వేటుకు సిద్ధం
క్రైం (కడప అర్బన్) : ఎర్ర డ్రైవర్లపై వేటుకు రంగం సిద్ధమైంది. ఎర్రచందనం అక్రమ రవాణాలో స్మగ్లర్లకు సాయపడుతున్న ఆర్టీసీ డ్రైవర్ల జాబితాలో మరో 30 మంది చేరారు. ఇప్పటికే 11 మంది డ్రైవర్లు రిమాండ్‌లో ఉన్నారు.
నాలుగు రోజుల క్రితం ఆర్టీసీ విజిలెన్స్ ఏడీ రజనీకాంత్‌రెడ్డి కడపకు వచ్చి జోనల్ వ్యాప్తంగా విజిలెన్స్ అధికారుల నివేదికను పరిశీలించారు. నివేదికను ఆర్టీసీ ఎండీ పూర్ణచంద్రరావుకు అందజేసినట్లు తెలుస్తోంది. దీంతో త్వరలోనే ఎర్రడ్రైవర్లపై ఆర్టీసీ ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది.