ramanayyapeta
-
సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాలి
వైఎస్సార్ సీపీ సీజీసీ సభ్యురాలు విజయలక్ష్మి కాకినాడ రూరల్ : తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు రంగవల్లులు దర్పణాలుగా నిలుస్తాయని, వీటిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి అన్నారు. బుధవారం రాత్రి రమణయ్యపేట పంచాయతీ పరిధిలోని రాయుడుపాలెం, కొత్తూరులలో పార్టీ రాష్ట్ర యువత కార్యదర్శి లింగం రవి, జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి పాలగుమ్మి నాగరాణిల ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ఉత్సవాలలో ఆమె పాల్గొన్నారు. పండగల్లో సంస్కృతితో పాటు భక్తి, సేవాగుణం, అనుబంధాలు, ఆటపాటలు, ఉల్లాసం, ఉత్సాహం సమ్మిళితమై ఉంటాయన్నారు. భవిష్యత్తు తరాలకు వాటిని అందించాలన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రవి, నాగరాణిలు సంక్రాతి ఉత్సవాలను తెలుగు సంప్రదాయం ఉట్టిపడేలా గ్రామాల్లో చేపట్టడం అభినందనీయమన్నారు. సంక్రాంతి ఉత్సవాలను పురస్కరించుకొని వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో రాయుడుపాలెంలో వినూత్న పద్ధతిలో ఇంటింటా సంక్రాంతి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రతి ఇంటి వద్దా రంగవల్లులు వేసే కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 200 మంది మహిళలు తమ ఇళ్ల వద్ద రంగురంగుల ముగ్గులు వేసి గ్రామ ఐక్యతను చాటారు. వారిలో ఐదుగురిని విజేతలుగా ఎంపిక చేసి బహుమతులు అందజేశారు. మరో 9 మందికి కన్సొలేష¯ŒS బహుమతులు, 10 మందికి లక్కీడిప్ ద్వారా, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న మరో 11 మందికి మొత్తం 36 మందికి బహుమతులు అందజేశారు. కూచిపూడి, భరతనాట్యం, చిన్నారులతో సాంప్రదాయ దుస్తుల పోటీలు నిర్వహించారు. గ్రామస్తుల కోరికపై జక్కంపూడి విజయలక్ష్మి లింగం రవిని దుశ్శాలువాతో సత్కరించారు. పెద్దాపురం స్పెషల్ కోర్టు జడ్జి సూరిబాబు, ఫుడ్ కార్పొరేష¯ŒS ఆఫ్ ఇండియా రాష్ట్ర కన్సలే్టటివ్ కమిటీ సభ్యుడు అబ్బిరెడ్డి ప్రభాకరరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు చెల్లే శేషారావు, విత్తనాల రమణ, పెంకే వీరబాబు, కొత్తపల్లి గిరీష్, మండల పార్టీ ప్రధాన కార్యదర్శి డీకే వరప్రసాద్, మహిళా నాయకులు పల్లా కాత్యాయని, వెంట్రు స్వర్ణలత, ముదిలి శ్రీదేవి, మాలతి, రజని తదితరులు పాల్గొన్నారు. -
బందోబస్తు మధ్య స్పిల్చానల్
* రామయ్యపేట నిర్వాసితుల ఆందోళన * గ్రామం ఖాళీ చేసేవరకూ ఆపాలని డిమాండ్ * అయినా వినని అధికారులు పోలవరం : పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా రామయ్యపేట గ్రామ సమీపంలో స్పిల్ చానల్ తవ్వకం పనులను శుక్రవారం సాయంత్రం అధికారులు పోలీసు బందోబస్తు మధ్య ప్రారంభించారు. ఈ పనులను అడ్డుకునేందుకు అధిక సంఖ్యలో రామయ్యపేట నిర్వాసితులు తరలివచ్చారు. కొద్దిసేపు పనులను అడ్డుకున్నారు. అధికారులు వారిని హెచ్చరించి వెనక్కు పంపేసి పనులను కొనసాగించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామం రామయ్యపేట సమీపంలోని 80 ఎకరాల భూమిలో శుక్రవారం సాయంత్రం స్పిల్చానల్ నిర్మాణం కోసం మట్టి తవ్వకం పనులు ప్రారంభించారు. ఈ మట్టిని గ్రామ సమీపంలో డంపింగ్ చేస్తున్నారు. గతంలో అనేకసార్లు నిర్వాసితులు ఈ పనులను అడ్డుకున్నారు. గ్రామం ఖాళీ చేసి వెళ్లే వరకూ ఈ పనులు చేపట్టవద్దని డిమాండ్ చేశారు. దీంతో అధికారులు అప్పట్లో పనులను నిలిపివేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం మళ్లీ పోలీసు బందోబస్తు మధ్య అధికారులు స్పీల్చానల్ తవ్వకం ప్రారంభించారు. దీంతో రామయ్యపేట నిర్వాసితులు తరలివచ్చి తమకు ఆర్అండ్ఆర్ ప్యాకేజ్ పూర్తిగా అమలు చేయలేదని, కొందరికి ఇళ్లస్థలాలు కేటాయించలేదని, పునరావాస కేంద్రంలో ఇళ్ల నిర్మాణం కూడా పూర్తి కాలేదని, గ్రామం విడిచి వెళ్లే వరకు పనులు చేయబోమని చెప్పిన అధికారులు ఇప్పుడు ఎలా ప్రారంభించారని ప్రశ్నించారు. గ్రామాన్ని ఖాళీ చేసేవరకూ పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. పనులు చేస్తున్న వారికి నిర్వాసితులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. ఈ సమయంలో అక్కడికి చేరుకున్న జంగారెడ్డిగుడెం ఆర్డీఓ ఎస్.లవన్న మాట్లాడుతూ ఈ భూములను ఎనిమిదేళ్ల క్రితం సేకరించి ఇరిగేషన్ అధికారులకు అప్పగించామని, ఈ పనులను అడ్డుకోవద్దని హెచ్చరించారు. పోలవరం ఎస్సై కె. శ్రీహరిరావు మాట్లాడుతూ నిర్వాసితులకు సమస్యలు ఉంటే గ్రామంలో అధికారులతో మాట్లాడుకుని పరిష్కరించుకోవాలని, పనులకు అడ్డురావద్దని స్పష్టం చేశారు. దీంతో నిర్వాసితులు వెనుతిరిగి వెళ్లిపోయారు. సుమారు 50 మంది పోలీసుల బందోబస్తు మధ్య అధికారులు పనులు కొనసాగించారు.