Punt
-
కృష్ణానదిలో రవాణా పంట్ ట్రైల్‌రన్
ఇబ్రహీంపట్నం: రాజధాని నిర్మాణానికి ముడి సరకులు సరఫరా చేసేందుకు ఏర్పాటు చేసిన జలరవాణా పంట్‌కు శుక్రవారం ట్రైల్ రన్ నిర్వహించారు. సుమారు 700 టన్నుల బరువు మోయగల సామర్థ్యమున్న పంట్‌పై 40 టన్నుల బరువుండే ఆరు భారీ వాహనాలను ఎక్కించి ఇబ్రహీంపట్నం ఫెర్రీ నుంచి లింగాయపాలెం రేవు వరకు నడిపారు. 240 టన్నులకే నదిలో అక్కడక్కడ భూగర్భం తగలడంతో నదిలో డ్రెడ్జింగ్ చేపట్టాలని నిర్వాహకులు గుర్తించారు. రాజధాని నిర్మాణానికి అవసరమైన ఇనుము, సిమెంట్, కంకర, ఇతర సామగ్రిని అమరావతి ప్రాంతానికి తరలించాలంటే విజయవాడ చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తున్నది. దుర్గ గుడి ప్లైఓవర్ నిర్మాణంతో రాత్రివేళల్లో మాత్రమే రవాణా వాహనాలను పోలీసులు అనుమతిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఫెర్రీలో ఏర్పాటు చేసిన పంట్తో ఒకేసారి 15 నుంచి 20 భారీ వాహనాలు గుంటూరు జిల్లా వైపు వెళ్లేందుకు మార్గం సుగుమం కానుంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వాహనాలు విజయవాడకు రాకుండానే గుంటూరు జిల్లా చేరుకోవచ్చు. స్థానికుల అభ్యంతరం జాతీయ రహదారి నుంచి ఫెర్రీకి భారీ వాహనాలు వెళ్తుండడంపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. రింగ్ సెంటర్ నుంచి ఫెర్రీకి వెళ్లే రోడ్డు నిత్యం రద్దీగా ఉంటోంది. అక్కడినుంచి పట్టిసీమ కాలువ వెంట ఉన్న రహదారి ఇప్పటికే నాణ్యత కోల్పోయిందని, అందువల్ల భారీ వాహనాలను ఎలా అనుమతిస్తారని స్థానికులు మండిపడుతున్నారు. -
లారీ డ్రైవర్ నరకయాతన
అశ్వారావుపేటరూరల్: లారీ అదుపుతప్పి రహదారి పక్కనున్న గుంతలో పడిపోయింది. అందులోని డ్రైవర్, క్లీనర్ క్యాబిన్లో చిక్కుకుపోయారు. దాదాపు రెండు గంటలపాటు నరకయాతన అనుభవించారు. గురువారం అర్థరాత్రి ఇది జరిగింది. ఛత్తీస్‌గఢ్ నుంచి ఇనుప రాడ్ల లోడుతో విశాఖపట్నానికి వెళ్తున్న లారీ అర్థరాత్రి సమయంలో అశ్వారావుపేట మండలంలోని ఊట్లపల్లి సమీపంలోని ముత్యాలమ్మ ఆలయం వద్దగల మూలమలుపు వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనున్న భారీ గుంతలో పడిపోయింది. ఆ తరువాత చెట్టును ఢీకొంది. లారీ క్యాబిన్ నుజ్జునుజ్జయింది. డ్రైవర్ ఖాజిదే, క్లీనర్ చోటు ఇరుక్కుపోయారు. చాలాసేపటి తర్వాత గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. హెడ్ కానిస్టేబుల్ బాబురావు, పోలీస్ సిబ్బంది వచ్చి వారిని బయటకు తీసేందుకు ప్రయత్నించారు. సాధ్యపడకపోవడంతో సర్పంచ్ తెల్లం వీరకుమారి భర్త దుర్గారావు సహాయంతో స్థానిక యువకులు, జేసీబీతో క్యాబిన్ ఇరుక్కుపోయిన క్షతగ్రాతులను బయటకు తీశారు. డ్రైవర్‌కు కాలు విరిగింది. క్లీనర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని 108 సిబ్బంది ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
రౌడీల పెత్తనం సహించం
గీసుకొండ : ‘ప్రజలు ఎందుకో గుడ్డిగా ఒక్కోసారి రౌడీల వెంట ఉరుకుతుంటరు.. ఎందుకో ఒక్కోసారి గుండాయిజం చేసేవారి వెంట తిరుగుతుంటరు.. వారినే ఎన్నుకుంటారు.. గ్రాడ్యుయేషన్, పోస్టుగ్రాడ్యుయేషన్ చేసే వారు కూడా పిచ్చిగా ఆలోచన లేకుండా వారి వెంట తిరుగుతుంటరు.. ఇది ప్రజాస్వామ్యం.. ప్రజలను కొట్టడానికి, దోచుకోవడానికి కాదు ఎన్నికైంది. ప్రజలకు సేవ చేయడానికి. ఎవరో ఒకరిద్దరు రౌడీలను గ్రామాల్లో తయారు చేసుకుని పెత్తనం చెలాయిస్తే చూస్తూ ఊరుకునేది లేదు. రాష్ట్రంలో ఇలాంటి వాళ్లను కనిపెట్టుకుని ఉండాలని మా ప్రభుత్వం దృఢ నిశ్చయంతో ఉంది. అలాంటివారిని వదిలి పెట్టేది లేదు’ అంటూ వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి విరుచుకుపడ్డారు. గీసుకొండ మండలంలోని బాలయ్యపల్లె డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టు రెండో దశ పనులకు శనివారం శంకుస్థాపన చేసిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. అప్పటి వరకు తనను ఎంపీగా భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృత జ్ఞతలు అని, పదేళ్ల కాంగ్రెస్ పాలనలో అవినీతి రాజ్యమేలిందని అని మాట్లాడిన ఆయన ఒక్కసారిగా టాపిక్ మార్చారు. ‘ విచిత్రం ఏమిటేంటే ఒక్కసారి ఎమ్మెల్యే అయితే వందల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములు ఎట్లా వస్తాయి?. నా ఇల్లు హన్మకొండలోని టీచర్స్ కాలనీలో ఉంది. పదేళ్లు మంత్రిగా పని చేసిన. నా దగ్గరకు వచ్చే సర్పంచ్‌లు అయ్యో సారూ మీ ఇల్లు గిట్లున్నదేంది అని అంటాంటె వారు నన్ను పొగుడుతాండ్లో.. అవమానపరుస్తాండ్లో తెల్వడం లేదు. మీ ఇంటికన్నా గా వీఆర్వో ఇల్లు బాగున్నదని అంటరు’ అని చెప్పుకొచ్చారు. రౌడీయిజంపై ఎంపీ ఘాటుగా మాట్లాడుతుండగా సభికులు స్పందించి చప్పట్లు కొట్టారు. ఆయన పక్కనే కూర్చున్న ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ముసిముసి నవ్వులు నవ్వారు. అయితే అంతకు ముందు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ గతంలోని ప్రజాప్రతినిధులు పదేళ్లుగా నియోజకవర్గానికి ఒక్క మంత్రిని, ఎంపీని రానివ్వలేదని, దీనికి రౌడీ రాజకీయాలే కారణమంటూ విరుచుకుపడ్డారు. -
తాటతీస్తాం...
బెంగళూరు నగరంలోని రౌడీషీటర్లకు పోలీసులు తీవ్రమైన హెచ్చరికలు చేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా శిక్షస్తామని హెచ్చరించారు. బుధవారం వేకువజామున నగరంలో రౌడీషీటర్లు ఉంటున్న ఇళ్లపై దాడులు చేశారు. బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్లు క మల్పంత్, శరత్చంద్ర, రవి, డీసీపీలు లాబురామ్, సురేష్, టీ.డీ. పవార్, రవికాంత్‌గౌడ, రేవణ్ణ, డాక్టర్ హర్ష, సందీప్ పాటిల్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 1275 మందిని అదుపులోకి తీసుకుని 63 బైక్‌లు, పిసోళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో నేరాలకు పాల్పడినా, సహకరించినా తీవ్ర పరిణామలు ఉంటాయని హెచ్చరించారు. 733 మంది రౌడీలను మైసూరు రోడ్డులోని సీఏఆర్ మైదానంలో హాజరు పరచగా, 542 మంది రౌడీలను ఆడుగోడిలోని సీఏఆర్ మైదానంలో హాజరు పరచి కౌన్సెలింగ్ ఇచ్చారు. వీరిపై నిత్యం నిఘా పెట్టాలని పోలీసులకు సూచించారు.