Raja Chari
-
భారత సంతతి రాజా చారికి అమెరికా వైమానిక దళంలో కీలక పదవి!
న్యూయార్క్: భారత సంతతికి చెందిన అమెరికా వ్యోమగామి రాజా చారి అరుదైన ఘనత సాధించనున్నారు. అధ్యక్షుడు జో బైడెన్ ఈయనను ఎయిర్‌ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ పదవికి నామినేట్ చేశారు. సెనేట్ దీన్ని ఆమోదిస్తే అగ్రరాజ్యం వాయుసేనలో రాజా చారి కీలక బాధ్యతలు చేపట్టిన భారత సంతతి వ్యక్తిగా నిలుస్తారు. అమెరికా వైమానిక దళంలో సైన్యంలాగే బ్రిగేడియర్లను వన్-స్టార్ జనరల్స్‌గా పరిగణిస్తారు ర్యాంకులుంటాయి. చంద్రునిపైకి తిరిగివెళ్లేందుకు సిద్ధమవుతున్న అమెరికా మిషన్ అర్టెమిస్ బృందలో చారి సభ్యుడు. ఈయన సారథ్యంలోనే 2021లో నాసా సిబ్భంది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లింది. అక్కడ 177 రోజులు ఉన్న చారి.. స్పేస్ వాక్ కూడా నిర్వహించారు. రాజా చారి నాసాలో చేరకముందు అమెరికా ఎయిర్‌ఫోర్సులో టెస్ట్ పైలట్‌గా ఉన్నారు. మసాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేశారు. చదవండి: మిలటరీ సామర్థ్యంలో స్థిరంగా భారత్ -
రాజా చారికి బ్రిగేడియర్ జనరల్ హోదా
వాషింగ్టన్: భారతీయ అమెరికన్ వ్యోమగామి, కల్నల్ రాజా జె.చారి(45) ఎయిర్ ఫోర్స్ బ్రిగేడియర్ జనరల్ హోదాకు ఎంపికయ్యారు. ఈ హోదాకు ఆయన్ను ఎంపిక చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు బైడెన్ గురువారం ఒక ప్రకటన చేశారు. ఈ నియమాకాన్ని సెనేట్ ఆమోదించాల్సి ఉంది. అధ్యక్షుడు జరిపే అన్ని పౌర, సైనిక నియామకాలపై సెనేట్ సాధారణంగా ఆమోదముద్ర వేస్తుంటుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం రాజా చారి టెక్సాస్‌లోని నాసాకు చెందిన జాన్సన్ స్పేస్ సెంటర్లో క్రూ–3 కమాండర్, ఆస్ట్రోనాట్‌గా ఉన్నారు. రాజా చారి తండ్రి శ్రీనివాసా చారి తెలంగాణకు చెందిన వారు. ఆయన హైదరాబాద్‌లో ఇంజినీరింగ్ చదివి అమెరికాకు చేరుకున్నారు. వాటర్లూలోని జాన్ డీర్ సంస్థలో పనిచేశారు. రాజా చారి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ, మేరీల్యాండ్‌లోని యూఎస్ నేవల్ టెస్ట్ పైలట్ స్కూల్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 461వ ఫ్లైట్ టెస్ట్ స్క్వాడ్రన్ కమాండర్‌గా, ఎడ్వర్డ్స్ ఎయిర్ ఫోర్స్ బేస్‌లో ఎఫ్–35 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఫోర్స్‌కు డైరెక్టర్‌గాను వ్యవహరించారు. రాజా చారి తన కెరీర్లో 2,500 గంటలకు పైగా ఫ్టైట్ టైంను సాధించారు. అమెరికా ఎయిర్‌ఫోర్స్‌లో బ్రిగేడియర్ జనరల్(బీడీ) ఒన్ స్టార్ జనరల్ ఆఫీసర్ స్థాయి. ఇది కల్నల్‌కు ఎక్కువ, మేజర్ జనరల్ స్థాయికి తక్కువ. -
భారత్‌కు అంతరిక్ష కేంద్రం నుంచి వెల్లువెత్తిన శుభాకాంక్షలు
