బెంగళూరు నగరంలోని రౌడీషీటర్లకు పోలీసులు తీవ్రమైన హెచ్చరికలు చేశారు. లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠినంగా శిక్షస్తామని హెచ్చరించారు. బుధవారం వేకువజామున నగరంలో రౌడీషీటర్లు ఉంటున్న ఇళ్లపై దాడులు చేశారు.
బెంగళూరు నగర అడిషనల్ పోలీసు కమిషనర్లు క మల్‌పంత్, శరత్‌చంద్ర, రవి, డీసీపీలు లాబురామ్, సురేష్, టీ.డీ. పవార్, రవికాంత్‌గౌడ, రేవణ్ణ, డాక్టర్ హర్ష, సందీప్ పాటిల్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి 1275 మందిని అదుపులోకి తీసుకుని 63 బైక్‌లు, పిసోళ్లు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో నేరాలకు పాల్పడినా, సహకరించినా తీవ్ర పరిణామలు ఉంటాయని హెచ్చరించారు.
733 మంది రౌడీలను మైసూరు రోడ్డులోని సీఏఆర్ మైదానంలో హాజరు పరచగా, 542 మంది రౌడీలను ఆడుగోడిలోని సీఏఆర్ మైదానంలో హాజరు పరచి కౌన్సెలింగ్ ఇచ్చారు. వీరిపై నిత్యం నిఘా పెట్టాలని పోలీసులకు సూచించారు.