RBI orders
-
డీసీయూబీ డిపాజిటర్ల ఆందోళన
భవానీపురం (విజయవాడ పశ్చిమ): విజయవాడలోని దుర్గా కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ (డీసీయూబీ)లో డిపాజిట్ చేసిన వారి పరిస్థితి ఆందోళనకరంగా మారింది. కాలపరిమితి ముగిసినా డిపాజిట్లను తిరిగి ఇవ్వకపోవడంతో డిపాజిటర్లు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరికి చెప్పుకోవాలో తెలియని స్థితిలో కన్నీటి పర్యంతం అవుతున్నారు. రుణాలు తీసుకున్న వారినుంచి రావాల్సిన మొండి బకాయిలు వసూలు చేయకపోవడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డీసీయూబీ లావాదేవీలను నిలిపివేస్తూ 2022 జూలై 29న ఆదేశాలు జారీ చేసింది.ఈ నేపథ్యంలో విజయవాడ విద్యాధరపురం నాలుగు స్తంభాల సెంటర్లో గల డీసీయూబీ బ్రాంచి వద్ద పలువురు డిపాజిటర్లు ఆదివారం సమావేశమయ్యారు. దాదాపు 92 ఏళ్ల చరిత్ర గల ఈ బ్యాంక్‌తో 40–50 అనుబంధం ఉన్నవారు రూ.6 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు డిపాజిట్లు చేశారు. వారికి సీపీఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మద్దతుగా నిలిచారు. డిపాజిటర్లలో ఒకరైన ఎస్.లక్ష్మీకనకదుర్గ కుమారుడు సత్యకుమార్ మాట్లాడుతూ.. ఇక్కడ డిపాజిట్ చేసిన వారిలో అంతా 50–60 ఏళ్లు పైబడిన వారేనని తెలిపారు.ఓ మహిళ తన కుమార్తె వివాహం నిమిత్తం రూ.7 లక్షలు డిపాజిట్ చేసిందని, ఆ మొత్తం తిరిగి ఇవ్వకపోవడంతో ఆమె పరిస్థితి దయనీయంగా మారిందని వివరించారు. బ్యాంక్ సిబ్బంది డిపాజిటర్లు ఏమైనా అడిగితే దురుసుగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. రుణాలు తీసుకున్న ఖాతాదారుల నుంచి రావల్సిన బకాయిలను వసూలు చేయలేక డిపాజిట్లను తిరిగి ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. 6 నెలల్లో కొలిక్కి రావచ్చుబ్యాంక్లో పేరుకుపోయిన మొండి బకాయిల కారణంగా ఆర్బీఐ లావాదేవీలను నిలిపివేస్తూ ఆదేశాలిచ్చిందని బ్యాంక్ సీఈఓ బంకా శ్రీనివాసరావు తెలిపారు. డిపాజిటర్లు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమేనని.. మొండి బకాయిలు ఉన్నవారి ఆస్తులను స్వాధీనం చేసుకుని వేలం ద్వారా వసూలు చేయాలని ఆర్బీఐ ఆదేశించిందన్నారు. డిపాజిటర్లకు చెల్లించాల్సిన మొత్తం రూ.40 కోట్ల నుంచి రూ.50 కోట్ల వరకుఉండగా.. మొండి బకాయిలు రూ.240 కోట్ల నుంచి రూ.250 కోట్ల వరకు ఉన్నాయన్నారు. డిపాజిటర్లు మరో 6 నెలలు ఓపిక పడితే అంతా సర్దుకుంటుందని, ఆర్బీఐ నిబంధనలను సడలింవచ్చన్నారు. అప్పుడు మెచ్యూర్ అయిన డిపాజిట్లను తిరిగి చెల్లిస్తామని, ఆందోళన చెందవద్దన్నారు. -
కొత్త రూ.500 నోట్లు వచ్చేశాయి..
నేటి నుంచి మార్పిడి మొదలు నేడు తెరుచుకోనున్న బ్యాంకులుయి విశాఖపట్నం : కొత్త రూ.500 నోట్లు జిల్లాకు వచ్చేశాయి. గురువారం నుంచి ఇది చలామణిలోకి రానున్నాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత మూతపడిన బ్యాంకులు తెరుచుకోనున్నాయి. శని, ఆదివారాలు కూడా పనిచేసేలా ఇప్పటికే ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. గురువారం ఉదయం తొమ్మిది గంటలకే సిబ్బంది కార్యాలయాలకు వచ్చి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. చెల్లుబాటు కాని రూ.500, రూ.1000 నోట్లను మార్చుకునేందుకు వీలుగా ప్రతి బ్యాంకులోనూ అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. బ్యాంకులో ఖాతా ఉంటే రోజుకు గరిష్టంగా రూ.10 వేలు, లేకుంటే రూ.4 వేలు వరకు మార్చుకోవచ్చు. వారానికి గరిష్టంగా రూ.20 వేలు దాటడానికి వీల్లేదు. ఇందుకు ఆర్బీఐ నిర్దేశించిన ఫారం నింపి, ఐడీ నంబర్ మస్ట్‌గా జతచేయాల్సి ఉంటుంది. పాత నోట్లను డిపాజిట్ చేయదలిచే అవకాశం కూడా గురువారం నుంచి మొదలుకానుంది. ఎంత డిపాజిట్ చేసినా అభ్యంతరం చెప్పరు. అయితే రూ.50వేలకు పైబడి డిపాజిట్ చేస్తే మాత్రం విధిగా పాన్ కార్డ్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎలాంటి ఆందోళన అవసరం లేదు చలామణిలో లేని రూ.500, రూ.1000 నోట్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదు. మీ వద్ద ఉన్న పాత నోట్లను బ్యాంకుల వద్ద గురవారం నుంచి మార్చుకునే అవకాశం ఆర్బీఐ కల్పించింది. వచ్చే నెల 30 వరకు ఈ అవకాశం ఉన్నందున ఏ ఒక్కరూ భయాందోళనలకు గురికానవసరం లేదు. శనివారం నుంచి ఏటీఎంలు పనిచేస్తారుు. -డి,శరత్‌బాబు, ఎల్డీఎం