India celebrates its Independence Day not world But Space Well: భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేవలం ప్రపంచ వ్యాప్తంగానే కాకుండా అంతరిక్షం నుంచి కూడా భారత్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మేరకు భారతీయ అమెరికన్ వ్యోమోగామి రాజా చారి ట్విట్టర్లో విదేశాల్లో నివశిస్తున్న భారతీయులకు శుభాకాంక్షల సందేశాలతోపాటు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్ఎస్)లో భారతీయ జెండా ఫోటోను కూడా పోస్ట్ చేశారు. రాజా చారి ఇటీవల ఐఎస్ఎస్లో ఆరునెలల మిషన్ తర్వాత ఇంటికి తిరిగి వచ్చారు. మే నెలలో గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో సురక్షితంగా ల్యాండ్ చేసిన స్పేఎక్స్ అంతరిక్ష నౌకలో నలుగురు వ్యోమోగాములలో అతను కూడా ఉన్నారు. ఈ మేరకు చారి ట్విట్టర్లో.... " భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నా పూర్వీకుల మూలాలను గుర్తుతెచ్చుకుంటునమ్నాను. వలస వచ్చిన తన తండ్రి స్వస్థలం హైదరాబాద్ ఈ రోజు మెరిసిపోతుంది. యూఎస్‌లో ఉండే ప్రతి భారతీయ అమెరికన్‌కి ప్రతిరోజు ఒక వైవిధ్యంగా ఉంటుంది. తాను యూఎస్‌లోని ఇండియన్ ఎంబసీ వేడుకల కోసం ఎదురుచూస్తున్నాను. అమెరికాలో ఉన్న ప్రవాస భారతీయులందరికి స్వాతంత్య్ర శుభాకాంక్షలు" అని పేర్కొన్నారు. చారి తాతగారిది తెలంగాణలోని మహబూబ్ నగర్. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో గణిత శాస్త్ర ప్రోఫెసర్‌గా పనిచేశారు. చారి తండ్రి శ్రీనివాస్ అదే యూనివర్సిటీలో ఇంజనీరింగ్ చదివి ఆ తర్వాత అమెరికా వెళ్లారు. ఆ తర్వాత చారీ అక్కడే యూఎస్‌లోని విస్కాన్సిన్లోని మిల్వాకీలో జన్మించాడు. అయోవాలోని వాటర్లూలో కొలంబస్ హై స్కూల్ నుంచి ప్రాధమిక విద్యను, కొలరాడోలోని యూఎస్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ నుంచి ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేశడు. ఆ తర్వాత అతను కేంబ్రిడ్జ్, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఏరోనాటిక్స్, ఆస్ట్రోనాటిక్స్లో మాస్టర్స్ డిగ్రీని అందుకున్నాడు. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా కోసం పనిచేస్తున్న రాజా చారి 2017లో వ్యోమోగామిగా ఎంపికయ్యాడు. On Indian Independence eve I’m reminded of Indian diaspora that I could see from @Space_Station where my immigrant father’s home town of Hyderabad shines bright. @nasa is just 1 place Indian Americans make a difference every day. Looking forward to @IndianEmbassyUS celebration pic.twitter.com/4eXWHd49q6 — Raja Chari (@Astro_Raja) August 14, 2022 (చదవండి: భారత్‌తో పాటు ఇతర దేశాలకు హృదయ పూర్వక కృతజ్ఞతలు) -
తెలుగోడి నేతృత్వంలో ఐఎస్ఎస్కు నాసా బృందం
-
తాత పుట్టింది మహబూబ్‌నగర్.. మనవడు అడుగు పెట్టేది చంద్ర మండలం
