![కొత్త రూ.500 నోట్లు వచ్చేశాయి..](/styles/webp/s3/article_images/2017/09/4/71478808467_625x300.jpg.webp?itok=p-WUcPO3)
కొత్త రూ.500 నోట్లు వచ్చేశాయి..
నేటి నుంచి మార్పిడి మొదలు
నేడు తెరుచుకోనున్న బ్యాంకులుయి
విశాఖపట్నం : కొత్త రూ.500 నోట్లు జిల్లాకు వచ్చేశాయి. గురువారం నుంచి ఇది చలామణిలోకి రానున్నాయి. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం తర్వాత మూతపడిన బ్యాంకులు తెరుచుకోనున్నాయి. శని, ఆదివారాలు కూడా పనిచేసేలా ఇప్పటికే ఆర్బీఐ ఆదేశాలు జారీ చేసింది. గురువారం ఉదయం తొమ్మిది గంటలకే సిబ్బంది కార్యాలయాలకు వచ్చి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశాలు జారీ అయ్యాయి. చెల్లుబాటు కాని రూ.500, రూ.1000 నోట్లను మార్చుకునేందుకు వీలుగా ప్రతి బ్యాంకులోనూ అదనపు కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు. బ్యాంకులో ఖాతా ఉంటే రోజుకు గరిష్టంగా రూ.10 వేలు, లేకుంటే రూ.4 వేలు వరకు మార్చుకోవచ్చు. వారానికి గరిష్టంగా రూ.20 వేలు దాటడానికి వీల్లేదు. ఇందుకు ఆర్బీఐ నిర్దేశించిన ఫారం నింపి, ఐడీ నంబర్ మస్ట్‌గా జతచేయాల్సి ఉంటుంది. పాత నోట్లను డిపాజిట్ చేయదలిచే అవకాశం కూడా గురువారం నుంచి మొదలుకానుంది. ఎంత డిపాజిట్ చేసినా అభ్యంతరం చెప్పరు. అయితే రూ.50వేలకు పైబడి డిపాజిట్ చేస్తే మాత్రం విధిగా పాన్ కార్డ్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఎలాంటి ఆందోళన అవసరం లేదు
చలామణిలో లేని రూ.500, రూ.1000 నోట్ల విషయంలో ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదు. మీ వద్ద ఉన్న పాత నోట్లను బ్యాంకుల వద్ద గురవారం నుంచి మార్చుకునే అవకాశం ఆర్‌బీఐ కల్పించింది. వచ్చే నెల 30 వరకు ఈ అవకాశం ఉన్నందున ఏ ఒక్కరూ భయాందోళనలకు గురికానవసరం లేదు. శనివారం నుంచి ఏటీఎంలు పనిచేస్తారుు. -డి,శరత్‌బాబు, ఎల్‌డీఎం