rana ayyubh
-
రాణా అయ్యుబ్‌కు ఈడీ షాక్.. మనీలాండరింగ్‌పై ఛార్జ్‌షీట్
లక్నో: ప్రముఖ జర్నలిస్ట్ రాణా అయ్యుబ్‌పై మనీలాండరింగ్ కేసు నమోదు చేశారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు. ఛారిటీ పేరుతో ప్రజల నుంచి నిధులు సేకరించి ఆమె మోసానికి పాల్పడినట్లు అభియోగాలు మోపారు. 2021లో ఉత్తర్‌ప్రదేశ్‌లో నమోదైన ఓ ఎఫ్ఐఆర్ ఆధారంగా గాజియాబాద్ కోర్టులో బుధవారం ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కెట్టో అనే ఆన్లైన్ క్రౌడ్ ఫండింగ్ ప్లాట్‌ఫాం ద్వారా మూడు క్యాంపెయిన్లను నిర్వహించి రాణా అయ్యుబ్ కోట్ల రూపాయాలు వసూలు చేశారని ఈడీ ఛార్జ్‌షీట్‌లో పేర్కొంది. మురికివాడల్లోని నివాసితులు, రైతుల కోసం మొదటిసారి 2020 ఏప్రిల్-మే మధ్యకాలంలో, అస్సాం, బిహార్, మహాష్ట్ర రిలీఫ్ పేరుతో రెండోసారి 2020 జూన్-సెప్టెంబర్ మధ్యకాలంలో, కోవిడ్ సాయం కోసం 2021 మే-జూన్ మధ్యకాలంలో మూడోసారి రాణా అయ్యుబ్ విరాళాలు సేకరించినట్లు పేర్కొంది. ఈ మూడు క్యాంపెయిన్ల ద్వారా రాణా అయ్యుబ్ మొత్తం రూ.2.69కోట్లు వసూలు చేశారని, అందులో రూ.80.5 లక్షలు విదేశాల నుంచి అందాయని ఈడీ అధికారులు వెల్లడించారు. అయితే ఐటీ శాఖ విదేశీ విరాళాలపై విచారణకు ఆదేశించగానే ఆ డబ్బునంతా రాణా అయ్యుబ్ తిరిగి దాతలకే పంపారని వివరించారు. ఈ.2.69 కోట్లను ఆమె అక్రమంగానే సేకరించారని పేర్కొన్నారు. విరాళాల రూపంలో సేకరించిన నిధులలో రూ.50లక్షలు రాణా అయ్యుబ్ తండ్రి, సోదరి ఖాతాలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమె వాటిని తన ఖాతాలోకి మళ్లించింది. రూ.29లక్షలు మాత్రం ఛారిటీ కోసం ఉపయోగించినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో రాణా అయ్యుబ్‌కు చెందిన రూ.1.77కోట్లను ఈడీ అటాచ్ చేసింది. అందులో రూ.50లక్షల ఫిక్స్డ్ డిపాజిట్ కూడా ఉంది. చదవండి: జమ్ములో వివాదాస్పద ఉత్తర్వుల ఉపసంహరణ -
గుజరాత్ ఫైల్స్
జర్నలిస్టు రానా అయ్యూబ్ ఎనిమిది నెలల పాటు అండర్ కవర్లో ఉంటూ గుజరాత్ మత కల్లోలాలు, బూటకపు ఎన్కౌంటర్లు, రాష్ట్ర హోంశాఖ మంత్రి హరేన్ పాండ్యా హత్యలను దర్యాప్తు చేసి బయటపెట్టిన ఎన్నో విభ్రాంతికర విషయాల సమాహారమే గుజరాత్ ఫైల్స్. అమెరికన్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కన్జర్వేటరీ నుండి వచ్చిన ఫిల్మ్‌మేకర్ మైథిలీ త్యాగిగా రానా గుజరాత్ రాష్ట్రంలో 2001, 2010 మధ్య అత్యంత కీలక పదవుల్లో ఉన్న ఉన్నతాధికారులను, పోలీసు అధికారులను కలిసింది. రాజ్యం, దాని అధికారగణం మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేయడంలో ఎట్లా భాగస్వాములయ్యాయో ఈ స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టిన విషయాలు తెలుపుతాయి. నరేంద్ర మోదీ, అమిత్ షాలు అధికార శిఖరాలకు ఎగబాకటం కోసం గుజరాత్ నుండి ఢిల్లీ దాకా వాళ్లు చేసిన ప్రయాణానికి సమాంతరంగా నడిచిన కేసుల గురించి ఎన్నో సంచలనాత్మక విషయాలను ఈ పుస్తకం బయటపెడుతుంది. (‘గుజరాత్ ఫైల్స్: ఎనాటమీ ఆఫ్ ఎ కవర్ అప్’ తెలుగు అనువాదం ‘గుజరాత్ ఫైల్స్’ ఆవిష్కరణ డిసెంబర్ 8న సాయంత్రం 5:30కు సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాల్లో జరగనుంది. అనువాదం: ఎన్.రవి. రానా అయ్యూబ్ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమంలో కాత్యాయని, జహీద్ అలీ ఖాన్, జి.ఎస్.రామ్మోహన్, రమా మెల్కోటె, మహ్యద్ లతీఫ్ ఖాన్ వక్తలు. ప్రచురణ: ‘మలుపు’.)