జాబిల్లిపై పరిశోధనలు విస్తృతం చేసేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రాయాన్ ప్రయోగాల్లో బిజీగా ఉండగానే భారత మూలాలు ఉన్న మరో వ్యక్తి ఏకంగా జాబిల్లిపై అడుగు పెట్టేందుకు ఆకాశంలోకి అడుగు పెట్టాడు. Raja Chari-Led SpaceX Crew-3 Mission Lifts Off: నాసా, స్పేస్ ఎక్స్ సంస్థలు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లోకి పంపించేందుకు ప్రయోగించిన స్పేస్‌ఫ్లైట్ స్పేస్ఎక్స్ క్రూ 3లో ఇండో అమెరికన్ రాజాచారి అంతరిక్షంలోకి అడుగు పెట్టారు. రాచాచారితో పాటు మిషన్ స్పెషలిస్ట్ కేయ్లా బారోన్, వెటరన్ అస్ట్రోనాట్ టామ్ మార్ష్‌బర్న్‌లు అంతరిక్ష యానానికి బయల్దేరి వెళ్లారు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న కెన్నెడీ స్పేస్ స్టేషన్ నుంచి నిప్పులు కక్కుకుంటూ వీరిని ఫాల్కన్ రాకెట్ నింగిలోకి మోసుకెళ్లింది. #Crew3... 2... 1... and liftoff! Three @NASA_Astronauts and one @ESA astronaut are on their way to the @Space_Station aboard the @SpaceX Crew Dragon Endurance: pic.twitter.com/dxobsFb4Pa — NASA (@NASA) November 11, 2021 మూలాలు మహబూబ్‌నగర్‌లో అంతరిక్షంలో అడుగు పెడుతున్న రాజాచారి తెలుగు మూలాలు ఉన్న వ్యక్తి. ఆయన తండ్రి శ్రీనివాసాచారి ఉస్మానియా యూనివర్సిటీలో చదువు పూర్తి చేసి అమెరికాలో సెటిల్ అయ్యారు. శ్రీనివాసాచారి తండ్రి స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా. అక్కడి నుంచి గణితం బోధించే అధ్యాపకుడిగా పని చేసేందుకు హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడ్డారు. హైదరాబాద్ టూ అమెరికా ఉస్మానియా యూనివవర్సిలో ఇంజనీరింగ్ పూర్తి చేసి పై చదువుల కోసం అమెరికా వెళ్లారు శ్రీనివాసాచారి. అక్కడ ఉద్యోగం చేస్తూ అమెరికన్ మహిళ పెగ్గీ ఎగ్‌బర్ట్‌ని వివాహం చేసుకున్నారు. వీరికి 1977 జూన్ 24న రాజాచారి జన్మించారు. రాజాచారి పూర్తి పేరు రాజా జాన్ వీర్‌పుత్తూర్ చారి. అస్ట్రోనాట్ చిన్నప్పటి నుంచే అస్ట్రోనాట్ కావాలనే లక్ష్యం పెట్టుకున్నారు చారి. అందుకు తగ్గట్టే చదువులోనే కాదు ఆటపాటల్లోనూ ఆస్ట్రోనాట్ కల ప్రతిబింబిచేలా ప్రవర్తించేవారు. అందుకు తగ్గట్టే 1995లో యూఎస్ స్టేట్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో చేరారు. ఆ తర్వాత 1999లో ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ పట్టా పుచ్చుకున్నారు. ఇదే విభాగంలో 2011లో మాస్టర్స్ పూర్తి చేశారు. నాసాలోకి ఎంట్రీ అంతరిక్ష పరిశోధనల కోసం నాసా 2017లో ఎంపిక చేసిన అస్ట్రోనాట్ గ్రూప్ 22కి ఎంపికయ్యారు రాజా చారి. రెండేళ్ల శిక్షణ అనంతరం 2024లో నాసా చంద్రుడి మీద ప్రయోగాల కోసం చేపట్టనున్న ఆర్టెమిస్ టీమ్‌కి సైతం ఎంపికయ్యారు. ఆ ప్రాజెక్టు సన్నహకాల్లో భాగంగా కమాండ్ ఇన్ ఛీఫ్ హోదాలో స్పేస్ ఎక్స్ క్రూ 3లో ఇంటర్నేషనల్ స్పేస్ సెంటర్‌కి వెళ్లారు. We like turtles. There are three aboard the #Crew3 Endurance capsule on the way to the @Space_Station: Two from the "Turtles" class of astronauts, Kayla Barron and @Astro_Raja, and the third... well, can you spot the zero G indicator? pic.twitter.com/kBmxKawusH — NASA (@NASA) November 11, 2021 ట్యాంక్‌బండ్ జ్ఞాపకాలు మరిచిపోలేను ‘నా తండ్రి మూలాలు భారత్‌లో ఉన్నాయనే విషయం నేను మరిచపోలేదు. ఇప్పటి వరకు మూడు సార్లు హైదరాబాద్‌కి వచ్చాను. అక్కడ మా బంధువులు చాలా మంది ఉన్నారు. చిన్నతనంలో వేసవి సెలవులకు హైదరాబాద్ వచ్చినప్పుడు ట్యాంక్‌బండ్‌కి వెళ్లాం. చాలా ఎంజాయ్ చేశాం. సంతోషంగా గడిపిన ఆ రోజులను నేను ఎన్నడూ మరిచిపోను’ అంటూ భాగ్యనగరంతో తనకున్న అనుభవాలను ఇటీవల నెమరువేసుకున్నారు రాజాచారి. అంతేకాదు హైదరాబాద్‌లో ఉన్నప్పుడు ఇక్కడి ఫుడ్ బాగా ఎంజాయ్ చేశానని, కొన్ని తెలుగు పదాలు కూడా నేర్చుకున్నట్టు ఆయన తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ తెలుగు పదాలు అంతగా గుర్తులేవన్నారు. "It's really mind boggling when you think about how much effort it takes to put people in space and then to sustain them in space." — @Astro_Raja, Commander of the #Crew3 mission to the @Space_Station. pic.twitter.com/FGv5w46Q7a — NASA (@NASA) November 10, 2021 త్వరలో జాబిల్లిపైకి రాజాచారి ప్రస్తుతం హుస్టన్ నగరంలో నివసిస్తున్నారు. ఆయనకు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు. అంతరిక్ష స్పేస్ స్టేషన్లో ప్రయోగాలు ముగించుకుని వచ్చిన తర్వాత ఆయన చంద్రమండల యాత్రకు సన్నద్ధం అవుతారు. చదవండి: చల్లని ‘రాజా’ ఓ చందమామ -
చల్లని ‘రాజా’ ఓ చందమామ
ఒక చిత్రం వెయ్యి పదాలతో సమానం అంటారు.ఈ చిత్రాన్ని చూడండి...పదాలు మాత్రమే కాదు కల, పట్టుదల కలిసికట్టుగా కనిపిస్తాయి. చంద్రుడి పైకి పంపడానికి ‘నాసా’ ఎంపిక చేసిన బృందంలో ఒకరైన రాజాచారి పదకొండు సంవత్సరాల వయసులో తయారుచేసిన పోస్టర్ ఇది.. రాజాచారి పదకొండు ఏళ్ల వయసులో, ప్రస్తుతం.. నిన్న అనేది నేటి జ్ఞాపకంరేపు అనేది నేటి కల. –ఖలీల్ జిబ్రాన్ చిన్న వయసులో పిల్లలు కనే కలలు పెద్దలకు మురిపెంగా ఉంటాయి. చాలామంది పిల్లల్లో ఆ కలలు వయసు పెరుగుతున్నకొద్దీ కరిగిపోతుంటాయి. కొందరు దీనికి మినహాయింపు. వారిలో కలలు కరిగిపోవు. బలపడతాయి. రాజాచారి ఈ కోవకు చెందిన వ్యక్తి. ‘రాజాచారి’ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన పేరు. ‘నాసా’ చంద్రుడి పైకి పంపనున్న వ్యోమగాముల బృందంలో ఇండియన్–అమెరికన్ రాజాచారి ఒకరు. పదకొండు సంవత్సరాల వయసులో ఆస్ట్రోనాట్ కావాలని కలలు కన్నాడు రాజా. ‘ఇది పిల్లకల’ అని తల్లిదండ్రులు తేలిగ్గా తీసుకోలేదు. ఆ కలల సౌధానికి దగ్గర కావడానికి ఒక్కో మెట్టు పేరుస్తూ వచ్చారు. ఉన్నత చదువు, సక్సెస్ఫుల్ కెరీర్ కోసం శ్రీనివాస్‌చారి(రాజా తండ్రి) ఇంజనీరింగ్ డిగ్రీతో హైదరాబాద్ నుంచి అమెరికాకు వెళ్లాడు. అక్కడ అమెరికన్ పెగ్గి ఎగ్బర్ట్ను వివాహం చేసుకున్నాడు. వారి కుమారుడే రాజాచారి. రాజా చిన్నప్పుడు కాగితాలు, మెటల్ హుక్‌లతో బొమ్మ విమానాలు తయారుచేసి మురిసిపోయేవాడు. పక్కింటి పిల్లలు ఈ బొమ్మల కోసం పరుగులు తీస్తూవచ్చేవారు. తన భుజాలకు రెక్కలు తగిలించుకొని ఊహాల్లో ఆకాశంలోకి వెళ్లి వచ్చేవాడు రాజా. ‘ఫాంటసీ ప్రపంచం’లో వీరవిహారం చేసేవాడు. తల్లి టీచర్ కావడంతో ‘చందమామ పాఠాలు’ ఆసక్తికరంగా చెప్పేది. ఎన్నో సందేహాలను ఓపిగ్గా తీర్చేది. సైన్స్ మాత్రమే కాదు సంగీతం అంటే కూడా రాజాకు బాగా ఇష్టం. రెండేళ్ల వయసులోనే సుజుకి మెథడ్ వయోలిన్ పాఠాలు నేర్చుకున్నాడు. ఆరేళ్ల వయసులో ఫ్రెంచ్ హార్న్ ఇన్‌స్ట్రుమెంట్‌లో ప్రావీణ్యం సంపాదించాడు.‘నీ బ్రెయిన్లో కుడి,ఎడమ భాగాలు సమానంగా వృద్ధి చేయడానికి ప్రయత్నించు’ అని రాజాకు పదేపదే చెప్పేది తల్లి. మెదడులోని ఎడమభాగం విశ్లేషణ, కుడిభాగం సృజనాత్మకతను వృద్ధి చేస్తుంది. స్ఫూర్తి కోసం ఎక్కడికో వెళ్లనక్కర్లేదు. స్ఫూర్తిని ఇచ్చే వాళ్లు పెద్దల రూపంలో మన చేరువలోనే ఉంటారు. రాజాచారి తండ్రి శ్రీనివాస్‌చారి అలాంటి వారే. చేతిలో ఇంజనీరింగ్ పట్ట, గుండెలో ధైర్యం...అంతే...అమెరికాకు వచ్చేశాడు. దేశం కాని దేశం. తెలియని మనుషులు. తెలియని కష్టాలు..కాని ఇవేమీ ఆయన ఆలోచించలేదు. అర్జునుడి చూపు పిట్టకన్ను మీదే ఉన్నట్లు శ్రీనివాస్ కన్ను కూడా ఒకే లక్ష్యాన్ని చూసింది. సాధించాలి....ఎలాగైనా సాధించాలి! ఆయన తన ప్రయాణంలో విజయాన్ని సాధించాడు. ఆ స్ఫూర్తిని కుమారుడికి అందించాడు.‘బాగా కష్టపడి చదివితే ఎన్నో ద్వారాలు నీకోసం తెరుచుకుంటాయి. జీవితాన్ని సంతోషమయం చేసుకోవడానికి కష్టాన్ని ఇష్టపడాలి’ అని రాజాచారితో చెబుతుండేవారు శ్రీనివాస్.‘‘ఇతరులు ఏమైనా అనుకుంటారని, హేళన చేస్తారనే భయం నాలో ఎప్పుడూ లేదు. నేను ఒకటి ఇష్టపడ్డాను అంటే. ఇక అంతే...చాలా కష్టపడతాను’ అంటాడు రాజాచారి. ఆ కష్టమే అతడిని యూఎస్ ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో ఆస్ట్రోనాటికల్ ఇంజనీరింగ్ చేసేలా, మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఐటీ)లో ఆస్ట్రోనాటిక్స్, ఏరోనాటిక్స్‌లో మాస్టర్డిగ్రీ చేసేలా చేసింది. టెస్ట్ పైలట్‌గా మార్చింది. ఆతరువాత తన ఆస్ట్రోనాట్ కల గుర్తుకు వచ్చింది. అదేమీ ఆషామాషీ కల కాదు. అలా అని వెనక్కి తగ్గే వ్యక్తి కాదు. ‘నాసా’లో పనిచేసే వ్యక్తులను కలవడం మొదలైంది. వారు తనలో ఎంతో స్ఫూర్తి నింపారు. కమాండర్ ఆఫ్ ది 461 ఫ్లైట్ టెస్ట్ స్క్వాడ్రన్, డైరెక్టర్ ఆఫ్ ది ఎఫ్–35 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ఫోర్స్గా తన టాలెంట్ చాటుకున్న చారి 2017లో నాసా ‘ఆస్ట్రోనాట్ క్యాండిడెట్ క్లాస్’కు ఎంపికయ్యాడు. టెస్ట్ పైలట్‌గా రోజువారీ సవాళ్లను ఎదుర్కొనే నైపుణ్యం, సంక్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలు వెదికే ధైర్యం ‘నాసా కమ్యూనిటీ’లో ఉపయోగపడింది. ‘నిరంతర పఠనం, నిరంతరం మెరుగుపరుచుకోవడం ఇదే నా జీవనతత్వం’ అని చెబుతున్న రాజాచారికి జయహో చెబుదాం. -
చందమామపైకి రాజాచారి!
వాషింగ్టన్ : చందమామను మళ్లీ అందుకునే యత్నాలు ఆరంభించిన అమెరికా అంతరిక్ష సంస్థ నాసా చంద్రుడిపైకి మనుషుల్ని పంపే మిషన్ ఆర్టిమిస్‌లో పాల్గొనే 18 మంది పేర్లను ఖరారు చేసింది. వారిలో ఇండియన్ అమెరికన్, హైదరాబాద్ మూలాలున్న రాజా జాన్ వుర్పుతూర్ చారికి చోటు లభించింది. 1970 తర్వాత మళ్లీ చంద్రుడిపైకి యాత్ర చేయడానికి సన్నాహాలు చేస్తున్న నాసా ఈ సారి వ్యోమగాముల ఎంపికలో ఎన్నో ప్రత్యేకతలు కనబరిచింది. మొత్తం 18 మంది వ్యోమగాముల్ని ఎంపిక చేస్తే, అందులో తొమ్మిది మంది మహిళలే కావడం విశేషం. విభిన్న జాతుల వారూ ఈ సారి స్థానం దక్కించుకున్నారు. వ్యోమగాముల బృందంలో ఎక్కువ మంది 30, 40 వయసులో ఉన్న వారే. ఫ్లోరిడాలోని నాసా కెన్నెడీ స్పేస్ సెంటర్లో జరిగిన వైట్ హౌస్ జాతీయ అంతరిక్ష మండలి సమావేశంలో చంద్రుడిపైకి పంపే వారి తుది జాబితాను ఖరారు చేశారు. అమెరికా ఉపా«ధ్యక్షుడు మైక్ పెన్స్ ఈ 18 మంది పేర్లను ప్రకటించారు. ‘‘మన భావి హీరోలను మీకు పరిచయం చేస్తున్నాను. వీళ్లంతా చంద్రుడి పైకి వెళ్లి చరిత్రను తిరగరాస్తారు. వీరిని ఆర్టిమిస్ తరంగా భావించవచ్చు’’ అని మైక్ పెన్స్ చెప్పారు. నాసా ఆర్టిమిస్ మిషన్ 2024లో చంద్రుడిపైకి వెళ్లనుంది. ఆకాశంలోనే కాదు.. ఆకాశంలోనే కాదు జాబిల్లి యాత్రలో కూడా మహిళలు సగమనేలా ఈదఫా బృందంలోని మొత్తం 18 ఆస్ట్రోనాట్లలో తొమ్మిది మంది మహిళలే ఉన్నారు. అంతేకాదు ఈ సారి చంద్రుడిపైన తొలుత ఒక మహిళే కాలు మోపుతుంది. ఆ తర్వాతే బృందంలో మిగిలిన వారు అడుగు పెడతారు. గత ఏడాది మొదటి సారిగా స్పేస్ వాక్ చేసిన క్రిస్టినా కొచ్, జెస్సికా మీర్లు మూన్ మిషన్‌లో కూడా ఉన్నారు. ఇక ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న ఆస్ట్రోనాట్ పాట్ ఫారెస్ట్ తమ ఆనందానికి హద్దుల్లేవని అన్నారు. చంద్రుడిపైకి వెళతామన్న ఊహ ఎంతో ఉద్వేగానికి గురి చేస్తోందని చెప్పారు. చంద్రుడిపై అటూ ఇటూ చక్కెర్లు కొట్టాలన్న కల నిజం కాబోతోందని, అందరికీ దక్కిన అపూర్వమైన గౌరవమిదని ఆయన చెప్పారు. మనోడే.. నాసా మూన్ మిషన్ యాత్రికుల్లో ఒకరైన ప్రవాస భారతీయుడు రాజాచారి హైదరాబాద్ మూలాలున్న వ్యక్తి. రాజాచారి తాతది మహబూబ్‌నగర్. హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో గణితశాస్త్రం ప్రొఫెసర్‌గా పనిచేశారు. ఆయన కుమారుడు శ్రీనివాస్ చారి. తన 13 ఏళ్ల వయసులో ఉండగానే తండ్రిని కోల్పోయిన శ్రీనివాస్ తల్లి, అక్కల సంరక్షణలో పెరిగారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి కాగానే 1970లో శ్రీనివాస్ అమెరికాకు వెళ్లిపోయారు. విస్కన్సిన్ యూనివర్సిటీలో మాస్టర్స్ చేస్తుండగా పెగ్గీ ఎగ్బర్ట్‌తో ప్రేమలో పడ్డారు. మూడేళ్లు డేటింగ్ చేశాక 1976లో పెళ్లి చేసుకున్నారు. వారికి 1977 జూన్ 25న రాజాచారి జన్మించారు. అయోవా రాష్ట్రంలో పెరిగిన రాజాచారి ప్రఖ్యాత మస్సాచుసెట్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లో ఇంజనీరింగ్ చదివారు. ఏరోనాటిక్స్‌లో మాస్టర్స్ చేశారు. అక్కడ నుంచి అమెరికా ఎయిర్‌ఫోర్స్ అకాడమీలో పని చేశారు. 43 ఏళ్ల వయసున్న రాజాచారి 2017లో వ్యోమగాముల శిక్షణ కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఈ ఏడాది జనవరిలో తన శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకొని ఇప్పుడు చరిత్రాత్మక మూన్ మిషన్‌లో చోటు సంపాదించారు. రాజాచారి, ఆయన తమ్ముడు కృష్ణ అమెరికాలో పుట్టి పెరిగినా భారతదేశ సంస్కృతి సంప్రదాయాల పట్ల ఎనలేని మమకారం. శ్రీనివాస్ తన ఇద్దరు కుమారుల్ని భారతీయ మూలాలను మర్చిపోకుండా పెంచారు. రాజాచారికి కొంచెం హిందీ కూడా వచ్చు. తల్లిదండ్రుల పెంపకమే తననీ స్థాయికి చేర్చిందని రాజాచారి గర్వంగా చెప్పుకుంటారు. -
నాసా వ్యోమగాముల్లో భారత సంతతి వ్యక్తి
హూస్టన్: నాసా త్వరలో చేపట్టనున్న అంతరిక్ష ప్రయోగా నికి ఎంపికైన 12 మంది వ్యోమగాముల్లో భారత్ సంతతికి చెందిన యూఎస్ ఎయిర్ ఫోర్స్‌లో లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేస్తున్న రాజాచారి(39) చోటు దక్కించుకున్నారు. ఎర్త్ ఆర్బిట్ అండ్ డీప్ స్పేస్ మిషన్ల కోసం నాసా గతంలో దరఖాస్తులను ఆహ్వానించింది. దీనికోసం రికార్డు స్థాయిలో 18,300 మంది దరఖాస్తు చేసుకోగా .. వీరిలో 12 మందిని నాసా ఎంపిక చేసింది. ప్రస్తుతం అయోవా రాష్ట్రంలోని వాటర్లూ నగరంలో నివసిస్తున్న రాజాచారీ మసాచూసెట్స్ ఇన్స్టిట్యూట్ నుంచి ఎరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్లో మాస్టర్ డిగ్రీ, అమెరికాలోని నావెల్ టెస్ట్ పైలట్ స్కూల్ నుంచి డిగ్రీ పట్టా అందుకున్నారు. ప్రస్తు తం ఆయన 461 ఫ్లైట్ టెస్ట్ స్క్వాడ్రన్‌లో కమాండర్‌గా, కాలిఫోర్నియాలోని ఎడ్వర్డ్స్ ఎయిర్‌ఫోర్స్ బేస్‌లో ఉన్న ఎఫ్–35 ఇంటిగ్రేటెడ్ టెస్ట్ ఫోర్స్‌కు డైరెక్టర్‌గా ఉన్నారు.