qualitative
-
అందగాడు, ఆయుష్మంతుడు కన్నా గుణవంతుడే అన్ని విధాల..
వారణాసి పట్టణంలో సుప్రబుద్ధి అనే వ్యాపారి ఉన్నాడు. దేశవిదేశాల్లో వ్యాపారం చేసి ఎంతో ధనం సంపాదించాడు. అతనికి సుజాత అనే పెళ్ళీడుకొచ్చిన కుమార్తె ఉంది. సుగుణాల రాశి. అందాల బొమ్మ. అందానికి అందం. సంపదకి సంపద పుష్కలంగా ఉండటంతో ఎందరో ఆమెను పెళ్ళాడలనుకున్నారు. తమ తమ ఆస్తి వివరాలు, చిత్రపటాలూ పంపారు. సుప్రబుద్ధి భార్యకు వారిలో ధననందుడు నచ్చాడు. ఎందుకంటే ఆ పెళ్ళి కుమారులందరిలో అతనే అందగాడు. రంగూ, రూపం చాలా బాగుంది. ‘‘ధననందుని తల్లిదండ్రులకి కబురు పంపండి’’ అంది ఆమె. సుప్రబుద్ధుని తండ్రికి మాత్రం విక్రముడు నచ్చాడు. అతను అవంతీనగర శ్రేష్ఠికుమారుడు. ధనం, వంశగౌరవం కలవాడు కాబట్టి ‘‘విక్రముని కుటుంబంతోనే వియ్యమందుదాం’’ అన్నాడు పెద్దాయన. ధనం కంటే వంశం కంటే ఆరోగ్యమే మహా భాగ్యం అనుకున్నాడు సుప్రబుద్ధి. కాబట్టి అతనికి ఉజ్జయినీ యువకుడు ఉదయనుడు నచ్చాడు. తన కుమార్తెను చేపట్టేవాడు ఆరోగ్యంతో దీర్ఘాయువుగా ఉండాలి. పెళ్లంటే నూరేళ్ళ పంట. కాబట్టి ఉదయనుడే తనకు అల్లుడైతే చాలు అనుకున్నాడు. అలా ఆ ముగ్గురి అభిప్రాయాలూ వేరు వేరుగా ఉన్నాయి. కాబట్టి తన కుమార్తె అభిప్రాయం అడగాలనుకున్నాడు. వెంటనే పిలిచి తమ తమ అభిప్రాయాలు చెప్పి–‘‘అమ్మా! సుజాతా! మా ముగ్గురి అభిప్రాయాలు వేరుగా ఉన్నాయి. వీరిలో ఎవరు అయితే నీకిష్టం?’’ అని అడిగాడు. సుజాత చిరునవ్వు నవ్వింది. మౌనం వహించింది. ‘‘సందేహించక చెప్పు తల్లీ!’’ అన్నాడు. ‘‘నాన్నా! నాకు ఈ మూడు రకాల వారూ వద్దు. గుణవంతుడు, శీలవంతుడు అయితే చాలు’’ అని లేచి అక్కడి నుంచి మేడ మీదికి పరుగు తీసింది సిగ్గుపడుతూ. ఆ వచ్చిన వారిలో అలాంటి యువకుడు మగధకు చెందిన శీలభద్రుడున్నాడు. ఈ విషయంపై ఇంట్లో తర్జన భర్జనలు జరిగాయి. ఎటూ తేల్చుకోలేకపోయాడు సుప్రబుద్ధి. మధ్యాహ్నం దాటాక సారనాథ్‌లోని జింకల వనానికి చేరాడు. అక్కడ వెదురు చెట్ల కింద కూర్చొన్న బుద్ధుని దగ్గరకు వెళ్ళాడు. నమస్కరించి, విషయం చెప్పాడు. అప్పుడు బుద్ధుడు– ‘‘సుప్రబుద్ధీ! ఒకడు చాలా అందగాడు. మంచి శరీర వర్ణం గలవాడు. కన్నూ, ముక్కు తీరు బావుంటుంది. కానీ వాడు ఒక దొంగ అనుకో. అందగాడని దొంగను ఇష్టపడతావా?’’ ‘‘లేదు భగవాన్!’’ ‘‘అలాగే.. ఒకడు సోమరి. అజ్ఞాని. కానీ, ఆరోగ్యవంతుడు. అతణ్ణి ఇష్టపడతావా?’’‘‘ఇష్టపడను భగవాన్!’’ ‘‘ధనవంతుడు, గొప్ప వంశం కలవాడు. కానీ.. వాడు జూదరి. తాగుబోతు. తిరుగుబోతు. అతను నీకు ఇష్టమేనా?’’ ‘‘కాదు భగవాన్! ఇష్టం కాదు’’‘‘చూశావా! అందగాడైనా, ఆయుష్షు గలవాడైనా, ధనవంతుడైనా ఇష్టం కాదు అనే అంటున్నావు. అవునా! సుప్రబుద్ధీ! వీటన్నిటి కంటే గుణమే ప్రధానం. నీ కుమార్తె కోరినట్లు గుణవంతుడు, శీలవంతుడు నీకు అల్లుడైతే, నీవూ, నీ కుమార్తె, నీ కుటుంబం, నీ బంధువర్గం అందరికీ గౌరవం.’’ అన్నాడు. ‘‘భగవాన్! నా కుమార్తె ఇష్టం ప్రకారమే ఆమె పెళ్ళి చేస్తాను పెద్ద మనస్సుతో అంగీకరిస్తాను’’ అంటూ సుప్రబుద్ధి సంతోషంతో లేచి వెళ్ళాడు. అలాగే చేశాడు. – డా. బొర్రా గోవర్ధన్ (చదవండి: క్షమయే దైవము) -
