Reverse bidding
-
పోలవరం పనుల ప్రక్షాళన!
సాక్షి, అమరావతి: పోలవరం పనులను సమూలంగా ప్రక్షాళన చేసి అవినీతి నిర్మూలనకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే హెడ్‌వర్క్స్, జలవిద్యుదుత్పత్తి కేంద్రం కాంట్రాక్టు ఒప్పందాలను రద్దు చేసి వాటికి ఒకే ప్యాకేజీ కింద ఈనెల 17న రివర్స్ టెండరింగ్ నోటిఫికేషన్ జారీ చేయాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. తాజాగా ఎడమ, కుడి కాలువలు, కనెక్టివిటీస్(అనుసంధానాల) పనుల కాంట్రాక్టు ఒప్పందాలను రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమైంది. అంచనాలు భారీగా పెంచేసి నామినేషన్ పద్ధతిలో పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్లు తక్షణం వైదొలగాలంటూ నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. పోలవరం పనుల్లో రూ.3,128.31 కోట్ల మేర అవినీతి జరిగిందని నిర్ధారించిన నిపుణుల కమిటీ గత సర్కారు కాంట్రాక్టర్లకు దోచిపెట్టిన సొమ్మును రికవరీ చేయడంతోపాటు మిగిలిన పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని సిఫార్సు చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ సిఫార్సులను పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ)కి వివరించిన రాష్ట్ర ప్రభుత్వం రివర్స్ టెండరింగ్‌కు అనుమతి తీసుకుంది. యనమల వియ్యంకుడికి నోటీసులు.. పోలవరం ఎడమ కాలువ ఐదో ప్యాకేజీ కాంట్రాక్టు ఒప్పందం విలువ రూ.181.6 కోట్లు కాగా రూ.71.04 కోట్ల పనులను పాత కాంట్రాక్టర్ 2014 నాటికే పూర్తి చేశారు. అనంతరం 60 సీ నిబంధన కింద తొలగించిన రూ.93.74 కోట్ల పనుల అంచనా వ్యయాన్ని రూ.142.88 కోట్లకు పెంచేసి అప్పటి ఆర్థిక మంత్రి యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్‌కు చెందిన పీఎస్కే–హెచ్‌ఈఎస్(జేవీ)కి నామినేషన్ పద్ధతిలో టీడీపీ సర్కారు కట్టబెట్టింది. ఇందులో రూ.26.20 కోట్ల మట్టి పని వ్యయాన్ని రూ.77.82 కోట్లకు పెంచేసి పుట్టా సుధాకర్ యాదవ్‌కు నిబంధనలకు విరుద్ధంగా రూ.51.62 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. దీన్ని రికవరీ చేసి మిగిలిన పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని నిపుణుల కమిటీ సిఫారసు చేసింది. ఈ నేపథ్యంలో కాంట్రాక్టు ఒప్పందం నుంచి వైదొలగాలంటూ పుట్టా సుధాకర్‌యాదవ్‌కు చెందిన సంస్థకు పోలవరం ఎడమ కాలువ ఎస్ఈ ఒకటి రెండు రోజుల్లో నోటీసులు జారీ చేయనున్నారు. నామా, బీఎస్సార్ ఇన్‌ఫ్రాలపై వేటు.. పోలవరం ఎడమ కాలువ ఆరో ప్యాకేజీ పనుల కాంట్రాక్టు ఒప్పంద విలువ రూ.196.20 కోట్లు కాగా నామా సంస్థ రూ.112.48 కోట్ల విలువైన పనులు చేసింది. 60సీ కింద రూ.70.29 కోట్ల విలువైన పనులు తొలగించారు. దీంతో నామా చేతిలో రూ.13.43 కోట్ల విలువైన పనులు మాత్రమే మిగిలాయి. ఆ తర్వాత ఆరో ప్యాకేజీ పనుల కాంట్రాక్టు ఒప్పంద విలువను రూ.399.18 కోట్లకు పెంచేయించారు. ఇందులో 60సీ కింద తొలగించిన రూ.70.29 కోట్ల విలువైన పనుల వ్యయాన్ని రూ.153.46 కోట్లకు పెంచేసి చంద్రబాబు తన సన్నిహితునికి చెందిన బీఎస్సార్ ఇన్ఫ్రాకు నామినేషన్ పద్ధతిలో అప్పగించారు. నామా చేతిలో మిగిలిన రూ.13.43 కోట్ల పనుల విలువను రూ.119.81 కోట్లకు పెంచేశారు. నిబంధనల ప్రకారం నామాకు పెరిగిన అంచనా వ్యయంలో 95 శాతం(రూ.192.31 కోట్లు) జరిమానాగా వసూలు చేయాల్సిందిపోయి రూ.116.38 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చడాన్ని నిపుణుల కమిటీ తప్పుబట్టింది. వీటికి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని సిఫార్సు చేసింది. నామా, బీఎస్సార్‌లపై ఒకట్రెండు రోజుల్లో పోలవరం ఎడమ కాలువ ఎస్ఈ వేటు వేయనున్నారు. ఈ పనులకు రివర్స్ టెండరింగ్ నిర్వహించనున్నారు. ఇదే రీతిలో పోలవరం ఎడమ, కుడి కాలువలో మిగిలిన పనుల కాంట్రాక్టు ఒప్పందాలను రద్దు చేసుకుని రివర్స్ టెండరింగ్ ద్వారా సెప్టెంబర్ నాటికి కొత్త కాంట్రాక్టర్లను ఎంపిక చేయనున్నారు. కనెక్టివిటీస్‌పై ప్రత్యేక దృష్టి.. మరోవైపు పోలవరం నుంచి కుడి, ఎడమ కాలువలకు నీటిని సరఫరా చేసే అనుసంధానాల (కనెక్టివిటీస్) పనులను శరవేగంగా పూర్తి చేయటంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దీనికి సంబంధించిన కాంట్రాక్టు ఒప్పందాన్ని రద్దు చేసి రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. కాంట్రాక్టర్లకు గత సర్కార్ దోచిపెట్టిన సొమ్మును తిరిగి వసూలు చేసేందుకు రెవెన్యూ రికవరీ చట్టాన్ని ప్రయోగించడంపై కసరత్తు చేస్తోంది. -
‘సోలార్’ తెలంగాణ
-
‘సోలార్’ తెలంగాణ
లోటు నుంచి మిగులు విద్యుత్ దిశగా రాష్ట్రం ♦ ‘సౌర’ వెలుగులతో కల సాకారం ♦ రికార్డు స్థాయి ఉత్పత్తి లక్ష్యం ♦ ఖరీఫ్‌లోగా 2747 మెగావాట్లు ♦ రివర్స్ బిడ్డింగ్‌తో తగ్గిన ధరలు సాక్షి, హైదరాబాద్: సౌర విద్యుత్ ఉత్పత్తిలో తెలంగాణ కొత్త చరిత్ర సృష్టించబోతోంది. లోటు విద్యుత్ నుంచి మిగులు విద్యుత్ ఉత్పత్తి రాష్ట్రంగా ఏర్పడబోతోంది. సౌర విద్యుత్‌పై రాష్ట్రం అనుసరించే విధానం దేశం మొత్తానికి తలమానికం కాబోతోంది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఒక్క ఏడాదిలో 2,500 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పి చరిత్ర సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇటీవల ప్రకటించిన ‘తెలంగాణ సౌర విద్యుత్ విధానం’ రాష్ట్రంలో సౌర విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు మరింత ఊతమిస్తోంది. 2,000 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోళ్లకు గత నెలలో టెండర్లు ఆహ్వానిస్తే 6 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు టెండర్లు దాఖలు అయ్యాయి. జూన్ 15 వరకు టెండర్లు దాఖలు చేసేందుకు గడువుంది. అంతకు ముందు 2014 నవంబర్‌లో 515 మెగావాట్ల సౌర విద్యుత్‌కు టెండర్లు పిలిచి ఆ మేరకు విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) సైతం ప్రభుత్వం కుదుర్చుకుంది. కాగా, గతంలో కుదుర్చుకున్న పీపీఏల ప్రకారం 232 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటు జరగాల్సి ఉంది. అంతా కలిపి వచ్చే ఏడాది జూన్ నాటికి 2,747 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అక్కడికక్కడే ఉత్పత్తి, సరఫరా.. ప్లాంట్లను ఓ చోట పెట్టి రాష్ట్రమంతా సరఫరా చేయడం వల్ల నష్టాలు ఎక్కువగా ఉంటాయి. ఉత్పత్తి కేంద్రం నుంచి కొత్త లైన్లనూ వేయాల్సి వుంటుంది. దీనికి పరిష్కారంగా సబ్స్టేషన్లకు 5 కి.మీ.ల పరిధిలో కేంద్రాలను నెలకొల్పేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. సబ్స్టేషన్ల సామర్థ్యం, ప్రస్తుత విద్యుత్ సరఫరా మధ్య లోటును అక్కడికక్కడ ఉత్పత్తి చేసే సౌర విద్యుత్ ద్వారా పూడ్చనున్నారు. ఒక వేళ సబ్‌స్టేషన్‌కు పూర్తి సామర్థ్యం మేర సరఫరా ఉన్నా..సౌర విద్యుత్ పోను మిగతా విద్యుత్‌ను సరఫరా చేస్తారు. ఉదాహరణకు సబ్‌స్టేషన్ సామర్థ్యం 50 మెగావాట్లు ఉంటే, అక్కడ 10 మెగావాట్ల సౌర ఉత్పత్తి ఉంటే, ఇతర మార్గాల ద్వారా మిగిలిన 40 మెగావాట్లనే ఆ సబ్‌స్టేషన్‌కు పంపుతారు. త్వరలో మహబూబ్‌నగర్‌లో 400, మెదక్‌లో 500, నల్లగొండలో 600, రంగారెడ్డిలో 100, వరంగల్‌లో 300, కరీంనగర్లో 300, ఖమ్మంలో 200, నిజామాబాద్‌లో 400, ఆదిలాబాద్‌లో 200 మెగావాట్ల సౌర విద్యుత్ కేంద్రాలు నెలకొల్పనున్నారు. ‘పవర్’ ధరలు పడిపోతున్నాయి... సౌర విద్యుత్ కొనుగోళ్లకు ప్రభుత్వం అనుసరించిన విధానంతో ధరలు దిగి వస్తున్నాయి. తొలి విడత టెండర్ల ద్వారా సగటున యూనిట్‌కు రూ.6.72 ధరతో 515 మెగావాట్లను 25 ఏళ్ల వరకు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం పీపీఏలు కుదుర్చుకుంది. అంతకు తక్కువ ధరకు 2 వేల మెగావాట్లను కొనుగోలు చేసేందుకు రివర్స్ బిడ్డింగ్ టెండర్ నిర్వహించగా ఏకంగా 6 వేల మెగావాట్లకు స్పందన వచ్చింది. అందరి కంటే తక్కువ ధర సూచించిన వారిని ఎంపిక చేయనుండడంతో ధరలు సైతం దిగి వస్తున్నాయి. సౌర విధానానికి పురస్కారం రాష్ట్రంలో సౌర విద్యుదుత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటిస్తూ ప్రభుత్వం ప్రకటించిన సౌర విద్యుత్ విధానం అందరినీ ఆకర్షిస్తోం ది. సౌర విద్యుత్‌ను ప్రోత్సహించే ‘మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ శాఖ తెలంగాణ సౌర విధానానికి ప్రత్యేక అవార్డు ప్రకటించింది. ఆల్ ఇండియా విండ్ సోలార్ పవర్ అసోసియేషన్ సైతం ఇటీవల గౌహతిలో జరిగిన సమావేశంలో ప్రశంసించింది.