. సిద్ధకి త్వరలో కొత్త బాధ్యతలు కట్టబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు సమాచారం. సిద్ధూతో సమావేశమయ్యే అవకాశమే లేదని రాహుల్ మంగళవారం చెప్పారు. మరుసటి రోజే ప్రియాంక, రాహుల్‌లు సిద్ధూకి అపాయింట్మెంట్ ఇవ్వడం విశేషం. చదవండి: ‘సిద్ధు’కు షాకిచ్చిన రాహుల్ గాంధీ! -
ఎంట్రీ టాక్స్ సబబే!
తేల్చిచెప్పిన రాజ్యాంగ ధర్మాసనం న్యూఢిల్లీ: రాష్ట్రాలు విధించే ఎంట్రీ టాక్సులో తప్పేమీలేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇలాంటి పన్ను వసూలు చట్టాలను రూపొందించుకోవటం ఆయా రాష్ట్రాల హక్కు అని శుక్రవారం వెల్లడించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ టీఎస్ ఠాకూర్ నేతృత్వంలోని 9 మంది సభ్యుల బెంచ్ దీనిపై చర్చించింది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వాలకు పన్ను వసూలు చేసే హక్కుందని 7-2 మెజారిటీతో ధర్మాసనం తీర్పు చెప్పింది. ‘పక్కరాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్న వస్తువులపై పన్ను, సొంత రాష్ట్రంలో తయారీ పన్ను ఒకేలా ఉండేలా.. అవసరాలకు అనుగుణంగా ఆర్థిక నిబంధనలు మార్చుకోవటం రాష్ట్రాల హక్కు. ఈ విధానాన్ని అనుసరిస్తే రాష్ట్రాలు రాజ్యాంగంలోని 304 (ఏ) సెక్షన్‌ను అతిక్రమించినట్లు కాదు’ అని జస్టిస్ టీఎస్ ఠాకూర్ తెలిపారు. దీనిపై జస్టిస్ ఎస్ఏ బాబ్దే, జస్టిస్ శివ కీర్తిసింగ్, జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ ఆర్ భానుమతిలు ఏకీభవించినట్లు తెలిపారు. రాష్ట్రాలు ఎంట్రీ టాక్స్ విధించే చట్టాలను రూపొందించటం రాజ్యాంగ విరుద్ధమంటూ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ అశోక్ భూషణ్ మెజారిటీ అభిప్రాయంతో విభేదించారు. ‘పన్నులకు సంబంధించిన ఏ చట్టమైనా రాజ్యాంగంలోని 304 (ఏ) సెక్షన్ పరిధిలో ఉండాలి. ఇలాంటి చట్టం వివక్షరహితంగా ఉందని మెజారిటీ సభ్యులు భావిస్తే.. దీనికి రాజ్యాంగ బద్ధత కల్పించవచ్చు’ అని 911 పేజీల తీర్పులలో సుప్రీం పేర్కొంది. ‘పక్కరాష్ట్రంలో ఉత్పత్తి అరుున వస్తువుకు భారీగా పన్ను విధించటం ద్వారా సొంతరాష్ట్రంలో దీని ధర పెరుగుతుంది. కానీ ఇలా పన్ను విధించటాన్ని రాజ్యాంగ విరుద్ధంగా భావించలేం’ అని బెంచ్ పేర్కొంది. ఈ సమస్యలను రాష్ట్రాలే పరిష్కరించుకుంటాయంది. ఆర్టికల్ 301 ప్రకారం వివక్షలేని పన్ను విధానంపై రాజ్యాంగ నియంత్రణ ఉంచకూడదని.. స్వేచ్ఛావాణిజ్య హక్కును కల్పించాలని ధర్మాసనం గుర్తుచేసింది. ఆర్టికల్ 301 ప్రకారం వస్తువులు, సేవలు, వ్యక్తులు, వాణిజ్యం, వ్యాపారం, లావాలదేవీల మూలధనం విషయంలో దేశమంతా ఒకే విధానం ఉండాలని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. 42 మంది పంజాబ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేల రాజీనామా చండీగఢ్: సట్లేజ్-యమునా లింక్ (ఎస్‌వైఎల్) కెనాల్ వివాదం రోజురోజుకూ ముదురుతోంది. వచ్చే ఏడాది ఆరంభంలో ఎన్నికలు జరగనున్న పంజాబ్‌లో రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఎస్‌వైఎల్ వివాదంలో సుప్రీం కోర్టు తీర్పుకు నిరసనగా గురువారం పంజాబ్ పీసీసీ చీఫ్ అమరీందర్ సింగ్ పార్లమెంటు సభ్యత్వానికి రాజీనామా చేయగా.. శుక్రవారం 42 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. చండీగఢ్ రోడ్లపై పాదయాత్రగా బయలుదేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు పార్టీ శాసనసభాపక్ష హాల్లో సమావేశమై.. అసెంబ్లీ సెక్రటరీకి రాజీనామా లేఖలు సమర్పించారు. అరుుతే వీరి రాజీనామాలపై స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోలేదు. దీంతోపాటు ఈ వివాదాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ దృష్టికి తీసుకురావాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణరుుంచింది.