ఉపాధ్యాయ శిక్షణలో నాణ్యత పెంచాలి
ఉపాధ్యాయ శిక్షణలో నాణ్యత పెంచాలి
Published Tue, Jul 26 2016 11:11 PM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM
‘నన్నయ’ వీసీ ఆచార్య ముత్యాలునాయుడు
రాజరాజనరేంద్రనగర్ (రాజానగరం) : ఉపాధ్యాయ శిక్షణలో నాణ్యతను పెంచాలని ఆదికవి నన్నయ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య ఎం. ముత్యాలునాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన బీఈడీ, బీపీఈడీ, ఎంపీఈడీ, ఎంఈడీ కోర్సులకు సంబంధించి శిక్షణ ఇస్తున్న కళాశాలల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులతో యూనివర్సిటీలో మంగళవారం నిర్వహించిన ‘ఓరియంటేషన్ ప్రోగ్రామ్ అండ్ వర్క్‌షాప్’లో ఆయన ముఖ్యఅతి«థిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇటీవల విద్యాసంస్థల నిర్వహణ వ్యాపారంగా మారిందన్నారు. రిజిస్ట్రార్ డాక్టర్ కేఎస్ రమేష్ మాట్లాడుతూ ఉపాధ్యాయ విద్యలో నాణ్యతను పెం పొందించేందుకు ముందుగా శక్తి, సామర్థ్యాలను మారుతున్న సమాజానికి అనుగుణంగా వృద్ది చేసుకోవాలన్నారు. వర్సిటీ అకడమిక్ అఫైర్స్ డీన్ డాక్టర్ ఎస్.టేకి మాట్లాడుతూ బోధనలో కొత్త విధానాలను అవలంబిస్తూ నిజజీవితానికి సంబంధించిన అంశాలను పాఠాలతో మిళితం చేసి బోధించాలన్నారు. బీఈడీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుబ్బారావు మాట్లాడుతూ సెమిస్టర్ –1, 3లకు సంబంధించిన కరిక్యులమ్, కృత్యాలపై అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. సీడీసీ డీన్ డాక్టర్ వై.శ్రీనివాసరావు, సహాయ అధ్యాపకులు డాక్టర్ జి.ఎలీషాబాబు, ఆర్.సాంబశివరావు, ఎం.గోపాలకృష్ణ, డాక్టర్ ఎన్.సుజాత, డాక్టర్ ఆÆŠ.ఎస్ వరహాల దొర, వి.రామకృష్ణ, జె. రాజామణి, కె.రాజేశ్వరిదేవి పాల్గొన్నారు.
Advertisement