reactions
-
‘బాంబు పేలింది’.. భూకంపం అనుభవాల వెల్లువ
న్యూఢిల్లీ: ఈరోజు (సోమవారం) ఢిల్లీ ప్రజలు తెల్లవారుజామున నిద్ర నుంచి లేస్తూనే భూకంప ప్రభావానికి లోనయ్యారు. భయంతో వణికిపోతూ ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఉదయం 5 గంటల 36 నిముషాలకు సుమారు 55 సెకెన్లపాటు ఢిల్లీలో భూమి కంపించింది. దీని తీవ్రత 4.0గా నమోదయ్యింది. భూకంపం వచ్చిన సమయంలో తమకు ఎదురైన అనుభవాలను పలువురు ట్వట్ల ద్వారా పంచుకున్నారు. Earthquake in Delhi NCR pic.twitter.com/XQwyhc8PvI— Navneet K Singh (@Navneet_K_Singh) February 17, 2025‘ఎక్స్’ ప్లాట్‌ఫారంపై నవనీత్ సింగ్ అనే యూజర్ భూకంపం సమయంలో తమ ఇంటిలో కదులుతున్న ఫ్యానుకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు. మరో యూజర్ బాంబు పేలిందని అనుకున్నామని రాశారు.You know it's a massive one when it forces you out of your sleep and out of bed. #earthquake— Sarah Waris (@swaris16) February 17, 2025@swaris16 అనే యూజర్ ‘ఆ సమయంలో వచ్చిన భారీ శబ్ధం నిద్ర ఎగిరిపోయేలా చేసింది’ అని రాశారు. దీనిని చూసిన ఒక యూజర్ ‘ఆ శబ్ధం ఉలిక్కిపడేలా చేసిందని’ పేర్కొన్నారు.Severe #earthquake tremors in #Delhi at 0537 amI was in hospital. Yet to evacuate all a patients down. Told those who can walk to go down— Anish K Gupta (@optionurol) February 17, 2025అనిష్ అనే యూజర్ ‘ఢిల్లీలో ఉదయం 05:37కు తీవ్రమైన ప్రకంపన వచ్చింది. ఆ సమయంలో నేను ఆస్పత్రిలో ఉన్నాను. ఇక్కడి సిబ్బంది అందరినీ బయటకు పంపించివేశారు’ అని రాశారు.Very strong earthquake for a couple of seconds here in delhi. The whole society is up!— Worah | #WalkingInDelhi (@psychedelhic) February 17, 2025ఇంకొక యూజర్ ‘ఢిల్లీలో కొద్ది సెకెన్లపాటు భూకంపం వచ్చింది. సొసైటీలోని వారంతా ఉలిక్కిపడ్డారు’ అని రాశారు. మరొకరు ‘ఇది భయానక అనుభవం’ అని పేర్కొన్నారు. -
బడ్జెట్‌పై ప్రముఖుల స్పందన ఇదే..
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై భిన్న స్పందనలు వస్తున్నాయి. ప్రముఖులు వివిధ మాధ్యమాల్లో ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విభిన్నంగా స్పందిస్తున్నారు. ఎంఎస్ఎంఈలకు బడ్జెట్లో మద్దతు ఇవ్వడం పట్ల కొందరు హర్షం వ్యక్తం చేస్తే, సామాన్యులకు బడ్జెట్లో పన్ను శ్లాబ్‌లను సవరించి మేలు చేశారని, తద్వారా వారి ఆదాయాలు పెంచారని కొందరు అభిప్రాయపడుతున్నారు. కొందరు పారిశ్రామిక వేత్తలు బడ్జెట్‌పై ఎలా స్పందిస్తున్నారో కింద తెలుసుకుందాం.ఆదాయంలో పెరుగుదల -ఆశిష్‌కుమార్ చౌహాన్, ఎండీ అండ్ సీఈఓ ఎన్ఎస్ఈబలమైన అభివృద్ధి చర్యలు, పెరిగిన మూలధన వ్యయం, తగ్గిన పన్ను భారంతో భారతదేశ వృద్ధి ఊపందుకుంటుంది. ఆదాయంలో పెరుగుదలను, వినియోగ వృద్ధిని పెంచుతుంది. భారతీయ కుటుంబాలకు మరింత సంపద సృష్టి అవకాశాలను అందిస్తుంది. ప్రస్తుతం 11 కోట్ల మంది ప్రత్యేక పెట్టుబడిదారుల సమూహంలో మరింత ఎక్కువ మంది చేరుతారు. భారతదేశ వృద్ధి ప్రయాణంలో వాటాదారులు అవుతారు. తద్వారా ఆర్థిక వృద్ధి, మూలధన నిర్మాణానికి కృషి చేస్తారు.వినియోగదారుల చేతిలో మరింత ఆదాయం- డాక్టర్ అనీష్ షా, మహీంద్రా గ్రూప్ ఎండీ.పన్ను నిర్మాణంలో మార్పుల ద్వారా 2025 బడ్జెట్‌పై సంతోషంగా ఉన్నాం. భారతీయ వినియోగదారుల చేతిలో మరింత ఆదాయాన్ని ఉంచడం మంచి విషయం. ఇది ప్రైవేట్ సెక్టార్ మూలధన వ్యయం సానుకూల దిశలో పయనించడానికి ప్రోత్సహిస్తుంది. ‘మేక్ ఇన్ ఇండియా ఫర్ ది వరల్డ్’ అనే అంశం ఈ బడ్జెట్లో కీలకంగా ఉంది. భారతదేశం తయారీ ఖర్చులను తగ్గించే ప్రయత్నాలు ప్రపంచ పోటీతత్వాన్ని గణనీయంగా పెంచడానికి సిద్ధంగా ఉన్నాయి. వృద్ధికి తక్షణ ఉద్దీపన అందించడంతో పాటు, బడ్జెట్ గణనీయమైన మౌలిక సదుపాయాల పెట్టుబడులపై దృష్టి పెట్టింది. ఎంఎస్ఎంఈలు, వ్యవసాయం, నైపుణ్యానికి బలమైన ప్రాధాన్యతనిస్తూ సమగ్ర అభివృద్ధితో 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాలను సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది. పునాదులు వేస్తోంది.వికసిత్ భారత్ లక్ష్యాలపై దృష్టి- ప్రశాంత్ కుమార్, మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ, యస్ బ్యాంక్మెరుగైన ఆర్థిక వ్యవస్థకు వేదికగా బడ్జెట్‌ను మార్చారు. వికసిత్ భారత్ లక్ష్యాలపై దృష్టి సారించింది. వ్యవసాయం, ఎంఎస్ఎంఈ, పాదరక్షలు, తోలు, బొమ్మలు, ఆహార ప్రాసెసింగ్ వంటి విభాగాలకు బడ్జెట్లో ప్రోత్సాహం అందించారు. వివిధ రంగాల్లో ఉత్పాదకతను మెరుగుపరిచే మార్గాలపై బడ్జెట్ దృష్టి కేంద్రీకరించింది. ఎంఎస్ఎంఈలకు క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని మెరుగుపరచడం ద్వారా తగిన అవకాశాలను అందించినట్లయింది. మరింత స్థిరమైన పన్నుల విధానాన్ని ఏర్పాటు చేయడంతో పాటు వ్యాపార నిర్వహణను సులభతరం చేసేలా నిర్ణయాలు తీసుకున్నారు. ప్రైవేట్ రంగ పెట్టుబడులను పెంచడానికి, తద్వారా దీర్ఘకాలిక వృద్ధిని ప్రోత్సహించేందుకు వీలుగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు.బడ్జెట్ బూస్టర్- కల్యాణ్ కృష్ణమూర్తి, ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీఈఓకేంద్ర బడ్జెట్ 2025-26 స్వయం సమృద్ధి, వికసిత్ భారత్‌కు సరైన బూస్టర్‌ను అందిస్తుంది. మధ్యతరగతికి గణనీయమైన పన్ను ఉపశమనం, క్రమబద్ధీకరించిన టీడీఎస్ నిబంధనలు, స్థానిక తయారీకి బలమైన ప్రోత్సాహంతో ఈ బడ్జెట్ వినియోగదారుల చేతుల్లో ఎక్కువ ఆదాయాన్ని ఉంచుతుంది. వారి కొనుగోలు సామర్థ్యాన్ని పెంచుతుంది. విస్తృత శ్రేణి ఉత్పత్తులను అధికం చేస్తుంది. ఎంఎస్ఎంఈల వృద్ధి, మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్‌లపై ప్రభుత్వం దృష్టి సారించడం వల్ల స్థానిక వ్యాపారాలు బలోపేతం కావడమే కాకుండా లక్షలాది మందికి ఉపాధి లభిస్తుంది. చిన్న వ్యాపారాలు, చేతివృత్తుల వారికి కొత్త అవకాశాలు వస్తాయి. స్థానిక తయారీని మెరుగుపరచడానికి, దేశం అంతటా పారిశ్రామికవేత్తలకు మద్దతు ఇవ్వడానికి, సాంకేతికతను ఉపయోగించడానికి బడ్జెట్ తోడ్పడుతుంది.ఇదీ చదవండి: కేంద్ర బడ్జెట్ 2025 హైలైట్స్అదనంగా 75 వేల వైద్య సీట్లు- డా.మల్లికార్జున, ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ, యూరాలజీకేంద్రబడ్జెట్ 2025లో ఆరోగ్య సంరక్షణ, వైద్య సదుపాయాల కోసం ఎక్కువ కేటాయింపులు జరపడం సంతోషంగా ఉంది. 75 వేల వైద్య సీట్లను అదనంగా జోడించడంతో ఈ రంగంలో స్థిరపడాలనుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. చాలా వరకు ఇతర దేశాలకు వెళ్లి వైద్య విద్యను అభ్యసించే విధానాన్ని కొంత కట్టడి చేసినట్లవుతుంది. చాలా క్యాన్సర్ సెంటర్లను ప్రారంభించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దాంతో చాలా మంది గ్రామీణ ప్రాంతాల్లోని రోగులకు మేలు జరుగుతుంది. అంగన్వాడీలకు మూలధన వ్యయాన్ని పెంచారు. -
‘సుప్రీం’ నిర్ణయం చంద్రబాబుకు చెంపపెట్టు: వైఎస్సార్సీపీ
సాక్షి, తిరుపతి: సీబీఐ సిట్ బృందం విచారణ పూర్తిగా స్వాగతిస్తున్నామని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుమల లడ్డూ కేసులో సుప్రీం కోర్టు నిర్ణయంపై ఆయన స్పందిస్తూ.. లడ్డూపై కేవలం దురుద్దేశ పూర్వకంగా చంద్రబాబు ఆరోపణలు చేశారన్నారు సీబీఐ డైరెక్టర్ పర్యవేక్షణలో వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందనే నమ్మకం ఉందన్నారు. శ్రీవేంకటేశ్వర స్వామి ఆదేశాలతోనే సుప్రీంకోర్టు ద్వారా ఆదేశాలు వచ్చాయన్నారు. సీబీఐ విచారణ ద్వారా నిజాలు నిగ్గు తేలతాయని, సత్యం వెలుగులోకి వస్తుందని భూమన అన్నారు. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం: వైవీ సుబ్బారెడ్డిసుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని.. సీబీఐ విచారణతో న్యాయం జరుగుతుందని విశ్వసిస్తున్నామని వైఎస్సార్సీపీ ఎంపీ, టీటీడీ మాజీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పొలిటికల్ కామెంట్లు చేయొద్దని సుప్రీంకోర్టు చెప్పింది. చంద్రబాబు వ్యాఖ్యలతో కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిజాలు బయటపెట్టేలా విచారణ జరిపించాలని పిటిషన్ వేశామన్నారు. ఆరోపణలు నిజమైతే ఎలాంటి శిక్షకైనా సిద్ధమని చెప్పాము. నా హయాంలో ఏ.ఆర్ కంపెనీ నుంచి ఎప్పుడూ నెయ్యి సరఫరా జరగలేదు. కల్తీ జరిగితే ఎలాంటి పదార్థాలు కలిశాయన్నది కూడా తెలుస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం నింద వేసింది కాబట్టి ఇక వెనక్కి వెళ్లొద్దన్న ధోరణిలో మాట్లాడుతున్నారు. వీలైనంత త్వరగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాను. విచారణ ముగిసే వరకు సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉంటుంది. మా పై చేసిన నిందలు తొలగిపోతాయని అనుకుంటున్నాము. మా సమయంలో కల్తీ జరగలేదు’’ అని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.బాబు అబద్ధాలు తేటతెల్లమయ్యాయి: రవీంద్రనాథ్రెడ్డితిరుమల లడ్డు కల్తీ ఆరోపణలపై సుప్రీం కోర్టు సిట్ వేయడం చంద్రబాబుకు చెంపపెట్టని, ఇప్పటికైనా చంద్రబాబు దేవుడిని తన స్వార్ధ రాజకీయాలకు వాడుకోవడం మానుకోవాలని వైఎస్సార్సీపీ వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వేంకటేశ్వరుని భక్తుల మనోభావాలతో ఆటలాడుకున్నారని, లడ్డూలో కల్తీ నెయ్యి వాడకపోయినా కల్తీ జరిగిందంటూ చంద్రబాబు గోబెల్స్ ప్రచారం చేశారని ఆయన అన్నారు. నేటి సుప్రీం కోర్టు తీర్పుతో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలని తేటతెల్లమయ్యాయని, సీబీఐ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు చేయడాన్ని తాము స్వాగతిస్తున్నట్లు రవీంద్రనాథ్‌రెడ్డి చెప్పారు.స్వతంత్ర దర్యాప్తుతో వాస్తవాలు బయటికి..: ఆర్కే రోజాశ్రీవారి లడ్డూ వివాదంలో సుప్రీంకోర్టు నిర్ణయం ఆహ్వానించదగ్గ పరిణామం’’ అని మాజీ మంత్రి ఆర్కే రోజా ట్వీట్ చేశారు. సున్నితమైన భక్తుల మనోభావాలతో కూడుకున్న శ్రీవారి ప్రసాదాల విషయంలో రాజకీయ దురుద్దేశపూరిత వ్యాఖ్యలు మానుకుంటే మంచిదని ఆమె హితవు పలికారు.‘‘మొదటి నుంచి మేము భావిస్తున్నది రాష్ట్ర ముఖ్యమంత్రే విచారణ, ఆధారాలతో సంబంధం లేకుండా రాజకీయ ఆరోపణలు చేసిన నేపథ్యంలో వారి పరిధిలోని విచారణతో నిజాలు బయటికి రావని స్వతంత్ర దర్యాప్తు సంస్థ కావాలని కోరుకున్నాం. కేంద్ర ప్రభుత్వం కూడా సిట్ సరిపోదని, కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో విచారణ జరగాలనే వాదనతో మా డిమాండ్‌కు విశ్వసనీయత పెరిగింది. సుప్రీం పర్యవేక్షణలో స్వతంత్ర దర్యాప్తుతో వాస్తవాలు బయటికి వస్తాయని, తద్వారా గాయపడిన కోట్లాది మంది భక్తుల మనోభావాల్ని పునరుద్ధరించినట్టు అవుతుందని తిరుపతి ఆడబిడ్డగా నమ్ముతున్నాను..!!’’ అని ఆర్కే రోజా ట్వీట్ చేశారు.శ్రీవారి లడ్డూ ప్రసాదాల వివాదంలో #SupremeCourt తీర్పు ఆహ్వానించదగ్గ పరిణామం. సుప్రీం తీర్పుతో అయినా సున్నితమైన భక్తుల మనోభావాలతో కూడుకున్న శ్రీవారి ప్రసాదాల విషయంలో రాజకీయ దురుద్దేశపూరిత వ్యాఖ్యలు అందరూ మానుకుంటే మంచిది. మొదటి నుంచి మేము భావిస్తున్నది రాష్ట్ర…— Roja Selvamani (@RojaSelvamaniRK) October 4, 2024 చంద్రబాబు, పవన్ ప్రజలకు క్షమాపణ చెప్పాలి: కొట్టు సత్యనారాయణ స్వతంత్ర సిట్ ఏర్పాటు చేయడం స్వాగతిస్తున్నామని మాజీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. చంద్రబాబు వంద రోజుల పరిపాలన ఫెయిల్యూర్ని కప్పిపుచ్చుకొని లడ్డూ రాజకీయం చేశారు. సుప్రీంకోర్టు ధర్మాసనం కోట్లాది మంది హిందువుల మనోభావాలు నిలబెట్టింది. దుర్మార్గుడైన ముఖ్యమంత్రి రాజకీయ క్రీడలకు ఇది చెంపపెట్టు. లడ్డూ వివాదంపై ఇప్పటికైనా ప్రభుత్వం పుల్ స్టాప్ పెట్టి సుప్రీంకోర్టు నిర్ణయానికి కట్టుబడి ఉండాలి.ఇదీ చదవండి: చంద్రబాబుకు సుప్రీంకోర్టులో మరో ఎదురుదెబ్బ..స్వతంత్ర సిట్ కమిటీ చంద్రబాబు పవన్ కల్యాణ్‌లను కూడా విచారణ చేయాలి. కల్తీ లడ్డూలు అయోధ్య రామలయానికి కూడా పంపారంటూ పవన్ వ్యాఖ్యానించారు. ఏ ఆధారాలతో ఇలాంటి వ్యాఖ్యలు చేశారు.? ఎవరు స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్టు మాట్లాడుతున్నాడు. సనాతన ధర్మంలో బ్రాహ్మణ ఇతరులు సైతం కూడా ఆచరించే ఆగమాలు సైతం ఉన్నాయి. సనాతన ధర్మంపై పవన్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నాడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలి’’ అని కొట్టు సత్యనారాయణ డిమాండ్ చేశారు.సుప్రీంకోర్టు నిర్ణయం స్వాగతిస్తున్నాం: కాకాణిసుప్రీంకోర్టు తీర్పు చంద్రబాబుకి చెంపపెట్టు లాంటిదని మాజీ మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డి అన్నారు. మొదటి నుంచి వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్న దానినే సుప్రీంకోర్టు ఏకీభవించినట్లు అనిపించిందన్నారు. ‘‘రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ ద్వారా నిజానిజాలు బయటికి రావు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు అయ్యే స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారానే నిజాలు బయటికి వస్తాయి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని మేము స్వాగతిస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉండాలి హిందూ భక్తులకు చంద్రబాబు క్షమాపణ చెప్పాలి. రాజ్యాంగం, కోర్టుల గురించి పవన్‌కు అవగాహన లేదు. హిందూ సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదు. వారాహి డిక్లరేషన్‌లో పవన్ చేసిన వ్యాఖ్యలను కోర్టు ధిక్కరణ కింద పరిగణలోకి తీసుకోవాలి.చంద్రబాబు రాజకీయ పతనం ఆరంభమైంది: తోపుదుర్తితిరుపతి లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు తీర్పుపై రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి స్పందిస్తూ.. తిరుపతి లడ్డు వివాదంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిది. సుప్రీంకోర్టు.. చంద్రబాబుని, రాష్ట్ర ప్రభుత్వాన్ని నమ్మడం లేదు. చంద్రబాబు తన రాజకీయ లబ్ధి కోసం భగవంతున్ని సైతం వదలకుండా దిగజారుడు రాజకీయాలు చేస్తున్నాడు. చంద్రబాబు రాజకీయ పతనం ఆరంభమైంది. చంద్రబాబు సుప్రీం కోర్టు నిర్ణయాన్ని దృష్టిలో పెట్టుకుని గతంలో చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, లేదంటే రాజీనామా చేయాలి’ అని తోపుదుర్తి డిమాండ్ చేశారు. -
ఊరటపై రాహుల్ గాంధీ రియాక్షన్
ఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, పార్టీ కీలక నేత రాహుల్ గాంధీకి సుప్రీం కోర్టులో దక్కిన ఊరటతో కాంగ్రెస్ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నాయి. మోదీ ఇంటి పేరు వ్యాఖ్యలతో పరువు నష్టం కేసు కారణంగా ఆయనకు సూరత్ కోర్టులో రెండేళ్ల శిక్ష పడగా.. ఆ కారణంగానే ఆయన ఎంపీగా అనర్హత వేటు ఎదుర్కోవాల్సి వచ్చింది. ట్రయల్‌కోర్టు తీర్పుపై సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ స్టే విధించడంతో ఆయనపై వేటు తొలగిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే కోర్టు తీర్పు కాపీతో లోక్‌సభ సెక్రటరీని కలిశారు కాంగ్రెస్ ఎంపీలు. ఒకవేళ వేటు వెంటనే తొలగిపోతే మాత్రం ఈ సెషన్‌కే ఆయన హాజరయ్యే ఛాన్స్ ఉంది. మణిపూర్ అంశంతో కేంద్రంపై అవిశ్వాస తీర్మానంపై మంగళవారం నుంచి చర్చ జరగనుంది. ఈ తరుణంలో రాహుల్ గాంధీకి ఊరట దక్కడంతో కాంగ్రెస్ శ్రేణులు మరింత సంబురాలు చేసుకుంటున్నాయి. సత్యమే గెలుస్తుందనే థీమ్‌తో ఆ పార్టీ నేతలంతా రియాక్షన్లు ఇస్తున్నారు. రాహుల్ గాంధీ సైతం ఈ పరిణామంపై స్పందించారు. ► ‘‘ఏది వచ్చినా.. నా కర్తవ్యం అలాగే ఉంటుంది. దేశాన్ని రక్షించాలన్నదే నా ఆలోచన’’.. అంటూ తీర్పును చాలా తేలికగా తీసుకుంటూ ట్వీట్ చేశారాయన. ఇవాళ కాకుంటే రేపైనా నిజం గెలుస్తుంది. ఏం జరిగినా నా రూట్ క్లియర్‌గా ఉంది. నేనేం చేయాలి.. నా పనేంటనే విషయంలో నాకు క్లారిటీ ఉంది. నాకు సపోర్ట్ చేసిన అందరికీ, నాపై ప్రేమ చూపించిన ప్రజలకు కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు. Come what may, my duty remains the same. Protect the idea of India. — Rahul Gandhi (@RahulGandhi) August 4, 2023 ► ఈ పరిణామంపై పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ట్విటర్ ద్వారా స్పందించారు. సత్యం ఒక్కటే గెలుస్తుందని ట్వీట్ ఖర్గే.. ఎట్టకేలకు న్యాయం జరిగిందని, ప్రజాస్వామ్యం నెగ్గిందన్నారు. రాహుల్‌ను బీజేపీ కుట్రపూరితంగా వేటాడటం పూర్తిగా బట్టబయలైంది. విపక్షాలను లక్ష్యంగా చేసుకునే దుర్మార్గపు రాజకీయాలను ఇకనైనా వాళ్లు ఆపేయాలి అంటూ ట్వీట్ చేశారాయన. Truth Alone Triumphs! We welcome the verdict by the Hon’ble Supreme Court giving relief to Shri @RahulGandhi. Justice has been delivered. Democracy has won. The Constitution has been upheld. BJP’s conspiratorial hounding of Shri Gandhi has been thoroughly exposed. Time for… — Mallikarjun Kharge (@kharge) August 4, 2023 రాహుల్ గాంధీకి దక్కింది భారీ ఊరటనే. ఆయనపై జరిగిన కుట్ర ఇవాళ విఫలమైంది. స్పీకర్‌ను కలిసి ఆయన్ని పార్లమెంట్‌లోకి అనుమతించాలని గట్టిగా కోరతాం. ఆయన అనర్హత ఎత్తేయాలని గళం వినిపిస్తాం. స్పీకర్‌కు లేఖ రాస్తా అని లోక్‌సభలో కాంగ్రెస్ సభా నేత అధిర్ రంజన్ చౌదరి తెలిపారు. #WATCH | After Supreme Court stays the conviction of Congress leader Rahul Gandhi in 'Modi' surname defamation case, Congress MP Adhir Ranjan Chowdhury says, "The SC's decision is a big relief for Congress leader Rahul Gandhi. The conspiracy against Rahul Gandhi has failed… pic.twitter.com/MogT1DxiQI — ANI (@ANI) August 4, 2023 ఇప్పుడు ప్రతీది సవ్యంగా సాగుతుందేమో.. రాహుల్ గాంధీ ఊరటపై రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ స్పందించారు. ‘‘స్వాతంత్రం వచ్చాక.. పరువు నష్టం కేసులో పూర్తిస్థాయి శిక్ష పడిన మొదటి వ్యక్తి రాహుల్ గాంధీనే. కానీ, దేశ సర్వోన్నత న్యాయస్థానం కింది కోర్టు తీర్పును కొట్టేసింది. ఇప్పుడు ప్రతీది సవ్యంగా సాగుతోంది. రాజస్థాన్‌లోనే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది ::: గెహ్లాట్ #WATCH | Rajasthan CM & Congress leader Ashok Gehlot on Supreme Court staying conviction of Rahul Gandhi in 'Modi' surname remark " After independence, Rahul Gandhi is the first person who got a full sentence of two years in a defamation case. Today, the Supreme Court rejected… pic.twitter.com/v9RcETEzU3 — ANI (@ANI) August 4, 2023 ► నిజం మాట్లాడేవాడు ఎవరికీ, దేనికి భయపడడు. జనాల మధ్య తిరిగి వాళ్ల కష్టసుఖాలు తెలుసుకునేవాడు.. రాజు కంటే గొప్పవాడే అవుతాడు అంటూ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విటర్ వీడియోలతో పోస్టులు పెడుతోంది. राजा से बड़ा भाग्य पथिक का होता है pic.twitter.com/eTTAf9LCTg — Congress (@INCIndia) August 4, 2023 ► సూర్య చంద్రులు, సత్యం.. ఈ మూడూ ఎంతోకాలం దాచబడవు.. అంటూ రాహుల్ గాంధీ సోదరి, కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా ట్వీట్ చేశారు. "Three things cannot be long hidden: the sun, the moon, and the truth” ~Gautama Buddha माननीय उच्चतम न्यायालय को न्यायपूर्ण फैसला देने के लिए धन्यवाद। सत्यमेव जयते। — Priyanka Gandhi Vadra (@priyankagandhi) August 4, 2023 ► కాంగ్రెస్ సీనియర్ జైరాం రమేశ్ సత్యమేవ జయతే అంటూ ట్వీట్ చేశారు. బీజేపీ యంత్రాంగం ఎంత ప్రయత్నించినా.. రాహుల్ గాంధీ లొంగలేదు. న్యాయంపై విశ్వాసం ఉంచాడు. కోర్టు తీర్పు బీజేపీకి, వాళ్ల సహచరులకు ఒక గుణపాఠం. వాళ్లను ఎండగడుతూనే ఉంటాం. రాజ్యాంగ ఆదర్శాలను పాటిస్తుంటాం. కోర్టు తీర్పు సత్యం, న్యాయానికి బలమైన రుజువులు అంటూ ట్వీట్ చేశారు. The Supreme Court judgment is a strong vindication of truth and justice. Despite the relentless efforts of the BJPs machinery, @RahulGandhi has refused to bend, break or bow, choosing instead to place his faith in the judicial process. Let this be a lesson to the BJP and its… — Jairam Ramesh (@Jairam_Ramesh) August 4, 2023 Look at Jitendra Awhad, he is NCP MLA still celebrating & chanting for Rahul Gandhi along with INC leaders. 🔥🔥pic.twitter.com/lech8heUSd — Amock (@Politics_2022_) August 4, 2023 ► ఎన్సీపీ ఎమ్మెల్యే జితేంద్ర అవాద్.. కాంగ్రెస్ నేతలతో కలిసి రాహుల గాంధీకి దక్కిన ఊరటపై ‘రాహుల్ గాంధీ’నినాదాలతో సంబురాలు చేసుకున్నారు. ► పరువు నష్టం దావా కేసులో శిక్షపై స్టే విధిస్తూ సుప్రీం కోర్టు ఇవాళ ఇచ్చిన తీర్పును స్వాగతిస్తూనే.. తమ పోరాటం కొనసాగిస్తానని బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్ మోదీ మీడియాకు తెలిపారు. -
రాకేశ్ మాస్టర్ గురించి తొలిసారి రియాక్ట్ అయిన శేఖర్ మాస్టర్
ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాకేష్ మాస్టర్ కొద్దిరోజుల క్రితం హఠాన్మరణం చెందిన సంగతి తెలిసింది. ఆయన హఠాన్మరణం అభిమానులను, కుటుంబ సభ్యులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. రాకేశ్ మాస్టర్ పెద్ద కర్మ కార్యక్రమాన్ని హైదరాబాద్‌లో నిర్వహించారు. (ఇదీ చదవండి: 'పుష్ప' పాటకు మనవాళ్ల డ్యాన్స్.. స్టాండింగ్ ఒవేషన్‌తో అమెరికన్స్) ఈ సందర్భంగా తను శిష్యులు అయినటువంటి శేఖర్ మాస్టర్‌తో పాటు సత్య మాస్టర్ భావోద్వేగానికి గురయ్యారు. రాకేష్ మాస్టర్‌తో ఉన్న అనుబంధాన్ని ఆయన మరణం తర్వాత శేఖర్ మాస్టర్ తొలిసారి ఇలా గుర్తుచేసుకున్నారు. 'నేను, సత్య ఇద్దరం విజయవాడలో డ్యాన్స్‌కు సంబంధించి బేసిక్స్ వరకు నేర్చుకున్నాం. డ్యాన్స్ అంటే మక్కువతో హైదరాబాద్‌కు వచ్చాం. మేము కష్ట సమయంలో ఉన్నప్పుడు రాకేష్మాస్టర్ ఆశ్రయం కల్పించి, డ్యాన్స్ నేర్పించారు. రాకేశ్ మాస్టర్ గొప్ప డ్యాన్సర్. మాది 8 ఏళ్ల అనుబంధం. మీరు యూట్యూబ్‌లో ఆయన డ్యాన్స్‌ను చూసింది 5 శాతమే. ఆయనకు ఉన్న టాలెంట్ చాలామందికి తెలియదు. మొదట్లో నేను ప్రభుదేవా మాస్టర్‌ను చూసి స్ఫూర్తి పొందాను. హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత రాకేశ్ మాస్టర్ని అభిమానించడం ప్రారంభించా. ఆయన మా గురవు అని చెప్పుకుంనేందకు ఎప్పటికీ గర్వంగానే ఫీలవుతాము. ఆ రోజుల్లో డ్యాన్స్ తప్పా మాకు మరో ప్రపంచం లేదు. అప్పట్లో ఆయన పెళ్లి కూడా మేమే చేశాం. ఎప్పుడూ రాకేశ్ మాస్టర్ దగ్గరే ఉండేవాళ్లం. ఆయన ఎక్కడున్నా బాగుండాలనే కోరుకునే వాళ్లం, కానీ ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. ఇంతలా ఆయనతో అనుబంధం ఉంది. కానీ ఇప్పుడు కొన్ని యూట్యూబ్ ఛానెళ్ల వారు ఇష్టం వచ్చినట్టు థంబ్‌నైల్స్ పెట్టి ఏదేదో రాసేస్తున్నారు. దయచేసి మీకు వాస్తవాలు తెలిస్తేనే రాయండి. లేదంటే రాయకండి. ప్లీజ్.. ఇకనైనా ఆపేయండి' అని శేఖర్ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. (ఇదీ చదవండి: SPY Review In Telugu: 'స్పై' సినిమా రివ్యూ) -
కఠిన నిబంధనలతో ఇబ్బందిపడ్డ విద్యార్థులు.. తల్లితండ్రుల అసహనం
-
తెలుగు సినిమా లోనే బలగం ఒక చరిత్ర
-
'అమృత కాల' బడ్జెట్ కాదు.. 'మిత్ర కాల' బడ్జెట్.. రాహుల్ సెటైర్లు..
న్యూఢిల్లీ: కేంద్రం బుధవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ప్రధాని మోదీ చెబుతున్నట్లు ఇది అమృత కాల బడ్జెట్ కాదు.. మిత్ర కాల బడ్జెట్ అని రాహుల్ సెటైర్లు వేశారు. ఇది కేవలం సంపన్నులకు మాత్రమే మేలు చేసే బడ్జెట్ అని ధ్వజమెత్తారు. ఈమేరకు ఆయన ట్వీట్ చేశారు. కేంద్ర బడ్జెట్లో ఉద్యోగాలు సృష్టించాలన్న విజన్, ధరల పెరుగుదలను నియంత్రించాలనే వ్యూహం, దేశంలో అసమానతలను తగ్గించాలే ఉద్దేశం లేదని రాహుల్ ధ్వజమెత్తారు. దేశంలోని ఒక్క శాతం సంపన్నుల చేతిలో 40శాతం సంపద ఉందని, 50 శాతం పేదలు 64 శాతం జీఎస్టీ చెల్లిస్తున్నారని, 42 శాతం మంది యువత నిరుద్యోగులుగా ఉన్నారని.. అయినా మోదీ వీటిని అసలు పట్టించుకోరని రాహుల్ ఫైర్ అయ్యారు. భారత్ భవిష్యత్తును నిర్మించే రోడ్‌మ్యాప్ ప్రభుత్వం వద్ద లేదని ఈ బడ్జెట్ రుజువు చేస్తోందన్నారు. ‘Mitr Kaal’ Budget has: NO vision to create Jobs NO plan to tackle Mehngai NO intent to stem Inequality 1% richest own 40% wealth, 50% poorest pay 64% of GST, 42% youth are unemployed- yet, PM doesn’t Care! This Budget proves Govt has NO roadmap to build India’s future. — Rahul Gandhi (@RahulGandhi) February 1, 2023 చదవండి: వారి ఆకాంక్షలను బడ్జెట్ నెరవేర్చింది.. విపక్షాల స్పందన ఇదే! -
వారి ఆకాంక్షలను బడ్జెట్ నెరవేర్చింది.. విపక్షాల స్పందన ఇదే!
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ 2023-24పై విపక్షాలు పెదవి విరిచాయి. ఈ బడ్జెట్ వల్ల పేదలు, సామాన్యులు నిరుద్యోగులకు ఒరిగేదేమీ లేదని మండిపడ్డాయి. ఇది అంబానీ, అదానీ, గుజరాత్‌కు మాత్రమే లాభం చేకూర్చేలా ఉందని ధ్వజమెత్తాయి. 2024 సార్వత్రిక ఎన్నికలను దృష్టిలోనే ఉంచుకునే బీజేపీ అవకాశవాద బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని మండిపడ్డాయి. వాళ్ల కోసమే: కాంగ్రెస్ కాంగ్రెస్ ఎంపీ కే సురేశ్ ఈ బడ్జెట్‌ను 'ప్రో కార్పొరేట్‌గా' అభివర్ణించారు. అంబానీ, అదానీ, గుజరాత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కేంద్రం బడ్జెట్‌ను రూపొందించిందని ఆరోపించారు. అదానీ ఆకాంక్షలను ఇది నెరవేర్చిందని ధ్వజమెత్తారు. కానీ సామాన్యుడిని మాత్రం కేంద్రం అసలు పట్టించుకోలేదని విమర్శించారు. బడ్జెట్లో కొన్ని అంశాలు బాగానే ఉన్నాయని .. కానీ గ్రామీణ పేదలు, ఉపాధి హామీ పథకం, నిరుద్యోగం, ద్రవ్యోల్బణం వంచి కీలక అంశాల ప్రస్తావనే లేదని కాంగ్రెస్ నేత శశిథరూర్ అన్నారు. ప్రజా వ్యతిరేకం: మమత ఇది ప్రజా వ్యతిరేక బడ్జెట్ అని టీఎంసీ అధినేత్రి, బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే దీన్ని రూపొందించారని విమర్శించారు. ఆదాయపన్ను శ్లాబులు మార్చడం వల్ల ఎవరికీ మేలు జరగదని అన్నారు. దేశంలో కీలక సమస్యగా మారిన నిరుద్యోగం గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదని దుయ్యబట్టారు. పేదలు మరింత పేదలుగా, ధనికులు మాత్రం మరింత సంపన్నులుగా మారేలా బడ్జెట్ ఉందని ఫైర్ అయ్యారు. సమాజంలో ఒక వర్గానికి మాత్రమే ఇది ప్రయోజనం చేకూర్చేలా ఉందన్నారు. సవతి ప్రేమ: కేజ్రీవాల్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కూడా బడ్జెట్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది 1.75 లక్షల కోట్లు ఇన్‌కం ట్యాక్స్ కట్టిన ఢిల్లీ నగరానికి బడ్జెట్లో కేవలం రూ.325 కోట్లు మాత్రమే కేటాయించడం బాధాకరమన్నారు. కేంద్రం మరోసారి ఢిల్లీపై సవతి ప్రేమను చూపించి తీరని అన్యాయం చేస్తోందన్నారు. అలాగే ధరల పెరగుదల, నిరుద్యోగం వంటి కీలక అంశాల గురించి బడ్జెట్లో ప్రస్తావనే లేదని విమర్శించారు. ఈ బడ్జెట్‌తో ద్రవ్యోల్బణం మరింత పెరుగుతుందని కేజ్రీవాల్ అన్నారు. విద్య కోసం బడ్జెట్ కేటాయింపులు 2.64 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించడం దురదృష్టకరమన్నారు. అలాగే ఆరోగ్య రంగానికి కేటాయింపులు 2.2 శాతం నుంచి 1.98 శాతానికి తగ్గించడం హానికరం అన్నారు. ఆశ లేదు నిరాశే: అఖిలేష్ కేంద్ర బడ్జెట్‌పై గంపెడాశలు పెట్టుకున్న ప్రజలకు నిరాశే మిగిలిందని సమాజ్‌వాదీ పార్టీ అధినేత, యూపీ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్ విమర్శించారు. 10 ఏళ్లుగా బడ్జెట్ ప్రవేశపెడుతున్న బీజేపీ ఈసారి కూడా ప్రజలకు ఏమీ ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ బడ్జెట్‌తో దేశంలో నిరుద్యోగం, ద్రవ్యోల్బణం ఇంకా పెరుగుతుందని అన్నారు. రైతులు, కార్మికులు, యువత, మహిళలుకు ఆశకు బదులు నిరాశే మిగిలిందన్నారు. కేవలం కొందరు ధనికులకు మాత్రమే ప్రయోజనం చేకూర్చేలా బడ్జెట్ ఉందన్నారు. ఎప్పటిలాగే చేశారు: మాయావతి ఎప్పటిలాగే ఈసారి కూడా దేశంలోని 100 కోట్ల మంది పేదల ఆశలపై నీళ్లు జల్లేలా బడ్జెట్ ఉందని బీఎస్పీ అధినేత్రి మాయావతి మండిపడ్డారు. బడ్జెట్ రూపొందించే ముందు దేశంలో 130 కోట్ల మంది పేదలు, కార్మికులు, అణగారిన వర్గాలు, రైతులు ఉన్నారనే విషయాన్ని ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. వీరంతా అమృత కాలం కోసం ఎదురుచూస్తున్నారని, కానీ ఈసారి కూడా నిరాశే ఎదురైందన్నారు. కాస్త భిన్నం: మెహబూబా ముఫ్తీ గత 8-9 ఏళ్లతో పోల్చితే ఈసారి బడ్జెట్ కాస్త భిన్నంగా ఉందని జమ్ముకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ అన్నారు. పన్నులు పెంచారని, సంక్షేమ పథకాలు, సబ్సీడీలకు కేటాయింపులు లేవని అన్నారు. ధనవంతులు, బడా వ్యాపారవేత్తల కోసమే ప్రజల నుంచి పన్ను వసూలు చేస్తున్నారని విమర్శించారు. చదవండి: బడ్జెట్లో రక్షణ శాఖకు కేటాయింపులు పెంపు.. ఎన్ని కోట్లంటే..? -
83 చిత్రంపై రజనీ కాంత్ రియాక్షన్.. పొగడ్తలతో బౌండరీలు
Super Star Rajinikanth Reaction On 83 Movie: బాలీవుడ్ హీరో రణ్వీర్ సింగ్ మాజీ క్రికెటర్ హర్యానా హరికేన్ కపిల్ దేవ్ పాత్రలో మెప్పించి ఆకట్టుకుంటున్న చిత్రం '83'. 1983 వన్డే ప్రపంచకప్‌లో ఎటువంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగి ప్రపంచకప్ సాధించిన కపిల్ డెవిల్స్ అద్బుతం చేసి చూపెట్టింది. అప్పటివరకు సాధారణ వ్యక్తులుగా కనిపించిన ఆటగాళ్లు రాత్రికి రాత్రే స్టార్లుగా మారిపోయారు. ప్రపంచకప్ సాధించిన టీమిండియాలోని 14 మంది ఆటగాళ్లు తర్వాతి తరానికి ఒక ఐకాన్‌గా మారిపోయారు. ఈ నేపథ్యంలో వచ్చిన 83 సినిమా డిసెంబర్ 24న విడుదలైన ఈ సినిమా అశేష ప్రేక్షకాదరణ పొందుతుంది. నిమా తెరకెక్కించిన చిత్ర బృందానికి, ముఖ్యంగా కపిల్ దేవ్‌ను యాజ్ ఇట్ ఈజ్ దింపేసిన రణ్వీర్ సింగ్‌కు విమర్శకుల ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే 83 సినిమా చూసిన సూపర్ స్టార్ రజనీ కాంత్ ఈ చిత్రాన్ని పొగడ్తలతో బౌండరీలు దాటించారు. 'వావ్ వాట్ ఏ మూవీ.. అద్భుతం..' అంటూ ఆకాశానికెత్తారు రజనీ కాంత్. అలాగే నిర్మాతలకు, చిత్ర బృందానికి అభినందనలు తెలుపుతూ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ విషయాన్ని తన ట్విటర్ వేదికగా తెలిపారు సూపర్ స్టార్. ఈ ట్వీట్లో చిత్ర నిర్మాత కబీర్ ఖాన్, కపిల్ దేవ్, హీరో రణ్వీర్ సింగ్, నటుడు జీవాను మెన్షన్ చేశారు. #83TheMovie wow 👏🏻👏🏻 what a movie… magnificent!!! Many congratulations to the producers @kabirkhankk @therealkapildev @RanveerOfficial @JiivaOfficial and all the cast and crew … — Rajinikanth (@rajinikanth) December 28, 2021 ఇదీ చదవండి: 1983 వరల్డ్ కప్‌ను తెరపై చూపించిన '83' మూవీ రివ్యూ -
చారిత్రక విజయం: మరి సంయుక్త కిసాన్ మోర్చా ఏమంది?
