Re-release
-
పుష్పకు ఆదరణ కరువు.. రూ.1 కోటి కూడా రాలే!
క్లాసిక్, బ్లాక్‌బస్టర్ సినిమాలను మళ్లీ రిలీజ్ చేయడం ఇప్పుడు ప్యాషన్ అయిపోయింది. అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటించిన సూపర్ హిట్ మూవీ పుష్పను ఇటీవలే మళ్లీ విడుదల చేశాడు. నవంబర్ 22 నుంచి ఈ మూవీ హిందీ వర్షన్ థియేటర్లలో ఆడుతోంది. దీనితో పాటు హిందీ కల్ట్ క్లాసిక్ కరణ్ అర్జున్ కూడా ఒకేరోజు రిలీజైంది. షారూఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం వారం రోజుల్లో రూ.1 కోటి వసూలు చేసింది.ఏ సినిమా కలెక్షన్స్ ఎంతంటే?పుష్ప కేవలం రూ.70 లక్షలు మాత్రమే రాబట్టింది. రీరిలీజ్ ట్రెండ్‌లో కరణ్ అర్జున్, పుష్ప రెండూ నిరాశపర్చాయి. ఇకపోతే షారూఖ్ ఖాన్ 'కల్ హో నా హో' సినిమా కూడా నవంబర్ 15న రీరిలీజ్ అవగా ఇప్పటికీ థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. ఈ చిత్రం పది రోజుల్లోనే రూ.3.70 కోట్లు వసూలు చేసింది.పుష్ప 2ఇకపోతే అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ డిసెంబర్ 5న విడుదల కానుంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తోంది. దేవి శ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను మైత్రీమూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, యలమంచిలి రవిశంకర్ నిర్మించారు. -
బాస్ మళ్లీ వస్తున్నాడు
మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు బాస్. రజనీకాంత్ హీరోగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘శివాజీ: ది బాస్’ ఈ నెల 20న రీ రిలీజ్‌కి ముస్తాబవుతోంది. శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్, శ్రియ జంటగా నటించిన చిత్రం ‘శివాజీ: ది బాస్’. ఈ సినిమాలో సుమన్ విలన్ పాత్ర చేశారు. ఎంఎస్ గుహన్, ఎం. శరవణన్ నిర్మించిన ఈ సినిమా 2007లో విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. తెలుగులోనూ ఈ సినిమా సూపర్ హిట్ అయింది.తమిళ సినిమా ఇండస్ట్రీ చరిత్రలో రూ. 100 కోట్ల క్లబ్లో చేరిన తొలి చిత్రంగా ‘శివాజీ’ నిలిచింది. సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌కు ఇది నూరవ సినిమా కావడం విశేషం. సుమారు 17 ఏళ్ల తర్వాత ఈ సినిమా రీ రిలీజ్ కానుంది. 4కే వెర్షన్లో ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. అయితే ఎంపిక చేసిన స్క్రీన్స్ లో ‘శివాజీ’ టికెట్ ధర రూ. 99 మాత్రమే ఉండనుంది. -
రీ-రిలీజ్లో అత్యధిక కలెక్షన్లు సాధించిన టాప్-10 సౌత్ ఇండియా సినిమాలు (ఫొటోలు)
-
ఇంద్ర మళ్లీ వస్తున్నాడు
చిరంజీవి కెరీర్లో బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘ఇంద్ర’ (2002). ఈ చిత్రంలో ఆర్తీ అగర్వాల్, సోనాలీ బింద్రే హీరోయిన్లుగా నటించారు. బి. గోపాల్ దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ పతాకంపై సి. అశ్వినీదత్ నిర్మించిన ఈ యాక్షన్ డ్రామా విశేష ప్రేక్షకాదరణ దక్కించుకుంది. ఈ చిత్రంలో ఇంద్ర సేనారెడ్డి అలియాస్ శంకర్ నారాయణ పాత్రలో చిరంజీవి నటించారు. ఈ సినిమా రీ–రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. వైజయంతీ మూవీస్ 50 గోల్డెన్ ఇయర్స్‌ని సెలబ్రేట్ చేస్తూ, చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 22న ‘ఇంద్ర’ చిత్రాన్ని మళ్లీ విడుదల చేస్తోంది. -
మళ్లీ ఏ
ఉపేంద్ర హీరోగా నటించి, దర్శకత్వం వహించిన ‘ఏ’ చిత్రం మళ్లీ విడుదల కానుంది. 1998లో దాదాపు రూ. 1 కోటీ 25 లక్షలతో రూపోందిన ఈ చిత్రం రూ. 20 కోట్లు వసూలు చేసింది. కొత్త తరహా రొమాంటిక్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా రూపోందిన ఈ చిత్రంలో చాందినీ కథానాయికగా నటించారు. ఈ చిత్రాన్ని తాజాగా 4కేలో ఉపేంద్ర ఉప్పి క్రియేషన్స్, లింగం యాదవ్ చందు ఎంటర్టైన్మెంట్ విడుదల చేయనున్నాయి. ఈ నెల 21న ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది.ఈ సందర్భంగా లింగం యాదవ్ మాట్లాడుతూ – ‘‘అప్పట్లో ‘ఏ’ ఒక సంచలనం. ఇప్పటికే కన్నడలో రీ రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన స్పందన రాబట్టింది. జూన్ 21న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విడుదల చేయనున్నాం. ఇక మేం 4కేలో విడుదల చేసిన ప్రభాస్ ‘ఛత్రపతి, యోగి’ చిత్రాలకు మంచి స్పందన వచ్చింది. ‘ఏ’కి కూడా మంచి ఆదరణ దక్కుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. -
ఇన్నేళ్ల కెరీర్లో ఎక్కడా రాజీపడలేదు: శేఖర్ కమ్ముల
‘‘కోవిడ్ తర్వాత ప్రేక్షకుల అభిరుచి, సినిమాల పరిధి పెరిగింది. ఇప్పుడంతా పాన్ ఇండియా అంటున్నారు. మాది పాన్ ఇండియా మూవీ అని ప్రకటించుకుంటే సరిపోదు. ప్రేక్షకుల మైండ్ సెట్ గమనించాలి. కథ పరంగా మన నేటివిటీకి తగినట్లు సరైన సినిమా తీస్తే తప్పకుండా పాన్ ఇండియా స్థాయికి చేరుతుంది’’ అని దర్శకుడు శేఖర్ కమ్ముల అన్నారు. ఆయన దర్శకత్వం వహించిన ‘హ్యాపీ డేస్’ మూవీ 2007లో విడుదలై, హిట్‌గా నిలిచింది. ఆ సినిమాను నేడు రీ రిలీజ్ చేస్తున్నారు. అలాగే శేఖర్ కమ్ముల చిత్ర పరిశ్రమలోకి వచ్చి 25 ఏళ్లవుతోంది. ఈ రెండు సందర్భాలను పురస్కరించుకుని శేఖర్ కమ్ముల పంచుకున్న విశేషాలు. ► చిత్ర పరిశ్రమలో 25 సంవత్సరాల ప్రయాణంలో నేను నిలబడడం చూస్తే చాలా గర్వంగా ఉంది. నా తొలి చిత్రం ‘డాలర్ డ్రీమ్స్’ (2000) నుంచి ‘లవ్ స్టోరీ’ (2021) సినిమా వరకూ ఇన్నేళ్ల కెరీర్లో ఎక్కడా రాజీ పడకుండా నా విలువలకు తగినట్లు సినిమా తీయడం గొప్పగా అనిపిస్తోంది. నేను ఏ సినిమా చేసినా విలువలు, సిద్ధాంతాలతో తీయాలని, చెడు చెప్పకూడదు అనే ఆలోచనతోనే తీశాను. పేరు, డబ్బు కోసం చిత్ర పరిశ్రమకి రాలేదు. అలాంటి ఆలోచనతో సినిమాలూ తీయలేదు.. అదే నాకు గర్వంగా ఉంది. ఇప్పుడు సినిమా రంగంలో పోకడ చాలా హార్‡్షగా ఉంది. ► ‘హ్యాపీ డేస్’ సినిమా చేస్తున్నప్పుడు నా గ్రాడ్యుయేషన్ పూర్తయి పదేళ్లయింది. అప్పటి పరిస్థితుల రీత్యా ఆ మూవీకి స్టూడెంట్ బ్యాక్‌గ్రౌండ్ చక్కగా కుదిరింది. అయితే నేడు టెక్నాలజీ మారింది. ప్రతి స్టూడెంట్ చేతిలో మొబైల్ ఫోన్స్ ఉంటున్నాయి. కోవిడ్, గ్లోబలైజేషన్ వంటి పరిస్థితుల తర్వాత ఆలోచనా విధానం మారింది. సాంకేతిక పరంగా ఇప్పుడు విద్యార్థులు ఎవరి లోకంలో వారు ఉన్నారు. ‘హ్యాపీ డేస్’ సినిమా విడుదలై ఇన్నేళ్లయినా చాలా ఫ్రెష్‌గా ఉంది. రీ రిలీజ్ కూడా యూత్‌కు ఓ పండగలా ఉంటుందని అనిపించింది. ‘హ్యాపీ డేస్’కి సీక్వెల్ తీయాలనిపించింది.. కానీ, కథ కుదరలేదు. ► ఇన్నేళ్ల నా ప్రయాణంలో పది చిత్రాలు చేశాను. అయితే నా ప్రయాణం నిదానంగా సాగుతోందనుకోవడం లేదు. నేను ఏ సినిమా చేసినా ఈ కథ అవసరమా? అని ఆలోచించి చేస్తాను. నేను సినిమా చేసే పద్ధతి, నా సినిమాలే మాట్లాడతాయి. కాపీ కొట్టే కథలు నేను చేయను. కంటెంట్ పరంగా బాగా, సూటిగా చె΄్పాలనుకుంటాను. మనసులో ఓ ఆలోచన రావడానికి, అది కార్యరూపం దాల్చడానికి సమయం పడుతుంది. అలా కాకుండా వెంట వెంటనే సినిమాలు చేయాలనుకోను. ► నా తొలి చిత్రం ‘డాలర్ డ్రీమ్స్’కి జాతీయ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఆ తర్వాత నంది అవార్డులతో పాటు మరికొన్ని అవార్డులు కూడా అందుకున్నాను. అయితే మళ్లీ జాతీయ అవార్డు అందుకోవాలనే ఆలోచన లేదు. నేను రాజీపడకుండా సినిమా తీస్తున్నాను.. అందుకే సంతోషంగా ఉన్నాను. నా చిత్రాలకు ప్రేక్షకులు ఇచ్చే అవార్డే గొప్పది. ఒక్కో ఏడాది జాతీయ స్థాయిలో మనకంటే మంచి సినిమాలు వస్తుంటాయి.. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని అవార్డుకి ఎంపిక చేస్తారు. అయితే మంచి కంటెంట్ తీసుకుని ముందుకెళ్లడమే మన పని. ► నా కెరీర్లో తొలిసారి నాగార్జున, ధనష్ వంటి స్టార్ హీరోలతో ‘కుబేర’ అనే మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాను. ఈ కథకు వారిద్దరూ సరిపోతారనిపించి చేస్తున్నాను.. అంతేకానీ, పెద్ద ్రపాజెక్ట్, బిగ్ స్కేల్లో సినిమా చేయాలనే ఆలోచనతో కాదు. వారిద్దరితో పని చేయడం గొప్ప అనుభూతి. నిర్మాత, దర్శకుడికి మధ్య స్వేచ్ఛ, నమ్మకం అనేది ఉండాలి. అది ఏషియన్ మూవీస్ బేనర్లో నాకెక్కువగా ఉంది. ‘లీడర్’ సినిమాకి సీక్వెల్ తీయాలనే ఆలోచన ఉంది. కానీ సమయం కుదరడం లేదు. చేస్తే మాత్రం తప్పకుండా రానాతోనే చేస్తాను. -
మళ్లీ స్పైడర్‌మేన్ వస్తున్నాడు
హాలీవుడ్ సూపర్‌హిట్ సూపర్ హీరో ‘స్పైడర్ మేన్’ మళ్లీ థియేటర్స్‌కు వస్తున్నాడు. స్పైడర్‌మేన్ ఫ్రాంచైజీలో ఇప్పటివరకూ ఎనిమిది సినిమాలు వచ్చాయి. ‘స్పైడర్‌మేన్’ (2002), ‘స్పైడర్‌మేన్ 2’ (2004), ‘స్పైడర్‌మేన్ 3’ (2007), ‘ది అమేజింగ్ స్పైడర్‌మేన్’ (2007), ‘ది అమేజింగ్ స్పైడర్‌మేన్ 2’ (2014), ‘స్పైడర్‌మేన్: హోమ్ కమింగ్’ (2017), ‘స్పైడర్‌మేన్: ఫార్ ఫ్రమ్ హోమ్’ (2019), ‘స్పైడర్‌మేన్: నో వే హోమ్’ (2021)... ఈ 8 చిత్రాలూ రీ రిలీజ్ కానున్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ కొలంబియా పిక్చర్స్ వంద సంవత్సరాలను పూర్తి చేసుకున్న సందర్భంగా ‘స్పైడర్‌మేన్’ ఫ్రాంచైజీ సినిమాలను రీ రీలీజ్ చేస్తోందని హాలీవుడ్ సమాచారం. ఈ 8 సినిమాలకు సంబంధించి ఓ కామన్ ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ చిత్రాలు కూడా ఏప్రిల్ 15 నుంచి వారానికి ఒక్కొక్కటి చొప్పున జూన్ 3 వరకు విడుదలవుతాయి. ప్రతి చిత్రం కూడా సోమవారమే రీ –రిలీజ్ కానుండటం విశేషం. ఎంపిక చేసిన థియేటర్స్‌లోనే ఈ సినిమాలు రీ రిలీజ్ కానున్నాయి. -
మగధీర మళ్లీ వస్తున్నాడు
మెగా అభిమానులకు శుభవార్త. రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘మగధీర’ సినిమా మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నెల 27న చరణ్ బర్త్‌డే సందర్భంగా ‘మగధీర’ చిత్రాన్ని 26న రీ రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించారు. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ‘మగధీర’ 2009 జూలై 30న విడుదలై, బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. 14 ఏళ్ల తర్వాత ఈ చిత్రాన్ని శ్రీ విజయలక్ష్మి ట్రేడర్స్ అధినేత యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్‌బాబు రీ రిలీజ్ చేస్తున్నారు. ‘‘మగధీర’ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక థియేటర్లలో రీ రిలీజ్ చేస్తున్నాం. తెలుగు ప్రేక్షకులు, మెగా అభిమానులు ఈ చిత్రాన్ని ఆదరించి మరోసారి ఘన విజయాన్ని అందించాలి’’ అన్నారు యర్రంశెట్టి రామారావు, అరిగెల కిశోర్ బాబు. ఈ రోజుల్లోనూ... ఈ నెల రీ రిలీజ్ అవుతున్న చిత్రాల్లో శ్రీ, రేష్మ జంటగా మారుతి దర్శకత్వం వహించిన ‘ఈ రోజుల్లో’ కూడా ఉంది. గుడ్ సినిమా గ్రూప్ బ్యానర్‌పై యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ సినిమా 2012 మార్చి 23న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని 12 ఏళ్ల తర్వాత మళ్లీ విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈ నెల 23న ‘ఈ రోజుల్లో’ విడుదల కానుంది. -
చిరంజీవి బ్లాక్‌బస్టర్ సినిమా రీరిలీజ్.. ఇక థియేటర్లో పూనకాలే!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమా అప్పట్లో బాక్సాఫీస్‌ను ఓ ఊపు ఊపేసింది. 2004లో వచ్చిన ఈ చిత్రం అప్పటి రికార్డులను బ్రేక్ చేసింది. శంకర్ దాదాగా చిరంజీవి నటించిన తీరు, చెప్పిన ఇంగ్లీష్ సామెతలు, వేసిన స్టెప్పులు అన్నీ కూడా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చేశాయి. మెగా అభిమానులు మాత్రమే కాకుండా సాధారణ సినీ ప్రేమికులు సైతం శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాకు ఫిదా అయ్యారు. అసలే ఇప్పుడు టాలీవుడ్లో రీ రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. అలనాటి కల్ట్ క్లాసిక్ సినిమాలను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ఎవర్ గ్రీన్ బ్లాక్ బస్టర్ అయిన శంకర్ దాదా ఎంబీబీఎస్ సినిమాను రీ రిలీజ్ చేసేందుకు సర్వం సిద్దమైంది. నవంబర్ 4న ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు. మెగా ప్రొడక్షన్స్ ద్వారా ఈ చిత్రం నవంబర్ 4న భారీ ఎత్తున రిలీజ్ కాబోతోంది. ఈ మూవీకి దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు పెద్ద అసెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఇక థియేటర్లో పాటలు వస్తే.. జనాలు పూనకంతో ఊగిపోతారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరోసారి అప్పటి వింటేజ్ చిరుని చూపించేందుకు, ఆ గ్రేస్, మాస్ ఎరాలోకి తీసుకెళ్లేందుకు శంకర్ దాదా మళ్లీ వస్తున్నాడు. Mega Massive Update 💥 Megastar @KChiruTweets Garu's sensational hit #ShankarDadaMBBS Re-Releasing On Nov 4th Re-release worldwide from #megaproductions#Srikanth @iamsonalibendre #PareshRawal#Sharwanand #PanjaVaishanvTej#JayanthCParanjee#AkkineniRaviShankarPrasad… pic.twitter.com/7HdOrFh183 — BA Raju's Team (@baraju_SuperHit) October 15, 2023 చదవండి: మ్యాచ్ చూసేందుకు వెళ్లి గోల్డ్ ఐఫోన్ పోగొట్టుకున్న బాలీవుడ్ బ్యూటీ -
ఆ నమ్మకం ఉంది – ఏయం రత్నం
‘‘7/జీ బృందావన కాలనీ’ సినిమా ఎంత హిట్ అయిందో తెలిసిందే. ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్లో కూడా అంతే పెద్ద విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. రవి హీరోగా సెల్వరాఘవన్ దర్శకత్వంలోనే ‘7/జీ బృందావన కాలనీ’ రెండో భాగాన్ని అక్టోబర్ నుంచి ప్రారంభిస్తున్నాం’’ అని నిర్మాత ఏయం రత్నం అన్నారు. రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన చిత్రం ‘7/జీ బృందావన కాలనీ’. సెల్వరాఘవన్ దర్శకత్వంలో ఏయం రత్నం నిర్మించిన ఈ చిత్రం 2004లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాను ఈ నెల 22న రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా రీ రిలీజ్ ట్రైలర్ లాంచ్ వేడుకలో రవికృష్ణ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ చూడగానే మళ్లీ రవి పాత్రలోకి వెళ్లిపోయాను. ఈ సినిమా రెండో భాగానికి ముందు మరోసారి ‘7/జీ బృందావన కాలనీ’ మ్యూజిక్ చూపించేలా ఈ చిత్రం రీ రిలీజ్ జరుగుతోంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరో సోనియా అగర్వాల్, నటుడు సుమన్ శెట్టి మాట్లాడారు. -
మహేష్ బాబు బర్త్ డే సప్రైజ్ ఫిక్స్.. ఇక ఫాన్స్ కి పూనకాలు లోడింగ్..!
-
రీరిలీజ్ కానున్న సింహాద్రి, కలెక్షన్స్ ఏం చేస్తారంటే?
రీరిలీజ్ విషయంలో యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ రికార్డు క్రియేట్ చేశాడు. 20 ఏళ్ల క్రితం వచ్చిన సింహాద్రి సినిమాకు వెయ్యి షోస్ ఉండటం, దానికి గ్రాండ్‌గా ప్రీరిలీజ్ ఈవెంట్ జరగడమంటే మామూలు విషయం కాదు. తారక్ బర్త్‌డే సందర్భంగా తన ఆల్‌టైం బ్లాక్‌బస్టర్ మూవీ సింహాద్రి మే 20న రీరిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే. 4కే, డాల్బీ అట్మాస్ వర్షన్లో భారీ ఎత్తున ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఓవర్సీస్లోనే 150కి పైగా థియేటర్స్‌లో సింహాద్రి సినిమాను ప్రదర్శించనున్నారు. వరల్డ్‌లోనే అతి పెద్ద స్క్రీన్ అయిన మెల్బోర్న్ ఐమాక్స్ థియేటర్లోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయట. సింహాద్రి రీరిలీజ్ ద్వారా వచ్చిన కలెక్షన్స్‌లోని లాభాలను ఓ మంచి పని కోసం ఉపయోగించాలని మేకర్స్ భావిస్తున్నారట. పేదరికంతో బాధపడుతున్న ఎన్టీఆర్ అభిమానులకు ఈ కలెక్షన్స్ పంచేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూటర్స్ సూచించిన అభిమానులకు సాయాన్ని అందించనున్నట్లు టాక్ వస్తుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో తెలియాల్సి ఉంది. కాగా ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా అప్పట్లోనే 30 కోట్లు వసూళు చేసి బిగ్గెస్ట్ కమర్షియల్ హిట్‌గా నిలిచింది. 2003లో టాలీవుడ్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పుడు రీరిలీజ్‌లోనూ సింహాద్రి మూవీ రికార్టు క్రియేట్ చేయడం మరో విశేషం. చదవండి: సల్మాన్ ఖాన్ సోదరి ఇంట్లో దొంగతనం -
సింహాద్రి రీ రిలీజ్ పై ఎన్టీఆర్ పోస్ట్..గందరగోళంలో ఫ్యాన్స్
-
తిరిగొస్తున్న ఆది సింహాద్రి..
-
25న చెన్నకేశవరెడ్డి రీ రిలీజ్
‘‘చెన్నకేశవరెడ్డి’ సినిమాని 20 ఏళ్ల క్రితం ఒక పండగలా రిలీజ్ చేశాం. ఇప్పుడు కూడా రీ రిలీజ్‌లా లేదు.. కొత్త సినిమాని విడుదల చేస్తున్నట్లే అనిపిస్తోంది. మంచి ఉద్దేశం కోసం రీ రిలీజవుతున్న ఈ చిత్రాన్ని ప్రేక్షకులు, నందమూరి ఫ్యాన్స్ ఆదరించాలి’’ అని డైరెక్టర్ వీవీ వినాయక్ అన్నారు. బాలకృష్ణ హీరోగా, టబు, శ్రియ హీరోయిన్లుగా వీవీ వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చెన్నకేశవ రెడ్డి’. బెల్లంకొండ సురేష్ నిర్మించిన ఈ సినిమా 2002 సెప్టెంబర్ 25న రిలీజైంది. ఈ సినిమా రిలీజై 20 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ నెల 25న రీ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు బెల్లంకొండ సురేష్. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వీవీ వినాయక్ మాట్లాడుతూ– ‘‘చెన్నకేశవ రెడ్డి’లో బాలయ్యగారిని ఎలా చూపించాలా? అనే పిచ్చితో కొన్ని గంటలు మాత్రమే నిద్రపోయేవాణ్ణి. ఈ సినిమాలో వచ్చే మేజర్ రెవెన్యూని ‘బసవతారకం ట్రస్ట్’కి విరాళంగా ఇస్తాం’’ అన్నారు. బెల్లంకొండ సురేష్ మాట్లాడుతూ– ‘‘చెన్నకేశవ రెడ్డి’ రీ రిలీజ్ గురించి బాలకృష్ణగారికి చెప్పగానే సంతోషపడ్డారు. ఈ నెల 24న ప్రీమియర్ షోలతో మొదలుపెట్టి, 25న రెగ్యులర్ షోలతో విడుదల చేస్తున్నాం. రీ రిలీజ్లో ఒక సినిమాని కోటి రూపాయలకు అడిగిన దాఖలాలు లేవు.. కానీ పలువురు డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కోటి రూపాయలకు అడగడం ‘చెన్నకేశవ రెడ్డి’ క్రేజ్‌కి నిదర్శనం. ఈ సినిమాకి వచ్చే రెవెన్యూలో 75 శాతం ‘బసవతారకం ట్రస్ట్’కి, మిగతాది నాకు సంబంధించిన అసోషియేషన్స్కి ఇస్తాను. నవంబర్ నుంచి మళ్లీ యాక్టివ్‌గా ప్రొడక్షన్ మొదలు పెట్టాలనుకుంటున్నాను’’ అన్నారు. -
ఎల్ఎంఎల్ మళ్లీ వస్తోంది
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన రంగంలోకి తిరిగి ప్రవేశించనున్నట్టు ఎల్ఎంఎల్ వెల్లడించింది. ఎలక్ట్రిక్ టూ వీలర్లతో రంగ ప్రవేశం చేయనున్నట్టు కంపెనీ బుధవారం ప్రకటించింది. ఇందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించింది. ఓ భాగస్వామి భారీ పెట్టుబడులతో బ్రాండ్‌ను ప్రోత్సహిస్తున్నట్టు తెలిపింది. అత్యుత్తమ సాంకేతికతతో కూడిన వినూత్న ఉత్పత్తిని పరిచయం చేయడానికి అభివృద్ధి వ్యూహాలపై చురుకుగా పనిచేస్తున్నట్టు ఎల్ఎంఎల్ ఎలక్ట్రిక్ ఎండీ యోగేశ్ భాటియా తెలిపారు. కాగా, ఇటలీకి చెందిన పియాజియో భాగస్వామ్యంతో ఎల్ఎంఎల్ వెస్పాను కంపెనీ గతంలో తయారుచేసి విక్రయించింది. 1983లో 100 సీసీ స్కూటర్ల ఉత్పత్తి ప్రారంభించింది. 1999లో పియాజియోతో భాగస్వామ్యం తెగిపోయాక కంపెనీ పతనం ప్రారంభమైంది. 2006లో కాన్పూర్ ఫ్యాక్టరీ లాకౌట్ అయింది. -
నేడే చూడండి టికెట్ కేవలం 50 రూపాయిలే
కోవిడ్ వల్ల థియేటర్స్ వైపుకు రావట్లేదు ప్రేక్షకులు. వాళ్లందరూ మళ్లీ థియేటర్స్ బాట పట్టాలంటే ఏదో బలమైన ఆకర్షణ ఉండాలి. మంచి సినిమా ఉండాలి. బంఫర్ ఆఫర్ ఉండాలి. వీటన్నింటినీ కలిపి ఇవ్వడానికి ప్లాన్ సిద్ధం చేశాయి ప్రముఖ నిర్మాణ సంస్థ యశ్‌రాజ్ ఫిల్మ్స్, పలు మల్టీప్లెక్స్ చైన్లు. ఆ విశేషాలు. యశ్‌రాజ్ సంస్థ నిర్మాణంలోకి వచ్చి 50 ఏళ్లయింది. యాభై ఏళ్లుగా ఎన్నో విజయవంతమైన, సంచలనమైన సినిమాలను అందిస్తూ వస్తోంది. 50ఏళ్ల ప్రయాణం సందర్భంగా పలు భారీ సినిమాలను నిర్మించడానికి ప్లాన్ చేస్తోంది. తాజాగా ఓ కొత్త ఆలోచనతో యశ్‌రాజ్ ముందుకు వచ్చింది. ఇన్నేళ్లుగా తమ సినిమాలను ఆదరించిన ప్రేక్షకులకు ఏదైనా ఇవ్వాలనుకుంది. తమ సూపర్ హిట్ సినిమాలను మళ్లీ ఆనందించేలా చేయాలనుకుంది. కోవిడ్ వల్ల మర్చిపోయిన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్‌ను తిరిగి రుచి చూపించాలనుకుంది. అది కూడా తక్కువ ధరకే. యశ్‌రాజ్ సంస్థ నిర్మించిన సూపర్ హిట్ సినిమాల్లో కొన్నింటిని దీపావళి సందర్భంగా మళ్లీ థియేటర్స్‌లో విడుదల చేయనున్నారు. నవంబర్ 12 నుంచి 19 వరకూ ఈ సినిమాలను పీవీఆర్, ఐనాక్స్, సినీపాలీస్ మల్టీప్లెక్స్‌లలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. టికెట్ ధర జస్ట్ 50 రూపాయిలే. మరి.. ప్రేక్షకులను తిరిగి థియేటర్స్‌కు తీసుకురావడానికి ఈ ప్రయత్నం ఎంత వరకూ సఫలం అవుతుందో చూడాలి. రండీ.. ఆనందించండీ ‘సినిమా విడుదలకు మంచి సీజన్ దీపావళి. పండగకి సినిమాను ఆనందించడం సినీ ప్రేమికులకు ఇష్టమైన ఆనవాయితీ. యశ్‌రాజ్ సంస్థ ప్రేక్షకుల ఫేవరెట్ సినిమాలను మళ్లీ పెద్ద స్క్రీన్ మీద ఎంజాయ్ చేసే వీలు కల్పించడం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు పీవీఆర్, ఐనాక్స్, సినీపాలీస్ మల్టీప్లెక్స్ ప్రతినిధులు. ప్రదర్శితం కానున్న చిత్రాలు యశ్‌రాజ్ నుంచి వచ్చిన చిత్రాల్లో ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ ఓ క్లాసిక్. ఇటీవలే 25 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ సినిమాతో పాటు కభీ కభీ, సిల్సిలా, దిల్ తో పాగల్ హై, వీర్ జరా, బంటీ ఔర్ బబ్లీ, రబ్నే బనాదీ జోడీ, ఏక్‌థా టైగర్, బ్యాండ్ బాజా భారాత్, సుల్తాన్, వార్, మర్దానీ చిత్రాలు మళ్లీ విడుదల కానున్నాయి. -
మళ్లీ మేజిక్!
థియేటర్లు ఆరంభమయ్యాయి. 50 శాతం సీటింగ్‌తో ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. అయితే థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్య వేళ్ల మీద లెక్కపెట్టేంత ఉంది. ఈ నేపథ్యంలో ఒక భారీ సినిమా విడుదలైతే ప్రేక్షకుల సంఖ్య ఆశాజనకంగా ఉంటుందేమోననే ఆలోచన చాలామందికి ఉంది. మరి.. బాలీవుడ్ దర్శక–నిర్మాత కరణ్ జోహార్ కూడా ఇలానే ఆలోచించారేమో. ‘బాహుబలి’ రెండు భాగాలను మళ్లీ విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ‘‘మళ్లీ మేజిక్ జరగబోతోంది’’ అంటూ ఈ శుక్రవారం తొలి భాగం, వచ్చే శుక్రవారం మలి భాగాన్ని థియేటర్లు ఆరంభమైన రాష్ట్రాల్లో విడుదల చేస్తున్నట్లు తెలిపారు. -
పాత సినిమాలు... కొత్త సందడి
నేటి నుంచి థియేటర్స్ తెరుచుకుంటున్నాయి. థియేటర్స్‌ను నమ్ముకున్నవాళ్లకు సందడి మొదలుకానుంది. అయితే థియేటర్స్‌కి ప్రేక్షకులు ఎక్కువ సంఖ్యలో వస్తారా? కొత్త సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు రెడీగా ఉన్నారా? ప్రస్తుతానికి ప్రశ్నలే. పరిస్థితిని బట్టి సమాధానాలు దొరుకుతాయి. అయితే థియేటర్స్ తిరిగి ఓపెన్ అవుతున్న సందర్భంలో పాత సినిమాలను మళ్లీ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. బాలీవుడ్లో రీ–రిలీజ్ కాబోతున్న చిత్రాల విశేషాలు. ఆ సినిమాలను ప్రదర్శించం లాక్డౌన్ సమయంలో పలు సినిమాలు ఓటీటీ లో విడుదలయ్యాయి. థియేట్రికల్ విడుదల కాకుండా ఓటీటీలో విడుదలయిన సినిమాలను థియేటర్స్‌లో ప్రదర్శించం అని ప్రకటించాయి పలు మల్టీప్లెక్స్ సంస్థలు. ఆ సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తున్నట్టు ప్రకటించినప్పుడే మల్టీప్లెక్స్ సంస్థలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశాయి. ఇప్పుడు ఆ సినిమాలను ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. అమితాబ్ బచ్చన్, ఆయుష్మాన్ ఖురానా నటించిన ‘గులాబో సితాబో’, విద్యాబాలన్ ‘శకుంతలా దేవి’, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చివరి చిత్రం ‘దిల్ బేచారా’, జాన్వీ కపూర్ ‘గుంజన్ సక్సేనా’, ‘సడక్ 2’ వంటి సినిమాలను తమ థియేటర్స్‌లో ప్రదర్శించేది లేదని ఐనాక్స్, పీవీఆర్, సినీపోలీస్, కార్నివాల్ వంటి మల్టీప్లెక్స్ అధినేతలు నిర్ణయించుకున్నారని సమాచారం. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పీయం మోదీ’. వివేక్ ఒబెరాయ్ టైటిల్ రోల్ పోషించారు. 2019లో విడుదలైన ఈ సినిమా నేడు మళ్లీ థియేటర్స్‌లోకి రానుంది. ‘ఈ సినిమా మరింత మందికి చేరువ అవ్వడానికి ఇదో మంచి అవకాశం’ అని అన్నారు చిత్రనిర్మాతలు. హృతిక్ రోషన్, టైగర్ ష్రాఫ్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన యాక్షన్ చిత్రం ‘వార్’. గత ఏడాది ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు భారీగా సాధించింది. ఈ సినిమాను మళ్లీ థియేటర్స్‌లోకి తీసుకొస్తున్నట్టు తెలిపారు నిర్మాతలు. అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో తెరకెక్కిన చారిత్రాత్మక చిత్రం ‘తన్హాజీ’, ఆయుష్మాన్ ఖురానా నటించిన సందేశాత్మక చిత్రం ‘శుభమంగళ్ సావధాన్’, తాప్సీ లీడ్ రోల్ చేసిన ‘థప్పడ్’, ఆదిత్యా రాయ్ కపూర్, దిశా పటానీ నటించిన ‘మలంగ్’ సినిమాలు కూడా మళ్లీ విడుదల కానున్నాయి. వీటికి తోడు ఇటీవలే ‘పే ఫర్ వ్యూ’ (డబ్బుకట్టి సినిమా చూడటం) పద్ధతిలో విడుదలయిన హిందీ చిత్రం ‘ఖాలీ పీలీ’, తమిళ చిత్రం ‘కాపే రణసింగం’ అక్టోబర్ 16 నుంచి థియేటర్స్‌లోకి రానున్నాయి. -
మోదీ బయోపిక్ మళ్లీ విడుదల
భారత ప్రధాని నరేంద్ర మోది జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘పీయం నరేంద్ర మోది’. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ టైటిల్ రోల్ పోషించారు. ఒమంగ్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గత ఏడాది మే 24న విడుదలయింది. అయితే మరోసారి ఈ సినిమా థియేటర్స్‌లోకి రానుంది. లాక్డౌన్ తర్వాత ఈ నెల 15 నుంచి థియేటర్స్ మళ్లీ ప్రారంభం కానున్నాయి అనే విషయం తెలిసిందే. దాంతో ‘పీయం నరేంద్ర మోది’ని 15న రీ–రిలీజ్ చేయనున్నారు. ‘‘కొందరి పొలిటికల్ అజెండాల వల్ల ఈ సినిమా విడుదలైనప్పుడు ఎక్కువమంది ప్రేక్షకులకు చేరలేదు. ఈ రీ–రిలీజ్లో అందరికీ ఈ సినిమా చేరువ అవుతుందనుకుంటున్నాం’’ అన్నారు నిర్మాత సందీప్ సింగ్. -
మళ్లీ గోల్మాల్
న్యూజిల్యాండ్‌లో కరోనా వైరస్ ప్రభావం అదుపులోకి రావడంతో అక్కడి పరిస్థితులు మెల్లిగా గాడిలో పడుతున్నాయి. ఇటీవలే న్యూజిల్యాండ్‌లో ‘అవతార్’ సీక్వెల్స్ చిత్రీకరణను ప్రారంభించారు దర్శకుడు జేమ్స్ కామెరూన్. తాజాగా న్యూజిల్యాండ్‌లో థియేటర్స్ రీ ఓపెన్ కానున్నాయి. ఆ దేశంలో హిందీ చిత్రం ‘గోల్మాల్ ఎగైన్’ మళ్లీ విడుదల కానుంది. అజయ్ దేవగన్, పరిణీతీ చోప్రా, టబు, అర్షద్ వార్షి, తుషార్ కపూర్ ముఖ్యతారాగణంగా రోహిత్ శెట్టి దర్శకత్వం వహించిన చిత్రం ఇది. ‘‘న్యూజిల్యాండ్‌లో మా ‘గోల్మాల్ ఎగైన్’ చిత్రం రీ–రిలీజ్ కానుంది. గురువారం నుంచి థియేటర్స్ ఓపెన్ చేస్తున్నారు. రీ ఓపెన్ అయిన మొదటి రోజు నుంచే మా చిత్రం విడుదల కావడం ఆనందంగా ఉంది. రీ ఓపెన్ తర్వాత న్యూజిల్యాండ్‌లో విడుదల కాబోతున్న తొలి హిందీ చిత్రం మాదే’’ అని పేర్కొన్నారు రోహిత్ శెట్టి. 20 అక్టోబర్ 2017లో విడుదలైన ఈ చిత్రం మంచి వసూళ్లు రాబట్టింది. -
గుడ్ న్యూస్..రీ రిలీజ్!
దుబాయ్‌లో ఉన్న అక్షయ్ కుమార్ అభిమానులకు ఓ తీపి వార్త. అదేంటంటే... అక్షయ్ నటించిన ‘గుడ్ న్యూస్’ చిత్రాన్ని మళ్లీ చూసే అవకాశం వారికి దక్కబోతోంది. గత ఏడాది డిసెంబర్ 27న ఈ చిత్రం విడుదలై, మంచి వసూళ్లు రాబట్టింది. ఇప్పుడు లాక్డౌన్ నేపథ్యంలో కొత్త సినిమాల విడుదల ఆగిన విషయం తెలిసిందే. ఇండియాలో మళ్లీ ఎప్పుడు సినిమా థియేటర్లు ఓపెన్ చేస్తారో తెలియదు. అయితే ఆ మధ్య చైనా ఓపెన్ చేసింది. కానీ ప్రేక్షకులు పెద్దగా రాకపోవడంతో మూసేశారని తెలిసింది. దుబాయ్‌లో కూడా థియేటర్లు ఓపెన్ అయ్యాయి. ఆల్రెడీ విడుదలైన సినిమాలనే మళ్లీ విడుదల చేయాలని అక్కడి థియేటర్లవారు నిర్ణయించుకున్నారట. అలా విడుదల కానున్న చిత్రాల్లో ‘గుడ్ న్యూస్’ ఒకటి. ఈ నెల 11న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ‘‘నా సినిమాలను దుబాయ్ ప్రేక్షకులు బాగా ఆదరించారు. ఈ లాక్డౌన్ సమయంలో నా సినిమా రీ రిలీజ్ కావడం నాకు చాలా స్పెషల్‌గా అనిపిస్తోంది. ప్రేక్షకులను మరోసారి ‘గుడ్ న్యూస్’ ఎంటర్టైన్ చేస్తుందని నమ్ముతున్నాను’’ అన్నారు అక్షయ్ కుమార్. చిత్రనిర్మాతల్లో ఒకరైన అపూర్వ మెహతా మాట్లాడుతూ –‘‘థియేటర్లో సినిమాలు విడుదల కావడం అనేది ఓ పెద్ద కల అనే పరిస్థితిలో అన్నాం. ఇది ఊహించని పరిణామం. దుబాయ్ ప్రేక్షకులకు మా సినిమా కావాల్సినంత వినోదాన్ని ఇచ్చి, ఓ మంచి రిలీఫ్ అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు. -
డిగ్రీ రీ వాల్యుయేషన్ ఫలితాలు విడుదల
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ ఫైనలియర్ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల చేశారు. మే –2016లో పరీక్షలు జరిగాయి. మొత్తం 15 వేల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకొన్నారు. ఫలితాలను www.skuniversity.ac.in, www.skugresults.com ద్వారా తెలుసుకోవచ్చు.