కాల్చుకుని చనిపోయిన ప్రేమజంట
వాళ్లిద్దరూ ప్రేమ జంట. కానీ పెద్దలు మాత్రం వాళ్ల సంబంధాన్ని అంగీకరించలేదు. కలిసి జీవించలేకపోయినా.. కలిసి మరణిద్దామనుకున్నారు. అంతే, రాంలీలా సినిమాలో చూపించినట్లుగా రివాల్వర్లు తీసుకుని.. పరస్పరం కాల్చుకుని చనిపోయారు. అచ్చం సినిమాను తలపించే ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్‌లో జరిగింది. అంకుర్ (20), సరేష్టి (19) అనే ఈ ఇద్దరిదీ ఒకే కులం కూడా. వాళ్లిద్దరూ సీనియర్ ఇంటర్ చదువుతున్నారు.
కానీ వాళ్ల సంబంధాన్ని పెద్దలు అంగీకరించలేదు. ఏం చేద్దామా అనుకున్నారు. అమ్మాయి బుధవారం నాడు అబ్బాయి ఇంటికి వెళ్లింది. ఇద్దరూ మాట్లాడుకున్నారు. చివరకు చనిపోవాలనే నిర్ణయం తీసుకున్నారు. అంతే, కాల్చుకుని చనిపోయారు. వాళ్ల మృతదేహాల వద్ద రెండు పిస్టల్స్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసును దర్యాప్తు చేస్తున్నారు.