సాక్షి, హైదరాబాద్. వివాదాస్పద మూడు సాగు చట్టాలపై బీజేపీ సర్కార్ నిర్ణయాన్ని ప్రతిపక్షాలు స్వాగతిస్తున్నాయి. ఇది అన్న దాతల త్యాగాల ఫలితమని, చార్రితక విజయమని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు గురునానక్ జయంతి రోజున ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటనపై సంయుక్త కిసాన్ మోర్చా స్వాగతించింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. మరోవైపు రైతుల పోరాటంలో తీవ్రవాదులు, టెర్రరిస్టులు ప్రవేశించారనీ, దేశ ద్రోహులు, ఖలిస్తానీలు అంటూ రైతు ఆందోళనకారులపై విరుచుకుపడిన వారందరూ బహిరంగ క్షమాపణలు చెప్పాలని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.. జూన్ 2020లో ఆర్డినెన్స్‌లుగా తీసుకొచ్చిన మూడు రైతు-వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల నల్లజాతీయుల చట్టాలను రద్దు చేయడంపై రైతు సంఘాలు సంతోషం వ్యక్తం చేశారు.అయితే పార్లమెంటులో ఈ చట్టాలు రద్దు అయేంతవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని రైతు నేత రాకేష్ తికాయత్ తెలిపారు. పార్లమెంటరీ విధానాల ద్వారా ప్రకటన అమల్లోకి వచ్చే వరకు వేచి ఉంటామని సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. చట్టాల రద్దు నిర్ణయం అమలైతే దేశంలో దాదాపు ఒక సంవత్సరం పాటు సాగిన రైతుల పోరాటానికి ఇది చారిత్రాత్మక విజయం అవుతుందని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ మొండివైఖరి కారణంగానే లఖింపూర్ ఖేరీ హత్యలతోసహా ఈ పోరాటంలో దాదాపు 700 మంది రైతులు అమరులయ్యారని విమర్శించింది. మూడు నల్ల చట్టాల రద్దు కోసమే మాత్రమే కాకుండా, అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు, రైతులందరికీ లాభదాయక ధరల కోసం చట్టబద్ధమైన హామీ వచ్చేదాకా తమ ఆందోళన కొనసాగుతుందని తెలిపింది. విద్యుత్ సవరణ బిల్లు ఉపసంహరణతోపాటు రైతుల ఈ ముఖ్యమైన డిమాండ్ ఇంకా పెండింగ్‌లోనే ఉందని వ్యాఖ్యానించింది. -
నిండా ముంచిన మిర్చి
-
WhatsApp: వాట్సాప్ మెసేజ్‌లకు ‘రియాక్ట్’ అవుతారా?
వాట్సాప్‌లో ఎవరైనా మెసేజ్ చేస్తే.. ఎమోజీలు, కొంచెం కష్టపడి జిఫ్ ఫైల్స్‌తో రియాక్షన్ ఇస్తుంటారు చాలామంది. 2017 నుంచి స్టిక్కర్ల వాడకం విపరీతంగా పెరిగింది. అయితే వాట్సాప్ మెసేజ్‌లకు డిఫాల్ట్‌గా రియాక్షన్లు ఇచ్చే ఆఫ్షన్ ఎలా ఉంటుంది? యస్.. త్వరలోనే ఆ ఫీచర్ రాబోతోంది. మెసేజింగ్-కాలింగ్ యాప్ వాట్సాప్‌లో సరికొత్త ఫీచర్స్ రాబోతున్నాయి. ఇందులో భాగంగా ముందు అప్డేట్గా మెసేజ్ రియాక్షన్స్ ఫీచర్‌ను ప్రవేశపెట్టబోతోంది. ఈ మేరకు ఫీచర్‌కు సంబంధించిన టెస్టింగ్ స్క్రీన్ షాట్స్ కొన్నింటిని వాట్సాప్ సన్నిహిత సంస్థ వాబేటాఇన్ఫో షేర్ చేసింది. ఇక ట్విటర్, ఇన్స్టాగ్రామ్ ఇదివరకే మెసేజ్ రియాక్షన్ ఫీచర్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు దానిని వాట్సాప్‌కు సైతం తేబోతున్నారు. ఇది వాట్సాప్ ఓనర్ కంపెనీ ఫేస్బుక్ రియాక్షన్ ఫీచర్ తరహాలో(ఆఫ్షన్స్) ఉండొచ్చని వాబేటాఇన్ఫో అంచనా వేస్తోంది. అతిత్వరలో ఈ ఫీచర్ రానుందని, యాప్ అప్డేట్ ద్వారా ఆండ్రాయిడ్, యాపిల్ యూజర్లు వినియోగించుకోవచ్చని వాబేటాఇన్ఫో చెబుతోంది. చదవండి: వాక్సిన్ కోసం వాట్సాప్.. ఇలా ఉపయోగించుకోండి -
రియాకు షాక్ : ‘విజయానికి తొలి అడుగు’
సాక్షి,న్యూఢిల్లీ : బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతి కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాలపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. ప్రధానంగా సుశాంత్ సోదరి శ్వేతా సింగ్ దీనిపై సంతోషం వ్యక్తం చేశారు. విజయానికి, నిష్పాక్షిక దర్యాప్తునకు తొలి అడుగు పడిందంటూ ఆమె ట్వీట్ చేశారు. ప్రార్థనలకు ఫలితం లభించిందంటూ ఆ భగవంతునికి కృతజ్ఞతలు తెలిపారు. ఇది ప్రారంభం మాత్రమే. సత్యం వైపు మొదటి అడుగు అంటూ ఆమె సీబీఐపై పూర్తి విశ్వాసం ప్రకటించారు. సుశాంత్ స్నేహితురాలు అంకిత లోఖండేతోపాటు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్, సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ తదితరులు కూడా దీనిపై స్పందిస్తూ నిజాలు నిగ్గు తేలతాయంటూ ట్వీట్ చేయడం విశేషం. (సుశాంత్ మృతి కేసు సీబీఐకి అప్పగించిన సుప్రీంకోర్టు) కంగనా ఏమన్నారంటే.. సుశాంత్ మరణం తరువాత బాలీవుడ్ నెపోటిజంపై గళమెత్తిన హీరోయిన్ కంగన రనౌత్ కూడా స్పందించారు. ‘మానవత్వం గెలుస్తుంది, ఎస్ఎస్ఆర్ వారియర్స్ కు అభినందనలు, తొలిసారి సామూహిక శక్తి బలం అనుభవంలోకి వచ్చింది. అద్భుతం’ అంటూ ట్వీట్ చేశారు. Humanity wins, congratulations to each one of SSR warriors, first time I felt such strong force of collective consciousness, AMAZING 👏👏👏#CBITakesOver — Kangana Ranaut (@KanganaTeam) August 19, 2020 సుశాత్ మృతి కేసు దర్యాప్తును సీబీఐకు అప్పగిస్తూ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. జస్టిస్ హృషికేశ్ రాయ్ సింగిల్ జడ్జి బెంచ్ ఈ తీర్పును వెల్లడించింది. సుశాంత్ తండ్రి ఫిర్యాదు పట్నా నుంచి ముంబైకి దర్యాప్తును బదిలీ చేయాలన్న రియా చక్రవర్తి పిటిషన్ ను తోసిపుచ్చింది. అంతేకాదు సుశాంత్ మరణానికి సంబంధించి మరేదైనా కేసు నమోదైతే దానిని కూడా సీబీఐ మాత్రమే విచారిస్తుందని తేల్చి చెప్పింది. ఇప్పటికే ఈ కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించగా, రియాతో పాటు మరో ముగ్గురు కుటుంబ సభ్యులపై సీబీఐ కేసు నమోదు చేసింది. మనీలాండరింగ్ ఆరోపణల కింద రియాను మరో దర్యాప్తు సంస్థ ఈడీ కూడా విచారించిన సంగతి తెలిసిందే. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (34) జూన్ 14న ముంబై అపార్ట్మెంట్లో అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. ఆత్మహత్యగా ముంబై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే తన కుమారుడి ఆత్మహత్యకు రియా చక్రవర్తి కారణమని రాజ్‌పుత్ తండ్రి కేకే సింగ్ ఫిర్యాదు ఆధారంగా, పట్నా పోలీసులు జూలై 25న ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనిని సవాల్ చేస్తూ రియా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా విచారణ అనంతరం ఈ కేసును సీబీఐకి అప్పగించాలని సుప్రీం ఆదేశించింది. Congratulations to my extended Family!! So happy... first step towards victory and unbiased investigation. #JusticeforSushantSingRajput #OurfullfaithonCBI — shweta singh kirti (@shwetasinghkirt) August 19, 2020 Justice is the truth in action 🙏🏻 Truth wins .... #1ststeptossrjustice pic.twitter.com/2CKgoWCYIL — Ankita lokhande (@anky1912) August 19, 2020 SC directs CBI to investigate Sushant Singh Rajput’s death. May the truth always prevail 🙏🏻 #Prayers — Akshay Kumar (@akshaykumar) August 19, 2020 जय हो.. जय हो.. जय हो.. 👍👏🙏 #CBIForSSR #justiceforSushanthSinghRajput — Anupam Kher (@AnupamPKher) August 19, 2020 -
బాబు అవినీతి, రాష్ట్రానికి జరిగిన నష్టం ప్రజలకు తెలిసింది
-
నిందితుల ఎన్కౌంటర్ సబబే..
సాక్షి, న్యూఢిల్లీ : దిశా కేసులో నిందితులను తెలంగాణ పోలీసులు ఎన్కౌంటర్ చేయడంపై దేశవ్యాప్తంగా పలువురు నేతలు, సినీ ప్రముఖులు స్పందించారు. సామాన్యులకు నేర విచారణపై నమ్మకం సన్నగిల్లినందునే ఎన్‌కౌంటర్‌ను స్వాగతిస్తున్నారని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. ఉన్నావ్ , హైదరాబాద్ ఇలా లైంగిక దాడుల ఘటనల పట్ల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని అందుకే ఎన్‌కౌంటర్‌ను వారు హర్షిస్తున్నారని చెప్పారు. నేరస్తుడు పారిపోతున్న క్రమంలో పోలీసులకు మరో ప్రత్యామ్నాయం ఉండదని హైదరాబాద్ పోలీసుల చర్యను చత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బాఘేల్ సమర్ధించారు. ఈ ఎన్‌కౌంటర్‌తో న్యాయం జరిగినట్టేనని అన్నారు. ఇక పోలీసుల చర్యను స్వాగతిస్తామని ఆర్జేడీ నేత రబ్రీ దేవి పేర్కొన్నారు. దిశ లైంగిక దాడి కేసులో నిందితుల ఎన్కౌంటర్ సాహసోపేతమైందని బాబా రాందేవ్ స్వాగతించారు. ఎన్‌కౌంటర్‌పై తలెత్తే న్యాయపరమైన ప్రశ్నలు వేరని, ఈ ఘటనతో మాత్రం దేశ ప్రజలు ఊపిరిపీల్చుకున్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు లైంగిక దాడి కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ను బీజేపీ ఎంపీ మేనకా గాంధీ తప్పుపట్టారు. చట్టాన్ని మీరు చేతుల్లోకి తీసుకోలేరని వ్యాఖ్యానించారు. చట్టానికి అనుగుణంగా విచారణ ప్రక్రియకు ముందే పోలీసులు నిందితులను మట్టుబెడితే ఇక కోర్టులు, చట్టాలు ఎందుకని ఆమె ప్రశ్నించారు. -
కార్పొరేట్ పన్నుకోత : దిగ్గజాల స్పందన
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కార్పొరేట్ పన్నురేటు తగ్గింపు నిర్ణయంపై స్టాక్‌మార్కెట్ ఇన్వెస్టర్లలో భారీ ఉత్సాహాన్నినింపింది. ఏకంగా సెన్సెక్స్ రికార్డు స్థాయిలో 2250 పాయింట్లు ఎగిసింది. అటు దేశీయ వ్యాపార దిగ్గజాలు కూడా సానుకూలంగా స్పందించారు. ఇది చాలా ఉన్నతమైన చర్య అని అభివర్ణించారు. పన్ను తగ్గింపు వల్ల ఎక్కువ పెట్టుబడులు వస్తాయని చెప్పారు. ముఖ్యంగా వృద్ధి చర్యలు లోపించాయని ట్విటర్లో బహిరంగంగా విమర్శించిన బయోకాన్ ఎండీ, చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా ఆర్థికమంత్రి నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ చర్య ఆర్థిక వృద్ధితోపాటు పెట్టుబడులను పునరుద్ధరిస్తుందన్నారు. ఇది గొప్ప చర్య. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న ఆమెకు నా హ్యాట్సాఫ్ అని ప్రశంసించారు. కార్పొరేట్ పన్ను రేటును 25 శాతానికి తగ్గించే నిర్ణయం ధైర్యమైన, ప్రగతిశీల అడుగు. ఇదో బిగ్ బ్యాంగ్ సంస్కరణ అని కోటక్ మహీంద్రా బ్యాంక్ సీఈవో ఉదయ్ కోటక్ పేర్కొన్నారు. అమెరికా కంపెనీలతో పోటీ పడటానికి భారతీయ కంపెనీలకు ఊతమిస్తుందని చెప్పారు. ఈ నిర్ణయం ఆర్థిక వృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్న సంకేతానిస్తోందన్నారు. పిరమల్ ఎంటర్ప్రైజ్ చైర్మన్ అజయ్ పిరమల్ మాట్లాడుతూ దీనికోసమే తామంతా ఎదురుచూస్తున్నామన్నారు. ఇంతటి సాహసోపేతమైన అడుగు వేసినందుకు ప్రభుత్వానికి, ఆర్థికమంత్రికి అభినందనలు తెలిపారు. ఇది ఉత్పాదక రంగానికి పునరుజ్జీవనమిచ్చే నిర్ణయమని ఫిక్కీ చైర్మన్ సందీప్ సోమనీ తెలిపారు. ఈ ప్రకటన కార్పొరేట్ భారతానికి మంచి ఊతం, ముఖ్యంగా కష్టతరమైన దశలో ఉన్న ఉత్పాదక రంగాన్ని కొత్త శక్తి వస్తుందన్నారు. కార్పొరేట్లపై ఆదాయపు పన్నును తగ్గించాలని తాము చాలాకాలంగా అభ్యర్థిస్తున్నామని గుర్తు చేశారు. కేపీఎంజీ కొర్పొరేట్ హెడ్ హితేష్ డి గజారియా స్పందిస్తూ ఇది చాలా సానుకూల దశ, మరిన్ని ఉద్యోగావకాశాలు లభించనున్నాయని వ్యాఖ్యానించారు. ఆర్థికవ్యవస్థను గాడిలో పెట్టడానికి ఆర్థికమంత్రి ఎట్టకేలకు బలమైన చర్యలు తీసుకున్నారని రెలిగేర్ బ్రోకింగ్‌లోని విపి రీసెర్చ్ అజిత్ మిశ్రా పేర్కొన్నారు. గత కొన్ని త్రైమాసికాలలో కార్పొరేట్ ఆదాయాలు దిగజారిపోయాయి, ప్రధానంగా కొనసాగుతున్న మందగమనం కారణంగా కార్పొరేట్ పన్ను రేటు తగ్గింపు అంటే కార్పొరేట్ కంపెనీలకు లాభదాయకమే. మరోవైపు కార్పొరేట్ పన్నుకోత నిర్ణయంపై కాంగ్రెస్ తప్పుబడుతోంది. ఇది హౌడీమోదీ ఈవెంట్ కోసం తీసుకున్న నిర్ణయమని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జైరామ్ రమేష్ విమర్శించారు. ప్రభుత్వ తీసుకున్న నిర్ణయం స్వాగతించదగిందే అయినప్పటికీ తీవ్రమైన సంక్షోభం ఎదుర్కొంటున్న కునారిల్లుతున్న ఆర్థికవ్యవస్థను రానున్న పెట్టుబడులు పునరుద్ధరాస్తాయా అనేది సందేహమేనని ఆయన ట్వీట్ చేశారు. అటు ఆర్థికమంత్రి ఇంటిముందు కాంగ్రెస్శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించాయి. Timing of FM announcement dictated by #HowdyModi event. PM can now say, "I have come to Texas promising lower Taxes". Is this his 'trump card'? — Jairam Ramesh (@Jairam_Ramesh) September 20, 2019 దేశీయ సంస్థలకు, కొత్త దేశీయ తయారీ సంస్థలకు కార్పొరేట్ పన్ను రేట్లు తగ్గించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ శుక్రవారం ప్రకటించారు. ప్రస్తుత 30 శాతం కార్పొరేట్ పన్నును 22 శాతానికి తగ్గిస్తామని, కొత్త తయారీ సంస్థలకు ప్రస్తుతం ఉన్న రేట్లు 25 శాతం నుంచి 15 శాతానికి తగ్గించనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. -
నోట్ల రద్దు: నెటిజనుల వ్యంగ్యాస్త్రాలు
సాక్షి, న్యూఢిల్లీ: పెద్దనోట్ల ( 500, 1000 రూపాయల) రద్దు ప్రకటించి రెండు సంవత్సరాలు పూర్తయింది. నల్లధాన్ని రూపుమాపేందుకు, అవినీతిపై అరికట్టేందుకు అంటూ కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ 2016 నవంబరు 8 అర్థరాత్రి నుంచి 500, 1000 రూపాయల నోట్ల చట్టబద్ధమైన మారక విలువను రద్దు చేసింది. ఈ సందర్భంగా కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ డిమానిటైజేషన్‌ను సమర్ధించుకుంటూ ట్విటర్లో ట్వీట్ల పరంపర సాగించారు. అక్రమంగా నిలవ చేసిన డబ్బును నోట్ల రద్దుతో బ్యాంకులకు వచ్చే విధంగా చేశామని, పన్ను వసూళ్లు బాగా పెరిగాయంటూ తమని తాము ప్రశంసించుకున్నారు. ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమైన నిర్ణయాల పరపంపరలో నోట్ల రద్దు కీలకమైందని, ఈ చర్య ఆర్థిక వ్యవస్థను సరిదిద్దడంలో పెద్ద ప్రభావాన్ని చూపిందని జైట్లీ పేర్కొన్నారు. మే, 2014 లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడినపుడు ఆదాయపన్ను రాబడి మొత్తం 3.8 కోట్ల రూపాయలుంటే.. తమ ప్రభుత్వం ఆధీనంలో మొదటి నాలుగేళ్లలో 6.86 కోట్ల రూపాయలకు పెరిగిందని ట్వీట్ చేశారు. ప్రత్యక్ష, పరోక్ష పన్నుల భారాన్నీ తగ్గించాం..కానీ పన్ను వసూళ్లు భారీగా పెరిగాయని పేర్కొన్నారు. దేశ పౌరులకు మంచి జీవనవిధానాన్ని అందించాం. మెరుగైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదుపాయాలు, ఆదాయాన్ని సమకూర్చామంటూ చెప్పుకొచ్చారు. దీంతోపాటు ఒక వివరణాత్మక వ్యాసాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేయడం విశేషం. మరోవైపు పెద్దనోట్ల రద్దు కష్టాలు ఇంకా తమను పీడిస్తున్నాయని సామాన్య ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నెటిజనులు కూడా డీమానిటైజేషన్పై వ్యంగాస్త్రాలతో విరుచుకు పడుతున్నారు. అటు ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ నోట్లరద్దు చేపట్టి రెండేళ్లు గడిచిన సందర్భంగా దేశవ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. డిమానిటైజేషన్ చర్యను 'ఆర్థిక దుష్ప్రభావం' గా పేర్కొంది. ఎన్డీఐ ప్రభుత్వం అనాలోచిత చర్య కారణంగా, చిన్న వ్యాపారులు తీవ్రంగా దెబ్బతిన్నారని, 120 మంది ప్రాణాలు కోల్పోయారని మండిపడింది. ఇందుకు ప్రధాని నరేంద్ర మోదీని దేశం ఎప్పటికీ క్షమించదని దుయ్యబట్టింది. ఆర్థిక రంగంలో అనాలోచిత చర్యలు ఎకానమీపై ఎంతటి దుష్ర్పభావాన్ని పడవేస్తాయో, జాతికి దీర్ఘకాలికంగా ఎంతటి నష్టమో ఈ రోజు (నోట్ల రద్దు రెండేళ్లయిన సందర్భంగా) స్పష్టమవుతోందని మాజీ ప్రధానమంత్రి, ఆర్థికమంత్రి కూడా అయిన మన్మోహన్ సింగ్ పేర్కొన్నారు. ఆలోచించి, అతి జాగ్రత్తగా ఆర్థిక విధానానాలను చేపట్టాల్సి అవసరం వుందని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా సంప్రదాయక స్వల్పకాలిక విధాన నిర్ణయాలకు స్వస్తి పలికి దేశ ఆర్థికస్థిరత్వానికి మోదీ ప్రభుత్వం గట్టి చర్యలు చేపట్టాల్సిన అవసరాన్నినొక్కి చెప్పారు. -
ఆపరేషన్ లోటస్.. అట్టర్ ఫ్లాప్
సాక్షి, బెంగళూరు: బల నిరూపణ కంటే ముందే యెడ్యూరప్ప తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన వేళ.. కాంగ్రెస్-జేడీఎస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయాయి. బీజేపీ అప్రజాస్వామిక ప్రయత్నాలు విఫలం అయ్యాయని, మెజార్టీ కోసం వాళ్లు చేసిన ప్రయత్నాలు వెలుగులోకి వచ్చాయని కర్ణాటక కాంగ్రెస్ పార్టీ విభాగం ట్వీట్ చేసింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడిన కాంగ్రెస్-జేడీఎస్ కూటమి.. ఇక తటస్థ ప్రభుత్వంతో అభివృద్ధిపై దృష్టిసారిస్తుందని పేర్కొంది. మరోపక్క సీఎల్పీ నేత, మాజీ సీఎం సిద్ధరామయ్య కూడా స్పందించారు. ‘బీజేపీ చేపట్టిన ఆపరేషన్ లోటస్ దారుణంగా విఫలం అయ్యింది. ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలన్న వాళ్ల ప్రయత్నాలు బెడిసి కొట్టింది. అసమర్థుడినని ఒప్పుకున్న యెడ్యూరప్ప సభ నుంచి పరారయ్యారు. కర్నాటకలో ప్రజాస్వామ్యం వర్థిల్లింది’ అని ఆయన మీడియాతో పేర్కొన్నారు. ‘బీజేపీ కుట్ర ఫలించలేదు. రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరించాలనుకుని నిండా మునిగిపోయారు’ అని సిద్ధరామయ్య ఓ ట్వీట్ కూడా చేశారు. ‘ప్రజలే స్పీకర్లుగా మారి అసెంబ్లీలో జరిగిన మొత్తాన్ని వీక్షించారు. కర్ణాటకలో ప్రజాస్వామ్యానిదే గెలుపు’ అని కాంగ్రెస్ సీనియర్ నేత పి చిదంబరం ట్వీట్ చేశారు. బీజేపీ ‘హైజాక్ కర్ణాటక అసెంబ్లీ ఫెయిల్’ అయ్యిందని కాంగ్రెస్ అధికార ప్రతినిథి రణ్ దీప్ సింగ్ సుజ్రేవాలా పేర్కొన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలు అశోక్ గెహ్లట్, దిగ్విజయ్ సింగ్, శశిథరూర్ లు పరిణామాలపై హర్షం వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బీఎస్పీ అధినేత్రి మాయావతి తదితరులు స్పందిస్తూ... బీజేపీ కుయుక్తులు ఫలించలేదని పేర్కొన్నారు. -
ఆ కృష్ణజింక మళ్లీ పుట్టిందా?
సాక్షి, న్యూఢిల్లీ: రెండు దశాబ్దాలనాటి కృష్ణ జింకలను వేటాడిన కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్‌కు ఐదేళ్ల జైలు శిక్షను ఖరారు చేస్తూ జోధ్‌పూర్ కోర్టు తీర్పు వెలువరించింది. దీనిపై సర్వత్రా భిన్నస్పందనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో నెటిజన్లు భాయ్(సల్మాన్‌ఖాన్) పై కోర్టు తీర్పుపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ట్రయల్ కోర్టు తీర్పుపై సల్మాన్ ఖాన్ పై కోర్టుకు అప్పీల్‌కు వెళతాడని...దీనిపై తుదితీర్పు రావడానికి మరో ఇరవై సంవత్సరాలు పడుతుందంటూ కమెంట్ చేశారు. ఈలోపు ఆయన సంతోషంగా తన నటనను కొనసాగిస్తాడు..2038లో ఏం జరుగుతుందో ఎవరికి తెలుసంటూ ట్వీట్ ద్వారా చురకలంటించారు. కృష్ణ జింక ఇప్పటికే చనిపోయి....మళ్లీ పుట్టి ఉంటుంది. తీర్పు విన్న తరువాత మన న్యాయవ్యవస్థ తీరును అభినందిస్తుందంటూ ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. అంతేనా సల్మాన్‌కు బెయిల్రావడానికి ఎంత సమయం పడుతుందో చూద్దాం అంటూ సెటైర్ వేశారు. ఆశారాం బాపూ సల్మాన్కోసం జైల్లో ఎదురు చూస్తున్నారంటూ మరొకరు ట్వీట్ చేయడం విశేషం. కాగా 1988నాటి కేసులో గురువారం( ఏప్రిల్ 5) సల్మాన్ ఖాన్‌ను కోర్టు దోషిగా నిర్ధారించింది. వైల్డ్‌లైఫ్ (ప్రొటెక్షన్) చట్టం 1972 లోని సెక్షన్ 51 క్రింద ఐదు సంవత్సరాల జైలు శిక్షను, జరిమానాను విధించింది. అయితే ఈ కేసులో సహనిందితులు, నటులు సైఫ్ అలీ ఖాన్, టబు, సొనాలి బింద్రేలను నిర్దోషులుగా విడుదల చేసింది. After 20 years, #Jodhpur court convicts #SalmanKhan in #BlackBuckPoachingCase. Buck killed in 1998, There is a possibility that by now Buck might've taken a rebirth. He/She too read this verdict and praise our Judiciary System. Now, let's see in how much time Salman will get bail — Anshul Saxena (@AskAnshul) April 5, 2018 Job Opening for Lead Actor - - Race 3 - Kick 2 - Dabangg 3 - Bharat - Wanted 2 - Partner 2 - Sher Khan Qualifications - Unmarried, 50+ yrs, Fair, Minimum 10 FIRs against you, Shirt removing habit, Look like Salman Khan #BlackBuckPoachingCase #Jodhpur — Ankesh Sagar (@ankeshsagar) April 5, 2018 I don't know why everyone is going crazy over the verdict of "Salman Khan" 's case. He is going to appeal in higher courts and continue acting happily and that verdict will take another 20 years to come and who knows what happens in 2038! — V Gopalan (@TheGopalan) April 5, 2018 Pic 1 :- Salman Khan before Verdict Pic 2 :- Salman Khan after Verdict pic.twitter.com/KkRNy0OXjx — शाहरुख मोदी भक्त !! (@BeBachani) April 5, 2018 -
న్యాయవ్యవస్థకు ఇదొక దుర్దినం: ఇంకా ఎవరేమన్నారు
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నలుగురు సీనియర్ న్యాయవాదులు నిర్వహించిన మీడియా సమావేశం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. ముఖ్యంగా సుప్రీంకోర్టు పనితీరు బాగా లేదంటూ తొలిసారి బహిరంగంగా సుప్రీం చీఫ్‌పై విమర్శలకు దిగడం కలవరం పుట్టిస్తోంది. దీనిపై పలువురు న్యాయనిపుణులు, ఇతర ప్రముఖులు స్పందించారు. ప్రశాంత్ భూషణ్ సీనియర్ న్యాయవాది: సుప్రీం జడ్జిల పట్ల తన కృతజ్ఞత వ్యక్తం చేసిన ఆయన సుప్రీం చీఫ్ దీపక్ మిశ్రా చాలా ఘోరంగా తన అధికారాలను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ప్రత్యేక ఫలితాలను సాధించడానికి 'రోస్టర్ ఆఫ్ మాస్టర్' గా తన పవర్‌ను వాడుకున్నారని విమర్శించారు. ఏ మాత్రం బాధ్యత ఉన్నా చీఫ్ జస్టిస్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సీనియర్ న్యాయవాది ఉజ్వల్ నికం: న్యాయవ్యవస్థకు ఇదొక బ్లాక్ డే అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యం, న్యాయవ్యవస్థ ప్రతిష్టకు భంగం కలిగేలా సుప్రీం న్యాయవాదులు మాట్లాడారు. ఇకపై సామాన్య పౌరుడు కూడా ప్రతీ తీర్పును అనుమానించే అవకాశం ఉంది. ప్రతీ తీర్పు ప్రశ్నించబడుతుంది. సీనియర్ న్యాయవాది, బీజేపీ నేత సుబ్రమణియన్ స్వామి: వారిని విమర్శించలేమనీ, గొప్ప సమగ్రత గల వ్యక్తులు, చట్టపరమైన వృత్తిని త్యాగం చేశారంటూ న్యాయమూర్తుల పట్ల సానుకూలంగా స్పందించారు. ఈ విషయంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాలన్నారు. సీనియర్ న్యాయవాది కేటీఎస్ తులసి: ఇది తనను చాలా షాక్‌కు గురిచేసింది.సీనియర్ అధిక న్యాయమూర్తులకు ఈ చర్య వెనుక బలమైన కారణాలు ఉండి ఉంటాయని, వారు మాట్లాడుతున్నప్పుడు వారి ముఖాలపై బాధ కనిపించింది. ప్రధాన న్యాయమూర్తి తక్షణమే రాజీనామా చేయాలి. కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది సల్మాన్ ఖుర్షీద్ : అంతిమంగా కోర్టు నిర్ణయం తీసుకుంటుంది. న్యాయమూర్తులు తమలో తాము సమస్యలను పరిష్కరించుకొని వుంటే బావుండేది. మాజీ ఇన్ఫోసిస్ డైరెక్టర్ మోహన్‌దాస్ పాయ్: ఈ అంశంపై స్పందిస్తూ పార్లమెంటు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా పార్లమెంట్, సుప్రీంకోర్టే న్యాయమూర్తులను నియమిస్తుందన్నారు. అలాగే నలుగురు న్యాయవాదులు మీడియా ముందుకు రాకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. న్యాయవ్యవస్థలో సంస్కరణలు అవసరమన్నారు. ప్రముఖ మహిళా న్యాయవాది ఇందిరా జైసింగ్: న్యాయమూర్తుల ప్రెస్‌మీట్‌ను సమర్ధించారు. బయటకు వచ్చిన న్యాయమూర్తులు చీఫ్ జస్టిస్‌కు వ్యతిరేకులు కాదనీ, కానీ కొల్లీజియంలో ఏమి జరుగుతుందో తెలుసుకునే హక్కు భారత ప్రజలకు వుంటుందన్నారు. రిటైర్డ్ జస్టిస్ ఆర్ సోధి: ఇది పరిపాలనా అంశంపై విమర్శ. ఇపుడు బయటికి వచ్చింది కేవలం నలుగురే, ఇంకా 23 మంది ఉన్నారు. అపరిపక్వత, పిల్లతనం తప్ప మరోటి కాదంటూ నలుగురు న్యాయమూర్తులపై అనుమానం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని వారెలా చెబుతారు. మనకు పార్లమెంటు, కోర్టులు, పోలీసు వ్యవస్థలు ఉన్నాయి. మరోవైపు ఇదే అంశంపై సీనియర్ న్యాయవాదులు, ప్రముఖ న్యాయవాది కపిల్ సిబల్ నివాసంలో ఈ సాయంత్రం 5 గంటలకు సమావేశం కానున్నారు. -
'బడ్జెట్.. చేదుమాత్రకు షుగర్ కోటింగ్'
హైదరాబాద్: కేంద్ర బడ్జెట్ పూర్తిగా అంకెల గారడీ అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి అన్నారు. చేదు మాత్రకు చక్కెర పూతలా కేటాయింపులు ఉన్నాయని వ్యాఖ్యానించారు. రైతు రుణాలు మాఫీ అవుతాయన్న ఆశలు నెరవేరలేదని తెలిపారు. రైతు ఆదాయం రెట్టింపు ఎలా అవుతుందో ప్రభుత్వం చెప్పలేదని ఆరోపించారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు రైతు రుణాలు గతంలో సగం కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఇస్తామంటూ నమ్మబలుకుతున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోదీని పూర్తిగా సమర్ధిస్తున్న సీఎం కేసీఆర్ విభజన హామీలను నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆరోపించారు. బడ్జెట్ వాస్తవ విరుద్దమని కేటాయింపుల్లో చిత్తశుద్ధి లేదని విమర్శించారు. -
బడ్జెట్‌పై ఎవరేమన్నారంటే..?
న్యూఢిల్లీ : కేంద్ర ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ బుధవారం లోక్‌సభలో 2017-18 ఏడాదికిగాను బడ్జెట్‌ను సమర్పించారు. 92 ఏళ్ల సంప్రదాయాన్ని కాదని తొలిసారి రైల్వే బడ్జెట్‌ను కూడా సాధారణ బడ్జెట్లో భాగంగా ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రసంగం ముగిసిన తర్వాత దీనిపై అధికార పార్టీ నేతలు, ప్రతిపక్షాల వారు, ఇతర ప్రముఖులు స్పందించారు. కొంతమంది సానూకూలంగా మరికొందరు ప్రతికూలంగా స్పందించారు. ఒకసారి వాటిని పరిశీలిస్తే.. ప్రధాని నరేంద్రమోదీ ఇది పేదరికాన్ని మరింత తగ్గించే ఉత్తమమైన బడ్జెట్. ఈ బడ్జెట్‌ను ప్రవేశ పెట్టిన ఆర్థికమంత్రికి నా అభినందనలు. మేం రైతులపైన, ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతిపైన దృష్టిసారించాం. అభివృద్ధిని మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు ఎక్స్లేటర్లాగా పనిచేస్తుంది. అన్ని రంగాలపై ఈ బడ్జెట్ దృష్టి పెట్టింది. జీవన నాణ్యత మరింత పెంపొందుతుంది. 2022నాటికి రైతుల ఆదాయం రెండింతలు చేస్తాం. రైల్వే సేఫ్టీపై కూడా మేం దృష్టిని సారించాం. అలాగే, మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకానికి గతంలో ఎవ్వరూ కేటాయించనన్ని నిధులు కేటాయించాం. ఈ బడ్జెట్ ఉద్యోగాలకు, ఉద్యోగాల కల్పనకు తెరతీస్తుంది. సీ రంగరాజన్(ఆర్బీఐ మాజీ గవర్నర్) ఇది ఫెయిర్లీ రొటీన్ బడ్జెట్. రెవెన్యూ విభాగంలో పెద్దగా ఎలాంటి మార్పులు చేయలేదు. ద్రవ్య లోటు 3.2శాతం మేరకు కొనసాగించగలగడాన్ని నేను ఆనందంగా భావిస్తున్నాను. ద్రవ్యలోటును 3కు తగ్గించాలని లక్ష్యంగా ఉంది. కేంద్రమంత్రి స్మృతి ఇరానీ చప్పగా బడ్జెట్ ముగించారని రాహుల్ అంటున్నారు. కానీ, వాస్తవానికి రాహుల్ అసలు బడ్జెట్ ప్రసంగం వినలేదు. ఒక వేళ ఆయనకు ఈ వివరాలు ఎవరు చెప్పారో బహుషా వారు కూడా ఈ బడ్జెట్ వినలేదనుకుంట. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ మౌలిక సదుపాయాల కల్పనకు ఈ బడ్జెట్ చాలా మంచింది. గ్రామాలకు కూడా ఇక అన్ని సౌకర్యాలు వస్తాయి. బ్యాంకింగ్, హౌసింగ్ సెక్టార్లు ఆర్థిక వ్యవస్థను, పన్ను ఆదాయాన్ని మరింత బలోపేతం చేస్తాయి. కామర్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ స్టార్టప్స్‌కు సహాయం చేస్తుంది. గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని ప్రజలు అడుగుతున్నదానికి ఆర్థికశాఖ సరిగ్గా స్పందించింది. ఇది చాలా సానుకూలమైన బడ్జెట్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి కమల్‌నాథ్ ఈ బడ్జెట్లో రైతులకు, నిరుద్యోగులకు ఏమీ లేదు. ఇది ప్రజలను గందరగోళ పరిచే చర్య మాత్రమే. రాజకీయ విరాళాలకు సంబంధించి తీసుకున్న నిర్ణయం మాత్రం ఆహ్వానించదగింది. (ఇకపై పొలిటికల్ ఫండింగ్ చేయాలనుకునే వారు రూ.2000పైన అయితే, కచ్చితంగా బాండ్లతో ఇవ్వాలి. ఆ బాండ్లను కూడా చెక్లతోగానీ, కార్డులతోగానీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీని ద్వారా ఎవరు ఎంతిచ్చారో తెలిసిపోతుంది. తాజా బడ్జెట్లో ఈ నిబంధన పెట్టారు) రణదీప్ ఎస్ సుర్జీవాలా(కాంగ్రెస్ అధికార ప్రతినిధి) ఈ బడ్జెట్ ఉద్యోగాల సృష్టి శూన్యం, తయారీ రంగానికి శూన్యం, వ్యవసాయంలో అభివృద్ధికి శూన్యం, విద్య, వైద్యంలో శూన్యం, సామాజిక రంగానికి శూన్యం. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇది వివాదాస్పద బడ్జెట్. ఆధారాలు లేనిది, ఉపయోగం లేనిది, మిషన్లెస్, యాక్షన్ లెస్ బడ్జెట్ ఇది. భవిష్యత్‌కోసం ఈ బడ్జెట్లో రోడ్‌మ్యాప్ లేదు. బడ్జెట్కున్న క్రెడిట్ మొత్తం పోయింది. పన్ను చెల్లిస్తున్నవారు నగదు ఉపసంహరణకోసం ఇప్పటికీ పరిమితులు ఎదుర్కొంటున్నారు. వెంటనే అన్ని పరిమితులు ఉపసంహరించండి. సంబంధిత వార్తలకై చదవండి.. (పార్లమెంట్లో టపాసులు పేలతాయనుకున్నా..) 2017 కేంద్ర బడ్జెట్ ముఖ్యాంశాలు బడ్జెట్ లో రైల్వే హైలెట్స్... గృహ రంగానికి గుడ్‌న్యూస్ పేదలకు కేంద్ర బడ్జెట్లో వరాలు! -
రూ.500,1000 నోట్లు..కేజీ 12 రూపాయలే!
-
రూ.500, 1000 నోట్ల కట్టలు.. కేజీ 12 రూపాయలే!
500, 1000 రూపాయల నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటన వెలువడిన మరుక్షణం నెటిజన్లు సోషల్ మీడియాలో రకరకాలుగా స్పందించారు. కొందరు జోకులు పేల్చితే మరికొందరు సెటైర్లు వేశారు. రేపటి నుంచి ఎందుకూ పనికి రాని నోట్లను పల్లీలు కట్టే పొట్లాలుగా మలిచి కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. కొందరు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకించారు. పలువురు ఈ చర్యను ఆర్థిక ఎమర్జెన్సీగా అభివర్ణించారు. పాత నోట్లను చుట్టి అందులో పల్లీ బఠానీ అమ్ముతున్నట్టుగా నెటిజన్లు ఫోటోలను పోస్టు చేయగా, 500, 1000 రూపాయల నోట్లను తీసుకోవడానికి ఏమీ అభ్యంతరం లేదనీ, కిలో 12 రూపాయల చొప్పున కొనుగోలు చేస్తామంటూ కొందరు, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద పోలీసులు ఆపితే వెంటనే వెయ్యి రూపాయల నోటు ఇచ్చేమని మరికొందరు ఇలా పలువురు సెటైర్లు వేశారు. అమెరికాలో ఓట్ల లొల్లి... ఇండియాలో నోట్ల లొల్లి అంటూ ఇంకొందరు ఇలా తాజా ప్రకటనపై రకరకాలుగా స్పందించారు. ప్రతి ఇంట్లో గృహిణి తమ భర్త ముందు బ్లాక్ మనీని బయటపెట్టనుందని, ఇంతకాలం భర్తకు తెలియకుండా ఇంట్లో అప్పుడో ఇప్పుడో దాచుకున్న ఈ నోట్లను ఒక్కసారిగా బయటకు తీసి వెల్లడించనున్నారంటూ కొందరు జోకులు పేల్చారు. 'రెస్ట్ ఇన్ పీస్' అంటూ పాత నోట్లకు నివాళులర్పిస్తూ పలువురు పోస్టులు పెట్టారు. వృథా పోవు... తిరుపతి హుండీలో వేసుకోండని కొందరు సలహా ఇచ్చారు. రాత్రి 8 గంటల సమయంలో బస్సుల్లో రైళ్లల్లో ప్రయాణం చేస్తున్న వారి పరిస్థితేంటని కొందరు ప్రశ్నిస్తే మరికొందరు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి వెంటనే మీరు ఎయిర్ పోర్టులు, రైల్వే స్టేషన్లకు వెళ్లండని మరికొందరు సలహాలిచ్చారు. నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి పలువురు ఆస్పత్రుల్లో చేరిపోతున్నారని (ఆస్పత్రుల్లో పాత నోట్లను అనుమతిస్తారు కాబట్టి), అన్ని ఆస్పత్రుల్లోని ఐసీయూలు నిండిపోతున్నాయని సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు దర్శనమిచ్చాయి. మీ వద్ద ఏదైనా గుర్తింపు కార్డు ఉంటే చాలు... ఇప్పుడు మీకు ఓ కొత్త ఉద్యోగం దొరికనట్టే... రేపటి నుంచి బ్యాంకుల వద్ద నిలబడి మీరు కమీషన్ ఏజెంట్లుగా పనిచేయవచ్చు అంటూ నెటిజన్లు కామెంట్స్ పోస్ట్ చేశారు. అచానక్ చుట్టీ యోజన రెండు రోజుల పాటు బ్యాంకులు బంద్ ఉంటాయన్న విషయాన్ని తెలియజేస్తూ ఇది ప్రధానమంత్రి కొత్త పథకంగా అభివర్ణించారు. దీన్ని ప్రధానమంత్రి అచానక్ చుట్టీ యోజన (పీఎంఏసీవై) గా పేర్కొన్నారు. మోదీ ప్లేడ్ ది ట్రంప్ కార్డు... ఔర్ పూరీ ఇండియా హిల్లరీ హై అంటూ సెటైర్లు జోరుగా ఊపందుకున్నాయి. నిజానికి 500, 1000 నోట్లను రద్దు చేయాలన్న ప్రకటన వెలువడినప్పటి నుంచి అర్థరాత్రి దాటిపోయే వరకు నెటిజన్లు తమదైన రీతిలో స్పందిస్తూనే ఉన్నారు. చిల్లర ఇవ్వలేక నిత్యం చికాకు పడుతున్న చిన్న చిన్న వ్యాపారులకు తలనొప్పి పోయిందని కొందరు, జేబుల్లో వ్యాలెట్లకు బదులుగా ఇక నుంచి బ్యాగులు కొనుగోలు చేసుకోవాలని మరికొందరు... బిల్డర్లు, పొలిటీషియన్లు ఇకనుంచి బ్రీఫ్ కేసులకు బదులు సూట్ కేసులకు కొనుగోలు చేయాలి... ఇలా రకరకాల జోకులు పేల్చూతూనే ఉన్నారు. ఇక 2000 నోట్ల కట్టలు వెయ్యి రూపాయల నోట్లను రద్దు చేసి వాటి స్థానంలో రూ.2000 నోట్లను జారీ చేయడమంటే... నల్లధనం సమకూర్చుకునే వారికి మరింత సహాయం చేసినట్టేనని కొందరు వ్యాఖ్యానించారు. ఇది ఆర్థిక ఎమర్జెన్సీగా అభివర్ణించగా, ఈ చర్య ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో సాధారణ పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని పెదవి విరిచారు. ఈ నిర్ణయాన్ని రాత్రి సమయంలో ప్రకటించాల్సిన అవసరమేమొచ్చిందని ప్రశ్నించారు. ⇒ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలలో కొత్త 500 నోట్లు 2000 నోట్లు దర్శనమిచ్చాయంటే ప్రభుత్వం ముందే కొందరికి ఈ విషయం లీక్ చేసిందా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు -
ఎటాక్ పై రియాక్షన్స్
-
'ఫేస్బుక్ బటన్లకు రియాక్ట్ అవ్వొద్దు'
బెల్జియం పోలీసులు ఫేస్బుక్ కొత్త రియాక్షన్ బటన్లను వాడొద్దంటూ తమ సిటిజన్లను హెచ్చరిస్తున్నారు. ఫేస్బుక్లో నచ్చిన వాటికి లైక్ కొట్టడమే కాకుండా విభిన్న అభిప్రాయాలను ఎక్స్‌ప్రెస్ చేయడానికి లైక్ బటన్తోపాటూ రియాక్షన్స్ ఐకాన్లను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే దీని వెనక మరో మతలబు ఉంది అని ఆరోపిస్తున్నారు బెల్జియం పోలీసులు. ఈ రియాక్షన్ బటన్ల ద్వారా యూజర్ల మూడ్ ను తెలుసుకొని వాటికి అనుగుణంగా ఫెస్బుక్ ప్రకటనలను జొప్పిస్తుందని బెల్జియన్ పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. 'ఐకాన్లు అభిప్రాయాలను తెలపడం కోసమే కాదు. యాడ్లను యూజర్ల ప్రొఫైల్‌లో ప్రభావవంతంగా పంపడానికి ఎంతగానో తోడ్పడతాయి' అని బెల్జియన్ పోలీసుల అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. వీటితో ఫేస్ బుక్ యూజర్ల ప్రైవసీకి భంగం కలిగే అవకాశం ఉందని పేర్కొంది. ఈ రియాక్షన్ బటన్ సేవలు ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. -
ఫేస్బుక్లో లైక్‌ను ఇంకాస్త అందంగా..
న్యూయార్క్: ఫేస్బుక్లో ఇక నచ్చిన వాటికి లైక్ కొట్టడమే కాదు దానిని ఇంకాస్త అందంగా ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. లైక్ బటన్‌ను మరికాస్త ముందుకు తీసుకెళ్తూ రియాక్షన్స్ బటన్‌ను తీసుకొచ్చింది ఫేస్బుక్. ఈ రియాక్షన్ బటన్ సేవలు బుధవారం నుండి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి వస్తున్నట్లు ఫేస్బుక్ వెల్లడించింది. రియాక్షన్ బటన్ ద్వారా లైక్, వావ్.. ఇలా 7 రకాల భావాలను వెల్లడించే వీలు కల్పించారు. దీనిని పైలట్ ప్రాజెక్టుగా గత అక్టోబర్‌లో ఐర్లాడ్, స్పెయిన్‌లో ప్రవేశపెట్టారు. దీనికి మంచి స్పందన వస్తుండటంతో ఈ సేవలను ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. మొబైల్లో ఫేస్బుక్ వినియోగదారులు లైక్ బటన్‌ను నొక్కి పట్టుకోవటం ద్వారా రియాక్షన్స్ ఆప్షన్‌ను పొందొచ్చని సంస్థ ఓ బ్లాగ్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. -
ఫేస్‌బుక్‌లోకి న్యూ 'రియాక్షన్స్'!
శాన్ ఫ్రాన్సిస్కో: ఇప్పటివరకు ఫేస్బుక్లో ఏదైనా పోస్టు నచ్చితే.. అది చెప్పడానికి మనం వెంటనే 'లైక్' బటన్‌ను ఉపయోగించేవాళ్లం. అంతకుమించి ఆ పోస్టు గురించి మన భావోద్వేగాన్ని వెంటనే వ్యక్తం చేయడానికి మరో మార్గం ఉండేది. ఇప్పుడు ఆ లోటును భర్తీ చేస్తూ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్బుక్ త్వరలోనే సరికొత్త 'రియాక్షన్స్' ప్రవేశపెట్టబోతున్నది. 'లైక్' తరహాలో వెంటనే మన అభిప్రాయాన్ని మరింత స్పష్టంగా వెల్లడించేందుకు మరిన్ని భావోద్వేగపరమైన ప్రతీకలను అందుబాటులోకి తెస్తున్నది. ఈ రియాక్షన్స్ సింబల్స్ అతి తొందరలోనే ప్రపంచవ్యాప్తంగా ఇవి ఫేస్బుక్ యూజర్లకు అందుబాటులోకి రానున్నాయి. అమెరికా వెలుపల కొన్ని ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా అమల్లోకి తెచ్చిన 'ఈ రియాక్షన్ సింబల్స్'ని అతి త్వరలోనే ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. కంపెనీ తాజా త్రైమాసిక ఆదాయాలపై బుధవారం జరిగిన కాన్ఫరెన్స్ లో నిపుణులతో చర్చించిన ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అయితే ఎప్పటిలోగా అందుబాటులోకి వస్తుందన్న విషయాన్ని కచ్చితంగా చెప్పలేదు. ఫేస్బుక్లో పెట్టిన కామెంటు, వీడియో, లేదా ఫొటో నచ్చిందని చెప్పడానికి ఇప్పటివరకు ఓ లైక్ ఆప్షన్ మాత్రమే ఉంది. ఈ ఆప్షన్‌ను మరింత విస్తరిస్తూ.. సరికొత్త రియాక్షన్ సింబల్స్‌ను ఫేస్బుక్ అందుబాటులోకి తెస్తోంది. 'కోపం', 'బాధ', 'వావ్', 'హాహా', 'యాయ్', 'లవ్' వంటి ఎమోషనల్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చే యానిమేటెడ్ ఇమేజ్‌లను ప్రవేశపెట్టబోతున్నది. దీంతోపాటు యాథావిధిగా 'లైక్' బటన్ కూడా ఉంటుంది. 'లైక్' బటన్‌ను కాసేపు గట్టిగా ప్రెస్ చేస్తే ఈ రియాక్షన్స్ కనిపిస్తాయి. వాటిలో నచ్చినదానిని యూజర్ ఎంచుకోవచ్చు. ఫేస్బుక్లో 'డిస్లైక్' బటన్‌ను కూడా ప్రవేశపెట్టాలని చాలామంది యూజర్లు కోరుతూ వస్తున్నారు. అయితే, ఇది ప్రతికూలతలను పెంచుతుందన్న భావనతో ఈ ఆలోచనను ఫేస్బుక్ తోసిపుచ్చింది. -
ఆ 'ఇద్దరి' లైసెన్స్‌లు రద్దు చేయండి...
న్యూఢిల్లీ: నిర్భయ డాక్యుమెంటరీ 'ఇండియాస్ డాటర్' లో మహిళల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన డిఫెన్స్ లాయర్లపై సోషల్ మీడియాలో న్యాయనిపుణులు, మహిళా సంఘాల నాయకులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులు విరుచుకుపడుతున్నారు. మహిళలను కుక్కలతో పోలుస్తూ నీచమైన వ్యాఖ్యలు చేసిన ఎంఎల్ శర్మ, ఏకె సింగ్‌ల లైసెన్స్ రద్దు చేయాలని, వాళ్లను కఠినంగా శిక్షించాలంటూ వందలాది కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. భారత్‌లో మహిళలకు స్థానంలేదు అన్నశర్మ మాటలపై మహిళలు రగిలిపోతున్నారు. ఆ న్యాయవాదులపై ప్రభుత్వం చట్టపరమైన చర్యలు ఎందుకు తీసుకోదు అని నిర్భయ తల్లి ప్రశ్నించారు. 'సమాజంలో ఇలాంటి వాళ్లకు చోటులేదు.. వాళ్లను అసలు ఉపేక్షించకూడదు.. ఇలాంటి మనస్తత్వం వున్న మనుషులు న్యాయవాదులుగా ఉండడం నేరం. బార్ కౌన్సిల్ కఠిన చర్యలు తీసుకోవాలంటూ' సుప్రీంకోర్ట్ సీనియర్ లాయర్ తులసి వ్యాఖ్యానించారు. మహిళలను అవమారపరుస్తున్న ఇద్దరు న్యాయవాదుల వ్యాఖ్యలను సుమెటోగా స్వీకరించి చర్యలు తీసుకోవాలని ఇక తాత్సారం చేయొద్దని మాజీ అడిషనల్ సొలిసిటర్ జనరల్ రామచంద్రన్ బార్ కౌన్సిల్‌ని కోరారు. అయితే ఈ వివాదంపై బార్ కౌన్సిల్ ఛైర్మన్ స్పందిస్తూ వ్యక్తిగతంగా ఆ వ్యాఖ్యలను ఖండిస్తున్నప్పటికీ, కచ్చితమైన ఫిర్యాదు లేకుండా ఏమీ చేయలేమన్నారు. ఇది ఇలా ఉంటే ఫిలిం మేకర్ లెస్లీ ఉద్విన్ తమ మాటలను వక్రీకరించారంటూ ఎం ఎల్ శర్మ, ఎకె సింగ్ ఆరోపిస్తున్నారు. -
మాకూ ఒరిగేందేమీ లేదు.. ప్రధాని మాట మరిచారు
ఈ బడ్జెట్‌తో తమకు ఒరిగిందేమీ లేదని కొన్ని రైతు సంఘాల అసంతృప్తిని వ్యక్తం చేశాయి. మాకున్న అవసరాలను పరిగణనలోకి తీసుకోవడంలో ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ విఫలమయ్యారని మహారాష్ట్రలోని విదర్భ రైతులు ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని, పెట్టుబడుల్లోని 50శాతం నిధులను వెనక్కి ఇస్తామని చెప్పి ఆ విషయాన్నే మరిచారని విదర్భా జన్ ఆందోళన సమితీ అధ్యక్షుడు కిశోర్ తివారీ అన్నారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతులను విస్మరించారని స్వాభిమాని షేట్కరీ సంఘటన అధ్యక్షుడు, ఎంపీ రాజు షెట్టి విమర్శించారు. ' అచ్చే దిన్ (మంచి రోజులు) వస్తాయని అన్నారుగా.. ఇవేనా మంచి రోజులు... ఇది పూర్తిగా నిరాశ పెట్టిన బడ్జెట్' అని ఆయన అన్నారు. తమ ప్రాంతంలో రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నా పట్టించుకోరా అని ప్రశ్నించారు. -
అమలు చేసుకునేదే.. కాదు చేయలేనిది..
కేంద్ర ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ శనివారం లోక్‌సభలో ప్రవేశ పెట్టిన బడ్జెట్‌ను చారిత్రాత్మకం అంటూ స్వపక్షంవారు ఆకాశానికెత్తగా.. విపక్షం వారు విమర్షలు గుప్పించారు. ఇది చారిత్రాత్మక బడ్జెట్ అని, పేదల బడ్జెట్ అని, పేదల కొరకు తయారు చేసిన బడ్జెట్ అని బీజేపీ అనగా.. అసలు పేదలనే పూర్తిగా విస్మరించారంటూ కాంగ్రెస్ నేతలు విమర్శించారు. పూర్తిగా అమలు చేసుకోదగిన బడ్జెట్ అని ప్రధాని నరేంద్రమోదీ అనగా.. అసలు ఆచరణ సాధ్యం కాదని విపక్షం వారన్నారు.. ఇలా బడ్జెట్‌పై వివిధ పార్టీలవారు వెలిబుచ్చిన ప్రతిస్పందనలు వారి మాటల్లోనే.... బడ్జెట్‌పై అధికారపక్ష ప్రతిస్పందనలు.. ప్రధాని నరేంద్రమోదీ(భారత ప్రధాని) 'ఇది స్పష్టమైన దృష్టిని కలిగిన బడ్జెట్. ఇందులో రైతులు, యువకులు, పేదలు, మధ్యతరగతి, అందరిని దృష్టిలో పెట్టుకున్నారు. సమన్యాయం, వృద్ధి, ఉద్యోగితవంటి అంశాలను పొందుపరిచారు. ప్రగతి పూర్వక, సానుకూలత, ఆచరణకు అనుకూలమైన బడ్జెట్ ఇది. రాజ్‌నాథ్ సింగ్ (కేంద్ర హోంమంత్రి) ఆధునిక భారతాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు చాలా ఉపయోగపడే బడ్జెట్ ఇది. దేశంలోని పేదరికాన్ని, నిరుద్యోగితను రూపుమాపడానికి ఉపయోగపడుతుంది. మనోహర్ పారికర్ (రక్షణశాఖ మంత్రి) జైట్లీ ఆయన విద్యుక్త ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించారు. ఆయనకు ఈ విషయంలో నేను 10 కి 9.5 మార్కులు వేస్తాను. ప్రకాశ్ జవదేకర్ (పర్యావరణశాఖ మంత్రి) ఇది చారిత్రాత్మక బడ్జెట్. అన్ని వర్గాల ప్రజలకు సామాజిక భద్రతను కల్పిస్తుంది. ఇది పేద ప్రజల బడ్జెట్. పేదల కోసం తయారుచేసిన బడ్జెట్. నితిన్ గడ్కరీ (కేంద్ర మంత్రి) మొత్తం చరిత్రలోనే మౌలిక సదుపాయాలకు పెద్ద పీఠవేసిన మొట్ట మొదటి బడ్జెట్ ఇదే. దీని ద్వారా దేశంలో ఉద్యోగిత, అవకాశాలు పెరుగుతాయి. గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయం మరింత మెరుగవనుంది. వెంకయ్యనాయుడు (కేంద్రమంత్రి) ఈ బడ్జెట్‌తో ప్రజలు చాలా సంతోషంగా ఉంటారు. ఇది ఆమ్ జాంతా బడ్జెట్. ఎంతో ప్రోత్సాహకంగా, కొత్త ఆవిష్కరణలు జరిగేలాగా ఇది ఉంది. రాజ్యవర్ధన్ రాథోడ్ (బీజేపీ) దేశంలోని యువకుల నుంచి పెద్దవారి వరకు అందరిని దృష్టిలో పెట్టుకుని రూపొందించిన బడ్జెట్ ఇది. దేశ ప్రయోజనాలన్నింటిని దృష్టిలో పెట్టుకుంది. బడ్జెట్‌పై విపక్షాల ప్రతి స్పందనలు.. మన్మోహన్సింగ్ (మాజీ ప్రధాని, కాంగ్రెస్) ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ విషయంలో నాకు ఎలాంటి ఆందోళన లేదు. అందులో ఉద్దేశాలు బాగున్నాయి. కాకపోతే వాటి అమలుకు మాత్రం ప్రభుత్వం వద్ద సరైన రోడ్ మ్యాప్ ఉన్నట్లు నాకు అనిపించడం లేదు. పీసీ చాకో (కాంగ్రెస్) ఈ బడ్జెట్ నన్ను తీవ్రంగా నిరాశపరిచింది. వాళ్లు ఇంకా పలు వారు చాలా పనులు చేయాల్సి ఉంది. మల్లికార్జున ఖార్గే (కాంగ్రెస్) సాధరణ పౌరులను ఈ బడ్జెట్ దృష్టిలో పెట్టుకోలేదు. ఇదొక విజన్ డాక్యుమెంట్ మాత్రమే. ముమ్మాటికీ కార్పొరేటర్లు, పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉన్న బడ్జెట్ మాత్రమే తప్ప మరొకటి కాదు. కమల్‌నాథ్ (కాంగ్రెస్) ఇది కమిషన్ల, కమిటీల, హామీల బడ్జెట్ మాత్రమే తప్ప మరొకటి కాదు. మనీశ్ తివారీ (కాంగ్రెస్) ఉద్దేశాలు గొప్పగా ఉన్నా.. కేటాయింపులు మాత్రం తక్కువగా ఉన్నాయి. అశ్వనీ కుమార్ (కాంగ్రెస్) ఇది అంకెల గారడి బడ్జెట్ మాత్రమే. శశి థరూర్ (కాంగ్రెస్) ఆర్థికమంత్రిగారు పేదలను పూర్తిగా విస్మరించారు. ఇది కార్పొరేట్ ఫ్రెండ్లీ బడ్జెట్. కేరళకు మాత్రం ఇది మంచి వార్తే. అక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ స్పీచ్ అండ్ హియిరింగ్ను ప్రత్యేక అవసరాలుగల వారికి ప్రత్యేక విశ్వవిద్యాలయంగా మార్చడం మంచిదే. మాయావతి (బీఎస్పీ) ఇది పేదలకు వ్యతిరేకమైన బడ్జెట్ ఇది. ఈ బడ్జెట్ ఆచరణలో సాధ్యం కాదు. దేశంలోని పేదలు, సామాన్యుల ఆశలకు తగినట్లుగా లేదు. సుప్రియా సులే(ఎన్సీపీ) ఇది ముమ్మాటికి విమర్షించాల్సిన బడ్జెటే. ప్రజలకు వారు ఇంకా చాలా చేయాల్సిన అవసరం ఉంది. జై పాండా (బీజేడీ) ఇదొక బిగ్ బ్యాంగ్ బడ్జెట్. ఒడిశాకు వారు కొత్తగా కేటాయించిందేమీ లేదు. మా పక్క రాష్ట్రాలు ఎన్నో కేటాయింపులు పొందాయి. అలాంటి కేటాయింపులు పొందాల్సిన అవసరాలు మాకు చాలా ఉన్నాయి. -
ధోనీ రిటైర్మెంట్పై ప్రముఖుల స్పందన
భారత్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ టెస్టు క్రికెట్ నుంచి రిటైరవుతున్నట్టు అనూహ్యంగా ప్రకటించడంతో క్రికెట్ వర్గాలు ఆశ్చర్యపోయాయి. ధోనీ నిర్ణయంపై క్రికెట్ వర్గాల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమైంది. ధోనీ రిటైర్మెంట్ ప్రకటన చేసిన వెంటనే పలువురు క్రికెట్, సినీ రంగానికి చెందిన ప్రముఖులు సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను పంచుకున్నారు. పరిమిత ఓవర్ల క్రికెట్‌పై పూర్తిగా దృష్టిసారించేందుకు ధోనీ తక్షణం రిటైరయ్యారని బీసీసీఐ ప్రకటించింది. ధోనీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్టు బీసీసీఐ పేర్కొంది. కాగా ఆసీస్‌తో టెస్టు సిరీస్ పూర్తిగా ఆడుంటే బాగుండేదని మాజీ కెప్టెన్ గంగూలీ అభిప్రాయపడ్డాడు. టెస్టుల్లో ధోనీ అరంగేట్రం నుంచి రిటైర్మెంట్ వరకు భారత క్రికెట్ ప్రస్థానం అసాధారణమని సంజయ్ ఝా అన్నారు. ధోనీ సారథ్యంలో భారత్ ఓ వెలుగు వెలిగిందని ట్వీట్ చేశారు. మరికొందరు ప్రముఖుల వెల్లడించిన అభిప్రాయలు.. మీ సారథ్యం, నిష్ర్కమణ సాహసోపేతమైనది- సురేష్ రైనా ధోనీకి మరో మూడేళ్లు టెస్టు క్రికెట్ ఆడే సామర్థ్యం ఉంది-గవాస్కర్ మీ సేవలు ప్రశంసనీయం. మీ సారథ్యంలో దేశం గర్వించదగ్గ విజయాలు అందించారు. -శృతిహాసన్ ధోనీ నిర్ణయం సరైనదే. మహీ గాయాలతో బాధపడుతున్నట్టు కనిపిస్తున్నాడు. -చిన్మయ్ భోగ్లే దేశం గర్వించదగ్గ విజయాలు అందించారు- ప్రియమణి News Alert - MS Dhoni has chosen to retire from Test Cricket with immediate effect #MSD #Captain — BCCI (@BCCI) December 30, 2014 MS Dhoni's retirement marks an extraordinary decade (2004-14) from debut to farewell. His singular leadership transformed the Men in Blue. — Sanjay Jha (@JhaSanjay) December 30, 2014 Valiant while you led. Valiant in your departure. #Respect @msdhoni pic.twitter.com/w6xdnebG3s — Suresh Raina (@ImRaina) December 30, 2014 The art of leadership – by MS Dhoni...What made MSD captain extraordinaire? He reveals it here - http://t.co/UUQ5aYQAiV #Dhoni #Captain — BCCI (@BCCI) December 30, 2014 Shri Mahendra Singh Dhoni ji should now be elevated to the Marg Darshak Mandal. #Dhoni #Respect — Paresh Rawal (@Babu_Bhaiyaa) December 30, 2014 Good call from Dhoni. Looked like he was nursing chronic injuries - Not diving to the left/right, extra pressure on the slips, etc. — Chinmay Bhogle (@chinmaybhogle) December 30, 2014 As the new year dawns on all of us Dhoni announces his retirement in test cricket!take a bow #msd!!!u did the county proud! — priyamani (@priyamani6) December 30, 2014