ఉపాధ్యాయ శిక్షణలో నాణ్యత పెంచాలి
‘నన్నయ’ వీసీ ఆచార్య ముత్యాలునాయుడు రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఉపాధ్యాయ శిక్షణలో నాణ్యతను పెంచాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం. ముత్యాలునాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన బీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, ఎంఈడీ కోర్సులకు సంబంధించి శిక్షణ ఇస్తున్న కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించిన ‘ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అండ్ వర్క్‌షాప్’లో ఆయన ముఖ్యఅతి«థిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల విద్యాసంస్థల నిర్వహణ వ్యాపారంగా మారిందన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ కేఎస్ రమేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్యలో నాణ్యతను పెం పొందించేందుకు ముందుగా శక్తి, సామర్థ్యాలను మారుతున్న సమాజానికి అనుగుణంగా వృద్ది చేసుకోవాలన్నారు. వర్సిటీ అకడమిక్ అఫైర్స్ డీన్ డాక్టర్ ఎస్.టేకి మాట్లాడుతూ బోధనలో కొత్త విధానాలను అవలంబిస్తూ నిజజీవితానికి సంబంధించిన అంశాలను పాఠాలతో మిళితం చేసి బోధించాలన్నారు. బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుబ్బారావు మాట్లాడుతూ సెమిస్టర్ –1, 3లకు సంబంధించిన కరిక్యులమ్, కృత్యాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. సీడీసీ డీన్ డాక్టర్ వై.శ్రీనివాసరావు, సహాయ అధ్యాపకులు డాక్టర్ జి.ఎలీషాబాబు, ఆర్.సాంబశివరావు, ఎం.గోపాలకృష్ణ, డాక్టర్ ఎన్.సుజాత, డాక్టర్ ఆÆŠ.ఎస్ వరహాల దొర, వి.రామకృష్ణ, జె. రాజామణి, కె.రాజేశ్వరిదేవి పాల్గొన్నారు. -
గ్రామీణులు, పేదలకు అనుకూలమైన బడ్జెట్
దేశంలో రైతులు, పేదలు, గ్రామీణ ప్రజల అభివృద్ధే లక్ష్యంగా ఈసారి బడ్జెట్ రూపొందడం ఎంతో ఆనందంగా ఉందంటూ ప్రధాని నరేంద్ర మోదీ అరుణ్ జైట్లీ బడ్జెట్‌ను అభినందించారు. గ్రామీణభారతాన్ని పటిష్ఠపరిచేందుకు అరుణ్ జైట్లీ బడ్జెట్ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పేదలు, గ్రామీణులు, రైతుల్లో నాణ్యతాపరమైన మార్పు తీసుకురావాలన్నదే తమ ధ్యేయమని, ప్రజలు ఆదరించిన ప్రత్యేక కార్యక్రమాలతో పేదరికాన్ని నిర్మూలించడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రధాని తన అభిప్రాయం వ్యక్తంచేశారు. ముఖ్యంగా 2016-17 బడ్జెట్ వ్యవసాయం, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలతో పాటు, దళిత వ్యవస్థాపకత పైనా దృష్టితో రూపొందించినట్లు తెలిపారు. ఈ బడ్జెట్‌తో దేశంలోని సామాన్య