గుజరాత్ ఫైల్స్
జర్నలిస్టు రానా అయ్యూబ్ ఎనిమిది నెలల పాటు అండర్ కవర్‌లో ఉంటూ గుజరాత్ మత కల్లోలాలు, బూటకపు ఎన్‌కౌంటర్లు, రాష్ట్ర హోంశాఖ మంత్రి హరేన్ పాండ్యా హత్యలను దర్యాప్తు చేసి బయటపెట్టిన ఎన్నో విభ్రాంతికర విషయాల సమాహారమే గుజరాత్ ఫైల్స్. అమెరికన్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్ కన్జర్వేటరీ నుండి వచ్చిన ఫిల్మ్‌మేకర్ మైథిలీ త్యాగిగా రానా గుజరాత్ రాష్ట్రంలో 2001, 2010 మధ్య అత్యంత కీలక పదవుల్లో ఉన్న ఉన్నతాధికారులను, పోలీసు అధికారులను కలిసింది. రాజ్యం, దాని అధికారగణం మానవత్వానికి వ్యతిరేకంగా నేరాలు చేయడంలో ఎట్లా భాగస్వాములయ్యాయో ఈ స్టింగ్ ఆపరేషన్ ద్వారా బయటపెట్టిన విషయాలు తెలుపుతాయి.
నరేంద్ర మోదీ, అమిత్ షాలు అధికార శిఖరాలకు ఎగబాకటం కోసం గుజరాత్ నుండి ఢిల్లీ దాకా వాళ్లు చేసిన ప్రయాణానికి సమాంతరంగా నడిచిన కేసుల గురించి ఎన్నో సంచలనాత్మక విషయాలను ఈ పుస్తకం బయటపెడుతుంది.
(‘గుజరాత్ ఫైల్స్: ఎనాటమీ ఆఫ్ ఎ కవర్ అప్’ తెలుగు అనువాదం ‘గుజరాత్ ఫైల్స్’ ఆవిష్కరణ డిసెంబర్ 8న సాయంత్రం 5:30కు సుందరయ్య విజ్ఞాన కేంద్రం మినీ హాల్లో జరగనుంది. అనువాదం: ఎన్.రవి. రానా అయ్యూబ్ ముఖ్య అతిథిగా పాల్గొనే ఈ కార్యక్రమంలో కాత్యాయని, జహీద్ అలీ ఖాన్, జి.ఎస్.రామ్మోహన్, రమా మెల్కోటె, మహ్యద్ లతీఫ్ ఖాన్ వక్తలు. ప్రచురణ: ‘మలుపు’.)