ప్రసాదం తిని.. 160 మందికి అస్వస్థత
పశ్చిమబెంగాల్లోని హుగ్లీ జిల్లా ఆరాంబాగ్లో ప్రసాదం తిని 160 మంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగానే వాళ్ల ఆరోగ్యం పాడై ఉంటుందని అనుకుంటున్నారు. 'పీర్ మేళా'లో పెట్టిన ఖిచిడీ ప్రసాదం తిన్న కాసేపటికే వాళ్లందరికీ కడుపు నొప్పి, వాంతులు మొదలయ్యాయని ఆరాంబాగ్ మునిసపల్ చైర్మన్ స్వపన్ నంది తెలిపారు.
ఖిచిడీలో ఉపయోగించిన పప్పులు పాడై ఉంటాయని, అందుకే ఈ సమస్య వచ్చిందనుకుంటున్నామని ఆయన అన్నారు. వాటిని పరీక్షకు పంపినట్లు తెలిపారు. బాధితులంతా ప్రస్తుతం కోలుకుంటున్నారని చెప్పారు. ఆ ప్రాంతానికి వైద్యబృందాన్ని పంపినట్లు జిల్లా ఆరోగ్యశాఖాధికారి తెలిపారు.