ప్రజల జీవితాల్లో అనూహ్య మార్పును చూడొచ్చని మోదీ అభిప్రాయపడ్డారు. నిర్ణీత కాలపరిమితిలో పేదరికం తొలగించడానికి ఈ బడ్జెట్ ఓ రోడ్ మ్యాప్ అని, రైతుల అభివృద్ధే ధ్యేయంగా పలు చర్యలు తీసుకున్నామని, అందులో ప్రధానమంత్రి కృషి యోజన ముఖ్యమైనదని అన్నారు. ఈ బడ్జెట్ గ్రామాల్లో రహదారులు, విద్యుత్ సౌకర్యాలపై దృష్టిసారించిందని, 2019 నాటికి అన్ని గ్రామాలకు రోడ్లు వేయించడంతో పాటు 2018 కల్లా గ్రామాల్లో విద్యుత్ సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ బడ్జెట్ పేదల సొంతింటి కల నెరవేర్చేలా రూపొందిందని, గ్రామీణ ఉపాధి హామీకి కూడా భారీ కేటాయింపులు జరిగాయని మోదీ వివరించారు. దీంతోపాటు అద్దె ఇళ్లలో ఉండేవారికి బడ్జెట్లో ప్రత్యేక మినహాయింపులు చేకూర్చినట్లు ప్రధాని తెలిపారు. -
‘మేటి’ కొప్పాక చక్కెర
రూ.73.55 లక్షలతో సెంట్రీ ఫ్యూగల్ ఏర్పాటు 50 నిమిషాల్లో 1750 కిలోల పంచదార ఉత్పత్తి ప్యాకింగ్‌లోనూ ఆధునిక పరిజ్ఞానం నష్టాల నుంచి గట్టెక్కే ప్రయత్నం ఏటికొప్పాక చక్కెర కర్మాగారం ఆధునికత వైపు అడుగులు వేస్తోంది. నష్టాల నుంచి గట్టెక్కే ప్రయత్నం చేస్తోంది. మార్కెట్లో డిమాండ్ ఉన్న నాణ్యమైన పంచదార ఉత్పత్తికి అవసరమైన మెషినరీని అంచెలంచెలుగా యాజమాన్యం సమకూరుస్తోంది. ప్యాకింగ్‌లో ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడానికి అవసరమైన యంత్రాలను ఏర్పాటుచేశారు. పంచదార దిగుబడిలో నాణ్యత పెంచడంతోపాటు ప్యాకింగ్ వేగవంతానికి అవసరమైన యంత్రాలను ఏర్పాటుచేశారు. యలమంచిలి/ఎస్.రాయవరం, న్యూస్‌లైన్: ఏటికొప్పాక ఫ్యాక్టరీలో ఇప్పటివరకు మూడు రకాల పంచదార ఉత్పత్తి అయ్యేది. పాత యంత్రాలతో తయారీతో ఇందులో 20 శాతమే నాణ్యమైనది. మిగిలిన రెండు రకాల్లో నాణ్యత కొరవడి ఫ్యాక్టరీ ఆదాయంపై ప్రభావం కనబడేది. యాజమాన్యం ఆర్థికంగా ఒడిదుకులకు గురయ్యేది. ఇలా మూడు రకాల పంచదార ఉత్పత్తితో ఆదాయం తగ్గడమే కాకుండా పెద్ద సంఖ్యలో కార్మికులు అవసరమయ్యేవారు. ఇప్పుడు రూ.73.55 లక్షలతో సెంట్రీఫ్యూగల్ అనే యంత్రాన్ని కర్మాగారంలో ఏర్పాటు చేశారు. దీని ద్వారా 50 నిమిషాల్లో 1750 కిలోల నాణ్యమైన ఒకేరకం పంచదార ఉత్పత్తి అవుతోంది. అధిక శాతం నాణ్యత ఉన్న (క్రిస్టల్)ఉండడంతో ఫ్యాక్టరీకి అదనపు ఆదాయం సమకూరుతోంది. సెంట్రీఫ్లీగల్తో ఎటువంటి వృథా లేకుండా ఉత్పత్తి జరుగుతోంది. వృథాకాకుండా క్రమపద్ధతిలో ఉండేందుకు రూ.50 లక్షలతో బిన్ అనే మరో పరికరాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పంచదారను గోనె సంచిలో పట్టడం దగ్గర నుంచి బస్తాలను కుట్టడం వరకు అత్యంగా వేగంగా పనులు చకచకా జరిగిపోతున్నాయి. ఈ పరికరం ఏర్పాటుతో 15 మంది కార్మికులకు బదులు ఒకరిద్దరు సరిపోతున్నారు. ఇది గంటకు 207 బస్తాల పంచదారను నిల్వ చేస్తోంది. ప్యాకింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి.