శ్రీమఠం మాజీ పీఠాధిపతికి తప్పిన ప్రమాదం
మంత్రాలయం: మంత్రాలయం శ్రీరాఘవేంద్రస్వామి మఠం మాజీ పీఠాధిపతి శ్రీసువిదేంద్ర తీర్థులు ఓ రోడ్డు ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు. ఆధ్యాత్మిక పర్యటనలో భాగంగా సోమవారం సాయంత్రం పూనేకు బయలుదేరారు. అనంతపురం జిల్లా పామిడి బైపాస్ రోడ్డు దగ్గర ఆయన ప్రయాణిస్తున్న వాహనం టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పి డివైడర్ ను ఢీకొట్టింది.
దీంతో వాహనం ముందుగా భాగం పూర్తిగా ధ్వంసం అయింది. ఈ సంఘటన నుంచి ఆయన క్షేమంగా బయటపడ్డారు. అనంతరం ఆయన మరో వాహనంలో బెంగళూరు కు వెళ్లినట్టు సమాచారం.